ఏపీ సమస్యలపై యార్లగడ్డ దీక్ష
రాజమండ్రి: తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రా ప్రాంత సమస్యలపై మాజీ పార్లమెంట్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒక రోజు దీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని సీపీ బ్రౌన్ మందిరంలో గురువారం ఆయన ఒక్క రోజు దీక్ష చేస్తున్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ప్రస్తుతం ఉన్న తెలుగు యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ నిరాధరణకు గురైందన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.