peethadhipati
-
శ్రీవారి సన్నిధిలో ఇద్దరు పీఠాధిపతులు
తిరుమల:కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కంచి పీఠాధిపతికి జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అలాగే కర్ణాటకాలోని ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మతీర్థ స్వామికి టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. వారి వెంట పారుపత్తేదార్ రామచంద్ర, ఓఎస్డి డాలర్ శేషాద్రి, బొక్కసం ఇన్చార్జి గురురాజారావు ఉన్నారు. -
శ్రీమఠం పీఠాధిపతి సీమోల్లంఘన
– చాతుర్మాస దీక్ష విరమణ – కనుల పండువగా సాగిన పుర ప్రవేశ యాత్ర – ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు – రూపాయి నాణేలతో పీఠాధిపతికి తులాభారం మంత్రాలయం : హరిదాసుల భజన కీర్తనలు.. డోలు వాయిద్య నాదాలు.. మహిళా భక్తుల కోలాటాలు, నింగిన మిరుమిట్లు గొల్పుతున్న బాణసంచా తారా జువ్వలు మధ్య పీఠాధిపతి సీమోల్లంఘన వైభవోపేతంగా సాగింది. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు 42 రోజుల పాటు చాతుర్మాస దీక్షలో తరించారు. దీక్ష విరమణలో భాగంగా శుక్రవారం రాత్రి పుర ప్రవేశ యాత్ర శోభాయమానంగా జరిగింది. ముందుగా శ్రీమఠం డోలోత్సవ మండపంలో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు స్వర్ణమండపంలో చాతుర్మాస సమరూప, భాగవత పోత్సపతి మంగళ మహోత్సవం నిర్వహించారు. శ్రీమఠం నుంచి పల్లకీలో స్వామిజీని ఊరేగింపుగా ప్రాంగణం బయటకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి వాహనాల్లో గ్రామ పొలిమేరలో వెలసిన కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం చేరుకున్నారు. ఆంజనేయస్వామి మంగళప్రదంగా పూజలు, హారతులు పట్టి భక్తులకు పీఠాధిపతి ఆశీర్వచనాలు చేశారు. స్థానిక వీవీజీ అతిథిగహం వద్ద ప్రత్యేక పుష్పాలంకరణ వాహనంలో ఆశీనులయ్యారు. శ్రీమఠం అధికారగణం వాహనంపై కొలువుదీరిన పీఠాధిపతికి పూలమాల సమర్పణతో స్వాగతం సుమాంజలులు పలికారు. పుష్ప వాహనానికి గజరాజు ఆహ్వానం పలుకుతుండగా భారీ భక్తజన సందోహం మధ్య పుర ప్రవేశ యాత్ర అలా ముందుకు సాగింది. రాఘవేంద్ర సర్కిల్లో పేల్చిన బాణసంచాలు, 150 మంది డోలు వాయిద్యకారుల విన్యాస వాయింపులు, దాససాహిత్య మండలి మహిళల కోలాటాలు, భక్తుల హర్షధ్వానాల మధ్య కడు వైభవంగా యాత్ర శ్రీమఠం చేరకుంది. యోగీంద్ర మండపంలో పీఠాధిపతికి శ్రీమఠం అధికారులు రూపాయి నాణేలతో తులాభారం నిర్వహించారు. దాసవాణి భక్తిగేయాలు, హరిదాసుల కీర్తనలతో శ్రీమఠం హోరెత్తింది. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వార పాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
స్వర్ణ మండపం.. శోభాయమానం
మంత్రాలయం: వేద మంత్రోచ్ఛారణ.. భక్తుల హర్షధ్వానాలు.. శాస్త్రోక్త పూజల మధ్య స్వర్ణమండప ప్రారంభోత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులు విరాళంగా అందజేసిన రూ.18 కోట్ల విలువ చేసే దాదాపు 60 కేజీల బంగారంతో ఆరు నెలల పాటు శ్రమించి ఈ మండపాన్ని రూపొందించారు. స్వామికి ప్రీతిపాత్రమైన గురువారం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు శాస్త్రోక్తంగా మండపాన్ని ప్రారంభించారు. మూలరాముల పేటిక, న్యాయసుధా పరిమళ గ్రంథాన్ని మండపంలో ఉంచి విశేష పూజలు నిర్వహించారు. అంతకు ముందు రాఘవేంద్ర స్వామి మూల బందావనానికి నైవేద్య సమర్పణ.. అభిషేకం చేపట్టారు. స్వామి బందావన ప్రతిమను స్వర్ణ పల్లకీలో కొలువుంచి