
వైఎస్‌ఆర్ జిల్లా : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మంగళవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దీక్ష చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ పేరుతో ఆడుతున్న డ్రామాలను నిరసిస్తూ దీక్ష చేయాలని నిర్ణయించారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌లో దీక్షా వేదికను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రామేశ్వరం రోడ్డులో ఉన్న బుశెట్టి కల్యాణ మండపం నుంచి ఎమ్మెల్యే దాదాపు 10వేల మందితో భారీ ర్యాలీ ప్రారంభించారు.
ఈ ర్యాలీ రామేశ్వరం రోడ్డు, గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకుంటుంది. ఎమ్మెల్యే చేస్తున్న దీక్షకు మద్దతుగా పట్టణంలోని వ్యాపారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలపనున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జనసేన, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలన్నీ మద్దతు ఇవ్వనున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్లు దీక్షలో పాల్గొని ఎమ్మెల్యేకు మద్దతు పలకనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment