- ప్రజల సంక్షేమం పట్టని చంద్రబాబు సర్కార్
- ప్రజలపై మోయలేని భారం
- వైఎస్సార్ సీపీ నేత విజయలక్ష్మి విమర్శ
- ఇంటి పన్ను పెంపును నిరసిస్తూ నాయకుల నిరసన దీక్ష
ప్రజలకు ‘పన్ను’పోటు
Published Tue, Mar 7 2017 11:23 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) :
పన్ను పోటుతో ప్రభుత్వం ప్రజల వెన్ను విరుస్తోందని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. అడ్డుగోలుగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని కోరుతూ ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరసన దీక్ష చేశారు. దీక్షలో దుర్గేష్‌తో పాటు రాజమహేంద్రవరం రూరల్ కో–ఆరి్డనేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు (బాబు) కూర్చున్నారు. ముఖ్య అతిథిగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఇంటి పన్నులు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పింఛన్ల కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోవడంలేదన్నారు. భర్త ఉన్నప్పటికీ వితంతు పింఛన్లు ఇస్తున్న దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
కందుల దుర్గేష్ మాట్లాడుతూ అడ్డుగోలుగా ఇంటి పన్నులు పెంచడం దారుణమన్నారు. 3 నుంచి 5 రెట్లు ఇంటి పన్నులు పెరగడంతో ప్రజలపై మోయలేని భారం పడిందన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, అయితే చినబాబుకు మాత్రమే ఎమ్మెల్సీ జాబు వచ్చిందని ఎద్దేవా చేశారు. పార్టీ రూరల్ కో–ఆరి్డనేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజలపై భారీగా పన్నుల భారం వేస్తున్నారని విమర్శించారు. పార్టీ రూరల్ కో–ఆరి్డనేటర్ గిరజాల వీర్రాజు(బాబు) మాట్లాడుతూ గ్రామ సభలతో సంబంధం లేకుండా వివిధ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచుల అధికారాలను కాలరాస్తున్నారని విమర్శించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న నేతలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. అనంతరం వారు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా కాట¯ŒS బ్యారేజ్ సెంటర్‌కు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగర కో–ఆరి్డనేటర్ రౌతు సూర్యప్రకాశరావు, నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు, జక్కంపూడి గణేష్, కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి దాసరి శేషగిరి, కోస్టల్ పేపర్ నేషనల్ ఎంప్లాయీస్ యూనియ¯ŒS నాయకులు, ఫ్రూట్స్, లెమ¯ŒS మర్చంట్స్ అసోసియేష¯ŒS సభ్యులు, దివ్యాంగ్ మహాసంఘట¯ŒS నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
సీతానగరం (రాజానగరం) : రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబులు ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌కు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చి తన హామీ నెరవేర్చుకున్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు తమకు ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారందరికీ కుచ్చుటోపీ పెట్టిన చంద్రబాబు తన కుమారుడికి ఏకంగా ఎమ్మెల్సీ పదవినే ఇచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని, ప్రత్యేక హోదాను సాధించలేని నిస్సహాయ స్థితిలో పడ్డారని దుయ్యబట్టారు. ఒక్క హామీని కూడా అమలు చేయలేని ఏకైక అసమర్ద సీఎంగా మిగిలిపోయారని ఆక్షేపించారు. ఎందరో సీనియర్ నాయకులు ఉండగా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్‌కు పదవి ఇవ్వడం వెనుక ఉద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.
Advertisement
Advertisement