శ్రీమఠం మాడవీధుల్లో కనుల పండువగా ఊరేగించారు. పూజా మందిరంలోని స్వర్ణ మండపంలో మూల, జయ, దిగ్విజయ రాములను అధిష్టించారు. పీఠాధిపతి మాట్లాడుతూ రాఘవేంద్రుల కరుణా కటాక్షంతో శ్రీమఠం ఖ్యాతి రోజురోజుకూ విస్తరిస్తోందన్నారు. నంజన్‌గూడ, శ్రీమఠం భక్తుల కానుకలతో స్వర్ణ మండపం రూపుదిద్దుకుందన్నారు. వేడుకల్లో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసారాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, డీఎం ఆనందరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు. -
శ్రీశైలంలో శాస్త్రోక్త సామూహిక అభిషేకాలు
– ప్రారంభించిన జగద్గురు పీఠాధిపతి శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో ఆదివారం శాస్త్రోక్త సామూహిక అభిషేకాలకు శ్రీకారం చుట్టారు. గతంలో స్వామివారిని జలంతో అభిషేకించి స్పర్శదర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం అభిషేక జలాన్ని మంత్రపూర్వకంగా చేసి ..దానిని స్వామివార్లకు అభిషేకించుకునే అవకాశం కల్పించారు. జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి శాస్త్రోక్త పూజలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలను పఠిస్తుండగా.. వాటిని వింటూ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆ జల కళశాలను స్మశించి అభిషేక కార్యక్రమాన్ని మనసావాచా నిర్వహించాలని సేవాకర్తలకు సూచించారు. ఈ అభిషేకం వల్ల భక్తులు సంపూర్ణమైన ఫలితం పొందుతారన్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఐదు విడతలగా జరిగిన సామూహిక అభిషేకంలో మొత్తం 700పైగా టికెట్లను విక్రయించినట్లు ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. ఒక్కొక్క విడతలో మొత్తం 120 టికెట్ల చొప్పున విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు, సాయంత్రం 6.30గంటల నుంచి 7.30గంటల వరకు అభిషేకం టికెట్లను ఇస్తామని పేర్కొన్నారు. -
శ్రీమఠంలో బంగారు గోపురం
– పరిశీలించిన పీఠాధిపతి సుభదేంద్ర తీర్థులు మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో బంగారు గోపురం సిద్ధమైంది. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులతో కలిసి హైదారాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్.. 40 రోజులు క్రితం గోపురాన్ని పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించి శుక్రవారానికి బంగారు గోపురంగా తీర్చిదిద్దారు. పీఠాధిపతి, విజయ్‌కుమార్‌లు కలిసి గోపురాన్ని పరిశీలించారు. శనివారం కలశ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీ మఠం మేనేజర్ ఎస్.కే శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి , ఇంజనీర్ సురేష్‌కోనాపూర్, గ్రామ ఉపసర్పంచ్ గోరుకల్లు కష్ణస్వామి, వేదపాఠశాల ప్రిన్సిపాల్ వాదిరాజాచార్ తదితరులు పాల్గొన్నారు. -
చాతుర్మాస దీక్షలో శ్రీమఠం పీఠాధిపతి
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు చాతుర్మాస దీక్ష బూనారు. ఆదివారం వేకువజామున రాఘవేంద్రుల మూలబందావనానికి విశేష పూజలు చేసిన అనంతరం మూల, జయ, దిగ్విజయ రామ పూజల్లో తరించారు. అనంతరం దీక్షను స్వీకరణ చేశారు. 41 రోజుల పాటు చాతుర్మాస దీక్షలో పీఠాధిపతులు ఉంటారు. లోక కల్యాణార్థం శ్రీమఠంలోనే జపతప అనుష్టానం చేస్తారు. దీక్ష వాస్తవంగా త్రయోదశి రోజున స్వీకరించడం ఆనవాయితీ. తిథిలోపం కారణంగా ఆదివారం ద్వాదశి, త్రయోదశి కలిసిరావడంతో పీఠాధిపతి చాతుర్మాస దీక్షకు ఉపక్రమించారు. 41 రోజుల తర్వాత సీమోల్లంఘన ఉంటుంది. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు -
తెలుగు వర్సిటీ పీఠాధిపతి బాధ్యతల స్వీకరణ
శ్రీశైలం: శ్రీశైలంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కతి, పురావస్తుశాఖ పీఠం పీఠాధిపతిగా ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి ఆదివారం బాధ్యతలను చేపట్టారు. ఇప్పటి వరకు డీన్‌గా వ్యవహరిస్తున్న వెంకట్రామయ్య నుంచి ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది, దేవస్థానం సహకారంతో శ్రీశైలక్షేత్ర పురావస్తు సంపదను కాపాడడానికి కషి చేస్తానన్నారు. ఇక్కడ ఉన్న ప్రాచీన పురావస్తు సంపదలో భాగమైన పంచమఠాల అభివద్ధిలో తనవంతు కషి చేస్తానని అన్నారు. పురావస్తు శాఖ .. పనిచేసిన అనుభవంతో మరుగున పడిన శాసనాలను వెలుగులోకి తీసుకువస్తానని, ఇందుకు సంబంధించి పరిశోధకుల సలహాలతో పాటు ఈ పీఠం ఆచార్యుల సమన్వయ కషితో క్షేత్ర ప్రాధాన్యతను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. -
మోదీతో శ్రీమఠం పీఠాధిపతి
ప్రముఖ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో గురువారం భేటి అయ్యారు. ఢీల్లిలో ప్రధానిని కలుసుకుని శ్రీ మఠం కార్యచరణపై సమీక్షించినట్లు మఠం మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీ మఠం ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక, ఆధ్యాత్మిక, దార్మిక కార్యక్రమాలు ప్రధానికి పీఠాధిపతి వివరించామన్నారు. శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని పీఠాధిపతి కోరగా ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. – మంత్రాలయం -
ఎన్నాళ్లకెన్నాళ్లకు
– విరామం తర్వాత శ్రీమఠానికి ఆప్త కార్యదర్శి రాక – పీఠాధిపతితో కలిసి ఉత్సవాలకు హాజరు మంత్రాలయం : ఆప్తకార్యదర్శి హోదా శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఎంతో కీలకమైంది. పీఠాధిపతి కార్యాచరణ, మఠం కార్యకలాపాలు, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో అజమాయిషీ ఉంటుంది. పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రాచార్ పరమపదించిన తర్వాత మఠంలో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రాధాన్యతలో అసమానతల నేపథ్యంలో పీఠాధిపతుల ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్ జూన్ 18న రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాలతో ఉపసంహరించుకున్నారు. తర్వాత శ్రీమఠానికి రాలేదు. చాన్నాళ్ల విరామం తర్వాత ఆదివారం ఆయన మంత్రాలయం వచ్చారు. వేకువజామున మఠం చేరుకుని 8.45 గంటలకు శ్రీరాఘవేంద్రస్వామి మూలబందావన దర్శనం చేసుకున్నారు. పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులతో కలిసి టీకారాయలు ఆరాధనోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తన గదిలో మఠం మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్‌తో 9.54 గంటల వరకు మంతనాలు జరిపారు. 10 గంటలకు పీఠాధిపతిని కలుసుకుని ధార్మిక పర్యటనలో భాగంగా రాయచూరు బయలు దేరారు. పీఠాధిపతి, వారి పూర్వాశ్రమ తండ్రి గియాచార్‌తోపాటు ఒకే కారులో వెళ్లారు. ప్రై వేట్ కారులో ఆప్తకార్యదర్శి అనుకోని రాక మఠంలో చర్చనీయాంశమైంది. కలుపుగోలుగా ధార్మిక పర్యటనకు వెళ్లడం, టీకారాయలు ఆరాధనలో పాల్గొనడం నిజంగా విశేషమనే కోణంలో చర్చించుకున్నారు.