
మంగళగిరి: మంత్రి పదవి కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనసులో స్థానమే తనకు ముఖ్యమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. 6 నెలల క్రితమే సీఎం జగన్‌ను కలిసి సామాజికవర్గ పరంగా మంత్రి పదవి ఇవ్వడంలో ఇబ్బందులుంటే తనకు పదవి అవసరం లేదని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరానన్నారు.
తాను రాజకీయాల్లో ఉంటే సీఎం జగన్ వెంటే ఉంటానని.. లేదంటే తన పొలంలో వ్యవసాయం చేసుకుంటానని అసెంబ్లీ సాక్షిగా గతంలోనే స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment