మోదీతో శ్రీమఠం పీఠాధిపతి
ప్రముఖ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో గురువారం భేటి అయ్యారు. ఢీల్లిలో ప్రధానిని కలుసుకుని శ్రీ మఠం కార్యచరణపై సమీక్షించినట్లు మఠం మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీ మఠం ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక, ఆధ్యాత్మిక, దార్మిక కార్యక్రమాలు ప్రధానికి పీఠాధిపతి వివరించామన్నారు. శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని పీఠాధిపతి కోరగా ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.
– మంత్రాలయం