
'వైఎస్ జగన్ దీక్ష విరమిస్తే మంచిది'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ఉదయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నామని గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ ఉదయ్ శంకర్ తెలిపారు. వైఎస్ జగన్ శరీరంలో డీహైడ్రేషన్ మొదలైందని, ఆయన దీక్ష విరమిస్తే మంచిదని సూచించారు. కీటోన్స్ కారణంగా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు.
వైఎస్ జగన్ తక్షణం దీక్ష విరమించి, ఆహారం తీసుకోవాలని సలహాయిచ్చారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన నివేదికను తమ సూపరింటెండెంట్ కు సమర్పిస్తామని చెప్పారు. ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.