Samara deeksha
-
నిరశనపై వెక్కిరింపా?!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ, రాష్ట్ర ప్రజలకు దక్కిన హక్కుల సాధన కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాస్వామిక పద్ధతిలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను టీడీపీ ప్రభుత్వం అపహాస్యం చేయడంపై ప్రజల్లో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా కోసం అన్ని పక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సీఎం చంద్రబాబు ఆ పని చేయకపోగా మెతుకు ముట్టకుండా కఠోర దీక్ష సాగిస్తున్న జగన్ ఆరోగ్యంపై తప్పుడు నివేదికలతో నీచ రాజకీయాలకు దిగడంపై అన్ని వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా సాధించాల్సిన చంద్రబాబు ఆ పని చేయకపోగా, దానికోసం ప్రాణాలను ఫణంగా పెట్టి జగన్ సాగిస్తున్న దీక్షపై తప్పుడు నివేదికలు సృష్టించడమే కాకుండా నిస్సిగ్గుగా అవహేళన చేయడంతో.. హోదా సాధన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమైంది. ఈ నెల 7వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేస్తున్న జగన్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో చక్కెర స్థాయి ఎందుకు పెరిగిందో తెలియదంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడటం గమనిస్తే ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుంది. ఏదైనా సమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరశన చేపట్టినప్పుడు ప్రభుత్వం దిగొచ్చి చర్చలు, సంప్రదింపులతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. అలాంటి ప్రక్రియను ఎప్పుడో తమ డిక్షనరీ నుంచి తొలగించిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ప్రజాస్వామిక నిరశనలను అపహాస్యం చేసే నీచస్థాయికి దిగజారింది. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ప్రతిపక్ష నేత నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే.. తమ కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వ వైద్యుల ద్వారా తప్పుడు నివేదికలను తయారు చేయించి చవకబారు రాజకీయానికి పాల్పడిన ఉదంతం బహుశా దేశ చరిత్రలోనే ఇప్పటివరకు లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ప్రత్యేక హోదాను అడ్డుకోవడం కాదా? రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో పంపించారని చెప్పిన చంద్రబాబుకు.. ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి తన వంతుగా ప్రజల పక్షాన నిలబడిన ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటం చేస్తుంటే ఎందుకు అంత ఉలుకు? రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తే... ఏమొస్తుంది? కనీసం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నారు. దీక్షతో జగన్ ఆరోగ్యం క్షీణిస్తుంటే... సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాల్సిన ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా దీక్షను అవహేళన చేసే విధంగా వ్యవహరించడంలోని ఆంతర్యమేంటి? జగన్ దీక్షను ఆభాసుపాలు చేయాలనుకుంటే ఎవరికి నష్టం? ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న జగన్‌పై నిందలు వేయడమంటే.. హోదాకు అడ్డుపడటం కాదా? ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తుంటే దాన్నుంచి దృష్టి మళ్లించాలన్న దుర్బుద్ధితోనే బాబు చవకబారు ఎత్తుగడలను తెరమీదకు తెస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రతి దీక్షలోనూ దక్షత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలపై జగన్మోహన్రెడ్డి రాజీలేని పోరాటం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణికి నిరసనగా, విభజన తీరును నిరసిస్తూ సమైక్య రాష్ట్రం కోసం చంచల్‌గూడ జైలులో జగన్ 7 రోజులు దీక్ష చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించిన దశలోనూ వెరవకుండా 2013 ఆగస్టు 24న నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. కనీసం నలుగురు వ్యక్తులు కూడా ఆయనను చూడడానికి వీలులేని పరిస్థితుల్లో జైలు గోడల మధ్య దీక్ష సాగించారు. కేవలం ప్రచారం కోసమే అయితే జైలు గోడల మధ్య ఎవరూ చూడలేని చోట దీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం క్షీణించడంతో చివరకు 29వ తేదీ అర్ధరాత్రి జైలు అధికారులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన దీక్షను కొనసాగించారు. ఆరోగ్యం విషమించడంతో 31 వ తేదీన వైద్యులు బలవంతంగా ప్లూయిడ్స్ ఎక్కించారు. జైలు గోడల మధ్య ఏడు రోజుల దీక్ష చేసిన జగన్ ఆ తర్వాత కూడా తన ఆరోగ్యాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా అక్టోబర్‌లోనే మరోసారి నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ లోటస్పాండు వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2013 అక్టోబర్ 5న దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష కొనసాగిస్తున్న దశలో ఆరోగ్యం బాగా క్షీణించి శరీరంలో కీటోన్స్ ప్రమాదకర స్థాయికి చేరుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో 9 వ తేదీ రాత్రి పోలీసులు నిమ్స్‌కు తరలించి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు మిలాఖతయిన రోజుల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ 7 రోజుల పాటు ఇందిరాపార్క్ వద్ద జగన్ కఠోర దీక్ష సాగించారు. వైద్యులు అనేక దఫాలుగా హెచ్చరించినప్పటికీ ఆయన ఆరోగ్యం విషయంలో ఏమాత్రం వెరవలేదు. 2011 ఫిబ్రవరి 18 నుంచి 24 వరకు దీక్ష సాగించగా చివరకు పోలీసుల ద్వారా బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
'చంద్రబాబు భజన చేస్తున్న వెంకయ్య'
హైదరాబాద్: ఆరోగ్యం క్షీణిస్తున్నందున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష విరమించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నందున ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాకకు ముందే ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలన్నారు. ముందుగా వైఎస్ జగన్ దీక్ష విరమించాలని, సానుకూల ప్రకటన రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా10 ఏళ్ల పాటు కావాలని డిమాండ్ చేసిందే వెంకయ్య నాయుడు అని గుర్తు చేశారు. హామీని నెరవేర్చాల్సిన వెంకయ్య ఇప్పుడు చంద్రబాబు భజన చేస్తున్నారని విమర్శించారు. -
చాలా బాధగా ఉంది: వైఎస్ భారతి
గుంటూరు: ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న తన భర్త వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండడంపై ఆయన సతీమణి వైఎస్ భారతి ఆందోళన వెలిబుచ్చారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని అన్నారు. జగన్ ను ఈ పరిస్థితుల్లో చూస్తే బాధగా ఉందని చెప్పారు. దీక్షా ప్రాంగణం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. 'షుగర్ లెవెల్ కూడా 61కి వచ్చేసింది. అది కనీసం 80 పైన ఉంటే మంచిదని చెబుతున్నారు. మంత్రులు వాళ్లేం చేస్తారో అది మాట్లాడితే మంచిది గానీ, పక్కన వాళ్లను తప్పుపడితే ఎలా? వైఎస్ జగన్ ఆరు రోజుల నుంచి ఏమీ తినడం లేదు. చాలా బాధగా ఉంది' అని వైఎస్ భారతి అన్నారు. -
ఆరు రోజులుకు చేరిన వైఎస్ జగన్ నిరాహార దీక్ష
-
'చాలా బాధగా ఉంది'
-
జగన్ దీక్షకు సీపీఐ చంద్రశేఖర్ మద్దతు
-
జగన్ దీక్షకు మద్దతుగా విద్యార్థుల ఆందోళనలు
-
జగనన్న కోలుకోవాలని...
హైదరాబాద్: ఉక్కు సంకల్పంతో దీక్ష బూనిన జననేతకు యావదాంధ్ర ప్రజ దన్నుగా నిలిచింది. రాష్ట్ర మేలు కోరి ప్రాణాన్ని ఫణంగా పెట్టిన రాజన్న తనయుడికి బాసటగా నిలిచింది. అన్నపానీయాలు ముట్టకుండా ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న జగనన్న ఆరోగ్యం కుదుటపడాలని దేవుళ్లకు మొక్కుతున్నారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరు సల్పుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. శ్రీకాకుళం వైఎస్ జగన్ ఆరోగ్యం మెరుగుపడాలని అరసవెల్లి సూర్య దేవాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జననేత కోలుకోవాలని అయినవెల్లి వినాయక ఆలయంలో వైఎస్సార్ సీపీ నేతలు విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, చిట్టబ్బాయి ప్రత్యేక పూజలు చేశారు కృష్ణా పెడన నియోజకవర్గ ఇన్ చార్జి ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో జగన్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి జోగి రమేశ్ ఆధ్వర్యంలో ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో పూజలు, ప్రార్థనలు జరిపారు. అనంతపురం వైఎస్ జగన్ దీక్ష విజయవంతం కావాలని అనంతపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎర్రి స్వామిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. -
’ఆ మహానుభావుల ఆత్మక్షోభిస్తుంది’
-
జగన్ దీక్షపై కుట్ర
-
అలాంటి వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రా?
గుంటూరు: ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు విషమిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముందని డాక్టర్లు చెప్పారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్, నిరుద్యోగ యువత కోసం జగనన్న తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి దీక్ష చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. జగన్ చూపిన బాటలో ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడాలని కోరారు. పార్టీలకు అతీతంగా మద్దతు పలకాల్సిన అంశమిదని, అవహేళన చేసే విధంగా మంత్రులు మాట్లాడడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోని వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం సిగ్గుచేటని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అలాంటి వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రా?
-
'ఇప్పటికైనా కళ్లు తెరవండి'
గుంటూరు: వైద్యులను అడ్డుపెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు నోటికొచినట్టు మాట్లాడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తమకు అనుకూల మీడియాలో విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నీచరాజకీయాలు చేయాల్సిన అవసరముందా అని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ప్రత్యేక హోదా కావాలని జగన్ పోరాటం చేస్తున్నారని పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం బాగా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
'ఇప్పటికైనా కళ్లు తెరవండి'
-
క్షీణిస్తున్న ఆరోగ్యం.. సడలని సంకల్పం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాగా నీరసించిపోయారు. సోమవారం ఉదయం ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయనకు షుగర్ లెవల్ తగ్గింది. బీపీ, పల్స్‌రేటు పడిపోయాయి. బరువు కూడా తగ్గారు. జననేత ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నాయకుడు ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ తాను చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. జననేత ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా దీక్షకు దిగిన వైఎస్ జగన్ ను ఈ ఉదయం జర్నలిస్ట్ నాయకులు కలిశారు. ఐజేయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తదితరులు జగన్ ను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు
-
ఆరో రోజుకు చేరిన జగన్ నిరవధిక దీక్ష
-
అనంతలో ప్రత్యేక ఉద్యమం ఉధృతం
-
’ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే’
-
ఉద్యమాన్ని నీరుగార్చే యత్నం
-
ఎలుకలు కూడా పట్టడం రాని వాళ్లా విమర్శించేది ?
-
జగనన్నకు అండగా ఉంటాం
-
'వైఎస్ జగన్ దీక్ష విరమిస్తే మంచిది'
-
'వైఎస్ జగన్ దీక్ష విరమిస్తే మంచిది'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ఉదయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నామని గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ ఉదయ్ శంకర్ తెలిపారు. వైఎస్ జగన్ శరీరంలో డీహైడ్రేషన్ మొదలైందని, ఆయన దీక్ష విరమిస్తే మంచిదని సూచించారు. కీటోన్స్ కారణంగా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. వైఎస్ జగన్ తక్షణం దీక్ష విరమించి, ఆహారం తీసుకోవాలని సలహాయిచ్చారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన నివేదికను తమ సూపరింటెండెంట్ కు సమర్పిస్తామని చెప్పారు. ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ దీక్షకు మద్దతుగా రోడ్లపై వంటావార్పు
-
వైఎస్సార్ జిల్లాలో వెల్లువెత్తుతున్న నిరసనలు
-
ప్రకాశంజిల్లాలో ప్రత్యేకహోదా పోరాటం
-
జగన్ ఆరోగ్యం కోసం ప్రత్యేకపూజలు
-
నెల్లూరు జిల్లాలో జగన్ దీక్షకు భారీ మద్దతు
-
తూ.గో.జిల్లాలో జగన్‌కు మద్దతుగా భారీర్యాలీలు
-
విశాఖలో YSRCP రిలే నిరాహారదీక్షలు
-
హోదాపై ఏపీ సర్కార్‌ని ప్రశ్నిస్తున్న ఏపీ ప్రజలు
-
ప్రత్యేకహోదా డిమాండ్‌పై హోరెత్తిన రాయలసీమ
-
’సింగపూర్ బృందాలకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు’
-
సంఘీభావాలు... సంపూర్ణ మద్దతు
-
జగన్ దీక్షకి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ
-
వైఎస్ జగన్ దీక్షకి మద్దతుగా బైక్ ర్యాలీ
-
హోదా కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం
-
రోజుకో మాట,పూటకో పాట
-
జగన్ ఎత్తిన ప్రజా ఎజెండాకు భారీ స్పందన
-
’హోదా వస్తేనే మాకు ఉద్యోగాలొస్తాయి’
-
వైఎస్ జగన్‌తో విద్యార్థుల సెల్ఫీలు
-
పెరుగుతున్న ప్రజా సంఘాల మద్దతు
-
4వ రోజుకు చేరిన వైఎస్ జగన్ దీక్ష
-
అది మంత్రి వర్గమా.. రాబందుల సంతతా?
-
'బాబూ.. దమ్ముంటే పదవులు వదిలి పోరాడాలి'
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఓటుకు కోట్లు కేసు భయం పట్టుకుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ భయం వల్లే చంద్రబాబు కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని ఆరోపించారు. తరుచూ ఢిల్లీకి వెళుతున్న బాబు ప్రత్యేక హోదాపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై టీడీపీ మంత్రులు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ఉద్యమిస్తున్న జగన్‌పై చేతిగాని తనం వల్లే నిందలు వేస్తున్నారని చెప్పారు. దమ్ముంటే కేంద్రంలో మంత్రి పదవులు వదిలి ప్రత్యేక హోదాపై పోరాడాలని సవాల్ విసిరారు. -
అది మంత్రి వర్గమా.. రాబందుల సంతతా?
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్‌ను కేబినెట్ అంటారా? ఆయన మంత్రులను మంత్రులు అంటారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేత వాసిరెడ్డ పద్మ అన్నారు. వారంతా మంత్రులు కాదని స్వార్థపరుల గుంపు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. మట్టినుంచి ఇసుక వరకు అక్రమంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రి వర్గం అమ్ముకుంటుందని ఆరోపించారు. అసలు వారు నాయకులా.. రాబందులా సంతతా అని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని తల్లి లేని రాష్ట్రం అని చెప్పి.. ఇప్పుడు ఆ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. దిక్కులేని అనాధలా రాష్ట్రాన్ని వదిలేశారు ప్రత్యేక హోదా ఆశ చూపి నాడు మహోద్యమం ఆపేశారు ఎన్నికలు అయిపోయాక ఆ మాటలు పక్కకు పెట్టారు ప్రత్యేక హోదాకు ఇతర రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకోవు రాజధాని కడుతున్నాం.. దానిని చూసి మురుసుకొమ్మంటున్నారు రాజధానిని సినిమా చూపిస్తున్నట్లు చూపిస్తున్నారు మరి భూములు కోల్పోతున్న రైతుల పరిస్థతి ఏమిటి సింగపూర్ వాసులకు ఏపీని రియల్ ఎస్టేట్ భూమిగా మార్చారు ఎన్నిలక్షల ఎకరాలు ప్రైవేటు సంస్థలకు, కార్పొరేట్‌కు కట్టబెడతారు చంద్రబాబు ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి, మహిళల వ్యతిరేకి వైఎస్ ను చూస్తే ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ గుర్తొస్తుంది చంద్రబాబును చూస్తే నేడు కరువులు, కొరతలు గుర్తొస్తున్నాయి నిజాయితీతో ఏం అభివృద్ధి చేయలేకపోయారు లాభాల్లో ఉన్న చిత్తూరు డైరీని నాశనం చేసి తన హెరిటేజ్ డెవలప్ చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హెరిటేజ్ లాభాలు ఎలా పెరిగాయి మోసం చేసి మరోసారి చంద్రబాబునాయుడు ఆయన కుమారుడిని తీసుకొస్తున్నాడు పోలవరం పూర్తవ్వాలంటే కేంద్రం కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ప్రత్యేక హోదా చంద్రబాబు తీసుకురాలేకపోయాడు కాబట్టే వైఎస్ జగన్ దీక్షకు దిగారు ఆంధ్రప్రదేశ్‌ను సాధాసీదాగా ఉండే రాష్ట్రంగా జగన్ చూడాలనుకోవడం లేదు ప్రత్యేక హోదా సాధించలేక పోతే చంద్రబాబునాయుడు ప్రభుత్వం సచ్చినట్లే లెక్క అవసరం అయితే, వైఎస్ జగన్ దీక్ష చూపించైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాండి 13 జిల్లాల ప్రజల గొంతుక నేటి వైఎస్ జగన్ దీక్షా శిబిరం నిరవధిక దీక్ష విజయవంతమౌతుంది.. ప్రత్యేక హోదా తప్పక వస్తుంది ప్రత్యేక హోదా వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు.. దీక్ష కొనసాగుతుంది -
వైఎస్ జగన్ దీక్ష సఫలం కావాలి: ఉండవల్లి
-
వైఎస్ జగన్ దీక్ష సఫలం కావాలి: ఉండవల్లి
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష సఫలం కావాలని కోరుకుంటున్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలపై ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విభజన విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నాటి ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి ఏకమై మోసం చేశాయని చెప్పారు. విభజన సందర్భంలో సభలో జరిగిన అంశాలతో పొందుపరిచిన పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని అన్నారు. తామేం చేసినా అడిగే దిక్కెవరూ లేరన్నట్లుగా విభజన చేశారని అన్నారు. విభజన సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన మాటను తప్పాయని చెప్పారు. విభజన జరిగి ఏడాదిన్నర అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక హోదాపై వెంకయ్యనాయుడు సినిమా చూపించారని అన్నారు. విభజన అంశాన్ని బీజేపీ ఎన్నికల్లో వాడుకుందని అన్నారు. ఎన్నికలు ముగిశాక మాత్రం ఇచ్చిన హామీ మరిచిపోయిందని చెప్పారు. బిల్లులోని ఏ ఒక్క హామీని బీజేపీ అమలుచేయలేదని అన్నారు. అసలు ఈ విభజన బిల్లు పాసవలేదని అన్నారు. బిల్లును ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకిస్తున్నా తాము మాత్రం విభజనకు మద్దతు ఇస్తున్నామని నాడు సుష్మా స్వరాజ్ అన్నారని చెప్పారు. వెంకయ్యనాయుడు, కపిల్ సిబాల్ కలిసే బిల్లు సిద్ధం చేశారని ఆమె చెప్పారని కూడా అన్నారు. విభజన కారణంగా ఇప్పుడు తలెత్తిన పలు సమస్యలకు పార్లమెంటే సమాధానం చెప్పాలని అన్నారు. నాడు విభజనలో లేవనెత్తిన సవరణ అంశాలను పట్టించుకోకుండానే బిల్లు ఆమోదింపజేశారని, ప్రస్తుత సమావేశాల్లో వాటన్నింటిపై తిరిగి చర్చ చేపట్టాలని అన్నారు. ఇక ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేకుంటే కేంద్రం ఆ విషయం స్పష్టం చేయాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష సఫలం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం మనసు మారాలని చెప్పారు. -
