వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు గన్నవరంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రవిభజన విషయంలో సమన్యాయం పాటించాలంటూ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న ఆమె ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమాన స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుంటూరుకు రోడ్డు మార్గాన బయల్దేరిన ఆమె మరికాసేపట్లో దీక్షా స్థలికి చేరుకుంటారు. మరోవైపు విజయమ్మ దీక్షకు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ నేతలు జిల్లాల్లో దీక్షలు చేపడుతున్నారు.