ఒంగోలు సెంట్రల్: యాదవ జాతి అభిభ్యున్నతి కోసం, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతి యుతంగా దీక్ష చేస్తుంటే భగ్నం చేయడం దుర్మార్గమని యాదవ జేఏసీ జిల్లా కన్వీనర్ మిరియం శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం స్థానిక అంకమ్మపాలెంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సమస్యలపై స్పందించి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో దీక్షలు మొదలు పెడతామని చెప్పారు.
కాపులకు బీసీ రిజర్వేషన్ ఆలోచన విరమించుకుని యాదవులు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచాలని డిమాండ్ చేశారు. తమ దీక్షకు మద్దతు తెలిపిన ప్రజాసంఘాల నాయకులకు మిరియం కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సంఘ నాయకులు కుట్టుబోయిన కోటి, మల్లెబోయిన రాజు, తుమ్మకూరి దొర, మల్లవరపు లక్ష్మి, జాజుల కృష్ణ, దూళ్ల అప్పారావు, పిన్నిక శ్రీనివాస్, మిరియం శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment