
నాకు ఇప్పుడు తొమ్మిదో నెల. నొప్పులు తట్టుకోలేను అనిపిస్తోంది. ఎపిడ్యూరల్ లాంటి ఇంజెక్షన్స్ అంటే భయం. నొప్పులు తట్టుకోవడానికి వేరే మార్గాలు ఉంటే చెప్పండి?
– కావేరి, నెల్లూరు.
ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఈ రోజుల్లో చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్దిగానే ఉంటాయి. కాని, అది వద్దనుకే వాళ్లకి కొన్ని ఆసుపత్రుల్లో కాంప్లమెంటరీ థెరపీస్ లేదా ఎండోక్సాన్ వంటి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్‌ని సూచిస్తున్నారు. కాంప్లమెంటరీ థెరపీస్‌ను సంబంధిత ఎక్స్‌పర్ట్ థెరపిస్ట్‌లతోనే తీసుకోవాలి. వాటిలో హిప్నోథెరపీ, అరోమాథెరపీ, మసాజ్, రిఫ్లెక్సాలజీ, ఆక్యుపంక్చర్ లాంటివి ఉంటాయి.
హిప్నోగ్రఫీలో ప్రశాంతమైన ఒత్తిడిలేని ప్రసవం జరిగేటట్టు హిప్నో క్లాసులలో నేర్పిస్తారు. దీంతో ఆందోళన తగ్గి, బర్తింగ్ మజిల్స్ సరిగ్గా పనిచేస్తాయి. అరోమాథెరపీలో శారీరక, భావోద్వేగ ఆరోగ్యానికి అవసరమైన నూనెలు ఉపయోగించడం వలన భయం, ఆందోళన తగ్గుతుంది. కాని, దీనితో అంత పెద్దగా లాభం ఉండదని పరిశోధనల్లో తేలింది.
రిఫ్లెక్సాలజీ లేదా మసాజ్‌లో మీ శరీరంలోని కొన్ని ప్రాంతాలు, చేతులు, కాళ్లను మసాజ్ చేయటం వలన లేబర్ పెయిన్ తగ్గుతుంది. వివిధ పరిశోధనల్లో ఇది కూడా పూర్తి ఉపశమనం ఇవ్వదని తేల్చారు. ఇక ఆక్యుపంక్చర్‌లో సన్నని స్టెరైల్ సూదులతో శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన పాయింట్స్‌ని ప్రెస్ చేస్తారు. దీంతో నొప్పి తగ్గుతుంది. ఈ సూదులను ఆ నిర్దిష్టమైన స్పాట్స్‌లో ఇరవై నిమిషాల నుంచి మొత్తం కాన్పు జరిగే వరకు ఉంచుకోవచ్చు. ఇది థెరపిస్ట్ మీతోనే ఉండి, చేయాల్సిన చికిత్స. ఎంటోనాక్స్ అనే గ్యాస్‌నే ఒక ఆక్సిజన్ పంపు లాంటి దాని ద్వారా నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ మిక్స్చర్‌ని పీల్చుకునే పద్ధతి.
దీనితో చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఇది రోగి సొంతంగానే ఉపయోగించుకోవచ్చు. అంటే నొప్పి మొదలైనప్పుడు ఒక పఫ్ పీల్చుకుంటే ఆ గ్యాస్ ద్వారా నొప్పి ఒక నిమిషం వరకు తగ్గుతుంది. మళ్లీ నొప్పి వచ్చినప్పుడు మళ్లీ ఉపయోగించాలి. కొంచెం మగతగా ఉంటుంది. యాభై శాతం వరకు నొప్పి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఈ మార్గాల ద్వారా ఇంజెక్షన్స్ లేకుండా లేబర్ పెయిన్స్‌ను తగ్గించుకునే అవకాశం ఉంది. వీటిల్లో మీకు అందుబాటులో ఏది ఉంది అని ఆసుపత్రుల్లో పరిశీలించి తీసుకోవాలి.
డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: ప్రపంచ వాతావరణ సదస్సు ఎలా ఏర్పాటైందంటే..ఇప్పటికీ 75 ఏళ్లా..?)
Comments
Please login to add a commentAdd a comment