tax issue
-
సహచర మంత్రి జహావిపై సునాక్ వేటు
లండన్: పన్నుల వివాదంలో చిక్కుకున్న అధికార కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్, సహచర కేబినెట్ మంత్రి నదీమ్ జహావిని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మంత్రి మండలి నుంచి తొలగించారు. జహావి పన్ను వ్యవహారాల్లో మంత్రులకుండే నియమనిబంధనల్ని ఉల్లంఘించారంటూ విచారణలో తేలడంతో సునాక్ ఆయనపై వేటు వేశారు. ప్రస్తుతం జహావి శాఖ లేని మంత్రిగా కేబినెట్లో ఉన్నారు. ప్రభుత్వం నియమించిన స్వతంత్ర విచారణ నివేదికను కూడా సునాక్ విడుదల చేశారు. ఇరాక్‌లో జన్మించిన జహావి ఆర్థిక మంత్రిగా ఉండగా అంతకు ముందు కట్టని పన్నులకు పెనాల్టీగా 50 లక్షల పౌండ్లు చెల్లించారు. ఈ విషయాన్ని దాయడం మినీస్టిరియల్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని విచారణ నివేదిక తేల్చి చెప్పింది. -
భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ కష్టమేనా?.. పాక్ కుట్ర అయితే లేదుగా!
వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023కి భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. పుష్కరకాలం తర్వాత ఈ మెగాటోర్నీకి భారత్ మరోసారి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆసక్తిని సంతరించుకుంది. చివరిగా 2011లో వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వగా.. ధోని నాయకత్వంలోని టీమిండియా 28 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ మరోసారి స్వదేశంలో జరుగుతుండడంతో మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అభిమానుల ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆతిథ్యం భారత్ నుంచి తరలిపోయే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు విషయమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ ప్రపంచకప్ కోసం భారత్ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాలని ఐసీసీ బీసీసీఐని కోరింది. మాములుగా ఒక మెగాటోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఆ దేశ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాలని గతంలోనే ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి పురోగతి లేదు. దీంతో పన్ను చెల్లింపు విషయంలోతాము ఏమి చేయలేమని.. అవసరమైతే టోర్నమెంట్‌ను భారత్‌లో కాకుండా ఇతర చోట నిర్వహించుకోవచ్చని ఐసీసీకి బీసీసీఐ వివరించినట్లు సమాచారం. అయితే గతంలో 2016లో టి20 ప్రపంచకప్ భారత్‌లో జరిగినప్పుడు భారత ప్రభుత్వం ఐసీసీకి పన్ను మినహాంపులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈసారి కూడా పన్ను మినహాయింపుకు ప్రభుత్వం ఒప్పుకోకపోతే వన్డే వరల్డ్‌కప్ భారత్ నుంచి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తప్పుబట్టడం ఆసక్తి కలిగించింది. ఆసియా కప్ పాకిస్తాన్లో నిర్వహిస్తే టోర్నీని బహిష్కరిస్తామని గతంలో టీమిండియా హెచ్చరించింది. దీంతో పీసీబీ టీమిండియాపై అక్కసు వెళ్లగక్కింది. మీరు ఆసియా కప్ ఆడేందుకు మా దేశానికి రాకపోతే.. వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు తాము రాలేమని.. అవసరమైతే వన్డే వరల్డ్‌కప్‌ను భారత్‌లో జరగకుండా అడ్డుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. పాక్ ప్రమేయం ఏం లేనప్పటికి పన్ను మినహాయింపు కారణంగా వన్డే వరల్డ్‌కప్ తరలిపోయే అవకాశం ఉండడంతో పాక్ ఇలా పంతం నెగ్గించుకుందంటూ కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆస్ట్రేలియాలో భారత్ ఐటీ సంస్థల పన్ను భారంపై దృష్టి
న్యూఢిల్లీ: భారత్– ఆస్ట్రేలియాల వాణిజ్య మంత్రుల మధ్య వచ్చే నెలలో జరిగే కీలక సమావేశంలో భారతీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న పన్ను సమస్యలను లేవనెత్తనున్నట్లు ఇక్కడ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిజానికి రెండు దేశాలూ 1991లో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ)పై సంతకం చేశాయి. 2013లో ఈ ఒప్పందంలో కాలానుగుణ మార్పులూ జరిగాయి. కాగా, ఆస్ట్రేలియాలో సాంకేతిక సేవలను అందించే భారతీయ సంస్థల ఆఫ్‌షోర్ ఆదాయంపై పన్ను విధింపును కూడా డీటీఏఏ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. ఈ పన్ను విధింపును నిలిపివేయడానికి డీటీఏఏ కింద నిబంధనలను త్వరగా సవరించాలని ఆస్ట్రేలియాను భారత్ కోరుతోంది. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ సెప్టెంబరు చివర్లో జాయింట్ మినిస్టీరియల్ కమిషన్ సమావేశంలో పాల్గొనడానికిగాను భారతదేశాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా భారత్ డీటీఏఏ నిబంధనల సమస్యను లేవనెత్తుతుందని అధికారి తెలిపారు. -
ప్రజలకు ‘పన్ను’పోటు
ప్రజల సంక్షేమం పట్టని చంద్రబాబు సర్కార్ ప్రజలపై మోయలేని భారం వైఎస్సార్ సీపీ నేత విజయలక్ష్మి విమర్శ ఇంటి పన్ను పెంపును నిరసిస్తూ నాయకుల నిరసన దీక్ష ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : పన్ను పోటుతో ప్రభుత్వం ప్రజల వెన్ను విరుస్తోందని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. అడ్డుగోలుగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని కోరుతూ ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరసన దీక్ష చేశారు. దీక్షలో దుర్గేష్‌తో పాటు రాజమహేంద్రవరం రూరల్ కో–ఆరి్డనేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు (బాబు) కూర్చున్నారు. ముఖ్య అతిథిగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఇంటి పన్నులు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పింఛన్ల కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోవడంలేదన్నారు. భర్త ఉన్నప్పటికీ వితంతు పింఛన్లు ఇస్తున్న దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ అడ్డుగోలుగా ఇంటి పన్నులు పెంచడం దారుణమన్నారు. 3 నుంచి 5 రెట్లు ఇంటి పన్నులు పెరగడంతో ప్రజలపై మోయలేని భారం పడిందన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, అయితే చినబాబుకు మాత్రమే ఎమ్మెల్సీ జాబు వచ్చిందని ఎద్దేవా చేశారు. పార్టీ రూరల్ కో–ఆరి్డనేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజలపై భారీగా పన్నుల భారం వేస్తున్నారని విమర్శించారు. పార్టీ రూరల్ కో–ఆరి్డనేటర్ గిరజాల వీర్రాజు(బాబు) మాట్లాడుతూ గ్రామ సభలతో సంబంధం లేకుండా వివిధ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచుల అధికారాలను కాలరాస్తున్నారని విమర్శించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న నేతలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. అనంతరం వారు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా కాట¯ŒS బ్యారేజ్ సెంటర్‌కు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగర కో–ఆరి్డనేటర్ రౌతు సూర్యప్రకాశరావు, నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు, జక్కంపూడి గణేష్, కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి దాసరి శేషగిరి, కోస్టల్ పేపర్ నేషనల్ ఎంప్లాయీస్ యూనియ¯ŒS నాయకులు, ఫ్రూట్స్, లెమ¯ŒS మర్చంట్స్ అసోసియేష¯ŒS సభ్యులు, దివ్యాంగ్ మహాసంఘట¯ŒS నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు కుచ్చుటోపీ సీతానగరం (రాజానగరం) : రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబులు ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌కు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చి తన హామీ నెరవేర్చుకున్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు తమకు ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారందరికీ కుచ్చుటోపీ పెట్టిన చంద్రబాబు తన కుమారుడికి ఏకంగా ఎమ్మెల్సీ పదవినే ఇచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని, ప్రత్యేక హోదాను సాధించలేని నిస్సహాయ స్థితిలో పడ్డారని దుయ్యబట్టారు. ఒక్క హామీని కూడా అమలు చేయలేని ఏకైక అసమర్ద సీఎంగా మిగిలిపోయారని ఆక్షేపించారు. ఎందరో సీనియర్ నాయకులు ఉండగా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్‌కు పదవి ఇవ్వడం వెనుక ఉద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.