న్యూఢిల్లీ: సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఫెస్టివల్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత మహిళా అథ్లెట్ కేఎం దీక్ష 1500 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ఈ మీట్‌లో దీక్ష 1500 మీటర్ల దూరాన్ని 4ని:04.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఈ క్రమంలో 2021 నుంచి హర్‌మిలన్ బైన్స్ (4ని:05.39 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును దీక్ష బద్దలు కొట్టింది.
సుజీత్, జైదీప్‌లకు నిరాశ..
ఇస్తాంబుల్: వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు సుజీత్ (65 కేజీలు), జైదీప్ (74 కేజీలు) ఒలింపిక్ బెర్త్‌లను దక్కించుకోవడంలో విఫలమయ్యారు.
మూడో స్థానం కోసం జరిగిన బౌట్‌లో రూథర్‌ఫర్డ్ (అమెరికా) చేతిలో సుదీప్ ఓడిపోగా... కాంస్య పతక బౌట్‌లో జైదీప్ 1–2తో దెమిర్తాస్ (టర్కీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్క రెజ్లర్ (అమన్; 57 కేజీలు) మాత్రమే పోటీపడనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment