ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్ చేపట్టిన సమర దీక్షలో ఆయన బుధవారం మాట్లాడారు. 'తొలి సంతకానికి విలువ ఉంటుందని నిరూపించిన వ్యక్తి వైఎస్సార్. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఏడాదిలోపే 600 పై చిలుకు వాగ్దానాలు చేశారు. అందులో కనీసం 5 వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన మాట తప్పిన సీఎం ఎవరంటే అది ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబే. ప్రజలందరూ తప్పు తెలుసుకున్నారు.
నాడు చంద్రబాబు ఊరూరా తిరిగి అబద్ధాలు చెప్పి కుట్రలు, కుతంత్రాలు పన్ని సీఎం పదవి చేపట్టారు. తమకు అండగా జగన్ నిలుస్తారన్న ఉద్దేశంతోనే ప్రజలు మా వెంట వస్తున్నారు. వైఎస్సార్ వారసుడిగా నేడు మన ముందున్నారు వైఎస్ జగన్. సమాజానికి దశ, దిశ ఇస్తారని ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. దివంగత నేత ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం ఉచిత విద్యుత్ పై చేశారు. ప్రపంచ రాజకీయాల్లో వైఎస్సార్ నెంబర్ వన్ గా నిలిచారు. వైఎస్సార్ పాలనలో బడుగు, బలహీన వర్గాలందరూ సశ్యశ్యామలంగా జీవితాన్ని గడిపారు' అని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.