బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నా పదవుల పంపకంలో ఏకాభిప్రాయం రాలేదు. సీఎంగా కుమారస్వామి, ఉపముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణంచేయడం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ తమ కోటా కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పట్టుబడుతోందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ కాంగ్రెస్ తమకే కావాలంటోంది. అయితే ఈ విషయంలో జేడీఎస్ బెట్టుగా ఉంది. సీఎం పదవిని త్యాగం చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖతో పాటు పీడబ్ల్యూడీ, ఇంధన శాఖలు కూడా తమకే ఇవ్వాలని, మొత్తంగా 22 మందికి మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ విషయాన్ని తేల్చేస్తాం’ అని కుమారస్వామి మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment