ప్రాజెక్టుల నిర్మాణాల కోసమంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్ట సవరణ బిల్లుతో దోపిడీకి చట్టబద్ధత కల్పించినట్లవుతుందని జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కొత్తగా ఆమోదం పొందిన బిల్లుతో నిర్వాసితులకు అన్యాయమేతప్ప న్యాయం దక్కదని పునరుద్ఘాటించారు.