
కృతి మూడోతరగతి చదువుతున్నప్పుడు ఒక బుక్ ఫెయిర్‌లో పుస్తకం కొనడానికి అమ్మను డబ్బు అడిగితే, వాళ్లమ్మ చాలా సంతోషించింది. కాని, కృతి ‘హౌ టు బి గార్జియస్’ అనే బ్యూటీ బుక్‌తో ఇంటికి వెళ్లింది. చిన్నప్పటి నుంచి అందంపై ఎంతో శ్రద్ధ చూపే తను, ఫ్యాషన్‌లోనూ అంతే ఆసక్తిని కనబరుస్తున్న విషయం ఆమె ఫ్యాషన్ స్టయిలే చెప్తుంది. ఆ విషయాలే మీ కోసం..
సౌందర్యం, చర్మ రక్షణ కోసం చాలా తెలుసుకొని, ఎన్నో వీడియోలు, నిపుణుల సలహాలు తీసుకున్నాకే నాపై ప్రయత్నిస్తా. చక్కెరకు దూరంగా ఉండటం వలన వచ్చిన అందం, ఇప్పటివరకు ఏ బ్యూటీ ప్రాడక్ట్ నాకు ఇవ్వలేదు. జ్యూలరీలో లాంగ్ ఇయర్ రింగ్స్ ఇష్టం. అవి నా ముఖానికి బాగా నప్పుతాయని అంటోంది కృతి శెట్టి.

ఆభరణాలన్నీ అలంకరించుకోవటం ఓ స్టయిల్ అయితే, కేవలం ఒకే ఒక్క ఆభరణంతో స్టయిలింగ్ చేసుకోవటం ప్రస్తుతం ఉన్న ట్రెండ్. ముఖ్యంగా చెవులకు ధరించే దుద్దులు, జూకాలను సాధారణం కంటే కాస్త పెద్ద సైజులో ధరిస్తే మెడను బోసిగా ఉంచుకున్నా, ఇతర ఆభరణాలు ధరించకపోయినా అందంగానే కనిపించొచ్చు. కాని, ఎప్పుడూ ఒకే రకం ఇయర్ రింగ్స్ బోర్ కొడతాయి. అయితే, ఈ ఇయర్ రింగ్స్ బ్యాక్ ఫ్రేమ్ ఒక్కదానితో వివిధ రకాల స్టడ్స్‌ను మార్చుకుంటూ చాలా రకాలుగా స్టయిలింగ్ చేసుకోవచ్చు.
(చదవండి: కేన్సర్‌తో పోరాడటంలో బీట్‌రూట్ హెల్ప్ అవుతుందా..?)
మొదట్లో కేవలం బంగారు ఆభరణాలకే లభించే ఈ డిటాచబుల్ ఫ్రేమ్స్, ప్రస్తుతం ఖర్చుకు ఖర్చు ఆదా చేయడానికి, స్టయిల్‌కు స్టయిలిష్ లుక్ అందించడానికి మార్కెట్‌లో వివిధ మెటల్స్‌లోనూ లభిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలాంటి ఫ్రేమ్స్‌తో డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేసేయండి పైన చూపించిన నటి కృతి శెట్టిలా. డ్రెస్ డిజైనర్ ప్రియల్ ప్రకాశ్ ధర: రూ. 27,500 జ్యూలరీ బ్రాండ్ మయరా ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.