
చాపాడులో సిబ్బందికి సూచనలు ఇస్తున్న జిల్లా వైద్యాధికారి నాగరాజు
చాపాడు: గర్భిణులు క్రమం తప్పకుండా ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగరాజు పీహెచ్‌సీ సిబ్బందికి సూచించారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యాధికారి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌ఓ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా వైద్య శిబిరం నిర్వహించి గర్భిణులకు అవసరమైన పరీక్షలు చేసి రక్త హీనత నివారణకు తీసుకోవాల్సిన పోషక ఆహారం తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్, తల్లీబిడ్డ ఎంసీపీ కార్డులలో వివరాలు నమోదు చేయాలని, వైద్య సిబ్బంది రోజూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. జిల్లా ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే జిల్లా అధికారి వెంకటశివ, జిల్లా పీఎంఎంవీవై జిల్లా కో ఆర్డినేటర్ విజయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు సురక్షితం
ఖాజీపేట: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయించుకోవడం సురక్షితమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు అన్నారు. ఖాజీపేట పీహెచ్‌సీని గురువారం ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో జరిగిన కాన్పుల సంఖ్యపై అధికారులతో ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు, ఆరోగ్య విస్తరణ అధికారి రాఘవయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment