
విజయవాడకు చేరుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు బయలు దేరిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు.
ఆయనతోపాటు ఎంపీ మిధున్ రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కూడా ఉన్నారు. మరికాసేపట్లో వైఎస్ జగన్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకోనున్నారు. అనంతరం నేరుగా దీక్షా స్థలికి చేరుకుంటారు. గుంటూరు శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు బయలుదేరి వస్తున్నారు.