'కేసులు పెడతారని ఏపీ ప్రజలను తాకట్టు పెట్టారు'
-
'కంటికి కాంట్రాక్టర్లే కనిపిస్తారా.. బీదవారు కనిపించరా'
-
'కేసులు పెడతారని ఏపీ ప్రజలను తాకట్టు పెట్టారు'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ సాక్షిగా చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఇప్పటి వరకు కేంద్రానికి పంపించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దానిని మోదీ ప్రభుత్వానికి పంపించకుండా అసెంబ్లీ పెట్టెల్లో దాచి పెట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి చంద్రబాబునాయుడు తన స్వార్థం కోసం మొత్తం ఏపీ ప్రజలను ప్రధాని మోదీ వద్ద తాకట్టు పెట్టారని అన్నారు. మోదీ ఎక్కడ కేసులు పెడతారో అని భయపడి కేవలం ఢిల్లీకి పోయి రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తుందని వారు చెప్పిన మరుక్షణమే అరుణ్ జైట్లీ వంటి మంత్రులు ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్తున్నారని, దీనిని బట్టి చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'కంటికి కాంట్రాక్టర్లే కనిపిస్తారా.. బీదవారు కనిపించరా'
గుంటూరు: ప్రత్యేక హోదా విషయంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అందుకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాలుగా పోరాడి నిరవధిక నిరాహార దీక్షకు దిగారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి దీక్ష వద్ద మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. కార్పొరేట్ సంస్థలను, బడా కాంట్రాక్టర్లను మాత్రమే చూస్తున్న ప్రభుత్వం రైతులను మాత్రం పక్కకు పెట్టేసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న బకాయిలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోమంటూ ప్రత్యక్షంగా చెబుతోందని, ఇతర సంస్థలకు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. పరిశ్రమల బకాయిలు చెల్లించేటప్పుడు గుర్తుకు రాని కాంగ్రెస్ ప్రభుత్వం హయాం ఒక్క రైతుల విషయంలో ఎందుకు గుర్తుకువస్తుందని ప్రశ్నించారు. కార్మికులు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారారని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుందని చెప్పారు. ప్రతిసారి పరిశ్రమల గురించి, పారిశ్రామిక వేత్తల గురించి మాట్లాడే ప్రభుత్వానికి పేదలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వారికి ఇప్పటి వరకు ఒక్క ఇళ్లయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. -
వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు
-
వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గురువారం వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం ఆయన బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రత్యేక వైద్య సిబ్బంది వచ్చి వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించింది. బీపీ చెక్ చేయడంతో పాటు షుగర్ లెవల్స్, సాల్ట్ లెవెల్స్ తెలుసుకునేందుకు కోసం రక్త నమునాను సేకరించింది. మరికాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియనున్నాయ. -
'దీక్ష మహోద్యమంగా మారడం ఖాయం'
గుంటూరు: ప్రత్యేక హోదా ఉద్యమం కీలక మలుపు తిరుగుతుందని, మహోద్యమంగా మారేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష పునాది కానుందని పార్టీ నేత అంబటి రాంబాబు చెప్పారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ఆంధప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా మాట తప్పిందని అన్నారు. ప్రత్యేక రాదు అంటూ చెప్పకనే చెప్తోందని.. ఈ నేపథ్యంలో కీలక మలుపు తిప్పేందుకే తాము ఈనిర్ణయం తీసుకున్నామని, తమ అధినేత నిరవధిక నిరాహార దీక్షకు దిగారని చెప్పారు. గతంలో ఎన్నో ఉద్యమాలు చేశారని, కేంద్రానికి తమ డిమాండ్ తెలియజేశారని గుర్తు చేశారు. తక్షణమే కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఇది మహోద్యమంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. -
'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్'
గుంటూరు: అబద్ధాల పోటీ పెడితే ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి స్థానంలో ఉంటాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. ఆయన అబద్ధాల్లో గిన్నీస్ బుక్‌లోకి కూడా ఎక్కుతాడని విమర్శించారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్ష బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష రెండో రోజుకు చేరిన సందర్భంగా అక్కడికి వచ్చిన లక్ష్మీ పార్వతీ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ దీక్షకు అనూహ్యమద్దతు వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు అక్రమంగా కోట్లు ఖర్చుపెట్టి వాహనాలు ఏర్పాటు చేస్తున్నా వచ్చేందుకు ఆసక్తి చూపని జనం.. వైఎస్ జగన్ దీక్షకు మాత్రం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ప్రజలకే కాకుండా రైతులకు ఓ ధైర్యం అని చెప్పారు. మరోపక్క, దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. భారీ సంఖ్యలో న్యాయవాదులు దీక్ష ప్రాంగణానికి చేరి వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలిపారు. -
'దీక్ష మహోద్యమంగా మారడం ఖాయం'
-
'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్'
-
'మద్దతివ్వండి.. విమర్శిస్తే సహించం'
-
'మద్దతివ్వండి.. విమర్శిస్తే సహించం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హోదా కోసం, రాష్ట్ర ప్రజల బాగుగోసం, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. అలాంటి ఆయనకు మద్దతు పలికి వెంట రావాల్సిందిపోయి విమర్శలు చేస్తారా అని ఆమె మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వ నాయకులు చేస్తున్న ప్రకటనలపట్ల వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. చేతనైతే ప్రజల అభీష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, బీజేపీతో భాగస్వాములైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే ఏపీ ప్రజల డిమాండ్‌ను ప్రధాని నరేంద్రమోదీకి చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకానీ, ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ను విమర్శిస్తే మాత్రం సహించేది లేదని చెప్పారు. మరోపక్క, నిరవధిక నిరాహార దీక్షకు భారీ ఎత్తున మద్ధతు లభిస్తోంది. రెండో రోజు కూడా వివిధ ప్రాంతాలనుంచి ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో దీక్ష వద్దకు వస్తున్నారు. పలువురు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లోనే ఎన్నారైలు కూడా ఈ దీక్షపట్ల భారీగా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగిన వైఎస్ జగన్‌కు వారంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. -
ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నిరాహార దీక్ష
-
దీక్ష ప్రారంభించిన వైఎస్ జగన్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరహార దీక్షను ప్రారంభించారు. అశేష ప్రజానీకంతో కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణానికి మధ్యాహ్నం చేరుకున్న ఆయన దీక్ష వేదికపై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి మధ్యాహ్నం 2.25గంటలకు దీక్ష ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ప్రాణాలర్పించిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రోడ్డు మార్గం ద్వారా బయలు దేరి 12 గంటల ప్రాంతంలో విజయవాడకు చేరుకున్నారు. వెంటనే, కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనం అనంతరం గుంటూరు దీక్షా స్థలికి బయలుదేరి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి చేరుకుని దీక్ష ప్రారంభించారు. -
దుర్గమ్మను దర్శించుకున్న వైఎస్ జగన్
-
ప్రధాని అపవాదు మోయొద్దు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్ధం చేసుకుంటే మంచిదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవించాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ప్రధాని అనవసరంగా అపవాదు మోయొద్దని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ప్రధానిపై నమ్మకం ఉందని, దానిని కోల్పోవద్దని హితవు పలికారు. పార్లమెంటు సాక్షిగా చేసిన వాగ్దానాన్ని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. -
కనకదుర్గను దర్శించుకున్న జగన్
-
'సింగపూర్ నుంచి ఏపీ పాలన'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన అంతా కూడా సింగపూర్ నుంచే నడుస్తోందని పశ్చిమగోదావరి జిల్లా నిరుద్యోగుల సంఘం ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాన్య ప్రజానీకంలోకి రావడం లేదని, ప్రజల్లోకి అడుగు పెట్టకుండానే సింగపూర్ వెళుతున్నారని, అక్కడే ఉంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు పశ్చిమ గోదావరి జిల్లా నిరుద్యోగ సంఘం బయలు దేరింది. ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నేడు ఉపాధి కల్పించాలని కోరుతుంటే డబ్బులు లేవని అంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్నట్లుగా అమరావతి నగరాన్ని నిర్మించలేరని అవన్నీ గ్రాఫిక్స్‌లోనే సాధ్యమని చెప్పారు. మరోపక్క, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా దీక్షకు బయలు దేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై సాధ్యం కాకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుకోవాలని, వైఎస్ జగన్ సాధిస్తారని అన్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యార్థులు బెంగళూరులో దయనీయ స్థితిలో ఉన్నారని, కేవలం ఆరువేల రూపాయలకు అవమానకర పరిస్థితుల మధ్య పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ పోవాలంటే కేవలం ప్రత్యేక హోదానే పరిష్కార మార్గం అని చెప్పారు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వైఎస్ జగన్ ను అడ్డుకోవడం అంటే మొత్తం రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని అడ్డుకున్నట్లేనని అన్నారు. ప్రత్యేక హోదాతో తమకు కనీసం ప్రైవేటు ఉద్యోగాలయినా వస్తాయని చెప్పారు. -
బెజవాడ కనకదుర్గను దర్శించుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉదయం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయలు దేరిన ఆయన మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జననేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షకు ప్రభుత్వం పలు రకాలుగా ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తాను చేస్తున్న దీక్ష విజయవంతం కావాలని, ప్రజలకు మేలు జరగాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకొని అనంతరం గుంటూరుకు బయలు దేరారు. మరిన్ని చిత్రాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
విజయవాడకు చేరుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు బయలు దేరిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఆయనతోపాటు ఎంపీ మిధున్ రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కూడా ఉన్నారు. మరికాసేపట్లో వైఎస్ జగన్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకోనున్నారు. అనంతరం నేరుగా దీక్షా స్థలికి చేరుకుంటారు. గుంటూరు శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు బయలుదేరి వస్తున్నారు. -
'ప్రభుత్వం మెడలు వంచుతారు'
-
'ప్రభుత్వం మెడలు వంచుతారు'
కడప: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ముందునుంచి కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తుందని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంజన్ భాషా అన్నారు. కేంద్రం, రాష్ట్రం ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి భారీగా ప్రజలు తరిలారు. ఈ నేపథ్యంలో ఆయన అంజన్ భాషా మాట్లాడుతూ ఒక్క జిల్లా నుంచే దాదాపు నాలుగు లక్షలమంది వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్నారని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచైనా వైఎస్ జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పారు. చంద్రబాబు నైజం అందరికీ తెలిసిందేనని, తొలి దీక్షా స్థలిని అందుకే అడ్డుకున్నారని, అప్పుడే ఆయన కుట్ర తెలిసిందని చెప్పారు. సొంత ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు ఆరాటం తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడం లేదని చెప్పారు. -
కడప నుంచి కలిసి కట్టుగా..
కడప: ఆంధప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు కడప జిల్లా వ్యాప్తంగా దీక్ష మద్దతుదారులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున సంఘీభావం తెలిపేందుకు కదిలారు. పోరుమామిళ్ల నుంచి ఎమ్మెల్యే జయరాములు, నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజలు బయలుదేరగా రాజం పేట నుంచి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా దీక్ష వద్దకు తరిలారు. ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో కూడా భారీగా రైతులు, విద్యార్థులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరారు. -
'చేతకాని వాళ్లే అలా అంటారు'
హైదరాబాద్: చేతకాని వాళ్లు, చేతులెత్తేసిన వాళ్లు ఏమైనా చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేరుగ నాగార్జున అన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నుంచి పలువురు అధికార మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై గట్టిగా నిలబడలేనివాళ్లు కేంద్రాన్ని నిలదీయలేని వాళ్లు ఇక రాష్ట్రాన్ని ఎలా సంక్షేమ బాటలో నడిపిస్తారని ప్రశ్నించారు. ముందు నుంచి కూడా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి ఉన్నారని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారని, దేశం నడిబొడ్డున దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు చేయబోయే నిరవధిక నిరాహార దీక్ష మరో ఉద్యమం కాబోతుందని చెప్పారు. ఇక మరోనేత విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీతో భాగస్వాములై ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందిపోయి వారిని పొగడటంతోనే సరిపెడుతున్నారని చెప్పారు. సంకుచిత మనస్తత్వంతో చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. అందుకే వైఎస్ జగన్ నిర్మాణాత్మక దీక్షకు దిగారని ప్రత్యేక హోదా సాధించేవరకు దీక్ష ఉంటుందని తెలిపారు. -
దీక్షా స్థలికి కదిలిన ప్రజా దండు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవదిక నిరహార దీక్షకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. దీక్షకు స్పందించి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు దండుగా కదిలారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు సామాన్య జనం కూడా కుప్పలుగా గుంటూరు శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి కదిలారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి దీక్షకు మద్దతుగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో 30 వాహనాల్లో బయలుదేరారు. అలాగే, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున మద్దతుదారులతో దీక్ష వద్దకు కదిలారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పార్టీ కన్వీనర్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు నేతలు కార్యకర్తలు తరలి వెళ్లారు. పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి పార్టీ నేత అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో బయలు దేరారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి గుత్తుల సాయి ఆధ్వర్యంలో 25 వాహనాల్లో కార్యకర్తలు వస్తున్నారు. అలాగే పీ గన్నవరం నియోజకవర్గం నుంచి కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో 50 వాహనాల్లో కార్యకర్తలు దీక్ష వద్దకు బయలుదేరారు. దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 150 వాహనాల్లో దీక్షకు బయల్దేరారు. -
దీక్షకు బయలుదేరిన వైఎస్ జగన్
-
గళమెత్తిన యువతరం
గుంటూరులో జగన్ దీక్షకు మద్దతు ప్రకటించిన యూనివర్సిటీల విద్యార్థులు ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న దీక్ష.. ఒకరోజు ముందుగానే విద్యార్థుల్లో కదలిక తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలు వేదికగా.. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని ఎండగట్టాలని తీర్మానించుకున్నారు. ప్యాకేజీలతో రాజీపడి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటే వైఎస్ జగన్ చేస్తున్న దీక్షకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇకపై అంతా కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో.. సమైక్య ఉద్యమ పురిటిగడ్డ అయిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వేదికగా ప్రత్యేకహోదా ఉద్యమానికి జవసత్వాలు నింపేందుకు విద్యార్థులంతా ఏకమయ్యారు. హోదా సాధించేవరకు ఏ బెదిరింపులకూ భయపడకుండా ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించారు. ఎన్నో ప్రయో జనాలున్న ప్రత్యేక హోదాను ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురు ఆత్మార్పణం చేసుకున్నారని, వారి ఆత్మశాంతికోసమైనా ఇకపై ఉద్య మించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర విభజనే అన్యాయం. అంతోఇంతో న్యాయం జరిగే మార్గం ప్రత్యేక హోదా సాధన ఒక్కటే. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ , టీడీపీ ఇదే తరహాలో డిమాండ్ చేశాయి. రాష్ట్రాన్ని విభజించేముందు పార్లమెంటులో ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన కమిటీ సభ్యులు బాలస్వామి, డాక్టర్ వీరబ్రహ్మం, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో.. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ వల్ల నష్టమేనని, రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో అవతరించిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే ఆసరా దొరుకుతుందని విశాఖ విద్యార్థులు నినదించారు. ఆంధ్ర విశ్వావిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక హోదా చర్చాగోష్టిలో ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి కలిగే లాభం, ప్రత్యేక ప్యాకేజీ వల్ల కలిగే నష్టాలను చర్చించారు. జగన్ నిరవధిక దీక్షకు మద్దతు పలకాలని తీర్మానించుకున్నారు. ప్రత్యేక హోదా సాధించడానికి ప్రతిపక్షనేత ఉద్యమించడం విద్యార్థిలోకానికి కొండంత ధైర్యాన్నిచ్చిందన్నారు. ఎమ్మెస్సీ పీడీఎఫ్ సోషల్‌వర్క్ విభాగం విద్యార్థి బి. మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే పన్నుల్లో రాయితీలు వస్తాయని, రాయితీలు వస్తే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని, కంపెనీలు వస్తే ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభాశం వ్యక్తం చేశారు. బీఆర్ఏయూలో... ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమని ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ వేదికగా విద్యార్థులు నినదించారు. హోదా అవసరంపై మంగళవారం వర్సిటీలో సమావేశమయ్యారు. ఏపీ లోటు బడ్జెట్‌తో ఉందని, నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించినా నియామకాలు చేపట్టలేని దుస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు హోదాపై చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమాలు చేస్తుంటే, అధికార పక్షం అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో... ప్రత్యేక హాదా ఇవ్వకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని.. పార్లమెంటు సాక్షిగా పాలకులు ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేవరకు ఉద్యమి స్తామని విజయనగరం విద్యార్థులు తీర్మానించుకున్నారు. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో ఈరోజు నుంచి చేస్తున్న దీక్షకు తామంతా అండగా నిలబడతామని ప్రకటిం చారు. విజయ నగరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సత్యా డిగ్రీకాలేజీ, సత్యా పీజీ కాలేజీ, ఎంఆర్, సీతం ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధిక శాతం ఉపాధిని కల్పించే కెమికల్, ఫార్మస్యుటికల్ పరిశ్రమలు పూర్తిగా హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులు అక్కడికెళ్తే మీది ఈ రాష్ట్రం కాదు.. పొమ్మంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్ర ప్రభుత్వ రాయితీలతో అవే పరిశ్రమలు మన రాష్ట్రంలో ఏర్పాటవుతాయని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరిలో... ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా తప్పనిసరి అని, దానిని సాధించి తీరాలని విద్యార్థి లోకం గళమెత్తింది. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలోని కరిబండి సుబ్బారావు మోమోరియల్ విద్యాసంస్థల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు మంగళవారం ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ప్రత్యేకహోదాతోనే ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, పన్ను రాయితీలు వస్తాయని, ప్యాకేజీల వల్ల లాభం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు చేస్తున్న వారికి ప్రతి ఒక్కరూ సహకరించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులందరికీ ఉపాధి దొరుకుతుంది. మన అవసరాలు తీరడంతోపాటు అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధించడం మరింత సులభమవుతుం’ని బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పి. గంగాభవాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వస్తే మనం కొనే వస్తువుల ధరలు సగానికి సగం తగ్గుతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఆర్థిక పరిస్థితి చక్కబడుతుందని మరికొంతమంది విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒంగోలులో.. ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజీ ఆవరణలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మంగళవారం సదస్సు నిర్వహించారు. సదస్సులో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ షంషేర్ అహ్మద్ మాట్లాడుతూ హోదా వస్తే రాష్ట్రానికి నిధుల కేటాయింపులో రాజ్యాంగ బద్ధమైన హక్కు లభిస్తుందన్నారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలన్నారు. చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక ప్యాకేజీ కోసం వెంపర్లాడుతూ, రాష్ట్రంలో ప్రత్యేక హోదా పై కృషి చేస్తున్నానని కల్లబొల్లి కబుర్లు చెప్పడం దారుణమన్నారు. డిగ్రీ విద్యార్థిని ఊహారాణి మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో ఏ కంపెనీకి పోయినా ప్రస్తుత పరిస్థితుల్లో నో వేకెన్సీ బోర్డులు కనిపిస్తున్నాయని, ఆ బోర్డులు పోయి వాంటెడ్ బోర్డులు రావాలంటే ఏపీ ప్రత్యేక హోదా తప్పనిసరిగా రావాల్సిందేనన్నారు. చిత్తశుద్ధితో అందరూ ముందుకు సాగితేనే హోదా సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. కర్నూలులో... ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని విద్యార్థి సంఘాలు ఉద్ఘాటించాయి. మంగళవారం నారాయణ జూనియర్ కళాశాలలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా-ఆంధ్రుల హక్కు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లు మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌పై వివక్ష చూపుతున్నాయన్నారు. జగన్‌తో కలిసి ఉద్యమించి, హోదా సాధించుకుందామని తీర్మానించుకున్నారు. నెల్లూరులో... ప్రత్యేక హోదా అంధ్రుల హక్కుని, ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఉద్యమిస్తామని విద్యార్ధి లోకం గళమెత్తింది. స్థానిక రామలింగాపురంలోని శ్రీచైతన్య కళాశాలలో మంగళవారం వైఎస్సార్ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ ఆధ్వర్యంలో హోదాపై సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుంటే రాష్ట్రం పూర్తిగా వెనుకబడుతుందని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం నిరవధిక దీక్ష చేపడుతున్న జగన్మోహనరెడ్డికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నామన్నారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి ఆర్టీ సిద్ధార్థ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుంటే నిరుద్యోగం పెరుగుతుందని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ది చెందు తుందన్నారు. -
నయా జోష్
జగన్ సమర దీక్ష జయప్రదం వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరిలో నిర్వహించిన రెండు రోజుల సమర దీక్ష పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది. అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోని పాలకులపై జగన్మోహన్రెడ్డి సమరశంఖం పూరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రెండ్రోజుల దీక్ష విజయవంతం కోసం పదిరోజుల నుంచి వైఎస్సార్ సీపీ కీలక నేతలు చేసిన కృషి ఫలించింది. తరలివచ్చిన ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రజల ముంగిటకు సమరదీక్ష సంకల్పాన్ని తీసుకెళ్లగలిగారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి రాష్ట్రమంతా పర్యటించి పార్టీ శ్రేణులను సమరదీక్ష కోసం సన్నద్ధం చేయగలిగారు. పార్టీ ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ మంగళగిరి వైజంక్షన్ వద్ద స్థలం ఎంపిక నుంచి దీక్ష పూర్తయ్యే వరకు ఏర్పాట్లను పర్యవేక్షించడంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేశారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సమరదీక్ష విషయంలో బాధ్యత తీసుకుని తమవంతు కృషి చేశారు. పార్టీ కీలక నేతలతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ నేతలు బాధ్యత తీసుకుని పనిచేయడంతో లక్ష్యాన్ని సాధించినట్టయింది. ప్రజల్లోకి వినూత్న తరహాలో ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో వైఎస్సార్ సీపీ చేసిన ప్రయత్నం ఫలప్రదమైంది. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన వందల హామీల్లో మచ్చుకు ఒక వంద హామీలను ప్రస్తావిస్తూ తొలిరోజున విడుదల చేసిన ప్రజా బ్యాలెట్‌కు అపూర్వ స్పందన లభించింది. ఏడాది క్రితం టీడీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రాంతంలోనే ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించగా, ఏడాది తరువాత అదే ప్రాంతంలో చరిత్రాత్మక సమర దీక్ష నిర్వహించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత పట్టు సాధించేందుకు దోహదం చేసింది. సమరదీక్షతో టీడీపీ శ్రేణుల్లో కలవరం: ఎమ్మెల్యే కోన బాపట్ల : చంద్రబాబు నయవంచనకు నిరసనగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిం చిన సమరదీక్షకు అనూహ్య స్పందన లభించిందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. దూరప్రాంతాల నుంచి సమరదీక్షకు తరలివచ్చిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం బాపట్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందనేది సమరదీక్షకు వచ్చిన స్పందనతో తేటతెల్లమైందని చెప్పారు. ప్రజాస్పందన చూసి అధికారపార్టీ నాయకుల్లో కలవరం మొదలైందన్నారు. హామీ ల అమలు విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ ఉన్నారనే నమ్మకం కలిగిందని, ఆ నమ్మకంతోనే రాబోవు రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని పేర్కొ న్నారు. రేవంత్‌రెడ్డి విషయంపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
సమరదీక్ష విజయవంతం
తణుకు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరిలో నిర్వహించిన సమరదీక్షకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనపై విసుగెత్తిన ప్రజలు సమరదీక్షకు పోటెత్తారన్నారు. అన్నివర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలిపారని కారుమూరి చెప్పారు. జన స్పందనను చూసి ఈర్ష పడిన ప్రభుత్వం దీక్షా శిబిరం వద్ద కనీస భద్రత కూడా ఏర్పాటు చేయలేదని, ప్రతిపక్ష నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజాధన దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. చెరువులను తవ్వే పేరుతో గట్లు పటిష్టం చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తెగనమ్ముకుంటున్నారని కారుమూరి విమర్శించారు. వేల్పూరుకేనా అభివృద్ధి? నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి ఒక్క వేల్పూరుకే వరాల జల్లు కురిపించడం ఎంతవరకు సమంజసమని కారుమూరి ప్రశ్నించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ అభివృద్ధికై నిధులు కోరాల్సింది పోయి కేవలం వేల్పూరు గ్రామాభివృద్ధికే నిధులు ఇవ్వమని ఎమ్మెల్యే కోరడం దారుణమన్నారు. ఎమ్మెల్యే కొనుగోలులో రేవంత్‌రెడ్డి, డబ్బు సంచి వ్యవహారంలో మంత్రి పీతల సుజాత విషయంలో చంద్రబాబు నోరు విప్పకపోవడం సిగ్గు చేటని కారుమూరి విమర్శించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి సునంద, మండపాక సర్పంచ్ ఉండవల్లి జానకి, నాయకులు ఎస్ఎస్ రెడ్డి, చోడే జోషి, కడియాల సూర్యనారాయణ, మద్దిరాల రామసతీష్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు వైఎస్ఆర్ మాటలను లెక్కచేయనందుకే..
హైదరాబాద్: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన సమర దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. అందులో భాగంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు ఏపీ సీఎం చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో ఆయన మాటలను లెక్కచేయనందుకే పదేళ్ల పాటు టీడీపీ అధికారానికి దూరమైందని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రధాన ప్రతిపక్షం చెబుతున్న పనులకు సవరణలు చేస్తే నేడు రాష్ట్రంలో ఈపరిస్థితి ఉండేది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రతిపక్ష నాయకుడిగా ఎంతో మేలు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చారు. అదే తరహాలో నేడు మహానేత తనయుడు ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. శాసన సభలో ఆనాడు వైఎస్ఆర్ మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా పదేళ్లు అధికారానికి దూరమైంది. రాష్ట్రంలో పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వ పట్టించుకోలేదు. ప్రభుత్వ సహాయం కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. నాడు వైఎస్సార్ పాదయాత్రను ప్రజల భరోసాగా మలిచారు. ఇచ్చిన మాట ప్రకారమే రైతుల ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి.. మారానని నమ్మబలికి చంద్రబాబు గెలిచారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. ఐదేళ్ల ప్రభుత్వానికి ఏడాదిలోపే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి" అని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. -
'అడ్డంగా దొరికినా..దుష్ప్రచారం ఆపవా బాబూ'