'ఇప్పటికైనా కళ్లు తెరవండి' | yv subba reddy slams tdp govt over special status fight | Sakshi
Sakshi News home page

'ఇప్పటికైనా కళ్లు తెరవండి'

Published Mon, Oct 12 2015 10:02 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

yv subba reddy slams tdp govt over special status fight

గుంటూరు: వైద్యులను అడ్డుపెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు నోటికొచినట్టు మాట్లాడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తమకు అనుకూల మీడియాలో విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నీచరాజకీయాలు చేయాల్సిన అవసరముందా అని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసమే ప్రత్యేక హోదా కావాలని జగన్ పోరాటం చేస్తున్నారని పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం బాగా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement