
ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ బ్లాగర్. ‘The Style Edge’ ఫౌండర్. సోషల్ మీడియా స్టార్. ఇన్‌స్టాలో ఆమెకు ఏడు లక్షలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. సొంతూరు ముంబై. ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.
కాలేజీ రోజుల్లోనే తన పేరు మీదే యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. డార్క్ స్కిన్ వల్ల తను ఎదుర్కొన్న వివక్షను వివరిస్తూ చేసిన వీడియోతో పాపులర్ అయింది. అది ఆమెకు మోడలింగ్ చాన్స్‌నిచ్చింది. ర్యాంప్ మీద షో స్టాపర్‌గా నిలిచింది. ‘Grazia India’ లాంటి ఫ్యాషన్ మ్యాగజీన్‌లు ఆమె ఫొటోతో కవర్ పేజ్‌ని మేకప్ చేసుకున్నాయి. బెస్ట్ ఫ్యాషన్ బ్లాగర్‌గా ఎన్నో అవార్డులూ అందుకుంది సంతోషి శెట్టి.
ఇవి చదవండి: హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి