అది మంత్రి వర్గమా.. రాబందుల సంతతా?
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ను కేబినెట్ అంటారా? ఆయన మంత్రులను మంత్రులు అంటారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేత వాసిరెడ్డ పద్మ అన్నారు. వారంతా మంత్రులు కాదని స్వార్థపరుల గుంపు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. మట్టినుంచి ఇసుక వరకు అక్రమంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రి వర్గం అమ్ముకుంటుందని ఆరోపించారు. అసలు వారు నాయకులా.. రాబందులా సంతతా అని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని తల్లి లేని రాష్ట్రం అని చెప్పి.. ఇప్పుడు ఆ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
- దిక్కులేని అనాధలా రాష్ట్రాన్ని వదిలేశారు
- ప్రత్యేక హోదా ఆశ చూపి నాడు మహోద్యమం ఆపేశారు
- ఎన్నికలు అయిపోయాక ఆ మాటలు పక్కకు పెట్టారు
- ప్రత్యేక హోదాకు ఇతర రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకోవు
- రాజధాని కడుతున్నాం.. దానిని చూసి మురుసుకొమ్మంటున్నారు
- రాజధానిని సినిమా చూపిస్తున్నట్లు చూపిస్తున్నారు
- మరి భూములు కోల్పోతున్న రైతుల పరిస్థతి ఏమిటి
- సింగపూర్ వాసులకు ఏపీని రియల్ ఎస్టేట్ భూమిగా మార్చారు
- ఎన్నిలక్షల ఎకరాలు ప్రైవేటు సంస్థలకు, కార్పొరేట్కు కట్టబెడతారు
- చంద్రబాబు ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి, మహిళల వ్యతిరేకి
- వైఎస్ ను చూస్తే ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ గుర్తొస్తుంది
- చంద్రబాబును చూస్తే నేడు కరువులు, కొరతలు గుర్తొస్తున్నాయి
- నిజాయితీతో ఏం అభివృద్ధి చేయలేకపోయారు
- లాభాల్లో ఉన్న చిత్తూరు డైరీని నాశనం చేసి తన హెరిటేజ్ డెవలప్ చేశారు
- చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హెరిటేజ్ లాభాలు ఎలా పెరిగాయి
- మోసం చేసి మరోసారి చంద్రబాబునాయుడు ఆయన కుమారుడిని తీసుకొస్తున్నాడు
- పోలవరం పూర్తవ్వాలంటే కేంద్రం కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు
- ప్రత్యేక హోదా చంద్రబాబు తీసుకురాలేకపోయాడు కాబట్టే వైఎస్ జగన్ దీక్షకు దిగారు
- ఆంధ్రప్రదేశ్ను సాధాసీదాగా ఉండే రాష్ట్రంగా జగన్ చూడాలనుకోవడం లేదు
- ప్రత్యేక హోదా సాధించలేక పోతే చంద్రబాబునాయుడు ప్రభుత్వం సచ్చినట్లే లెక్క
- అవసరం అయితే, వైఎస్ జగన్ దీక్ష చూపించైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాండి
- 13 జిల్లాల ప్రజల గొంతుక నేటి వైఎస్ జగన్ దీక్షా శిబిరం
- నిరవధిక దీక్ష విజయవంతమౌతుంది.. ప్రత్యేక హోదా తప్పక వస్తుంది
- ప్రత్యేక హోదా వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు.. దీక్ష కొనసాగుతుంది