
సోఫా, బెడ్‌పైకి రకరకాల మోడల్స్‌లో కుషన్స్ కనపడుతుంటాయి. వాటిల్లో డాన్సింగ్ కుషన్స్‌ని చూశారా? ఎంబ్రాయిడరీ, ప్యాచ్‌వర్క్, పెయింటింగ్ కాంబినేషన్స్‌తో రూపుదిద్దుకునే ఈ కుషన్ డిజైన్స్ సృజనాత్మకతకు అద్దంపడతాయి. లివింగ్ రూమ్, బెడ్ రూమ్, కిడ్స్ రూమ్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
పిల్లల ఫ్రాక్స్‌ను పోలిన నెటెడ్ మెటీరియల్‌తో డిజైన్ చేసి, అటాచ్ చేసిన డాన్సింగ్ డాల్స్‌ని కుషన్ కవర్స్‌కి జతచేసినా.. డోర్స్‌కి హ్యాంగ్ చేసినా అదనపు హంగునిస్తాయి. ఈ డెకరేటివ్ కుషన్స్‌ని వివాహ వేడుకలు, పిల్లల పుట్టినరోజు పార్టీల కోసం కూడా డిజైన్ చేస్తున్నారు క్రియేటర్స్. వీటిలో నెటెడ్, లేస్, ముత్యాలు, కలర్ రిబ్బన్స్ వంటి వాటì నీ ఉపయోగిస్తున్నారు.