దీక్షా జునేజా.. సిననిమ్ ఆఫ్ టాలెంట్. అరుదైన ఆర్టిస్ట్! ఆమె స్వస్థలం.. చండీగఢ్. సెటిల్డ్ ప్లేస్.. ముంబై. మిగిలిన వివరాలు..
దీక్ష తల్లిదండ్రులు శశి జునేజా, అశోక్ జునేజాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఆర్టిస్ట్ అవ్వాలని దీక్షా అనుకోలేదు. మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేసింది. చదువైపోగానే చండీగఢ్‌లోని 94.3 మై ఎఫ్‌ఎమ్‌లో ఇంటర్న్‌గా చేరింది. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ ఉద్యోగంలోకి మారింది.
రేడియో కొలువులో ఉన్నప్పుడు కంటెంట్ రైటర్‌గానూ పనిచేసింది. ఆ టైమ్‌లోనే ఆమెను ముంబై పిలిచింది మోడలింగ్‌లో చాన్స్ ఉంది రమ్మంటూ! గ్లామర్ ఫీల్డ్ తనకు వర్కవుట్ అవుతుందో కాదో అనుకుంటూనే ముంబై చేరింది.
టీవీ కమర్షియల్స్‌తో మోడల్‌గా రాణిస్తున్నప్పుడే ‘ఘుమక్కడ్’ అనే మూవీలో అవకాశం వచ్చింది. తర్వాత చాలా చిత్రాల్లోనే కనిపించినా నటిగా ఆమెకు గుర్తింపు తెచ్చినవి మాత్రం ‘ద జోయా ఫ్యాక్టర్’, ‘రాజ్మా చావల్’ సినిమాలే.
సిల్వర్ స్క్రీన్ మీది ఆమె పెర్‌ఫార్మెన్స్ వెబ్ స్క్రీన్ ఆపర్చునిటీస్‌నీ తెచ్చిపెట్టింది. అలా ‘గర్ల్‌ఫ్రెండ్ చోర్’, ‘గిల్టీ మైండ్స్’, ‘యునైటెడ్ కచ్చే’ వంటి వెబ్ సిరీస్‌లు చేసి ఓటీటీ వీక్షకులనూ తన వీరాభిమానులుగా మార్చేసుకుంది. ఆమె నటించిన ‘పిల్’ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ‘జియో సినిమా’లో స్ట్రీమ్ అవుతోంది.
దీక్షా మంచి కవయిత్రి కూడా. తన కవితలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దీక్షా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.
పేరు, ప్రతిష్ఠల మీద నాకు మోహం లేదు. చేసే పనిపట్ల నిబద్ధత, గౌరవం ఉంది. పనే దైవం అనే మాటను నమ్ముతాను, ఫాలో అవుతాను! – దీక్షా జునేజా
Comments
Please login to add a commentAdd a comment