తెలుగు వర్సిటీ పీఠాధిపతి బాధ్యతల స్వీకరణ
తెలుగు వర్సిటీ పీఠాధిపతి బాధ్యతల స్వీకరణ
Published Sun, Jul 31 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
శ్రీశైలం:
శ్రీశైలంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కతి, పురావస్తుశాఖ పీఠం పీఠాధిపతిగా ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి ఆదివారం బాధ్యతలను చేపట్టారు. ఇప్పటి వరకు డీన్‌గా వ్యవహరిస్తున్న వెంకట్రామయ్య నుంచి ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది, దేవస్థానం సహకారంతో శ్రీశైలక్షేత్ర పురావస్తు సంపదను కాపాడడానికి కషి చేస్తానన్నారు. ఇక్కడ ఉన్న ప్రాచీన పురావస్తు సంపదలో భాగమైన పంచమఠాల అభివద్ధిలో తనవంతు కషి చేస్తానని అన్నారు. పురావస్తు శాఖ .. పనిచేసిన అనుభవంతో మరుగున పడిన శాసనాలను వెలుగులోకి తీసుకువస్తానని, ఇందుకు సంబంధించి పరిశోధకుల సలహాలతో పాటు ఈ పీఠం ఆచార్యుల సమన్వయ కషితో క్షేత్ర ప్రాధాన్యతను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
Advertisement