Ministerial post
-
మంత్రి పదవి ఆశలపై నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రి పదవుల(Ministerial post) ఆశావహులకు కాంగ్రెస్(Congress) అధిష్టానం షాకిచ్చింది. రాష్ట్ర పార్టీ పెద్దలంతా ఢిల్లీ వెళ్లారని, ఈసారి కేబినెట్ బె ర్తులు ఖరారై త్వరలోనే మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేస్తామనుకున్నవారి ఆశలపై నీళ్లు చల్లింది. కేబినెట్ విస్తరణ(Cabinet expansion) ఇప్పుడప్పుడే అవసరం లేదని తేల్చేసింది. ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంకం ఎప్పటికో తెలియని సమయానికి వా యిదా పడింది. సీఎం రేవంత్(revanth reddy) స్వయంగా ఈ విష యం ప్రకటించడంతో మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యేలు నిరాశలో మునిగిపోవాల్సి వచ్చింది. అదిగో ఇదిగో అంటూనే.. రాష్ట్ర కేబినెట్లో ప్రస్తుతం సీఎంతోపాటు మరో 11 మంది మంత్రులు కలిపి మొత్తం 12 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో ఆరుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ 7న సీఎం, 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచీ మిగిలిన ఆరు బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. వీటిని భర్తీ చేసే అంశంపై తరచూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఆ పండుగ, ఈ పండుగ, ఆ ఎన్నికలు, ఈ ఎన్నికల తర్వాత అంటూ కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూనే వచ్చింది.సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా కూర్పు కుదరడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికలతో కూడా ఈ అంశం ముడిపడి ఉన్నందున ముహూర్తం కుదరడం లేదనే చర్చ జరిగింది. అయితే ఈసారి పార్టీ అధిష్టానం తెలంగాణ పార్టీ పెద్దలను ఢిల్లీకి పిలిపించడంతో.. మంత్రివర్గ విస్తరణతోపాటు పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ వంటివి కొలిక్కి వస్తాయని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆశించారు. కార్యవర్గానికి లైన్ క్లియర్.. రాష్ట్ర నేతల ఢిల్లీ పర్యటనలో కొలిక్కి వచ్చిన ఏకైక అంశం టీపీసీసీ కార్యవర్గ కూర్పు మాత్రమే. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు తీసుకుని నాలుగు నెలలు దాటింది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ పార్టీ సంస్థాగత పదవులు ఖాళీగా ఉండటాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు 15 రోజుల్లో పార్టీ పదవులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు.దీనితో వేగంగా కసరత్తు చేపట్టి ఓ కొలిక్కి తేవడంతో.. టీపీసీసీ కార్యవర్గ కూర్పునకు అధిష్టానం ఆమోదం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లోనే టీపీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గంలోనూ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు చాలా డిమాండ్ ఉందని.. దీనితో 25కు చేరిందని తెలిసింది. పార్టీ కోశాధికారి, ప్రచార కమిటీ చైర్మన్ పోస్టులను కూడా ఈసారి భర్తీ చేయనున్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులను కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం. కార్పొరేషన్ పదవులకు ‘కోడ్’ తిప్పలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల అంశం కూడా ఈసారి తేలిపోతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశించాయి. చాలా మంది నేతలు ఆ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటికే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, త్వరలోనే రానున్న స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా ప్రస్తుతానికి వీటిని కూడా వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతానికి పార్టీ పదవులు.. స్థానిక ఎన్నికలు ముగిశాకే అధికారిక పదవులు దక్కనున్నాయి. నాలుగు జిల్లాలు.. నాలుగు సామాజిక వర్గాలు ప్రస్తుత కేబినెట్ కూర్పును పరిశీలిస్తే... రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఏ ఒక్కరికీ మంత్రివర్గంలో చాన్స్ దక్కలేదు. దీంతో ఈ నాలుగు జిల్లాల నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు వస్తాయనే ఆశలో ఉన్నారు. రేసులో ప్రేమ్‌సాగర్‌రావు, జి.వివేక్, వినోద్, పి.సుదర్శన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, దానం నాగేందర్‌ల పేర్లు వినిపించాయి.ఇప్పటికే కేబినెట్లో స్థానమున్న జిల్లాల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, వాకిటి శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఈర్లపల్లి శంకర్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్ కూడా కేబినెట్ రేసులోకి వచ్చారు. పేర్ల మాట ఎలా ఉన్నా ఈసారి నాలుగు బెర్తులు తప్పకుండా భర్తీ అవుతాయని.. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు చాన్స్ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ కేబినెట్ విస్తరణ లేదని అధిష్టానం తేల్చేసింది. -
మంత్రి పదవి కంటే జగన్ మనసులో స్థానమే ముఖ్యం
మంగళగిరి: మంత్రి పదవి కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసులో స్థానమే తనకు ముఖ్యమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. 6 నెలల క్రితమే సీఎం జగన్‌ను కలిసి సామాజికవర్గ పరంగా మంత్రి పదవి ఇవ్వడంలో ఇబ్బందులుంటే తనకు పదవి అవసరం లేదని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరానన్నారు. తాను రాజకీయాల్లో ఉంటే సీఎం జగన్ వెంటే ఉంటానని.. లేదంటే తన పొలంలో వ్యవసాయం చేసుకుంటానని అసెంబ్లీ సాక్షిగా గతంలోనే స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. -
అమాత్యులెవరో..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు, రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎవరు అమాత్యులవుతారు.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగింది. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించింది. ఇందులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు విజయం సాధించగా.. టీడీపీ అభ్యర్థులు సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. దీంతో జిల్లాలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి టీఆర్ఎస్ తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్ ఒక్కరే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన లావుడ్యా రాములునాయక్ టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం జిల్లాలో రెండుకు చేరిన్నా.. పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్‌కుమార్ మాత్రమే గెలిచారు. దీంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు మంత్రిగా అవకాశం లభిస్తుందని పువ్వాడ అనుచర వర్గం, పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జిల్లా టీడీపీలో సీనియర్ నేతగా ఉండి.. వరుసగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్యను అధికార టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణలోపు సండ్ర టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. టీడీపీ శ్రేణులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా గత డిసెంబర్లో పోటీ చేసేందుకు అనువుగా ఆయన టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి రాజీనామా కూడా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని పునరుద్ధరించినా.. ఆయన తిరిగి స్వీకరించలేదు. అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా టీటీడీ బోర్డు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వెంకటవీరయ్య రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నందున.. టీటీడీ బోర్డు సభ్యత్వం వంటి కీలక పదవిని సైతం వదులుకోవడం.. ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో స్థానంపై భరోసా లభించడమే కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో సండ్ర వెంకటవీరయ్య తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. జిల్లా నుంచి టీఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని, కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు అందలం ఎక్కిస్తాయని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు. దీంతో జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది? అసలు తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై రాజకీయ వర్గాలు ఎవరికి తోచిన విధంగా వారు తమ అనుకూల.. ప్రతికూల వాదనలు వినిపిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను టీఆర్ఎస్లో చేర్చుకుని.. మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో టీడీపీని బలహీన పరచడంతోపాటు శాసనసభలో ఆ పార్టీ తరఫున గళమెత్తే బలమైన నేత లేకుండా అవుతారనే వ్యూహంతో పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై ఆచితూచి స్పందిస్తున్న సండ్ర.. భవిష్యత్ వ్యూహంపై మాత్రం నోరు మెదపడం లేదని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సానుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వంలో తాము కీలకంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని సండ్ర అభిమానులు వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సామాజిక రాజకీయ అంశాలను, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిపించగలిగే సమర్థతను సైతం పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టీఆర్ఎస్లోని మరికొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక జిల్లా టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్‌పై సైతం పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
కౌన్ బనేగా మంత్రి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందని వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. హ్యాట్రిక్ వీరులు.. సీనియర్ ఎమ్మెల్యేలు తమకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని విశ్వసిస్తున్నారు. కేబినెట్ పరిమిత మోతాదులో ఉంటుందని సంకేతాలు వెలువడడంతో తమకు అవకాశాలు ఏ మేర కలిసివస్తాయని బేరీజు వేసుకుంటున్నారు. సుదీర్ఘ అనుభవం, సామాజిక సమీకరణలపై లెక్కలు వేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ కూర్పులో జిల్లా నుంచి ఎవరికి చాన్స్ దక్కుతుందనే అంశం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కేపీ వివేకానంద, చామకూర మల్లారెడ్డిలు మంత్రిపదవి రేసులో ఉన్నారు. ఎవరి లెక్కలు వారివే.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ముహూర్తం ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డిని ఓడించిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మంత్రి పదవిపై గంపెడాశ పెట్టుకున్నారు. మంత్రిగా వ్యవహరించిన సోదరుడు మహేందర్‌రెడ్డి పరాజయం పాలుకావడంతో ఆయన కోటాలో తనకు బెర్త్ ఖాయమనే భరోసాలో నరేందర్‌రెడ్డి ఉన్నారు. అయితే, కొడంగల్ సెగ్మెంట్‌ను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో తీసుకుంటారా? లేక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా పరిగణిస్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. మూడుసార్లు వరుసగా విజయం సాధించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా మంత్రి పదవిపై గట్టినమ్మకం పెట్టుకున్నారు. మృదుస్వభావిగా పేరున్న ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నికల ముందు జరిగిన ప్రగతి నివేదన సభతో ఇది మరింత బలపడింది. ఈ నేపథ్యంలో తన పనితీరును ఏంటో సీఎంకు తెలుసని భావిస్తున్న కిషన్‌రెడ్డి.. మంత్రి పదవి వ్యవహారం కూడా ముఖ్యమంత్రే చూసుకుంటారనే ధీమాలో ఉన్నారు. మరో హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన సామాజికవర్గానికే చెందిన వివేకానంద, శ్రీనివాస్‌గౌడ్, పద్మారావులు మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తుండడం ప్రకాశ్‌కు ప్రతిబంధకంగా మారింది. ఇక, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కూడా అమాత్య యోగంపై ఆశలు పెట్టుకున్నారు. మల్కాజిగిరి ఎంపీ పదవిని వదులుకొని ఎమ్మెల్యేగా పోటీచేసిన చామకూర.. తనకు కేబినెట్లో బెర్త్ ఖాయమని భావిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే శాసనసభ్యుడిగా రంగంలోకి దిగానని సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా మంత్రివర్గ విస్తరణలో లక్కీచాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగియుండడ తనకు ప్లస్‌పాయింట్ కాగలదని అంచనా వేస్తున్నారు. పద్మారావుకు గనుక బెర్త్ దక్కకపోతే.. ఆయన స్థానే తనకు పదవి ఖాయమనే లెక్కల్లో వివేకానంద ఉన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా మినిస్టర్ గిరిపై ఆశలు పెట్టుకున్నా.. ఆయన సామాజికవర్గానికి సరిపడా పదవులు ఉన్నందున ఆయన పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. ఏదీఏమైనా మంత్రివర్గ విస్తరణ ప్రచారంపై అధికార పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. -
తొలి విడతలోనా.., మలి విడతలోనా?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: అమాత్య పదవులపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. సరిగ్గా నెల రోజుల ముందటే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను, ఏకంగా తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ఈ తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రమే తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఇతర పార్టీల్లోనూ ఎమ్మెల్యేలుగా గెలిచి ఈసారి టీఆర్ఎస్ నుంచి మూడో విజయాన్ని అందుకున్న వారిలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, రెండో విజయాన్ని అందుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఉన్నారు. ఇక, టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునిత, పైళ్ల శేఖర్‌రెడ్డి , ఎన్.భాస్కర్‌రావు రెండోసారి విజయాలు సాధించారు. వీరిలో ఈసారి కేబినెట్లో బెర్త్ ఎవరికి ఖరారు అవుతుందన్నదే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్న చర్చ. గత 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జి.జగదీశ్‌రెడ్డి తెలంగాణ తొలి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు రెండోసారి కూడా విజయం సాధించారు కాబట్టి ఆయనకు తిరిగి అమాత్య పదవికి దక్కుతుందని, రెండోసారి మంత్రి కావడం ఖాయం అన్నది పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక మంత్రులను తీసుకుంటారా..? లేక, కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎంపిక చేస్తారా అన్న ప్రశ్నపై సరైన సమాధానం ఎవరి వద్దా లేదు. ఒకవేళ నల్లగొండ జిల్లా నుంచి కూడా మంత్రిని తీసుకోవాల్సి వస్తే అవకాశం ఎవరికి తలుపు తడుతుందన్న అంశం చర్చకు ఆస్కారం ఇస్తోంది. రేసులో.. జగదీశ్‌రెడ్డి.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ? గతంతో పోలిస్తే.. ఈసారి జిల్లా నుంచి మూడు స్థానాలు అధికంగా టీఆర్ఎస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన రెండు స్థానాలు నకిరేకల్, మునుగోడును కోల్పోయినా, తొలిసారి మిర్యాలగూడ, కోదాడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్లగొండ స్థానాలను దక్కించుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా సీనియర్లుగానే కనిపిస్తుండడంతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొన్నా.. ప్రధానంగా రేసులో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కేబినెట్ ర్యాంకులో రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌కు బాధ్యత వహిస్తున్నారు. శాసన మండలి సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించి, మంత్రి వర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నాయకులు మంత్రి పదవి రేసులో ఉన్నట్లు అవుతోంది. ఈ ఇద్దరు నేతలకు అవకాశం కల్పిస్తారా..? ఒకవేళ కల్పిస్తే తొలి విడతలో ఎవరిని తీసుకుంటారు..? మలి విడత దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏ నేత ఎదుర్కోనున్నారు అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తే...? తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రులకు తోడు పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టులను క్రియేట్ చేసి బాధ్యతలు అప్పజెప్పారు. మంత్రులకు సహాయకంగా (ఒక విధంగా సహాయ మంత్రులు) వీరికి శాఖలు కూడా కేటాయించారు. కానీ, కోర్టు కేసు వల్ల ఈ వ్యవస్థను రద్దు చేశారు. ఈసారి చట్టాన్ని మార్చి, కోర్టు గొడవలేం లేకుండా, పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు ఊపిరి పోస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఈ అంశం నిజరూపం దాలిస్తే.. అవకాశం ఎవరికి దక్కుతుందన్న చర్చా నడుస్తోంది. గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు పార్లమెంటరీ కార్యదర్శి పదవి దక్కింది. మరోవైపు గత శాసన సభలో ప్రభుత్వ విప్‌గా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీరికి ఏ పదవులు దక్కుతాయన్న అంచనాలు మొదలయ్యాయి. ఈనెల 18వ తేదీన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో జిల్లాలో నేతల అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. -
రాజన్నకా.. రామన్నకా ?!
నారాయణపేట : తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ సర్వత్రా సాగుతోంది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవులు దక్కగా ఇందులో కృష్ణారావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొకరికే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి ఇంకొకరికి కూడా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇది పక్కన పెడితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కొత్తగా నారాయణ జిల్లా ఏర్పడనుంది. తాజాగా జరిగిన సమావేశంలో ప్రతీ జిల్లాకు ఓ పదవి ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ సూచనప్రాయంగా వెల్లడించారు. దీంతో నారాయణపేట జిల్లాలో ఉన్న రెండు నియోజవర్గాల ఎమ్మెల్యేల్లో ఎవరికి ఏ పదవి దక్కుతుందన్న ఆసక్తి నెలకొంది. 17 నుంచి అసెంబ్లీ.. మంత్రి వర్గ విస్తరణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచాక సీఎంగా కేసీఆర్, రాష్ట్ర హోం శాఖ మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు తొలి విడత అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఆ సమయంలోనే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదే క్రమంలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మేరకు జిల్లాకో పదవి వచ్చేలా చూసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు కొత్తగా ఏర్పడనున్న నారాయణపేట జిల్లా నుంచి ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై చర్చ సాగుతోంది. ఈ జిల్లా పరిధిలో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలు ఉండనుండగా.. రెండింట్లోనూ టీఆర్ఎస్కే చెందిన ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి విజయం సాధించారు. మంత్రి వర్గంలో ‘పేట’ జిల్లాకు చాన్స్ నూతనంగా ఆవిర్భవించనున్న నారాయణపేట జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా రు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు విజయం సాధించారు. అయితే, వీరిద్దరు కూడా గత ఎన్నికల్లోనూ గెలిచినా టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇక ప్రజల ఆకాంక్ష మేరకు ఇటీవల ఎన్నికల ప్రచారంలో నారాయణపేటను జిల్లాగా మారుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ హామీ మేరకు విజయం సాధించగానే ప్రకటన చేశారు. తాజాగా కొత్త జిల్లాల నుంచి ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంతో పాటు పాటు పార్లమెంటరీ కార్యదర్శులు తదితర పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో నారాయణపేట జిల్లా వాసుల్లో ఆశలు చిగురించాయి. ఎవరికి ఆ వరం? నారాయణపేట కొత్త జిల్లాలో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చిట్టెం రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరు కూడా మంత్రి వర్గం ఏర్పాటులో తమకు స్థానం దక్కుతుందనే ఆశిస్తున్నారు. ఒకవేళ మంత్రిగా కాకున్నా పార్లమెంట్ సెక్రటరీలుగానైనా అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. నారాయణపేట ప్రజల ఆకాంక్షను కేసీఆర్‌కు వివరించి కొత్త జిల్లా ఏర్పాటులో తమ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కీలకపాత్ర పోషించినందున ఆయనకు సముచిత స్థానం దక్కుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మక్తల్ నుంచి గెలిచిన రాంమోహన్‌రెడ్డి అనుయాయులు కూడా అదే భావనలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన కీలక నేత, సొంత సోదరి అయిన డీకే.అరుణను కాదని కేసీఆర్ మాటను గౌరవవించి టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో రాంమోహన్‌రెడ్డికి మంచి అవకాశం దక్కుతుందని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరికి మంత్రి వర్గంలో స్థానం దక్కుతుంది, మరెవరికి పార్లమెంటరీ కార్యదర్శి పదవి దక్కొచ్చు..కొత్త జిల్లా నుంచి ఇద్దరికా లేక ఒకరికే పదవి వరిస్తుందన్న విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే! -
ఛూ ‘మంత్రి ఖాళీ’!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తాజా మంత్రివర్గ విస్తరణలో జిల్లా నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపించారు. జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న షరీఫ్‌కు మైనారిటీ కోటాలో చాలా కాలంగా మంత్రి పదవి ఇస్తామని ఊరిస్తూ వచ్చారు. చివరికి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయనను పక్కన పెట్టి రాయలసీమకు చెందిన వారికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎస్టీ కోటాలో పోలవరం నుంచి మొడియం శ్రీనివాస్ ఒక్కరే అధికార పార్టీ నుంచి గెలుపొందారు. అయితే గత నాలుగేళ్లలో ఎస్టీల నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. గత విస్తరణలో మొడియంకు మంత్రి పదవి వస్తుందని ఆశించినా అది దక్కలేదు. తాజాగా వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని మావోల చేతిలో చనిపోయిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించడంపైజిల్లా నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. షరీఫ్‌కు మరో‘సారీ’..! జిల్లాకు చెందిన మహ్మద్ అహ్మద్ షరీఫ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి మొండిచెయ్యి చూపించారు. చివరిసారిగా జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించడం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తూ, పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న షరీఫ్‌కు మంత్రివర్గంలో స్థానం ఇక దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం. మైనార్టీ వర్గం నుంచి షరీఫ్‌కు బెర్త్ ఖాయం చేస్తారని మూడేళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మూడేళ్ల కాలంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన ప్రతిసారీ షరీఫ్‌కు మంత్రి పదవి ఖాయం అని పార్టీ అధిష్టానం, సాక్షాత్తూ చంద్రబాబునాయుడు ఊరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గంలో మైనార్టీల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో తనపై ఖచ్చితంగా చంద్రబాబు కరుణ చూపిస్తారని షరీఫ్ కూడా ఆశగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి షరీఫ్ పార్టీకి పలు రూపాల్లో సేవలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ముందుగానే పార్టీలో చేరిన వ్యక్తి షరీఫ్. 1982లో ఎన్టీఆర్ పార్టీ ప్రకటన చేయగానే, నరసాపురంలో 11 మందితో పార్టీలో చేరారు. కొత్తపల్లి లాంటి వారూ షరీఫ్ తరువాత వచ్చినవారే. 1990–97 మధ్య పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత 1997 నుంచి 2000 సంవత్సరం వరకూ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా, 2002లో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు. 2011లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. గుంటూరులో టీడీపీ అట్టహాసంగా మైనార్టీ సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంలో అయితే అదే వేదికపై షరీఫ్‌కు మంత్రి పదవిని చంద్రబాబు ప్రకటిస్తారని ప్రచారం సాగింది. షరీఫ్ వైఖరిలో మార్పు మంత్రి పదవి ఊహాగానాలు రాగానే షరీఫ్ కూడా తమ అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు, ప్రతిపక్షంపై వివాదాస్పదమైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సౌమ్యుడిగా పేరున్న షరీఫ్ వైఖరిలో మార్పు రావడం అప్పటిలో పెద్ద చర్చనీయాంశమైంది. పదవి కోసం పడుతున్న తంటాలుగా షరీఫ్ కొత్త వైఖరిని రాజకీయవర్గాలు విశ్లేషించాయి. కానీ అవేమీ చంద్రబాబును ఆకర్షించలేదు. పార్టీకి వీరవిధేయుడైనా మైనార్టీ కార్డు కూడా చంద్రబాబుకు కనిపించలేదు. మొత్తంగా షరీఫ్‌కు ఇక ఛాన్స్ లేదని తేలిపోవడంతో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి శాసనమండలి చైర్మన్ ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాను మంత్రి పదవిని ఆశించిన మాట వాస్తవమేనని, మండలి చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు. పదవి కావాలని చంద్రబాబును తాను ఎప్పుడూ అడగలేదని పేర్కొన్నారు. ఎస్టీల నుంచి ఏకైక అధికారపార్టీ ఎమ్మెల్యే అయినా.. మరోవైపు రాష్ట్రంలోనే ఎస్టీల నుంచి గెలిచిన ఏకైక అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన మొడియం శ్రీనివాస్‌కు కూడా మంత్రి పదవి చేతిదాకా వచ్చి చేజారిపోయింది. గత మంత్రివర్గ విస్తరణ సమయంలో ముందురోజు సాయంత్రం మంత్రివర్గంలో బెర్త్ ఖరారు అయ్యింది. అర్జెంట్‌గా వచ్చి ముఖ్యమంత్రిని కలవాలని పేషీ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన బయలుదేరి వెళ్లారు. ఈలోగానే సమీకరణాలు మారి బీసీ కోటాలో జిల్లా నుంచి పితాని సత్యనారాయణకు పదవి దక్కింది. ఈసారి అసలు ఎమ్మెల్యే కాని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడంతో మొడియం అసంతృప్తికి గురైనట్లు సమాచారం. -
కర్ణాటకలో శాఖలపై కాక!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేపోతోంది. అధిష్టానం కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డిప్యూటీ సీఎం పరమేశ్వర అధిష్టానంపైనే పూర్తి విశ్వాసం ఉంచగా సిద్దరామయ్య త్వరగా తేల్చాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. అధిష్టానం విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆర్థిక శాఖ సహా కీలకమైన 4 శాఖలపై నిర్ణయం తీసుకోలేదు. రైతు రుణమాఫీ నేపథ్యంలో ఇది తనవద్దే ఉంచుకోవాలని సీఎం పట్టుబడుతుండగా.. తమకే కావాలని సిద్దరామయ్య ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పార్టీ ట్రబుల్ షూటర్ గులాంనబీ ఆజాద్ డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారూ మంత్రి పదవుల కోసం పట్టుబట్టడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. అటు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, సీఎం సోదరుడు రేవణ్ణలు పీడబ్ల్యూడీ శాఖ కావాలంటున్నారు. కాంగ్రెస్ పలు శాఖలపై ఒత్తిడి తెస్తుండటంతో సంకీర్ణంపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని బయటపెట్టేలా జేడీఎస్ ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. కింది స్థాయిలో ఇరుపార్టీల్లోనూ అసంతృప్తి తారస్థాయిలో కనబడుతోంది. ఫలితాలు రాగానే బేషరతు మద్దతు ఇస్తామంటూ కాంగ్రెస్ ముందుకొచ్చిందని ఇప్పుడు కొర్రీలు పెట్టడం సరికాదంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాహుల్ గాంధీ విదేశాల నుంచి భారత్‌కు తిరిగొచ్చాకే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. పుణ్యాత్ముడివల్లే అధికారం: కుమారస్వామి సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను కుమారస్వామి పుణ్యాత్ముడితో పోల్చారు. ఆ పుణ్యా త్ముడి వల్లే అధికారంలోకి వచ్చానన్నారు. ‘ఈరోజు నాకు ప్రజల ఆశీస్సులు లేకున్నా పుణ్యాత్ముడు రాహుల్ నాపై నమ్మకం ఉంచడం వల్లే అధికారం దక్కింది. ఆయన్ని కూడా విశ్వాసంలోకి తీసుకునే ఓ నిర్ణయం తీసుకుంటా’ అని రైతులతో కుమారస్వామి అన్నారు. ప్రజా విశ్వాసం కాకుండా కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపైనే తాను ఆధారపడి ఉన్నానని గతంలో వ్యాఖ్యానించడంతో బీజేపీ సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. -
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఆలస్యం?
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నా పదవుల పంపకంలో ఏకాభిప్రాయం రాలేదు. సీఎంగా కుమారస్వామి, ఉపముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణంచేయడం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ తమ కోటా కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పట్టుబడుతోందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ కాంగ్రెస్ తమకే కావాలంటోంది. అయితే ఈ విషయంలో జేడీఎస్ బెట్టుగా ఉంది. సీఎం పదవిని త్యాగం చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖతో పాటు పీడబ్ల్యూడీ, ఇంధన శాఖలు కూడా తమకే ఇవ్వాలని, మొత్తంగా 22 మందికి మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ విషయాన్ని తేల్చేస్తాం’ అని కుమారస్వామి మీడియాకు తెలిపారు. -
జిల్లా టీడీపీలో ‘కళ’కలం
-
జిల్లా టీడీపీలో ‘కళ’కలం
►సమీక్షల నుంచి పదవుల పందేరం వెనుకా ఆయన ప్రభావమే ►సీనియర్లను పక్కన పెట్టేస్తున్న పరిస్థితి ► అశోక్‌కు పోటీగా వర్గం తయారు ► జిల్లా టీడీపీలో విస్తృత చర్చ జిల్లా టీడీపీలో మరోవర్గం బలపడుతోందా... పార్టీకి పెద్ద దిక్కుగా ఇన్నాళ్లు నిలిచిన అశోక్‌గజపతిరాజుకు ప్రాధాన్యం తగ్గుతోందా... ఆయనకు తెలియకుండానే పార్టీలో కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయా... రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన కళావెంకటరావు ప్రభావం జిల్లాలో పెరుగుతోందా... సమీక్షల నుంచి... పదవుల కేటాయింపు వరకూ ఆయన సూచనల మేరకే సాగుతోందా... జిల్లాలో ఇప్పుడు మరో పవర్‌సెంటర్ తయారవుతోందా... దీని వెనుక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చిన్నబాబు కోటరీని బలోపేతం చేస్తున్నారా... ఇప్పుడు జిల్లా పార్టీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇదే. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... అక్షరాలా అది నిజమేనేమోనని అనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా తెలుగుదేశం పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై నమ్మకం సడలిందో, ఈయనతో భవిష్యత్ రాజకీయాలు చేయలేమనో, లోకేష్ తనకంటూ కోటరీని తయారు చేసుకుంటున్నారో తెలియదు గాని జిల్లా పార్టీలో కళా వెంకటరావు ప్రభావం ఎక్కువవుతోంది. పార్టీ పదవుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్, కళా వెంకటరావుల మధ్య బంధం పెరగడంతో ఒకప్పుడు రాష్ట్ర పార్టీలోనే నంబర్ టూగా భావించే అశోక్ గజపతిరాజు ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్నట్టు స్పష్టమవుతోంది. కళౠ చెప్పినట్టే అదిష్టానం నడుచుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సుజయకృష్ణరంగారావును పార్టీలో చేర్చుకోవడం, ఆయనకు మంత్రి పదవి భరోసా లభించడం, శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం వంటివి అందులో భాగమని విశ్లేషించుకుంటున్నాయి. పవర్‌సెంటర్ మార్చడమే లక్ష్యంగా... ఎన్నికలకు ముందు శత్రుచర్ల విజయరామరాజును పార్టీలోకి తీసుకొచ్చిందే కళా వెంకటరావు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడే అశోక్ ప్రాబల్యాన్ని తగ్గించే బీజం పడ్డట్టు వాదనలు విన్పించాయి. ఇక, లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు నియమితులయ్యాక వ్యూహా లు ఊపందుకున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగరావును చేర్చుకోవడం అశోక్‌కు ఇష్టం లేకపోయినా కళా వెంకటరావు పావులు కదపడంవల్లే మార్గం సుగుమం అయ్యిందనే వాదనలు ఉన్నాయి. అంతేనా... ఆయనకు మంత్రి పదవి ఇప్పించడానికి లోకేష్ నుంచి హామీ కూడా ఇప్పించినట్టు ప్రచారం నడిచింది. అశోక్ బంగ్లా నుంచి పవర్ సెంటర్‌ను మార్చడమే దీని వెనుకున్న లక్ష్యమని తెలిసింది. సమీక్షల వెనుకా... ఆయనే! మూడు రోజుల క్రితం ఉండవల్లిలో జరిగిన పార్టీ సమీక్ష కూడా కళా వెంకటరావు సూచన మేరకే జరిగినట్టు తెలుస్తోంది. ఆయనేదైతే బ్రీఫింగ్ ఇచ్చారో దాని ప్రకారం చర్చించినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కళా ఇచ్చిన స్క్రిప్టును చంద్రబాబు చదివి విన్పించారని కూడా తెలుస్తోంది. ఎవరెవరిని మందలించాలో, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో, ఎవరికి సుతిమెత్తని చురకలంటించాలో కళా వెంకటరావు చేసిన సలహాలు బాగా పనిచేశాయని పార్టీలో చర్చ నడుస్తోంది. చివరికి, ఎమ్మెల్సీ కేటాయింపుల్లో కూడా ఆయన మార్కే కన్పించిందంటున్నారు. జిల్లాలో శోభా హైమావతి, గద్దే బాబూరావు, ఐ.వి.పి.రాజు, త్రిమూర్తుల రాజు తదితరుల సీనియర్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవి విషయంలో వారినెవ్వరినీ పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన శత్రుచర్లతో సరిపెట్టేశారు. ఈ విషయంలో సీనియర్లకు మొండి చేయి ఎదురైందనే చెప్పుకోవాలి. శత్రుచర్లకు ఎమ్మెల్సీ పదవి వెనుక కళా... కళా పదును పెట్టిన వ్యూహంలో భాగంగానే శత్రుచర్ల విజయరామరాజుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీలో సీనియారిటీ లేకపోయినా తనకంటూ వర్గాన్ని తయారు చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగా సమీకరణలు పక్కన పెట్టి శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇప్పించినట్టు వాదనలు ఉన్నాయి. ఉండవల్లి సమీక్షలో శత్రుచర్లపై అధినేతకు అశోక్ చేసిన ఫిర్యాదు వెనుక ఈ అక్కసు ఉందనే గుసగుసలు విన్పించాయి. ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోకుండా శత్రుచర్లకు కురుపాం పగ్గాలు అప్పగించడం వెనక కళా డైరెక్షన్ కారణమనే వాదనలు కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇప్పించే విషయంలోనూ కళా పావులు కదుపుతున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
అనుప్రియ మహోదయ
మోదీ కేబినెట్లోకి కొత్తమ్మాయ్ వచ్చింది. కొత్తమ్మాయే కాదు, కేబినెట్లో చిన్నమ్మాయ్ కూడా! ఆ కొత్తమ్మాయ్, చిన్నమ్మాయ్ అయిన అనుప్రియ ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది నేషన్’. ఎందుకంటే మోదీ ఈ అమ్మాయిని మంత్రి వర్గంలోకి తీసుకున్న వెంటనే, బీజేపీ కూటమి ఫట్‌మని ఒక వికెట్‌ను కోల్పోయింది! అనుప్రియకు మంత్రి పదవి ఇచ్చినందుకు వచ్చిన తొలి రియాక్షన్ ఇది. ఇక రెండో రియాక్షన్... మోదీ నియోజకవర్గమైన వారణాసిలో ఆయనకు వ్యతిరేకంగా ఈ నెల 26 న మొదలవబోతున్న ‘బీజేపీ హఠావో... ఆరక్షణ్ బచావో’ ఉద్యమం. ఈ రియాక్షన్ల వల్ల మోదీకి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు కానీ... అందుకు కారణమైన అనుప్రియ పొలిటికల్ పవర్‌పై జాతీయ నేతల దృష్టి పడకుండా మాత్రం ఉండదు. నాన్న రమ్మంటే పాలిటిక్స్‌లోకి అయిష్టంగా వచ్చి, అమ్మ పొమ్మంటే పార్టీలోంచి ఛాలెంజ్ చేసి మరీ వెళ్లిపోయిన ‘అప్నాదళ్’ చీలిక వర్గం లీడర్ అనుప్రియ... మోదీ ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరిగా ఎదిగినా ఆశ్చర్యంలేదు. ‘‘ఐ ఫీల్ గ్రేట్. ఐ యామ్ రెడీ ఫర్ ఇట్.’’ ఎందుకు గ్రేట్‌గా ఫీలవడం? దేనికి రెడీ అవడం? అసలు ఎవరిది ఈ మాట? అనుప్రియ! ఎంపీగా రెండేళ్ల వయసు. మంత్రిగా ఆరు రోజుల వయసు. ఫస్ట్ టైమ్ ఎంపీ. ఫస్ట్ టైమ్ మినిస్టర్. ‘‘ఐ ఫీల్ గ్రేట్. ఐ యామ్ రెడీ ఫర్ ఇట్’’ - తనే ఈ మాట అన్నది. 35 ఏళ్ల వయసుకే కేంద్ర మంత్రి అవడం గ్రేట్ అనేనా ఆమె ఉద్దేశం? కాకపోవచ్చు. బహుశా.. మోదీజీ ఫస్ట్ హాఫ్‌లో ఇవ్వకుండా, సెకండ్ హాఫ్‌లో ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించడాన్ని అనుప్రియ గర్వంగా భావిస్తూ ఉండి వుండొచ్చు. సహాయ మంత్రి పదవి.. మంత్రిపదవి కన్నా చిన్నదే. కానీ మోదీ కేబినెట్‌కు సహాయంగా ఉండడం చిన్న విషయమేమీ కాదు. ఇక... రెడీ అవడం! యుద్ధానికి సిద్ధం అవుతున్నారా ఏమిటీ అనుప్రియ?! అవును యుద్ధమే! వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఆర్థికంగా వెనుకబడిన వర్గమైన కూర్మీల ఓట్లున్నాయి. కూర్మీలు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చేతుల్లో ఉన్నారు. ఆయనదీ కూర్మీ కులమే. ఆయన చేతుల్లోంచి యు.పి.లోని కూర్మీల ఓట్లను లాక్కోవాలంటే ఇంకో కూర్మీ కావాలి. అందుకే బీజేపీ.. కూర్మీ అయిన అనుప్రియను పిలిచింది. పట్టం కట్టింది. కేంద్రంలో ఇప్పుడామె హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్. ‘‘నాకు ఇష్టం లేదు నాన్నా..’’ ఎవరో వె నక నుంచి నెడితే రాజకీయాల్లోకి వచ్చి పడ్డారు అనుప్రియ! సో.. అనుప్రియ పొలిటికల్ బయోగ్రఫీ ఆ ‘ఎవరో’తో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే.. అనుప్రియకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. ‘‘నాకు ఇష్టం లేదు నాన్నా’’ అంది! ఆయన నవ్వారు. అప్పటికే ఆయన యు.పి.లో పేరున్న పొలిటీషియన్. సోనే లాల్ పాటిల్! ఆయనది పేరున్న పార్టీ. అప్నా దళ్. సోనే లాల్ ‘కుర్మీ’ లీడర్. దళితనేత కాన్షీరామ్‌కు సన్నిహితుడు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక బృందంలో సోనే లాల్ కూడా ఉన్నారు. తర్వాత్తర్వాత కాన్షీరామ్ మాయావతికి ప్రాధాన్యం ఇవ్వడంతో నచ్చని సోనే లాల్ పార్టీ బయటికి వచ్చేశారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అదే... అప్నాదళ్. ఇంతకీ అనుప్రియను పాలిటిక్స్‌లోకి తెచ్చిన ఆ ‘ఎవరో’ ఎవరు? ఇంకెవరు? విధి! అనుప్రియ, అప్నాదళ్...అక్కాచెల్లెళ్లు అనుప్రియ పుట్టిన 14 ఏళ్లకు అప్నాదళ్ పుట్టింది. తర్వాత పదిహేనేళ్ల పాటు అనుప్రియ, అప్నాదళ్ కలిసి పెరిగాయి. చెల్లెలంటే అక్కకు ఇష్టం లేకపోవడం ఏమిటి? ‘‘నువ్వు పార్టీలోకి వస్తే బాగుంటుందిరా’’ అన్నారు సోనేలాల్ ఓ రోజు కూతురితో మురిపెంగా. అప్పుడు అనుప్రియ అన్నదే.. ‘‘నాకు ఇష్టం లేదు నాన్నా’’ అన్న మాట. ఆయన నవ్వి ఊరుకున్నారు. అదే చివరి నవ్వు. 2009 అక్టోబర్ 17న డాక్టర్ సోనే లాల్ పటేల్ కారు ఆక్సిడెంట్లో చనిపోయారు! అప్పటికి అనుప్రియకు పెళ్లయి వారం దాటింది అంతే! కాళ్ల పారాణైనా ఆరలేదు అంటాం కదా అలా. అప్నాదళ్ బాధ్యతను అనుప్రియ తల్లి కృష్ణ తీసుకున్నారు. అనుప్రియ, ఆమె భర్త చెరో చెయ్యీ వేశారు. అదే నచ్చలేదు పార్టీ ప్రెసిడెంట్ కృష్ణకీ, పార్టీ కేడర్కీ. చెయ్యి వెయ్యడాన్ని... చేజిక్కించుకోడానికి చేసిన ప్రయత్నం అనుకున్నారు వాళ్లు. ‘‘నీ ముఖం నాకు చూపించకు ఫో’’ ఆరేళ్లు గడిచాయి. ఈ ఆరేళ్లలో అనుప్రియ అప్నాదళ్ ఎమ్మెల్యే అయ్యారు. అప్నాదళ్ ఎంపీ అయ్యారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా ఆమె గెలుపునకు భారతీయ జనతా పార్టీ సాయం చేసింది. చేసిన సాయానికి ప్రతిఫలంగా ‘మీ పార్టీని మా పార్టీలో కలిపేద్దాం’’ అనే సంకేతం పంపారు మోదీ. అది నచ్చలేదు అనుప్రియకు. అయినా మోదీ ప్రయత్నాలు ఆగలేదు. అదంతా చూస్తున్న తల్లికి... ‘పిల్లగానీ అటువైపు వెళుతుందా’ అన్న అనుమానం వచ్చింది. ‘‘మీ అనుమానం నిజమే’’ అని ఒకరిద్దరు పార్టీ సన్నిహితులు తల్లి చెవిలో ఊదారు. అనుప్రియతో పాటు మరో ఆరుగురు పార్టీ నాయకులను అప్నాదళ్ నుంచి బయటికి పంపించారు కృష్ణ పటేల్. అందుకు ఆమె చూపిన కారణం... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు! పార్టీలోంచి బయటకి వచ్చిన ఈ ఏడాది వ్యవధిలో అనుప్రియ చీలిక వర్గం నాయకురాలిగా ఉన్నారు! ఇప్పుడు క్యాబినెట్లోకి వచ్చేశారు. మోదీజీ రెండోసారి కలిపిన 19 పవర్ ముక్కల్లో.. చిన్నారి మినిస్టర్ అనుప్రియే. యంగెస్ట్! మంత్రి అయిందని తల్లికి కోపం ‘‘ఐ యామ్ రెడీ ఫర్ ఇట్’’ అని అనుప్రియ అనడాన్ని మనం ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె తన ప్రత్యర్థులతో తలపడడానికి ముందు తల్లి విసిరే ముష్టి ఘాతాలను తప్పించుకోవలసి ఉంటుంది. ఇప్పటికే ఆమె ఒక అస్త్రాన్ని సంధించారు. కూతురికి మంత్రి పదవి ఇచ్చినందుకు నిరసనగా బీజీపీ కూటమి నుంచి బయటికి వచ్చారు. అనుప్రియ మంత్రి అవడం ఆమె తల్లి కృష్ట పటేల్‌కు ఇష్టం లేదు. తన కూతురికి మంత్రి పదవి ఇస్తే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటానని ఆమె ఇదివరకే ప్రకటించారు. ఇక అనుప్రియకు మంత్రి పదవి రావడం ఇష్టంలేని ఇంకో వ్యక్తి హరివంశ్ సింగ్. లోక్‌సభకు ఉన్న ఇద్దరే ఇద్దరు అప్నాదళ్ ఎంపీల్లో హరివంశ్ ఒకరు (ఇంకొకరు అనుప్రియ). హరివంశ్.. అనుప్రియ తల్లికి విధేయుడు. దాంతో బీజేపీ ఒక ఎంపీని కోల్పోయింది. అయితే కోల్పోయే దానికన్నా, రాబట్టుకోబోయే ఎక్కువని భావిస్తున్నందు వల్లే మోదీ.. అనుప్రియను క్యాబినెట్లోకి తీసుకున్నారు. అనుప్రియ... ఆకర్షణ అనుప్రియ యాక్టివ్. పార్లమెంటులో ఆమె స్పీచ్ ఇస్తుంటే సీనియర్లు ముచ్చటగా చూస్తుంటారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు కూడా ఆమె మాట్లాడే తీరు ఆకట్టుకుంటుంది. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతపు మాండలికంలోకి సులువుగా వెళ్లిపోతారు. ఆమె స్వభావమే అంత. అయితే పాలిటిక్స్ అర్థం చేసుకోడానికి మాత్రం ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది. అనుప్రియ ఎమ్మెల్యే అవడానికి ముందు... యు.పిలో కుల సమీకరణలను అవగాహన చేసుకోవడం అంత తేలికైన పని కాదని గ్రహించారు. రోజూ ఏదో ఒక కొత్త కోణం కనిపించేది. ఆ ప్రకారం తన ప్రసంగ పాఠానికి అప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవలసి వచ్చేది. పైగా ఆమె పోటీ చేస్తున్న రొహానియా నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన హిందీ భాష ఉండేది. ఆ భాషలో అక్కడి వారితో మాటామంతీ జరపడం కాస్త తడబాటుగా ఉండేది. ఇవన్నీ కూడా ఆమె శక్తిని హరించేవే. అయితే ఓటర్లతో మాట్లాడుతున్నప్పుడు ముఖంపై ఆ చిరునవ్వు మాత్రం అలాగే నిలిచి ఉండేది. అది ప్లస్ పాయింట్ అయింది అనుప్రియకు. మున్ముందు మోదీకి అది ప్లస్ ప్లస్ పాయింట్ అవొచ్చు. అనుప్రియ నేడో, రేపో.. తను బి.జె.పి.లో చేరుతున్నట్లు ప్రకటించే అవకాశాలున్నాయి. అనుప్రియ పటేల్ (36), కేంద్ర మంత్రి జన్మదినం : 28 ఏప్రిల్ 1981 జన్మస్థలం : కాన్పూర్ (యు.పి) తల్లిదండ్రులు : సోనే లాల్ పటేల్, కృష్ణ పటేల్ తోబుట్టువులు : చెల్లెలు పల్లవి (అప్నాదళ్ వై.ప్రె.), ఒక తమ్ముడు. చదువు : బి.ఎ. లేడీ శ్రీరామ్ కాలేజ్ (ఢిల్లీ) ఎం.ఎ. సైకాలజీ, (అమిటీ వర్శిటీ, నోయిడా) ఎం.బి.ఎ. (కాన్పూర్ వర్శిటీ) ఆసక్తి ఉన్న రంగాలు : బోధన, సంఘసేవ, రాజకీయాలు భర్త : ఆశిష్ కుమార్ సింగ్ నాన్న రమ్మన్నాడు... అమ్మ పొమ్మంది! ప్రాతినిధ్యం : ఎం.పి. మీర్జాపూర్ (యు.పి) ప్రత్యర్థి : సముద్ర బింద్ (బి.ఎస్.పి) మెజారిటీ : 2.19 లక్షల ఓట్లు! (2014 ఎ.) తొలి ప్రాతినిధ్యం : ఎమ్మెల్యేగా 31 ఏళ్ల వయసులో. నియోజకవర్గం : రొహానియా, వారణాసి తొలి పార్టీ : అప్నాదళ్ రాజకీయరంగ ప్రవేశం : 2009 (తండ్రి మరణంతో) పార్టీ బహిష్కారం : 2015 (తల్లి ఆగ్రహంతో) కృషి చేస్తున్న రంగాలు : నీటి పారుదల, గిరిజన సంక్షేమం ఉన్నత విద్య, గ్రామీణ అభివృద్ధి -
ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం: సబిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలను అవమానించే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మాజీ మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, వి.సునీతా లకా్ష్మరెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని, మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా వారిని అవమానించారని మండిపడ్డారు. ఇప్పటిదాకా మహిళలకే ఇచ్చే సంప్రదాయమున్న మహిళా, శిశు సంక్షేమ శాఖను తుమ్మలకు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్లో సమర్థులైన మహిళలు లేరా, వారి శక్తిసామర్థ్యాల మీద నమ్మకం లేదా అని అన్నారు. కేసీఆర్ కుమార్తె కవితకు పోటీగా పార్టీలో మరే మహిళ ఎదగడం ఇష్టం లేదా అని ఆరోపించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పేద మహిళలకిచ్చే పింఛన్లను రద్దుచేసి వారికి అన్యాయం చేశారని సబిత, సునీత విమర్శించారు. -
లోకేష్ వద్ద మార్కుల కోసం మెహర్బానీ..
విజయవాడ : లోకేష్‌ను మంత్రి చేయాలన్నది చంద్రబాబు నాయుడు ఇష్టమని, ఆయన కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తామంటూ కొందరు మెహర్బానీ మాటలు చెప్పడం లోకేష్ వద్ద మార్కుల కోసమేనని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సీఎంను కలిసిన అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడుతూ లోకేష్ సమర్థుడని ఆయన ఆరు నెలల తరువాత ఎక్కడ నుంచైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి కావచ్చని చెప్పారు. తెలంగాణాలో మంత్రిగా కేటీఆర్ తన సమర్థతను నిరూపించుకున్నారని, ఏపీలో లోకేష్‌కు మంత్రికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. లోకేష్ కేంద్రానికి వెళితే ఉపయోగం లేదని అన్నారు. సీఎం కొడుకైనంత మాత్రాన లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో యువత అవసరం ఉందని చెప్పారు. లోకేష్ పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అయితే మెహర్బానీ కోసం కొందరు లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వాలని భజన చేస్తున్నారని, దీని వల్ల పార్టీకి మేలు జరగదని జేసీ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణాల్లో నియోజకవర్గాల పెంపుపై పార్లమెంటులో చట్ట సవరణకు అవకాశం ఉందని చెప్పారు. జగన్ తన తండ్రి పేరు చెప్పుకుని బతుకుతున్నారని, తాను సొంతంగా ఏం చేస్తారో ప్రజలకు చెప్పడంలేదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. టీడీపీ లోకేష్ తాతది : వైవీబీ తెలుగుదేశం పార్టీ లోకేష్ తాతదని, గ్లామర్, ఇమేజ్ ఉన్న ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా లక్ష ఓట్ల మేజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కార్యాలయం వద్ద మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కఠోర శ్రమతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో లోకేష్‌బాబు కృష్ణా జిల్లా నుంచిపోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. కృష్ణా జిల్లాలోని 16నియోజకవర్గాల్లోను ఎక్కడ నుంచి పోటీ చేసినా లోకేష్ లక్ష ఓట్ల మెజార్టీలో గెలుస్తారని, ఆయనకు మంత్రిపదవి ఇవ్వడం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పారు. -
ఊరికే ఇచ్చారా మంత్రిపదవి...!
మంత్రి పదవి నుంచి పీకేస్తారా? ఉత్తి పుణ్యానికే మంత్రి పదవి ఇచ్చారనుకుంటున్నారా? తీసివేయడానికి...! అమాత్య పోస్టుకు రూ.కోట్లు కాసులు కురిపించాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతలన్నీ భుజాలపై మోశాం. పీకేసీ చూడమనండి...!! అంటూ ఓ మంత్రిగారి భార్య చిందులేశారు. అన్నీ తానై చక్రం తిప్పే సదరు మంత్రి గారి భార్య తమ అనుచరవర్గానికి చెప్పిన ధైర్యవచనాలివి. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తల నేపధ్యంలో ఓ అమాత్యుడికి పదవీ గండంపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. సదరు మంత్రి గారు తన సతీమణి వ్యవహార శైలితో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. అన్ని వ్యవహారాల్లో ‘ఆమె’ జోక్యం ఎక్కువ కావడంతో అమాత్యుడికి చిక్కులు తప్పడం లేదు. రేషన్ మాఫియా నుంచి వివాదాస్పద భూములు కొనుగోలు వరకు అన్నింటిలో తలదూర్చి షాడో మంత్రిగా ‘ఆమె’ చక్రం తిప్పుతున్నారు. కొంత కాలం మంత్రి గారు ఆమెను హైదరాబాద్‌కు పరిమితం చేసి కట్టడి చేశారు. కానీ మళ్లీ ఇటీవల ఆమె అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జిల్లాలో ఓ ఉన్నతాధికారికి మంత్రిగారి సతీమణి ఓ పని అప్పగించి చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఆ పని సదరు ఉన్నతాధికారి చేయకపోవడంతో అగ్గి మీద గుగ్గిలమైన మంత్రి గారి భార్య ఉన్నతాధికారిని తిట్ల దండకంతో ఫోన్లో హోరెత్తించారు. ఈ దండకాన్ని ఫోన్లో రికార్డు చేసిన సదరు ఉన్నతాధికారి సీఎం వద్ద పంచాయతీ పెట్టారు. సీఎం తనదైన శైలిలో మంత్రికి క్లాస్ పీకారు. కట్టడి చేయకుంటే... ఊస్టింగ్ తప్పదని సీఎం హెచ్చరికలు జారీ చేశారట. సీఎం హెచ్చరికల్ని తన భార్యకు వివరించిన మంత్రి గారికి సతీమణి చేసిన వ్యాఖ్యలతో ఊరట దక్కిందని టీడీపీలో అంతర్గత ప్రచారం జరుగుతోంది. ఊరికే మంత్రి పోస్టు ఇవ్వలేదన్న సంగతి తెలియదా...! ఆరోజు రేటు ‘40 సీ’ తగ్గకుండా తీసుకున్నప్పుడు తెలియదా..? అంటూ ఏం ఫరవా లేదని మంత్రిగారికి ధైర్యవచనాలు చెప్పారని పార్టీలో గుసగుసలు గుప్పుమంటున్నాయి. -
పదవి పోయినా లెక్కచేయను
- కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు - మంత్రి నాయిని సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మంత్రి పదవి పోయిన పర్వాలేదు, కానీ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం 8వ వార్షికోత్సవం సందర్భంగా సంఘం డైరీ, క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. చంద్రబాబు లా అండ్ ఆర్డర్‌ను గవర్నర్‌కు ఇప్పించి, హైదరాబాద్ నగరాన్ని వారి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడే పరిశ్రమల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రైవేటు ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు. వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సామా వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, మహిళా అధ్యక్షురాలు మమతారెడ్డి , కనీస వేతన బోర్డు చైర్మన్ సదానందం గౌడ్, ఉపాధ్యక్షుడు అనిల్, పురుషోత్తం, శరత్ చందర్, గణేష్ పాల్గొన్నారు.సభకు ముందు సుందరయ్య పార్కు నుంచి వీఎస్టీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. -
మంత్రివర్గంలో మహిళలకు చోటేదీ!
* ప్రభుత్వానికి వారి సంక్షేమం పట్టదా! * డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి నర్సాపూర్ రూరల్: మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం కించపరుస్తోందని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. బుధవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్క మహిళా ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. మంగళవారం నాటి విస్తరణలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారని ఆశించామన్నారు. మహిళా శిశుసంక్షేమశాఖను మహిళలకు కేటాయించకుండా మగవారికి ఇవ్వడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అభయహస్తం, బంగారుతల్లి, జీరోవడ్డీ రుణాలు తదితర పథకాలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చారని ఆమె దుయ్యబట్టారు. నిరాశ మిగిల్చిన ఆసరా గతంలో పెన్షన్లు తీసుకున్న అనేకమంది ప్రస్తుతం పెన్షన్లు కోల్పోయారని సునీతారెడ్డి పేర్కొన్నారు. 50 శాతం వైకల్యం పేరుతో వికలాంగులకు, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ పేరుతో మెలికపెట్టి వితంతువుల పెన్షన్లు తొలగించారన్నారు. అలాగే వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పెన్షన్లు నిలిపివేశారన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2లక్షల 70 వేల అభయహస్తం పెన్షన్లు నిలిపివేసిందన్నారు. గతంలోనే ప్రతిపాదనలు చేశాం గతంలోనే ఘణపురం ఆయకట్టు ఎత్తుపెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేశామని సునీతారెడ్డి పేర్కొన్నారు. కేవలం 0.5 పెంచితే సరిపోతుందని అప్పట్లో నిపుణులు చెప్పారన్నారు. ప్రస్తుతం 1.5 పెంచబోతున్నట్లు ప్రకటించడం విచారకరమన్నారు. అప్పుడు సీఈఓ గా ఉన్న మురళీధర్ ఇప్పుడు కూడా ఉన్నారన్నారు. 1.5 పెంచితే అనేక గ్రామాలకు ముప్పు ఉంటుందన్నారు. సమావేశంలో ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా, స్థానిక సర్పంచ్ వెంకటరమణరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్ పాల్గొన్నారు. -
క్యాబినెట్లోకి దత్తన్న?
-
క్యాబినెట్లోకి దత్తన్న?
* ఈ విస్తరణలో స్థానం ఖాయమంటున్న అనుచరులు * సహాయ లేదా ఇండిపెండెంట్ చార్జిపై ఆశలు సాక్షి, సిటీబ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని మళ్లీ విస్తరిస్తారన్న వార్తల నేపథ్యంలో గ్రేటర్ భారతీయ జనతా పార్టీలో మళ్లీ ఆసక్తికరచర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో బీజేపీ తరఫున విజయం సాధించిన ఒకే ఒక్క నేత... సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు ఈమారు మంత్రి పదవి ఖాయమని అభిమానులు, నాయకులు ఆశిస్తున్నారు. గతంలో దత్తాత్రేయకు మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం ఉన్న దృష్ట్యా ఈసారి ఆయనకు ఇండిపెండెంట్ చార్జితో కూడిన పదవిని ఇచ్చే అవకాశం ఉందని సన్నిహితులు అంచనాకు వచ్చారు. ఒక వేళ వయస్సు అడ్డు (68 సంవత్సరాలు)గా భావిస్తే సహా య మంత్రి పదవినైనా కట్టబెడతారని పేర్కొంటున్నారు. దత్తాత్రేయ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను అప్పజెప్పకుండా ఖాళీగా ఉంచారని, అది కచ్చితంగా క్యాబినెట్లో స్థానం కల్పించే సంకేతమేనని పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. గురువారం సికింద్రాబాద్ నియోకజవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దత్తాత్రేయ సైతం ముందుంది మరింత మంచికాలం అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేయటంతో.. ఆయనకు పదవి ఖాయమై ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది.