జగనన్న నమ్మకాన్ని నిలబెట్టారు | Rachamallu Shiva Prasad Reddy Fires on TDP Leaders | Sakshi
Sakshi News home page

జగనన్న నమ్మకాన్ని నిలబెట్టారు

Published Sat, Feb 22 2020 12:46 PM | Last Updated on Sat, Feb 22 2020 12:46 PM

Rachamallu Shiva Prasad Reddy Fires on TDP Leaders - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

రాజుపాళెం : ఎన్నికల ముందు ఇచ్చిన హహామీలను నెరవెర్చడంతో జగనన్న నమ్మకాన్ని నిలబెట్టారని, టీడీపీ మోసం, దగాలను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. రాజుపాళెం మండలంలోని చిన్నశెట్టిపల్లె గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం బియ్యం కార్డులను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో బియ్యం కార్డులను రెండు, మూడు పంపిణీ చేసి మమ అనిపించారన్నారు.  అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీ తుడిచి పెట్టుకొని పోతుందని అన్నారు.

ప్రతి కుటుంబంలో అర్హులైన అవ్వాతాతకు పింఛను, అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఖాతాల్లో నగదు జమ చేశారని, ఈ ప్రకారం ఏడాదికి రూ.55 వేల నుంచి రూ.60 వేల వరకు లబ్ధి కలిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.గత ప్రభుత్వంలో రాజుపాళెం మండలంలోని చిన్నశెట్టిపల్లె గ్రామంలో నువ్వు వైఎస్సార్‌సీపీకి చెందిన వాడవు.. నీకు సంక్షేమ పథకాలు ఇవ్వమని తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అలా కాకుండా టీడీపీ జెండా మోసిన వారికి కూడా పథకాలను అందింస్తోందని చెప్పారు.ఇదంతా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ ఎస్‌ఏ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌ ఇరగంరెడ్డి జయరామిరెడ్డి, నాయకులు ఎంబీ శివశంకరరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రాజారాంరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement