
సాక్షి,నారాయణపేటజిల్లా: కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఈనెల 10వ తేదీన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.
‘సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జనవరి 26 తేదీ నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తానంటూ ప్రజలను మోసం చేశాడు. కేవలం మండలానికి ఒక గ్రామానికి మాత్రమే రైతు భరోసా వేశారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తమైంది. హామీలు నెరవేర్చాలంటూ కోస్గిలో నిర్వహించబోయే రైతు దీక్షను విజయవంతం చేయాలి’అని నరేందర్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment