హైకోర్టు లాయర్ జయ వింధ్యాల చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
హైదరాబాద్: హైకోర్టు లాయర్ జయ వింధ్యాల చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, జడ్జిలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలనే డిమాండ్లతో ఆమె మంగళవారం మధ్యాహ్నం నుంచి హైకోర్టులోని 11వ నంబర్ కోర్టు ఆవరణలో దీక్ష ప్రారంభించారు. అర్థరాత్రి చార్మినార్ మహిళా పోలీసులు ఆమె దీక్ష భగ్నం చేసి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.