ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ఉదయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నామని గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ ఉదయ్ శంకర్ తెలిపారు. వైఎస్ జగన్ శరీరంలో డీహైడ్రేషన్ మొదలైందని, ఆయన దీక్ష విరమిస్తే మంచిదని సూచించారు. కీటోన్స్ కారణంగా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు.