Department of Medical Health
-
AP: ఆరోగ్య సురక్ష రెండోదశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న ఆరోగ్య సురక్ష ’(జేఏఎస్) రెండో దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో జేఏఎస్‌ను నిర్వహిస్తారు. ఇక పట్టణాలు, నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో 50 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సొంత ఊళ్లలోనే 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందించింది. నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా రెండో దశను చేపట్టారు.ఆరు నెలల్లో 13,954 శిబిరాలు జేఏఎస్ రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలల్లో 13,954 సురక్ష శిబిరాలు నిర్వహించేలా వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో 10,032, పట్టణాలు, నగరాల్లో 3,922 చొప్పున శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున, మునిసిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను ఆర్నెళ్లలో కవర్ చేసేలా శిబిరాలను నిర్వహిస్తారు. శిబిరాల నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు మరోసారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జేఏఎస్–2పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలో స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్ వైద్యులను, కంటి సమస్యల స్క్రీనింగ్ కోసం 562 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను నియమించారు. వైద్య శిబిరాల్లో అవసరమైన అన్ని రకాల మందులను అత్యవసర ఔషధాలతో సహా అందుబాటులో ఉంచుతున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లు శిబిరాల్లో అందుబాటులో ఉంటాయి. చేయి పట్టి నడిపిస్తూ.. వైద్య శిబిరాల ద్వారా సొంతూళ్లలో వైద్య సేవలు అందించడమే కాకుండా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపిస్తోంది. జేఏఎస్ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున అందచేస్తోంది. రిఫరల్ రోగులను ఆస్పత్రులకు తరలించి అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్‌లు, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం వైద్య పరంగా అండగా నిలుస్తోంది. వీరికి ఉచిత కన్సల్టేషన్లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు జేఏఎస్–2 కార్యక్రమం అమలు పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలవారీగా ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సంబంధిత విభాగాధిపతుల దృష్టికి తెచ్చి సమస్య పరిష్కరానికి చర్యలు చేపడతారు. ప్రజల వద్దకే వైద్యం జేఏఎస్–2 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మందులు, వైద్య పరీక్షల కిట్లు సరఫరా చేశాం. శిబిరాల నిర్వహణపై జిల్లా యంత్రాంగాలు షెడ్యూల్లు రూపొందించాయి. ఆ మేరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజల వద్దకు చేరుస్తూ జేఏఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
ఊరూ వాడా.. ‘ఆరోగ్య సురక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో 7.16 లక్షల మంది ప్రభుత్వ సెలవు దినాలను మినహాయిస్తే గురువారం వరకూ నాలుగు రోజుల పాటు వైద్య శాఖ 2,427 శిబిరాలను నిర్వహించింది. గ్రామాల్లో 2,261 శిబిరాలను నిర్వహించగా పట్టణాలు, నగరాల్లో 166 శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి శిబిరంలో ఇద్దరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తంగా నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల్లో ఏకంగా 7,16,101 లక్షల మంది సొంత ఊళ్లలో ఉచిత చికిత్సలు పొందారు. వెద్య సేవలను వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 4 లక్షల మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఒక్కో శిబిరంలో సగటున 277 మంది వైద్య సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు భావించిన 20,798 మందిని పెద్దాస్పత్రులకు రిఫర్ చేశారు. ఉచితంగా పరీక్షలు.. మందులు ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. టోకెన్లు లేకున్నా వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకున్నా కూడా తమ గ్రామం/పట్టణంలో శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మహిళలకు ప్రత్యేక కౌంటర్ – పకూర్ బీ, క్రిష్టిపాడు, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లే వాళ్లం. ఇప్పుడు మా గ్రామానికే వైద్యులు వస్తున్నారు. డబ్బు ఖర్చు లేకుండా ఊళ్లోనే వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు వ్యయ ప్రయాసలు లేకుండా వైద్యులే గ్రామాల్లోకి వచ్చి వైద్యం చేయడం ఎంతో మేలు చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ.5 వేలు ఖర్చయ్యేవి – కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)) ఆరోగ్య సురక్ష శిబిరంలో నేను, నా భర్త వైద్య సేవలు పొందాం. ముందుగానే వలంటీర్, ఏఎన్ఎం మా ఇంటికి వచ్చి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భీమవరంలో నిర్వహించిన సురక్ష శిబిరంలో కొన్ని పరీక్షలు చేసి స్పెషలిస్ట్ వైద్యులు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఇదే వైద్య సేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకుంటే మాకు సుమారు రూ.5 వేలు ఖర్చయ్యేవి. ముఖ్యమంత్రి జగన్ మా ఇంటి వద్దకే వైద్యులను పంపించి ఉచితంగా సేవలు అందించడం చాలా బాగుంది. ఈ శిబిరాలు పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడతాయి. 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులు: మంత్రి విడదల రజని చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మంత్రి రజని గురువారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యం అందించేందుకు ఏకంగా 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. -
త్వరలో పేదలకు ఎయిర్ అంబులెన్స్‌లు
సాక్షి, హైదరాబాద్/ గన్‌ఫౌండ్రి: రాష్ట్రంలో త్వరలో ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడినా రోగులను హెలికాప్టర్ ద్వారా దవాఖానాకు తరలిస్తామన్నారు. కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. సోమవారం రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. అలాగే 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో 22,600 పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. మరో 7,291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు పరీక్ష పూర్తయిందని, వారం పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. మరో 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, 1,931 ఎంపీహెచ్ఏ (ఫిమేల్ (దరఖాస్తు దశ) పోస్టులు కూడా ఉన్నాయని వివరించారు. ఇవి కూడా పూర్తయితే పదేళ్లలోనే 30 వేల ఉద్యోగాలు వైద్య ఆరోగ్యశాఖలో ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ పదేళ్ల ప్రయాణంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందన్నారు. 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో 11 వ స్థానంలో ఉంటే, ఇప్పుడు మూడో ర్యాంకుకు చేరుకున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య రంగానికి రూ.12,364 కోట్ల బడ్జెట్ పెట్టామని, ఒక్కొక్కరి వైద్యానికి చేస్తున్న తలసరి ఖర్చు రూ.3,532 అని తెలిపారు. తద్వారా దేశంలో మూడో స్థానంలో నిలిచామని చెప్పారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం మొత్తం 50 వేల పడకలతో కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధమైందని మంత్రి పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చి అవయవ మార్పిడులు చేసుకునేలా ప్రభుత్వ ఆస్పత్రులు మారబోతున్నాయని చెప్పారు. ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతినెల సగటున 8 మందికి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ త్వరలో రెండో స్థానానికి చేరనున్నట్టు హరీశ్‌రావు వివరించారు. ఔషధాలను సమకూర్చడం, రోగులకు అందించడంలో ఫార్మాసిస్టులది కీలక పాత్ర అంటూ కొత్త ఫార్మాసిస్టులకు ఆయన స్వాగతం పలికారు. -
ఆన్లైన్ కౌన్సెలింగ్‌తోనే వైద్య సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పెట్టే దిశగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే అన్ని సీట్లను భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష (ఫిజికల్) కౌన్సెలింగ్ చేపట్టవద్దని స్పష్టం చేసింది. పలుమార్లు ఆన్లైన్ కౌన్సెలింగ్‌లు నిర్వహించాలని, అప్పటికీ సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించకుండా అలాగే వదిలేయాలని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ప్రతిభకు న్యాయం 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సీట్ల బ్లాకింగ్ నిలిచిపోతుందని, ఫలితంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులు, కోర్టు కేసులను పరిష్కరించడంలో ఇది సాయపడుతుందని ఎన్ఎంసీ కూడా స్పష్టం చేసింది. కాగా ఈసారి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లు దాదాపు 50కు పైగా, పీజీ మెడికల్‌లో 30కి పైగా మిగిలిపోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బ్లాకింగ్‌తో కోట్లు దండుకున్న కాలేజీలు! గతేడాది వరకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల బ్లాకింగ్‌తో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమ వ్యాపారం చేశాయనే ఆరోపణలున్నాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులు తమ కాలేజీల్లోని ఏ, బీ కేటగిరీ సీట్లలో చేరేలా యాజమాన్యాలు ముందస్తు అవగాహన కుదుర్చుకునేవి. దీంతో ఈ కేటగిరీలకు రెండు విడతల కౌన్సెలింగ్, చివరి మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్‌లు పూర్తయ్యేవరకు ఉత్తమ ర్యాంకర్లు తమ సీట్లను అలాగే అట్టిపెట్టుకునేవారు. అన్ని కౌన్సెలింగ్‌లూ పూర్తయిన తర్వాత ఒకవేళ సీట్లు మిగిలితే అవి ఆటోమెటిక్‌గా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అప్పటికే ఫీజు చెల్లించిన మెరిట్ విద్యార్థులు ముందుగా కుదుర్చుకున్న అవగాహన మేరకు తమ సీట్లు వదిలేసుకునేవారు. దీంతో ఇవి కూడా నిబంధనల ప్రకారం సీ కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. వీటికి అభ్యర్థులతో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ప్రైవేట్ కాలేజీలు కోట్లు దండుకునేవి. కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.60 వేలు, బీ కేటగిరీ సీటుకు రూ.11.55 లక్షల ఫీజు ఉంటుంది. ఇక సీ కేటగిరీ సీటుకు బీ కేటగిరీ సీటు కంటే రెట్టింపు ఫీజు ఉంటుంది. అంటే ఏడాదికి రూ.23.10 లక్షల వరకు ఉంటుందన్న మాట. ఇలా కోర్సు మొత్తానికి కోటికి పైగా వసూలు చేస్తారు. రూ.60 వేలున్న కన్వీనర్ కోటా సీటును కూడా అదే రేటుకు అమ్ముకునేవారు. ఇక అవగాహన మేరకు వర్సిటీకి రూ.3 లక్షల జరిమానా చెల్లించి మరీ సీట్లు వదులుకున్న విద్యార్థులకు వాళ్లు చెల్లించిన ఫీజుతో పాటు రూ.10 లక్షల వరకు అదనంగా యాజమాన్యాలు చెల్లిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ విద్యార్థులు ఆ తర్వాత ఇతర కాలేజీల్లో చేరిపోయేవారు. ఇతర రాష్ట్రాల ముఠాల ప్రమేయం గతంలో మాదిరిగానే ఏ, బీ కేటగిరీ సీట్లను సీ కేటగిరీగా మార్చుకునేలా యాజమాన్యాలు విద్యార్థులకు వల వేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ దందాలో అనేక ఇతర రాష్ట్రాల ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది. గతంలో కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇదంతా గుట్టుగా సాగిపోతుండటం గమనార్హం కాగా.. ఎన్ఎంసీ తాజా నిర్ణయంతో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. -
ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే..
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదవాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం, ఆర్టికల్ 371డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌ను సవరించారు. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు 100 శాతం రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు స్థానిక విద్యార్థులకు 85 శాతం మాత్రమే సీట్లు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేవి. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉండే సీట్లన్నీ కన్వీనర్ కోటా సీట్లే కాగా, ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందే భర్తీ చేయాల్సి ఉంటుంది. పాత కాలేజీల్లోనే అన్ రిజర్వుడు కోటా తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయడంతోపాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలుంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. నాడు తెలంగాణలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8,340కి పెరిగాయి. అప్పటి 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,895 ఎంబీబీఎస్ సీట్లు (ప్రభుత్వ, ప్రైవేటు కలిపి)అందుబాటులో ఉండేవి. ఇందులో 15 శాతం అన్ రిజర్వుడు కోటా కింద 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. వీటిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సైతం దక్కించుకునేందుకు అవకాశం ఉండటంతో ఆ మేరకు తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోయేవారు. తాజాగా ఈ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు అన్ రిజర్వుడు వర్తించకుండా చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభిస్తాయి. గతేడాది నుంచి బీ కేటగిరీలో 85 శాతం తెలంగాణకే... ఇప్పటికే ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా చేయడం (లోకల్ రిజర్వ్) వల్ల రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబీబీఎస్ సీట్లు లభించాయి. తాజా నిర్ణయంతో ప్రతి ఏటా మొత్తం 1,820 సీట్లు అదనంగా లభించనున్నాయి. 1,820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం. కాగా ప్రతి ఏటా కాలేజీల సంఖ్య పెరిగిన కొద్దీ అదనంగా లభించే సీట్లు పెరగనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటా 15 శాతం సీట్లు యధాతథంగా ఉంటాయి. దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు. రాష్ట్ర విద్యార్థుల డాక్టర్ కల సాకారం చేసే నిర్ణయం ప్రభుత్వం ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ ఆలోచనతో అమలు చేస్తున్న నిర్ణయాలు తెలంగాణ బిడ్డలను వైద్య విద్యకు చేరువ చేస్తున్నాయి. మొత్తం 1,820 మెడికల్ సీట్లు అదనంగా వచ్చేలా ప్రభుత్వం చేసింది. రాష్ట్ర విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
నిమ్స్‌లో 2 వేల పడకల భవనం
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన 2,000 పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దీనికోసం సత్వరమే ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతోపాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించేలా నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలన్నారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఉన్నతాధికారులతో నిర్వహించిన తొలి సమీక్షలో హరీశ్‌రావు మాట్లాడారు. 8 అంతస్తుల్లో నిర్మించే నూతన భవనం అందుబాటులోకి వస్తే, పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. అంతేగాక, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ నిర్మాణం పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఒక్క నిమ్స్‌లోనే మొత్తం 3,700 పడకలు ఉంటాయన్నారు. అలాగే, గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇదే దేశంలో తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ అవుతుందని చెప్పారు. సంతాన సాఫల్య కేంద్రం పనుల వేగం పెంచండి గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటుచేస్తున్న సంతాన సాఫల్య, అవయవ మార్పిడి కేంద్రాల పనులు వేగవంతం చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా, గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను నిర్దేశించారు. బ్రెయిన్‌డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి పీహెచ్సీ, బస్తీ దవాఖానా, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉండేలా కృషి చేయాలని సంబంధిత విభాగానికి ఆదేశించారు. ఆదర్శప్రాయంగా ఉండాలి ఆసుపత్రికి అందరికంటే ముందుగా వచ్చి, అందరి తర్వాత వెళ్లే డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదర్శప్రాయులని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రతి రోజూ రెండు గంటలపాటు ఆసుపత్రుల్లో రౌండ్లు వేస్తూ, అన్ని విభాగాలు సందర్శిస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. బాధ్యతగా పని చేసి ప్రజల మన్ననలు పొంది, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణను మొదటిస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, త్వరలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. వైద్యశాఖలోని అన్ని విభాగాల అధిపతులతో సోమవారం మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో మంత్రి రజిని 2023–24 బడ్జెట్ అంచనాలు, వైఎస్సార్ కంటివెలుగు, ఆరోగ్యశ్రీ, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్‌పై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ జిల్లా నోడల్ అధికారులు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను పరిశీలించి లోటుపాట్లు ఉంటే సరిచేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. మందులషాపుల్లో మత్తు మందులు, ఇతర అనధికారిక విక్రయాలను అరికట్టాలని ఔషధ నియంత్రణ విభాగాన్ని ఆదేశించారు.‘వైఎస్సార్ కంటివెలుగు’ మూడో దశలో భాగంగా 35,42,151మంది వృద్ధులకు ఆరు నెలల్లో స్క్రీనింగ్ పూర్తి చేయాలని చెప్పారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయాలని, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. చికిత్స కోసం వచ్చే రోగులకు ఇంటి నుంచి ఆస్పత్రికి, చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. 146 కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా పాతవాటిలో ఎన్ని ‘మహాప్రస్థానం’ సేవలకు పనికొస్తాయో చూడాలన్నారు. వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. -
ఐటీ కేంద్రంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో విశాఖ ఐటీ డెస్టినీగా అవతరించనుందని, మరిన్ని టెక్ కంపెనీలు ఏర్పాటయ్యేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో ఇప్పటికే ఐటీ పార్కులు ఏర్పాటు కాగా భోగాపురంలో త్వరలోనే కొత్త ఐటీ పార్క్ రానుందని వివరించారు. కరోనా తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనుసరించగా రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ అనే నూతన విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. గురువారం విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం, పల్సస్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ – 2023ని ప్రారంభించిన అనంతరం మంత్రి విడదల రజిని, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధునిక ఆవిష్కరణలతో పాటు ఐటీ, ఫార్మా, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులకు సంబంధించి ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. జీ–20 దేశాలతో పాటు వివిధ దేశాలకు చెందిన 300 కంపెనీలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ), నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఆర్డీసీ) మధ్య సైన్స్, టెక్నాలజీపై ఎంవోయూ కుదిరింది. సదస్సులో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బ్రిటిష్ హై కమిషన్ ఇన్ ఇండియా ప్రగ్యా చతుర్వేది, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏడీసీ అభిజిత్ ఘోష్, ఎన్ఆర్డీసీ సీఎండీ కమడోర్ అమిత్ రస్తోగి, జీ 20 నేషనల్ కోఆర్డినేటర్ డా.నవ సుబ్రహ్మణ్యన్‌తో పాటు సియోల్, టోక్యో, రోమ్, పారిస్, న్యూయార్క్, మెల్బోర్న్, బీజింగ్, లండన్ తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచం చూపు.. విశాఖ వైపు భవిష్యత్తు టెక్నాలజీని రూపొందించేందుకు గ్లోబల్ టెక్ సమ్మిట్ గేట్ వే లాంటిది. ప్రపంచం చూపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్ర భాగాన ఉన్న విశాఖ వైపే ఉంది. డిజిటల్ భారత్ లక్ష్యమైన సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతతో నడిచే కొత్త భారత్‌ను సృష్టించాలి. డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం వంటివి అమలు చేసే దిశగా వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్లోబల్ టెక్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. – గేదెల శ్రీనుబాబు, పల్సస్ గ్రూప్ సీఈవో డిజిటల్ హెల్త్‌లో రికార్డు డిజిటల్ హెల్త్‌కేర్‌లో విప్లవాత్మక మార్పులకు ఆంధ్రప్రదేశ్ నాంది పలికింది. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం రోజూ 66 వేల మందికి టెలి కన్సల్టెన్సీ సేవలందిస్తున్నాం. రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆసుపత్రులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. డిజిటల్ హెల్త్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందచేస్తున్నారు. – విడదల రజిని, వైద్యారోగ్య శాఖ మంత్రి జనం మెచ్చిన గిరిజన ఉత్పత్తులు టెక్నాలజీ ద్వారా అటవీ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెరుగుతుంది. గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ప్రవేశపెట్టిన ఈ కామర్స్, ఈ ప్రొక్యూర్మెంట్ విధానం ఇందుకు నిదర్శనం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ, తేనె, పసుపు, చింతపండు వంటి ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల ద్వారా ప్రపంచానికి చేరువయ్యాయి. తద్వారా గిరిజనులకు ఆర్థిక పరిపుష్టి కల్పించినట్లైంది. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి -
ఔషధ నియంత్రణ కార్యాలయాలు ప్రారంభం
గుంటూరు (మెడికల్): ఇప్పటివరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖకు సొంత భవనాలు సమకూరాయి. గుంటూరులో రూ.1.30 కోట్లతో నిర్మించిన ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ ఉపసంచాలకుల కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నిర్మించిన 12 ఔషధ నియంత్రణ కార్యాలయాలను అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖకు రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి 27 నూతన భవనాలు నిర్మిస్తున్నామని, తొలివిడతగా రూ.6.50 కోట్లతో నిర్మాణం పూర్తయిన 12 భవనాలను ప్రారంభించామని తెలిపారు. నకిలీ మందులు, కాలం చెల్లిన మందులు మార్కెట్లో లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, జెడ్పీ చైర్మన్ కత్తెర హెని క్రిస్టినా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ ఎస్.రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి. లక్ష్మణ్ పాల్గొన్నారు. -
వైద్య పథకాల అమలుపై కేంద్ర బృందం సంతృప్తి
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో కేంద్ర వైద్యబృందం ఆదివారం పర్యటించింది. ఐదు రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆస్పత్రులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఈ బృందంలోని సభ్యులు సందర్శించనున్నారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆరోగ్యశ్రీ అమలు, రోగులకు కల్పించిన సౌకర్యాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన నిధులతో అమలు చేస్తున్న పథకాలు రోగులకు ఎలా అందుతున్నాయనేది తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఇందిరాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్ కేంద్ర వైద్యబృందానికి ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరించారు. అంతకుముందు మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేంద్ర బృందానికి డీఎంహెచ్‌వో డాక్టర్ గీతాబాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ బృందంలో డాక్టర్ త్రిపాఠి షిండే, డాక్టర్ ఆసీమా భట్నాగర్, డాక్టర్ రష్మీ వాద్వా, డాక్టర్ అనికేట్ చౌదరి, శ్రీ శుభోధ్ జైస్వాల్, ప్రీతీ ఉపాధ్యాయ, అభిషేక్ దదిచ్ ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి డాక్టర్ దేవి, డాక్టర్ శిరీష, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
అతి త్వరలో గడపగడపకు వైద్యం.. అందరూ సిద్ధంగా ఉండాలి
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో అతి త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్యవిధానాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న పథకాలు, అందిస్తున్న సేవలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తొలిసారిగా మంగళవారం గుంటూరులో ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం అమల్లోకి వచ్చాక ప్రభుత్వమే ఇంటింటికి వైద్యసేవలు అందిస్తుందన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం కొత్తగా 176 మంది మెడికల్ ఆఫీసర్లను, 1,681 మంది మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమిస్తామని తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో 65 రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేలా ప్రత్యేక యాప్‌లు కూడా అన్ని స్థాయిల సిబ్బందికి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంఎంయూ వాహనాలను 45 రోజుల్లో సిద్ధం చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ రూపు మార్చిన సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పరిధిని మరింతగా పెంచారన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని తమ ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారికి ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్యవిధానం ద్వారా అదనంగా వైద్యసేవలు అందుతాయన్నారు. వైద్యులు, ఏఎన్ఎంలు వారి ఇళ్లకు సేవలందిస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా పొందిన వైద్యంపై రోగులు సంతృప్తి చెందకపోతే వారితో మాట్లాడిన వీడియోలను ఏఎన్ఎంలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని, తద్వారా ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకునే వీలుంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మాతా శిశు మరణాలు దాదాపు సున్నాకు తగ్గాయన్నారు. పీహెచ్‌సీల్లో నెలకు కనీసం పది డెలివరీలు అయినా చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, ఎల్.శివశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్.హెచ్.ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఆరోగ్యానికి భరోసా ‘కార్డు’
2023 జూలై 1.. సుబ్బారావుకు జ్వరమొచ్చింది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌కు వెళ్లి హెల్త్ కార్డు ఇచ్చాడు. అందులో ఉన్న నంబరును హెల్త్ ప్రొవైడర్ కంప్యూటర్లో ఎంటర్ చేశాడు. ‘ప్రతి ఏటా ఇదే సీజన్లో మీకు జ్వరం వస్తోంది. మీకు కొన్ని మందులు బాగా పనిచేస్తున్నాయి. యాంటీబయాటిక్స్ మీ ఒంటికి పడటంలేదు. అందువల్ల ఇతర మందులు వాడాలి. మీ వయసు పెరుగుతున్నందున ఆహారంలో మార్పులు చేసుకోవాలి’ అంటూ హెల్త్ ప్రొవైడర్ చెబుతున్న వివరాలతో సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలన్నీ కొత్తగా వచ్చిన ఈయనకు ఎలా తెలిశాయబ్బా అనుకుని అదేమాట అడిగేశాడు. మీ హెల్త్ అకౌంటులో మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. మీరు గతంలో ఏ జబ్బులకు గురయ్యారు, వాటికి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? మీకు ఏ మందులు బాగా పనిచేస్తాయి? ఇలాంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేయటం వల్ల సకాలంలో సరైన చికిత్స చేసేందుకు వీలవుతోంది అని ఆయన వివరించాడు. – సాక్షి ప్రతినిధి, అమరావతి ఆరోగ్య రంగంలో వినూత్న పథకాలతో దూసుకుపోతున్న మన రాష్ట్రం డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్ళి నిర్దిష్ట ఫార్మాట్లో వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఈ నమోదు ప్రక్రియ 66.8 శాతం పూర్తయింది. హెల్త్ మిషన్‌కు ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేయడంలోనూ ఏపీ ముందంజలో ఉంది. రాష్ట్రం నుంచి 69,683 హెల్త్ రికార్డులను డిజిటల్ హెల్త్ అకౌంట్స్‌తో అనుసంధానం చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మిషన్ ద్వారా ప్రోగ్రామ్ మేనేజర్లు, నియంత్రణాధికారులు, అసొసియేషన్లు, ఎన్జీవోలు, వైద్యులు, మందుల, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు, ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, థెరపీ సెంటర్లు, హాస్పిటల్స్, క్లినిక్స్.. అన్నింటినీ అనుసంధానం చేయటం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించటం ముఖ్య ఉద్దేశం. డిజిటల్ హెల్త్ కార్డు ఆధార్ కార్డులానే ప్రతి ఒక్కరికీ 14 అంకెలతో ఉన్న డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఇది రెఫరల్ సిస్టంలో బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు పీహెచ్సీలో ఒక డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు టెస్టులు చేసి కొన్ని లక్షణాలు కనుక్కుంటారు. దీన్ని సాధారణంగా ప్రిస్క్రిప్షన్‌లో రాస్తారు. అదే హెల్త్ అకౌంటు ఉంటే.. అందులో వివరాలన్నీ పొందుపరుస్తారు. మరో డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు రక్త పరీక్షలు, స్కానింగ్, ఇతరత్రా పరీక్షలు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. రోగి ఐడీ నంబర్ కంప్యూటర్లో నమోదు చేయగానే వివరాలన్నీ వస్తాయి. టెలి–కన్సల్టేషన్ ద్వారా ఆరోగ్య సేవలను పొందేందుకు సైతం ఇది అనుకూలం. ఇతర వైద్య నిపుణుల సలహా సంప్రదింపులకు, బీమా క్లియరెన్సు, క్లెయిముల పరిష్కారం, అత్యవసర సమయాల్లో పేషెంటును ఆధునిక వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు తక్షణమే తరలించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఆరోగ్య డేటా, ల్యాబ్ రిపోర్టులు, చికిత్స వివరాలు, అందించిన ఆరోగ్య సదుపాయాలు, డిశ్చార్జి సమ్మరీలను అకౌంటులో ఎప్పటికప్పుడు జత చేస్తుంటారు. రోగి తన ఆరోగ్య సమాచారం రహస్యంగా ఉంచాలని భావిస్తే.. అకౌంటును బ్లాక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు మళ్లీ ఓపెన్ చేసుకోవచ్చు. ఆస్పత్రుల అనుసంధానమూ ముఖ్యమే ప్రజలందరికీ హెల్త్ ఐడీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను, అక్కడ పనిచేసే డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులను కూడా డిజిటల్ మిషన్ పరిధిలోకి తేవాలి. ప్రతి డాక్టరుకూ ప్రత్యేక లాగిన్ ఐడీ ఉంటుంది. ఆ ఐడీ ద్వారా పేషెంట్ ఐడీని కంప్యూటర్లో నమోదు చేస్తే అతని ఆరోగ్య వివరాలు వస్తాయి. మన రాష్ట్రంలో 13,346 ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు డిజిటల్ హెల్త్ మిషన్‌లో చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్ తర్వాత మన రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఆసుపత్రులు ఈ పథకంతో అనుసంధానమైనట్లు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిస్థాయిలో దీని పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడికి వెళ్లినా రోగికి అత్యంత మెరుగైన, కచ్చితమైన వైద్యం సత్వరమే అందుతుంది. మన ఆరోగ్య విధానం ఇలా.. మన రాష్ట్రంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్.. అంటే ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రాథమిక వైద్యం లభిస్తుంది. అక్కడి నుంచి పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కు రెఫర్ చేస్తారు. పీహెచ్సీ నుంచి సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం)కు, అక్కడి నుంచి ఏరియా ఆస్పత్రికి, జిల్లా ఆస్పత్రికి.. చివరగా బోధనాసుపత్రికి రెఫరల్ సిస్టం పనిచేస్తుంది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లో మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్, పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, సీహెచ్‌సీలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా బృందం, ఏరియా ఆస్పత్రిలో వీటికి అదనంగా ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ వంటివి, జిల్లా ఆస్పత్రిలో సుమారు 16 రకాల స్పెషాలిటీ డాక్టర్లు, బోధనాసుపత్రిలో 32 విభాగాల స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో దాదాపు 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ డేటాలో మనమే నం.1 ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించటం, వాటిని డిజిటలైజ్ చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉంది. ఇదంతా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతోనే సాధ్యమైంది. ప్రజల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటం వల్ల వారికి వైద్యం అందించే విషయంలో ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే మన ముఖ్యమంత్రి గ్రామగ్రామానికి హెల్త్ క్లినిక్‌లు తీసుకొచ్చారు. కొత్తగా పీహెచ్‌సీలు, యూపీహెచ్సీలూ నిర్మిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే వైద్యానికి సంబంధించిన అన్ని దశలనూ పటిష్టపరుస్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ హెల్త్ ఐడీలు, రికార్డులు భద్రపరిచేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ద్వారానూ క్షేత్రస్థాయిలో అందరి హెల్త్ డేటా సేకరిస్తున్నారు. మనకు సరిపడా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఉన్నారు. వీరందరి సహకారంతో మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయగలుగుతున్నాం. ఈ విభాగంలో మనమే ముందున్నామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభినందనలు తెలిపింది. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఈ విషయంలో మన ప్రభుత్వానికి అవార్డులు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్స్ టైమ్స్ ప్రకటించిన అవార్డు కూడా ఇలాంటిదే. – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
జంట జబ్బులతో జర భద్రం!
సాక్షి, అమరావతి : ఉరుకులు పరుగుల జీవితం.. నిరంతరం పనిఒత్తిడి.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. వెరసి రాష్ట్రంలో చాలామందిని 30 ఏళ్లకే ‘రక్తపోటు, మధుమేహం’ పలకరిస్తున్నాయి. గతంలో పట్టణాలు, నగర వాసుల్లోని 45 నుంచి 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా ఈ జంట జబ్బుల సమస్య కనిపించేది. ప్రస్తుతం పల్లె, పట్టణం, నగరం అనే తేడాలేకుండా యుక్తవయస్సుల వారూ వీటి బారినపడుతున్నారు. కోనసీమలో అధికం.. ప్రజల్లోని జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారికి స్వస్థత కల్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీ–సీడీ సర్వే చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడుకోట్ల మందికి పైగా ప్రజలను వైద్య సిబ్బంది స్క్రీనింగ్ చేశారు. వీరిలో 1.87 కోట్ల మంది 30 ఏళ్ల వయస్సు పైబడిన వారిగా ఉన్నారు. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు, 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఇక అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 6,82,189 మందిలో 30 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్ చేయగా అత్యధికంగా 38.02 శాతం మందిలో రక్తపోటు, 35.54 శాతం మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఎన్సీడీ క్లినిక్‌ల నిర్వహణ జీవనశైలి జబ్బుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎన్సీడీ క్లినిక్‌లు నిర్వహిస్తోంది. 17 జిల్లా, 51 ఏరియా ఆస్పత్రులు, 177 సీహెచ్‌సీల్లో ఈ ఎన్సీడీ క్లినిక్‌లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయిల్లోను వీటిని నిర్వహిస్తున్నారు. కారణాలివే.. ► ఊబకాయం ► ధూమపానం, మద్యపానం ► తీవ్రఒత్తిడికి లోనవడం ► శారీరక శ్రమ లేకపోవడం ► అతిగా జంక్‌ఫుడ్ తినడం రక్తపోటు లక్షణాలివే.. తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం, కంటి చూపులో మార్పులు, మూర్ఛరావడం జరుగుతుంది. ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా కూడా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి ► మధుమేహం, రక్తపోటు బాధితులు సక్రమంగా మందులు వేసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రోజు అరగంట పాటు నడక ఉత్తమం. ► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్‌ను తినకుండా ఉండటం మంచిది. ► పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిని కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ► ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ► గర్భిణులు మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మ«ధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. -
రూ.16 వేల కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి
తిరుపతి (తుడా): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.16 వేల కోట్లు కేటాయించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ శిరీషతో కలిసి ఆమె తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవల గురించి వార్డుల్లో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, వారి సహాయకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ఆగస్టు 1 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులను చేర్చేలా సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. మొత్తం 3 వేల వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానున్నాయన్నారు. ఆస్పత్రులలో పనిచేసే పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఏజెన్సీలపై విచారణ చేయాలని డీఎంఈని ఆదేశించారు. తీరు మారకుంటే సరెండర్ చేస్తాం రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి పనితీరుపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మంత్రి రజని స్పందిస్తూ.. సక్రమంగా విధులు నిర్వహించలేనప్పుడు తప్పుకోవచ్చుగా అంటూ సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. ‘మీ నిర్లక్ష్యం లేకుంటే ఇంత మంది ఎందుకు ఫిర్యాదు చేస్తారు.. ఇకనైనా తీరు మారకుంటే హెడ్ ఆఫీస్‌కు సరెండర్ చేస్తాం’ అని హెచ్చరించారు. మంత్రి వెంట డీఎంఈ ఎం.రాఘవేంద్రరావు, డీఎంహెచ్ఓ శ్రీహరి, ఈఈ ధనంజయరెడ్డి, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్, మెటర్నిటీ సూపరింటెండెంట్ లక్ష్మీప్రసన్న, సీఎస్ఆర్ఎంఓ ఈబీ దేవి, పార్థసారథి ఉన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో షిఫ్టుల వారీగా బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును షిఫ్టుల వారీగా వేయాలని వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ఆస్పత్రులూ, సంస్థల బాధ్యులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కొద్ది నెలలుగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే 24/7 పనిచేసే ఆస్పత్రుల్లో ఉద్యోగుల హాజరు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటిలో ఆస్పత్రులు, ఇతర సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు 3 షిఫ్ట్‌ల ప్రకారం సవరించి, డ్యూటీ రోస్టర్‌ను సంబంధిత హెల్త్ కేర్ ఫెసిలిటీ హెడ్ సిద్ధం చేయాలని సూచించారు. అలర్ట్ మెకానిజం కూడా అభివృద్ధి చేసి సంబంధిత ఉద్యోగులకు ఆబ్సెంట్ మెసేజ్‌లను ఎప్పటికప్పుడు ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపనున్నారు. వచ్చే ఆగస్టు నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు జమ చేయాలని ఆదేశాలిచ్చారు. -
ఆన్లైన్లో వైద్య సిబ్బంది వేతనాలు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌తోపాటు డైట్, పారిశుద్ధ్య, ఇతర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సుల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు మాన్యువల్ బిల్లుల విధా నంద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో కొంత ఆలస్యమవుతోంది. బిల్లులను స్క్రూటినీ చేయడం, ఉన్నతాధికారులకు పంపడం, ప్రభుత్వం ఆమోదం తీసుకోవడం లాంటి పద్ధతుల వల్ల జాప్యం జరుగు తున్నట్లు గుర్తించారు. దీన్ని నివారించేందుకు ఆన్లైన్ విధానంలో చెల్లింపులు చేయాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిష నర్ శ్వేత మహంతి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సంబంధిత అధికారులతో గురువారం బీఆర్కే భవన్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది, హౌస్ సర్జ న్లు, జూనియర్, సీనియర్ రెసిడెంట్ల వేత నాల చెల్లింపులో ఆలస్యం జరగ కూడదని ఆదేశించారు. వైద్యులకు సెల్యూట్.. ఈ భూమిపై ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడగలిగే శక్తి వైద్యులకు మాత్రమే ఉందని, అందుకే వాళ్లు మనకు కనిపించే దేవుళ్లు అని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్యసిబ్బంది చూపిన తెగువను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు. దీనికి ‘థ్యాంక్యూ డాక్టర్’అని చెబితే సరిపోదని, వారి త్యాగాలను గౌరవించాలని సూచించారు. -
ఐదు కొత్త వైద్య కళాశాలలకు 3,530 పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో 3,530 పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఒక్కో వైద్య కళాశాలకు 706 పోస్టులు చొప్పున 3,530 పోస్టులు కొత్తగా సృష్టించడానికి ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ఏకంగా 16 కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.7850 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం(2023–24) నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం లలో నూతన వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం వైద్య కళాశాలలో 222, అనుబంధంగా ఉండే బోధనాస్పత్రిలో 484 చొప్పున పోస్టులను ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తోంది. ప్రతి మెడికల్ కళాశాల, బోధానాస్పత్రిలో ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ పోస్టులతో పాటు, 11 ప్రొఫెస్, 25 అసోసియేట్, 42 అసిస్టెంట్ ప్రొఫెసర్, 58 సీనియర్ రెసిడెంట్, 18 హెడ్‌నర్సు, 200 స్టాఫ్ నర్స్, ఇతర పారామెడికల్, నాన్‌మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఉన్నాయి. ఐదు వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా అక్కడి జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా వైద్య శాఖ అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఆస్పత్రిలో ఒక లక్ష చ.అ ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) నిర్మాణానికి ప్రభుత్వం రూ.146 కోట్లు ఖర్చు చేస్తోంది. అదే విధంగా ఒక్కో ఆస్పత్రిలో రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఖర్చు చేసి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇప్పటికే 40వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. ఇదే క్రమంలో ఐదు కొత్త వైద్యశాలల కోసం మరో 3530 పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించడం గమనార్హం. -
YSR Aarogyasri: ఆరోగ్యమస్తు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంలో భాగంగా పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అక్రమాలు, పొరపాట్లకు ఏమాత్రం తావుండరాదని స్పష్టం చేశారు. జూలై 26 లోగా వైద్య ఆరోగ్యశాఖలో నియామకాల ప్రక్రియను ముగించాలని నిర్దేశించారు. రిటైర్మెంట్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఇకపై వెంటనే భర్తీ చేయాలన్నారు. సంస్కరణల ఫలితాలు సజావుగా అందాలంటే తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించడం తప్పనిసరన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు కార్యక్రమాల పురోగతి, ఆరోగ్యశ్రీ అమలు తదితరాలపై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మొదటి రెఫరల్ పాయింట్‌గా విలేజ్ క్లినిక్ ఆరోగ్యశ్రీ ద్వారా సులభంగా చికిత్స పొందేలా రెఫరల్ విధానాన్ని బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మొదటి రెఫరల్ పాయింట్‌గా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియచేసేలా విలేజ్ క్లినిక్‌లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందే వైద్య సేవలు, ఏ జబ్బుకు ఏ ఆస్పత్రికి రెఫర్ చేయాలి? ఎలా రెఫర్ చేయాలి? తదితర వివరాలతో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ), ఏఎన్ఎంలకు బుక్లెట్లు అందజేయాలన్నారు. రోగి సంతకంతో కన్సెంట్, కన్ఫర్మేషన్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగేలా సీఎం జగన్ పలు సూచనలు చేశారు. చికిత్స అనంతరం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేప్పుడు సంబంధిత రోగికి ఆరోగ్యశ్రీ ద్వారా ఏ జబ్బుకు చికిత్స అందించాం? చికిత్సకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? తదితర వివరాలను తెలియచేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు డబ్బులేమైనా డిమాండ్ చేశారా? వైద్య సేవలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ఆరా తీసి సేవల పట్ల రోగి సంతృప్తిగా ఉన్నాడో లేదో తెలుసుకోవాలన్నారు. ఈ మేరకు డిశ్చార్జి సమయంలో రోగి సంతకంతో సమ్మతి(కన్సెంట్), నిర్ధారణ (కన్ఫర్మేషన్) పత్రం తీసుకోవాలన్నారు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆస్పత్రులు వాటిని అప్లోడ్ చేయాలన్నారు. వర్చువల్ ఖాతా ద్వారా చెల్లింపు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా ఆస్పత్రికి వెళ్లకుండా రోగి పేరిట వర్చువల్ ఖాతాను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. రోగి సమ్మతి తీసుకుని ఈ ఖాతాకు తొలుత నేరుగా డబ్బులు జమ చేయాలన్నారు. అనంతరం ఆస్పత్రికి డబ్బులు బదిలీ చేయాలని నిర్దేశించారు. లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక వర్చువల్ అకౌంట్ ఉపయోగపడుతుందన్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాలో డబ్బులు నేరుగా రోగి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో జమ చేస్తున్న పద్ధతినే కొనసాగించాలన్నారు. పథకం కింద సేవలు అందించడానికి ఆస్పత్రుల యాజమాన్యాలు అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఫిర్యాదులుంటే ఏ నెంబరుకు ఫోన్ చేయాలన్న విషయం ప్రతి రోగికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా లేఖలు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన లబ్ధిదారులకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా లేఖలు పంపాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ లేఖను వలంటీర్, ఏఎన్ఎంలు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేసి ఆరోగ్యంపై ఆరా తీయాలని సూచించారు. లేఖలో పథకం ద్వారా లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించిన సాయాన్ని తెలియజేయాలన్నారు. చురుగ్గా ఆరోగ్యమిత్రలు ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్యమిత్రలు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. రోగి ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి డిశ్చార్జి అయ్యేవరకూ అండగా, తోడుగా నిలవాలన్నారు. ప్రస్తుతం 2,446 చికిత్సలను పథకం కింద ఉచితంగా చేస్తున్నామన్నారు. అవసరమైన మేరకు చికిత్సా విధానాల సంఖ్యను పెంచాలన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలన్నారు. సేవలు ఉచితంగా అందాలి.. 108, 104, వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రజలకు ఉచితంగా అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీటిద్వారా సేవలు అందించడానికి ఎక్కడా లంచాలు వసూలు చేసే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లను వాహనాలపై ప్రదర్శించాలన్నారు. ఎక్కడా కొరత ఉండకూడదు 2019 నుంచి వైద్య శాఖలో 40,188 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 1,132 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటులో భాగంగా 176 కొత్త పీహెచ్‌సీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటిల్లో పని చేయడానికి 2,072 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అవసరం కాగా భవన నిర్మాణాలు పూర్తి కాగానే భర్తీ చేపడతామన్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడా మానవ వనరుల కొరత ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అవసరం అయితే పదవీ విరమణ పొందిన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై పరిశీలన చేయాలని ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఎం.టి.కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: కొత్తగా 496 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 496 మందికి కోవిడ్ నిర్ధారణయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,98,621 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 7,90,897 మంది కోలుకోగా మరో 3,613 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో 4,111 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 28,808 నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 342 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
AP: నియంత్రణలోనే కరోనా.. పొరుగుతో పోలిస్తే తక్కువే
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడం వైరస్ నాలుగో దశ వ్యాప్తికి సూచికనే ప్రచారం జరుగుతున్నా రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహిస్తూ కట్టడి చర్యలు సమర్థంగా అమలు చేస్తున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో క్రమంగా కేసులు పెరుగుతునప్పటికీ రాష్ట్రంలో ఆందోళనకర స్థాయిలో పరిస్థితులు లేవంటున్నారు. చదవండి: దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే! ఈ నెల నాలుగో తేదీ నుంచి 10వతేదీ మధ్య దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 15,928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 13,771, కర్ణాటకలో 2,831, తమిళనాడులో 1,157, తెలంగాణలో 785 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో 128 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఇక గత మూడు రోజుల్లో వరుసగా 23, 18, 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పెద్దగా లేనప్పటికీ ముందస్తు అప్రమత్తత చర్యలను వైద్య శాఖ కొనసాగిస్తోంది. కొనసాగుతున్న 46వ విడత ఫీవర్ సర్వే ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహిస్తూ కరోనా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేస్తోంది. సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య సేవలందిస్తున్నారు. తద్వారా వైరస్ బాధితులను ముందే గుర్తించి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 46వ విడత ఫీవర్ సర్వేలో 1.63 కోట్ల ఇళ్లను సిబ్బంది సందర్శిస్తున్నారు. 80.97 శాతం మందికి ప్రికాషన్ డోసు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గత జనవరిలో ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీ చేపట్టారు. వీరిలో ప్రికాషన్ డోసుకు 49,72,320 మంది అర్హులు కాగా ఇప్పటికే 40,26,135 మందికి టీకాలిచ్చారు. ప్రికాషన్ డోసు తీసుకున్న వారిలో హెల్త్‌కేర్ వర్కర్లు 4,34,710 మంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 9,96,999 మంది, వృద్ధులు 25,94,426 మంది ఉన్నారు. 99.65 శాతం టీనేజర్లకు డబుల్ డోస్ రాష్ట్రంలో 15 నుంచి 17 ఏళ్ల వయసున్న టీనేజర్లలో 99.65 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం 24.41 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా అంతకు మించి 25,33,439 మందికి తొలి డోసు పంపిణీ చేసి జాతీయ స్థాయిలోనే ఏపీ రికార్డు సృష్టించింది. తొలి డోసు తీసుకున్న వారిలో 25,24,553 (99.65 శాతం) మందికి రెండో డోసు టీకా కూడా పూర్తయింది. 12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లల్లో 97.78 శాతం మందికి రెండు డోసుల టీకాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఈ వయసు పిల్లలు 14.90 లక్షల మంది ఉండగా ఇప్పటికే వంద శాతం తొలి డోసు పంపిణీ పూర్తయింది. అనంతపురం, నెల్లూరు జిల్లాలు రెండు డోసుల టీకాను వంద శాతం పంపిణీ చేసి తొలి స్థానంలో ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తక్కువగానే ఉంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు కొనసాగిస్తున్నాం. టీకా పంపిణీ చేపడుతున్నాం. అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తున్నాం. నాలుగో దశ వైరస్ వ్యాప్తి అంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు పాటించాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
వైద్య పోస్టుల భర్తీ మెడికల్ బోర్డుకే!
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య, వైద్య సహాయక పోస్టుల భర్తీ ప్రక్రియనంతా ఒక నియామక సంస్థకే అప్పగించాలంటూ ప్రభుత్వాన్ని కోరాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు సర్కారుకు లేఖ రాయాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని 2,662 ఉద్యోగ ఖాళీల భర్తీకి నియామక ఏజెన్సీగా టీఎస్పీఎస్సీని ఎంపిక చేసిన ప్రభుత్వం... మరో 10,028 పోస్టుల భర్తీ బాధ్యతలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యసేవల నియామకాల బోర్డుకు అప్పగించింది. అయితే రెండు నియామక సంస్థలకు అప్పగించిన ఉద్యోగాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్సు పోస్టులు ఒకే కేడర్‌కు చెందినవిగా ఉన్నాయి. ఈ పోస్టులను రెండు ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తే సమయం వృథా, నిర్వహణ భారం కావడంతోపాటు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ప్రతిపాదనలు పంపండి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన నియామకాలపై వెద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ ఇటీవల సమావేశమైంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, జోన్లు, జిల్లాలవారీగా ఖాళీల ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. -
డెంగీతో ‘జ్వర’భద్రం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ దడ పుట్టిస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగు తున్న సమయంలో చాపకింద నీరులా డెంగీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలైనా ఇంకా వర్షాలు కురవకముందే డెంగీ జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 506 డెంగీ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా వానాకాలం ముగుస్తున్న సమయంలో డెంగీ తీవ్రత కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెంగీ కేసులు నమోదు కావడం, దీనికితోడు చికెన్ గున్యా బాధితులు సైతం క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పక్షం రోజుల్లో మారిన సీను... రాష్ట్రంలో గత రెండు వారాలుగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో డెంగీ ప్రభావం కనిపించనప్పటికీ... ప్రస్తుతం రోజుకు సగటున 10–15 పాజిటివ్ కేసులు నమోద వుతున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 167 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 42, కరీంనగర్ జిల్లాలో 39 కేసులున్నాయి. వరంగల్, సంగా రెడ్డి, రంగారెడ్డి, పెద్దపల్లి, నల్లగొండ, మేడ్చ ల్, మహబుబాబాద్, కొత్తగుడెం, ఖమ్మం, గద్వాల జిల్లాల్లో రెండంకెల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే డెంగీని సమర్థంగా ఎదుర్కోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట దోమకాటే డేంజర్... డెంగీ జ్వరం ఎడిస్ దోమ కాటుతో వస్తుంది. ఎడిస్ దోమ నీరు నిల్వ ఉండే చోట ఉంటుంది. ప్రధానంగా పగటిపూటే కుడుతుంది. ఈ దోమకాటుకు గురైన తర్వాత 103–104 డిగ్రీల మధ్య జ్వరం వస్తుంది. రోగికి జ్వరం తగ్గాక క్రమంగా ప్లేట్లెట్లు తగ్గుతాయి. జ్వరం తగ్గిందని ప్లేట్లెట్ల పరీక్ష చేయిం చుకోకపోతే డెంగీ దొంగదెబ్బ తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ప్లేట్లెట్ల సంఖ్య ఉండాల్సి ఉండగా లక్షన్నరకన్నా దిగు వకు ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుం టుంది. దీన్ని సకాలంలో గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల సమక్షంలో చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలకన్నా పడిపోతుంటే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ లక్షణాలు, చికిత్స ►ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహం, బీపీ తగ్గుదల. ►ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్‌తోపాటు తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ►డెంగీ జ్వరాన్ని గుర్తిస్తే వెంటనేవైద్యుని సలహా తీసుకోవాలి. ►ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే దాన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించాలి. ►జ్వరం తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ►రోగికి ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు మళ్లీ పెరుగుతాయి. -
కొత్తగా 145 కరోనా కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 145 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్ప టివరకు రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,94,329కు చేరిం ది. ఇందులో 7,89,241 మంది కోలుకోగా, 977 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతిచెందారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 15,200 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇందులో 413 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో తాజాగా నమోదైన పా జిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 117 నమోదు కావడం గమనార్హం. -
గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు
చాపాడు: గర్భిణులు క్రమం తప్పకుండా ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగరాజు పీహెచ్సీ సిబ్బందికి సూచించారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యాధికారి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా వైద్య శిబిరం నిర్వహించి గర్భిణులకు అవసరమైన పరీక్షలు చేసి రక్త హీనత నివారణకు తీసుకోవాల్సిన పోషక ఆహారం తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, తల్లీబిడ్డ ఎంసీపీ కార్డులలో వివరాలు నమోదు చేయాలని, వైద్య సిబ్బంది రోజూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. జిల్లా ఎన్సీడీ, ఆర్బీఎస్కే జిల్లా అధికారి వెంకటశివ, జిల్లా పీఎంఎంవీవై జిల్లా కో ఆర్డినేటర్ విజయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు సురక్షితం ఖాజీపేట: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయించుకోవడం సురక్షితమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు అన్నారు. ఖాజీపేట పీహెచ్‌సీని గురువారం ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో జరిగిన కాన్పుల సంఖ్యపై అధికారులతో ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు, ఆరోగ్య విస్తరణ అధికారి రాఘవయ్య పాల్గొన్నారు. -
మళ్లీ కరోనా దడ
సాక్షి, హైదరాబాద్: కరోనా దడ మళ్లీ మొదలైంది. గురువారం ఒక్కరోజే 12,385 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 122 మందికి కరోనా సోకింది. వీరిలో హైదరాబాద్ వారే 94 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.98 శాతానికి చేరుకుంది. క్రియాశీలక కేసులు 811కు చేరుకున్నాయి. కాగా, థర్డ్‌వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వేరియంట్లోని సబ్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూడా కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమైంది. ఏకంగా 2.75 కోట్ల పారాసిటమాల్ మాత్రలను, 17.25 లక్షల ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచింది. అలాగే 1.81 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను, 2.80 కోట్ల లివోసిట్రజిన్ మాత్రలను, 2 కోట్ల డెక్సమెథజోన్ మాత్రలను, 3.14 కోట్ల డాక్సిసైక్లైన్ కేప్సుల్స్ను అందుబాటులో ఉంచినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివా సరావు వెల్లడించారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. అవసరమైన వారికి వెంటనే పరీ క్షలు చేసేందుకు 57.47 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున చర్యలు చేపడుతున్నారు. డెంగీ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. ఏది కరోనా జ్వరమో, ఏది డెంగీ జ్వరమో తెలుసుకునేందుకు టెస్టులను పెంచనున్నారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్... వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా సెకండ్, బూస్టర్ డోస్‌లు వేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయిం చింది. 3.06 కోట్ల మందికి రెండో డోస్ వేయగా, బూస్టర్ డోస్ 8.54 లక్షల మందికే వేశారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్‌లను పెంచాలని నిర్ణయించా రు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వద్ద 32.27 లక్షల కరోనా డోస్లున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడంలేదు. ఇక నుంచి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. కాగా, తప్పనిసరిగా అధికంగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలను గురువారం కోరింది. అంతర్జాతీయ ప్రయాణికుల నిర్దేశిత నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని సూచించింది. అయితే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం విమానాశ్రయంలో ఉన్న రాష్ట్ర వైద్య బృందాన్ని ఇటీవల ఉపసంహరిం చుకోవడం విమర్శలకు తావిస్తోంది. వ్యాధి తీవ్రత తక్కువే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒమిక్రాన్‌కు చెందిన బీఏ.2.12.1, బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్ల ప్రభావం ఎక్కువగా ఉంది. వీటిలో ఒక ప్రత్యేకమైన ఎల్452ఆర్ జన్యుమార్పు వల్ల వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ వ్యాధి తీవ్రత చాలా తక్కువ. వీటితో కేసులు కొంత పెరగవచ్చు కానీ.. ఫోర్త్వేవ్కు ఇవి కారణం కాబోవు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖ నియామకాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయి టేజీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా ఎంపిక ఉంటుందని తెలిపారు. వివిధ విభా గాల్లో 10,028 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వంటి స్పెషలిస్టు వైద్యులు.. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, స్టాఫ్‌నర్సులు, ఎంపీహెచ్ఏ (స్త్రీ)/ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేస్తారు. ►స్పెషలిస్ట్ వైద్యులను పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయాల్లో చదివినవారికి గ్రేడ్లు, మార్కుల మధ్య సమానత్వ సూత్రాన్ని అనుసరిస్తారు. గ్రేడ్ ఏలో 60%, ఆపై మార్కులుంటే ఎక్సలెన్స్.. బీగ్రేడ్‌లో 55%, ఆపై ఉంటే ‘గుడ్’.. 50%, అంతకంటే తక్కువ ఉంటే పాస్ గ్రేడ్‌గా నిర్ధారిస్తారు. ►సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంఓ ఎస్ తదితర పోస్టులకు ఎంబీబీఎస్‌లో పొందిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లను నిర్ధారిస్తారు. ఎంబీబీఎస్‌లో అన్ని సంవత్సరాల్లో పొందిన మొత్తం మార్కులను కలిపి 80%కి మార్చుతారు. ►విదేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినవారికి సంబంధించి.. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ)లో పొందిన మార్కుల ఆధారంగా 80వరకు పాయింట్లను నిర్ధారిస్తారు. ►స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలకు రాతపరీక్షలో పొందిన మార్కులకు 80 పాయింట్లు ఇస్తారు. ►అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ట్యూటర్లు, జీడీఎంఓఎస్, ఆయుష్ వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ (స్త్రీ), ల్యాబ్–టెక్నీషియన్ గ్రేడ్– ఐఐ, ఫార్మసిస్ట్ గ్రేడ్– ఐఐ, రేడియోగ్రాఫర్, పారామెడికల్ ఆప్తాల్మి క్ ఆఫీసర్, ఫిజియో థెరపిస్ట్ పోస్టులన్నింటిలో.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అభ్యర్థులకు 20 పాయింట్ల వరకు వెయిటేజీ ఇస్తారు. ►అభ్యర్థులు వారు దరఖాస్తు చేస్తున్న నిర్దిష్ట కేటగిరీలో అన్ని పోస్టులకు ప్రాధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ధ్రువీకరణ తీసుకుని.. వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అనుభవమున్న అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అధికారులు ఈ దరఖాస్తులను 15 రోజుల్లోగా ఆమోదించి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి లేదా తిరస్కరించాలి. అభ్యర్థులు ఈ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆరునెలల అనుభవానికి.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు అభ్యర్థులకు వారు సేవలు అందించిన ప్రతి ఆరునెలల అనుభవానికి వెయిటేజీ పాయింట్లను కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. వారు కనీసం 6 నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటేనే వెయిటేజీ వర్తిస్తుంది. ఏ సేవ అందిస్తే.. అదే కేటగిరీ ఉద్యోగానికి మాత్రమే వెయి టేజీ పాయింట్లు వర్తిస్తాయి. ►కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు ఈఎస్ఐ, ఈపీఎఫ్, హాజరు రిజిస్టర్లు వంటి రికార్డులను సూచించవచ్చు. వాటి కాపీలను జత చేయవచ్చు. ►సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేసే వారికి అనుభవ ధ్రువీకరణను జిల్లా వైద్యాధికారులు ఇవ్వొచ్చు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసేవారికి జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ధ్రువీకరణ ఇవ్వాలి. -
టీవీవీపీ సర్వీస్ రూల్స్‌లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో త్వరలో నియామకాలు చేపడుతున్న తరుణంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు సవరణ ఉత్తర్వులతో నోటిఫికేషన్ జారీచేసింది. ఈ విభాగం పరిధిలో నియమించనున్న వైద్యులను సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా విభజించారు. వీరిని ఎంబీబీఎస్ అర్హతతో నియమిస్తారు. ►గతంలో సైకియాట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాలను నియమించలేదు. ఇప్పుడు వీటిని కొత్తగా నియామకాల్లో చేర్చారు. ►పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్బీ అర్హతలను స్పెషాలిటీ పోస్టులకు అర్హతగా పరిగణిస్తారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా రాష్ట్ర వైద్య మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి. ►టీవీవీపీలో కొత్తగా నియమితులయ్యే వైద్యులకు కూడా ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం వర్తిస్తుంది. ►బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసిన అర్హులైన నర్సులను నేరుగా నియమిస్తారు. దరఖాస్తు చేసుకునే నర్సులందరూ రాష్ట్ర నర్సింగ్ మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. ►క్లాస్ ఏ పారామెడికల్ పోస్టులకు.. సర్టిఫికెట్ ఆఫ్ రేడియాలజీ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇమేజియాలజీ, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. వీరందరూ రాష్ట్ర పారామెడికల్ బోర్డులో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. ►క్లాస్ బి పారామెడికల్ పోస్టులకు.. ఏడాది అనుభవంతో ఎంఎల్డీ ఒకేషనల్/ఇంటర్మీడియేట్ (ఎంఎలీ ఒకేషనల్), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు, బీఎస్సీ ఎంఎలీ/ఎంఎస్సీ ఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్(క్లినికల్ పాథాలజీ) టెక్నీషియన్, బ్యాచ్‌లర్ ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ, బీఎస్సీ(మైక్రోబయాలజీ)/ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రో బయాలజీ ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ.. పూర్తి చేసిన వారు అర్హులు. ►క్లాస్ సి పారామెడికల్ పోస్టులకు.. డి ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మా డి అభ్యర్థులు అర్హులు -
10,028 పోస్టులకు నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 12,755 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే 10,028 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. వారం వారం విడతల వారీగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా ఒకట్రెండు రోజుల్లో ఎంబీబీఎస్ అర్హతతో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లో 1,326 పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని హరీశ్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, రెండుమూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేత మహంతి, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రెటరీ గోపీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. నర్సులకు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో పరీక్ష.. ‘ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20% వెయిటేజి మార్కులు ఇవ్వాలి. ఆయుష్ విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు.. టెక్నికల్ పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను టీఎస్ పీఎస్సీ.. నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్ బోర్డు.. మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి. స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి.. మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు కోవిడ్ కాలంలో పని చేసిన వారికి వెయిటేజి ఇవ్వాలి. ఆయుష్ డాక్టర్లను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఆ ఖాళీలను భర్తీ చేయాలి. ఆయుష్ సర్వీసు రూల్స్‌లో సవరణలు చేయాలి’అని సూచించారు. వారిపై నివేదిక రూపొందించండి... ‘ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ సవరణలు చేయాలి. జాతీయ ఆరోగ్య మిషన్‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు.. ఏ పని చేస్తున్నారన్న అంశాలపై పూర్తి నివేదిక రూపొందించాలి. సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు రూ.330 కోట్లు స్టైపెండ్‌గా ఇస్తున్నారు. వారి సేవలు వినియోగించుకునేలా విధివిధానాల రూపకల్పన చేయాలి. తొలి నోటిఫికేషన్లో ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ మార్కులు, మిగతా 80 శాతం మార్కులు ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. తొలి విడత తర్వాత. వెంటనే స్టాఫ్ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి’అని హరీశ్ వివరించారు. జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న కంటి వైద్యులతో ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అవసరమైన వైద్య పరికరాలు వెంటనే సమకూర్చాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులను ఆదేశించారు. తగిన పరికరాలు, సదుపాయాలున్న ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్య పెంచాలన్నారు. దీని కోసం ప్రజాప్రతినిధుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. -
కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజలు కోవిడ్–19 నిబంధనలు తప్పకుండా పాటించాలని, మాస్కు ధరించాలని సూచించారు. శనివారం రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఐడీసీ) కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా రోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో 80 వేలు, జర్మనీలో 50 వేల కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో కూడా పాజిటివిటీ రేటు పెరిగిందని, తెలంగాణలో పెద్దగా ప్రభావం లేనప్పటికీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కోవిడ్ కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స, వ్యాక్సినేషన్ పక్కాగా, ఉచితంగా జరిగేలా వైద్య ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. పీహెచ్సీ నుంచి బోధనాస్పత్రుల వరకు అన్నీ కోవిడ్ చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా టీకాలు ఫస్ట్ డోస్ వంద శాతం, సెకండ్ డోస్ 99 శాతం పూర్తి అయిందని, ఇంకా 33 లక్షల డోసుల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అరవై ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోస్ 16.8 శాతం వేశామని, ఇంకా వేసుకోనివారిని గుర్తించి అందించాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా వ్యాక్సిన్ వేసుకోనివాళ్లను ఆరోగ్య కార్యకర్తలు గుర్తిం చి ఇంటింటికీ వెళ్లి వేయాలని మంత్రి ఆదే శించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కా ర్యదర్శి రిజ్వీ, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్సిజన్ ప్లాంట్లలో సిలిండర్లు నింపుకొనే వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆసుపత్రుల్లోని పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద సిలిండర్లను నింపి ఏరియా, సామాజిక, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయాలని వైద్యవిధాన పరిషత్ నిర్ణయించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద ఆక్సిజన్ భారీగా అందుబాటులో ఉందని, దాన్ని చిన్న ఆసుపత్రులకు సరఫరా చేస్తే రోగులకు ఉపయోగం ఉంటుందని పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. సిలిండర్లను నింపుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రుల సూపరింటెం డెంట్లు, ఫార్మసిస్టులు, ఇతర అధికారులతో డాక్టర్ అజయ్‌కుమార్ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సిజేరియన్లను ప్రోత్సహించవద్దని సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలను విస్త్రృత పరచాలని, అవసరం లేకపోయినా పైస్థాయి ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదని పేర్కొన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, రోగులు బయట కొనుగోలు చేసే పరిస్థితి రావొద్దని, డయాలసిస్ యూనిట్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకొని వైద్య విద్యాసంచాల కుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. -
తెలంగాణలో ‘104’ మొబైల్ వైద్య వాహనాల వేలం
సాక్షి,హైదరాబాద్: ‘104’మొబైల్ వైద్య సేవలకు ఉపయోగిస్తున్న వాహనాలను వేలం వేయాలని సర్కారు నిర్ణయించింది. వాటిని వేలం ద్వారా అమ్మేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వాటికి వేలం వేసేందుకు చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా అదనపు కలెక్టర్, జిల్లా రవాణాధికారి, ఎస్పీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 198 వాహనాలు వేలం వేస్తారు. కాగా, వాటిల్లో అనేక వాహనాలను పాడైపోయాయని చెబుతున్నారు. కండీషన్లో ఉన్న వాటిని ఇతరత్రా వైద్య అవసరాలకు ఉపయోగించుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోగులకు మందుల సరఫరాకు బ్రేక్ గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వారి ఊళ్లలోనే నెలనెలా వైద్య పరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా ఔషధాలను ఒకేసారి ఇచ్చే పథకమే..‘104’వాహన సేవలు. ప్రతి నెలా మొదటి తేదీ నుంచి 20వ తేదీ వరకూ నిర్దేశించిన గ్రామాలకు ఈ వాహనాలు వెళ్లేవి. సంచార వైద్య వాహనంలో ఒక వైద్యుడు, ఏఎన్ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, సహాయకుడు ఉంటారు. ఈ పథకాన్ని నిలిపివేయాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించడంతో ఆయా సేవలకు బ్రేక్ పడిపోనుంది. ఇందులో పనిచేస్తున్న సుమారు 1,250 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖలోనే ఇతర పథకాల పరిధిలో వాడుకోవాలని నిర్ణయించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జీవనశైలి వ్యాధుల నివారణ పథకం అమల్లో ఉండగా... దీని ద్వారా ఇంటింటికి ఔషధాలను సరఫరా చేస్తున్నారు. మరోవైపు త్వరలో పల్లె దవాఖానాలను ప్రారంభించనుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కొత్తగా 43 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 43 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు 7,93,133 మందికి కరోనా వ్యాప్తి చెందగా, వీరిలో 7,88,599 మంది కోలుకున్నారు. మరో 423 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 11,984 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 306 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
సర్కారు ఆస్పత్రుల్లో నిరంతర వైద్యం
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అడ్డన్నదే ఉండదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడంలో వెనకడుగే వేయడంలేదు. ఇందుకు ఉదాహరణే ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్సీ)లు. గ్రామీణ, పేద ప్రజలకు అందుబాటులో ఉండే పీహెచ్‌సీలు నాణ్యమైన సేవలందించడం చరిత్రలో ఇదే తొలిసారి. అదీ ఇరవై నాలుగ్గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి పేదలకు సేవలందిస్తున్నారు. ఇది గతానికి భిన్నం. గతంలో పీహెచ్సీ అంటే గ్రామీణ, పేద ప్రజలకు చేరువలో ఉన్నవైనప్పటికీ, సేవల్లో మాత్రం నాసిరకం. వైద్యులు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండే వారు కాదు. ఆసుపత్రి పరిసరాలు కాసేపు నిలబడటానికి కూడా దుర్లభంగా ఉండే పరిస్థితి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిలో పెద్ద మార్పే తెచ్చింది. మంచి వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఆసుపత్రిలో మంచి వాతావరణం కల్పించింది. ఇరవై నాలుగ్గంటలూ ప్రజలకు వైద్య సేవలందిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలలో మారిన ఈ దృశ్యాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ‘రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్(ఆర్హెచ్ఎస్) 2020–21’ కళ్లకు కట్టింది. మరో రెండు చిన్న రాష్ట్రాలు మినహా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ విధమైన సేవలు అందడంలేదని వెల్లడించింది. ఆ నివేదిక సారాంశమిదీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 1,142 పీహెచ్‌సీలు వంద శాతం 24/7 పని చేస్తున్నాయి. 99.3 శాతం పీహెచ్‌సీల్లో లేబర్ రూమ్ సౌకర్యం ఉంది. 98.9 శాతం పీహెచ్‌సీల్లో ఆపరేషన్ థియేటర్ ఉంది. కనీసం 4 పడకలున్నవి 98.1%. వీటిలో వసతులకూ కొరత లేదు. 2021 మార్చి నాటికి సిక్కిం, అండమాన్ నికోబార్ వంటి చిన్న రాష్ట్రాల్లో మాత్రమే వంద శాతం పీహెచ్‌సీలు 24/7 పనిచేస్తున్నాయి. దక్షిణాదిలోని తెలంగాణలో 49.4%, కర్ణాటకలో 41.1, తమిళనాడులో 92.5%, కేరళలో 81.7% పీహెచ్‌సీలు మాత్రమే 24/7 సేవలు అందిస్తున్నాయి. పీహెచ్‌సీల్లో వంద శాతం కంప్యూటర్ సౌకర్యం కల్పించిన జాబితాలో ఏపీ, గోవా, సిక్కిం, రాజస్తాన్, తెలంగాణ ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలోని 141 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సీహెచ్సీలలో) కనీసం 30 పడకలు, లేబొరేటరీ, వినియోగంలో ఉన్న ఆపరేషన్ థియేటర్లు, లేబర్ రూమ్, న్యూ బార్న్ కేర్ యూనిట్, రెఫరల్ ట్రాన్స్పోర్ట్, సాధారణ అనారోగ్యాలకు అల్లోపతిక్ మందులు ఉన్నాయి. అన్ని సీహెచ్‌సీ, పీహెచ్సీలలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. పెరిగిన వైద్యులు, వైద్య సిబ్బంది 2019–20తో పోలిస్తే పీహెచ్సీలలో వైద్యుల సంఖ్యా పెరిగింది. 1,142 పీహెచ్‌సీల్లో 2019–20లో 1,798 మంది వైద్యులు ఉండగా.. 2020–21లో వైద్యుల సంఖ్య 2,001కి పెరిగింది. అదే విధంగా 141 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 2020లో స్పెషలిస్ట్ వైద్యులు 315 మంది ఉండగా 2021లో 322కు చేరారు. గిరిజన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రాథమిక వైద్య సేవలు నిరంతరం అందుతున్నాయి. రాష్ట్రంలో గిరిజన జనాభా 22.58 లక్షలుగా ఉంది. వీరి కోసం గిరిజన ప్రాంతాల్లో 752 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ అవసరం కాగా 822 ఉన్నాయి. 112 పీహెచ్‌సీలు ఉండాలి. కానీ అంతకంటే ఎక్కువగా 159 ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,593 మంది ఏఎన్ఎంలు, పీహెచ్‌సీల్లో 278 మంది పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. దేశ సగటుకన్నా తక్కువ మాత, శిశు మరణాల కట్టడికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. శిశు మరణాల రేటు (ఐఎంఆర్)లో దేశ సగటుకన్నా రాష్ట్ర సగటు తక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి జననాలకు సగటున 30 శిశు మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 25 మరణాలు ఉంటున్నాయి. జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 34 మరణాలు ఉండగా రాష్ట్రంలో 28గా ఉంది. జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో 20గా ఉండగా రాష్ట్రంలో 19గా ఆ నివేదిక పేర్కొంది. -
వైద్య పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: వైద్య పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపించింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించాలన్న అధికారుల ఆలోచన చర్చనీయాంశమైంది. కౌన్సెలింగ్ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న యంత్రాంగం వైద్యుల అభిప్రా యాలకు ప్రాధాన్యత ఇచ్చి విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. దరఖాస్తు చేసే వైద్యులకు నాలుగైదు ఆప్షన్లు ఇవ్వాలని, వారు కోరుకున్న చోటే పోస్టింగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఒకే ప్రాంతానికి ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే ఇతర అంశాలన్నిటినీ పరిగణన లోకి తీసుకొని పోస్టింగులు ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే భార్యాభర్తలు ఒకేచోట లేదా దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని మార్గదర్శకాల్లో స్పష్టత ఇవ్వ నున్నారు. ఈ విధమైన కౌన్సెలింగ్ వల్ల వైద్యుల సేవలను పూర్తిస్థాయిలో ఉప యోగించుకునేందుకు వీలుంటుందని, వారు రెగ్యులర్‌గా విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుం చెబుతున్నారు. గతానుభవం దృష్ట్యా .. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖలో 12 వేలకు పైగా వైద్య సిబ్బంది భర్తీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందులో డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎం, పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. డాక్టర్ పోస్టుల్లో ప్రధానంగా బోధనాసు పత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఉన్నాయి. పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, దాదాపు 10 వేలకుపైగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్, నర్సులు, ఏఎన్ఎం పోస్టులను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని మెడికల్ బోర్డు భర్తీ చేస్తుంది. అందులో ప్రధానంగా 2,467 కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, పల్మనరీ మెడిసిన్ తదితర స్పెషలిస్ట్ పోస్టులున్నాయి. మరో 1,200 వరకు ఎంబీబీఎస్ అర్హతతో భర్తీ చేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. అయితే స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీ కీలక సమస్యగా మారింది. 2018లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా దరఖాస్తు చేసిన వారికి అధికారులే ఇష్టారాజ్యంగా పోస్టింగులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. పైరవీలు జోరుగా జరిగాయన్న విమర్శలూ వచ్చాయి. భార్యా భర్తలను సుదూర ప్రాంతాలకు పంపారన్న అపవాదు కూడా వచ్చింది. ఫలితంగా 600 మంది వరకు మాత్రమే విధుల్లో చేరారు. మిగిలినవారు ఉద్యోగాలనే వదులుకున్నారు. చేరినవారిలోనూ చాలామంది విధుల్లోకి వెళ్లలేదు. అందులో కొందరికి నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో ఉద్యోగంలోంచి తీసేశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కౌన్సెలింగ్ నిర్వహించాలనే ఆలోచనకు వైద్య ఆరోగ్య శాఖ వచ్చింది. మరోవైపు కొత్త వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎంతమంది ప్రభుత్వ వైద్యులుగా చేరేందుకు ఆసక్తి చూపిస్తారనే సంశయమూ వెంటాడుతోంది. -
స్పెషలిస్టులొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీ ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం 12 వేలకు పైగా వైద్య సిబ్బంది భర్తీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందులో డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎం, పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నాయి. డాక్టర్ పోస్టుల్లో ప్రధానంగా బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీ ఏ మేరకు విజయవంతం అవుతుందన్నది అనుమానంగా మారింది. పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, దాదాపు 10 వేలకుపైగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్, నర్సులు, ఏఎన్ఎం పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. అందులో ప్రధానంగా 2,467 కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, పల్మనరీ మెడిసిన్ తదితర స్పెషలిస్ట్ పోస్టులున్నాయి. అయితే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినా ఏ మేరకు స్పెషలిస్టులు ముందుకు వస్తారన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖలో అనుమానాలున్నాయి. నోటిఫికేషన్ల కంటే ముందు ఇప్పుడు అధికారులను ఇదే వేధిస్తోంది. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. 2018 నాటి చేదు అనుభవం... 2018లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులకు పోస్టింగ్‌లిచ్చారు. అన్నీ పోస్టులను భర్తీ చేశారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్ నగరంలోని ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో వైద్యులకు పోస్టింగ్‌లు లభించాయి. అందులో దాదాపు 600 మంది వరకు మాత్రమే విధుల్లో చేరారు. మిగిలినవారు చేరకుండా ఉద్యోగాలను వదులుకున్నారు. చేరిన వారిలోనూ చాలామంది విధుల్లోకి వెళ్లలేదు. వీరికి నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో కొందరిని తీసేశారు. సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్యకు కారణమని తెలుస్తోంది. స్పెషలిస్ట్ వైద్యులకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ వేతనాలకు జిల్లాల్లో పనిచేయాల్సిన అవసరమేంటన్న భావన ఉంటోంది. పైగా ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు చేయాలన్న ఆలోచన ఉన్నందున ఏ మేరకు ముందుకు వస్తారన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సదరు శాఖ స్పెషలిస్ట్ వైద్యుల భర్తీలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఏఎన్ఎం పోస్టులకు భారీ డిమాండ్.. ఎంబీబీఎస్ అర్హతతో భర్తీ చేసే మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఏఎన్ఎం పోస్టులకు ఈసారి భారీగానే డిమాండ్ ఉంటుందని వైద్య వర్గాలు అంచనా వేశాయి. 1,785 ఏఎన్ఎం పోస్టులకు దాదాపు 15 వేల నుంచి 20 వేల మంది నుంచి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఎంబీబీఎస్ అర్హతతో భర్తీ చేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 1,100పైగా ఉంటాయని, వాటికి దాదాపు ఐదారు వేల మంది నుంచి పోటీ ఉంటుందని అంటున్నారు. 4,600కు పైగా ఉన్న స్టాఫ్‌నర్స్ పోస్టులకు కూడా రెండుమూడు రెట్లు పోటీ ఉంటుందని భావిస్తున్నారు. డాక్టర్ పోస్టులు మినహా మిగిలిన వాటికి రాత పరీక్ష ఉండే అవకాశముంది. గతంలో మాదిరిగా తప్పులు దొర్లకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడటానికి నెల రోజుల సమయం పడుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఆ తర్వాత రెండుమూడు నెలల ప్రక్రియ పడుతుందని ఆయన పేర్కొన్నారు. -
4,755 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో మరో భారీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 4,755 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. గ్రామీణ ప్రజలు వైద్యం కోసం దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాలకు వెళ్లే అవసరం లేకుండా.. గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలందించేందుకు 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సేవలందించేందుకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకం చేపట్టారు. గతేడాది నవంబర్‌లో 3,393 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి.. నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తాజాగా మరో 4,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకోవడానికి గురువారం నుంచి ఈ నెల 16 వరకు గడువిచ్చింది. అర్హతలు.. ► అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లకు 40 ఏళ్లలోపు వయసు ఉండాలి. ► అభ్యర్థులు hmfw.ap.gov.in,cfw.ap.nic వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో భోజన చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వివిధ వర్గాలకు అందజేసే భోజన చార్జీలను పెంచుతూ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత చెల్లింపులను రెట్టింపు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఆదేశా లిచ్చారు. రోగులందరికీ, అలాగే గిరిజన రోగుల సహాయకులకు ప్రస్తుతం రూ.40 ఉండగా, దాన్ని రూ.80కి పెంచారు. టీబీ, మానసిక రోగులు, థెరపాటిక్ రోగులకు ప్రస్తుతం రూ.56 ఇస్తుండగా, దాన్ని రూ.112కి పెంచారు. ఇక డ్యూటీ డాక్టర్లకు రూ.80 నుంచి రూ.160కి పెంచారు. నాణ్యమైన భోజనాన్ని అందజేయాలన్న ఉద్దేశంతోనే ఈ మేరకు పెంచినట్లు రిజ్వీ పేర్కొన్నారు. -
బదిలీల మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మార్గదర్శకాలు రాజ్యాంగంలోని అధికరణ 309 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించలేదని, అందువల్ల ఇవి రాష్ట్రపతి ఉత్తర్వులు, ఏపీ సబార్డినేట్ సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్న ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేసింది. అధికరణ 309 ద్వారా మార్గదర్శకాలను రూపొందించనప్పుడు, వాటికి ఎలాంటి చట్టబద్ధత ఉండదని తెలిపింది. అవి కేవలం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలు మాత్రమేనంది. వాటిపై అభ్యంతరాలు ఉంటే ఆయా ఉద్యోగులు సవాలు చేసుకోవచ్చునంది. బదిలీల మార్గదర్శకాలను, తదనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
వైద్య ఆరోగ్య శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం: హరీశ్‌రావు
ఖైరతాబాద్(హైదరాబాద్): కోవిడ్ ప్రభావం తగ్గిందే తప్ప వైరస్ పూర్తిగా తగ్గలేదని, ప్రతి ఒక్కరు ముందస్తుగా టీకాలు వేయించుకుంటేనే మన ఆరోగ్యానికి భరోసా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా బుధవారం ఖైరతాబాద్‌లోని వెల్నెస్ సెంటర్లో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 16,555 మంది టీకాలు తీసుకున్నారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ ముగిసిందనో, పెద్దగా ప్రభావం చూపలేదనో కొత్త వేరియెంట్ ఇప్పుడే వస్తుందా, రాదా అనే అనుమానాలతో టీకాలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12–14 ఏళ్ల వయస్సు వారు 17,23,000 మంది ఉంటారని అంచనా వేశామని వారందరికీ టీకాలు వేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలకు నేరుగా వెళ్లి లేదా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మంత్రి కోరారు. 20 వేల పోస్టుల భర్తీ కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపం చానికి తెలంగాణ రెండు టీకాలను అందించిందని, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ మొదటిదయితే, బయోలాజికల్ –ఈ తయారుచేసిన కార్బొవ్యాక్స్ రెండోదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రపంచానికే తెలంగాణ వ్యాక్సిన్‌హబ్‌గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో 20వేల మందిని వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్‌రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాజేంద్రనగర్‌లోని టీఎస్ పార్డ్ లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు,ఉద్యోగులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలో పనిచేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మందులను ఆన్లైన్ చేస్తామని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైద్యాధికారులకు, ఉద్యోగులకు నగదు పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తామని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,90,574కు పెరిగింది. -
అన్ని జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హెల్త్ ప్రొఫైల్ సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రెండు నెలల్లో అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ఈ నెల ఐదో తేదీన హెల్త్ సర్వే ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఇక అన్ని జిల్లాల్లోనూ వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని (హెల్త్ ప్రొఫైల్) సేకరిస్తారు. వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్ కేటాయిస్తారు. తద్వారా ఆన్లైన్లో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశముంటుంది. హెల్త్ ప్రొఫైల్ సేకరణ అనంతరం అందరికీ డిజిటల్ హెల్త్ కార్డు అందజేస్తారు. ప్రాథమిక స్థాయి పరీక్షలన్నీ.. వైద్య సిబ్బంది ప్రజల రక్తపోటు, మధుమేహం సంబంధిత పరీక్షలు, బ్లడ్ గ్రూప్, రక్తానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ (సీబీపీ), పూర్తిస్థాయి మూ త్ర పరీక్ష (సీయూఈ), ఊపిరితిత్తులు, కాలేయం పనితీరు, 3 నెలల షుగర్ టెస్ట్, రక్తంలో యూరియా శాతం, సీరమ్ క్రియాటినైన్, ఆల్కలైన్ ఫాస్పటేజ్ , టోటల్ కొలెస్ట్రాల్ టెస్టులతో పాటు గుండె పనితీరును ప్రాథమికంగా కనుగొనే ఈసీజీ చేస్తారు. ఇళ్లకు వెళ్లి కొన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరికొన్ని పరీక్షలు చేస్తారు. ఆయా వివరాలు, పరీక్షా ఫలితాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. తెలియని జబ్బులు బయటపడే అవకాశం 18 ఏళ్లు పైబడిన వారిలో కొందరికి సహజంగానే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రోడ్డు ప్రమాదం జరగొచ్చు. అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యం తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో అప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్య వివరాలు తెలుసుకునే సమయం ఉండదు. ఈ దృష్ట్యా ఆరోగ్య సమాచారం తక్షణమే అందుబాటులో ఉండేందుకు ఇలా హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తున్నారు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఏకీకృత నంబర్ ఆధారంగా సంబంధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని అప్పటికప్పుడు అంచనా వేసేందుకు సదరు వైద్యుడికి వీలుంటుంది. తద్వారా తక్షణమే వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఇలాంటి చెకప్‌ల వల్ల అప్పటివరకు తెలియకుండా ఉన్న చిన్నచిన్న అనారోగ్య సమస్యలు బయటపడే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు తొలిదశలోనే సంబంధిత జబ్బుకు వైద్యం చేయించుకునేందుకు వీలవుతుంది. అవసరమైన ఏర్పాట్లలో అధికారులు హెల్త్ ప్రొఫైల్ తయారీకి అవసరమైన నిర్ధారణ పరీక్షల పరికరాలను, ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రస్తుతం జరుగుతున్న పైలెట్ ప్రాజెక్టు కోసం పరికరాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ సర్వే కొనసాగించేందుకు వీలుగా వైద్య సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది చివరిలోగా అన్ని జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ సర్వేను పూర్తి చేసేలా ప్రణాళిక రచించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
ఆరోగ్య భాగ్యం
వైద్య,ఆరోగ్యశాఖకు ఈసారి నిధులు గణనీయంగా పెరిగాయి. 2021–22 బడ్జెట్లో రూ.6,295 కోట్లు కేటాయిస్తే.. 2022–23 బడ్జెట్లో ఏకంగా రూ.11,237 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.4,942 కోట్లు అదనంగా కేటాయించారన్నమాట. ప్రతి జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. ఏ జిల్లాలో ఎప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలో నిర్ధారించారు. హైదరాబాద్ నగరం నలుదిక్కులా.. అంటే గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలు, నిమ్స్‌లో మరో రెండు వేల పడకలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయి. వరంగల్‌లో హెల్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. – సాక్షి, హైదరాబాద్ వచ్చే ఏడాది నుంచి 8 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 5 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. వీటిలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మరో 8 కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాబోయే వైద్య విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇక రాబోయే రెండు సంవత్సరాల్లో మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 8 కళాశాలలను ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. 2023 సంవత్సరంలో మిగతా జిల్లాలు.. మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో ఏర్పాటు చేయనుంది. కొత్త కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రతిపాదించింది. కాగా ఆరోగ్యశ్రీకి రూ.1,343 కోట్లు, కేసీఆర్ కిట్‌కు రూ.443 కోట్లు కేటాయించింది. వైద్యారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం బడ్జెట్లో 4.5 శాతం ఆరోగ్యరంగ అభివృద్ధికే కేటాయించడం శుభపరిణామమని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు అన్నారు. బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావులకు డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ దవాఖాన్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తదితరాలకు రూ.1,400 కోట్లు కేటాయించారని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో మారుమూల ప్రజలకు కూడా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
ఆస్పత్రుల్లో మురుగుశుద్ధి కేంద్రాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో జీవ వైద్యవ్యర్థాల నిర్వహణలో భాగంగా వ్యర్థజలాలను శుద్ధి చేయడానికి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, టిమ్స్ సహా రాష్ట్రవ్యాప్తంగా 20 ఆస్పత్రుల్లో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందు కోసం రూ.68.31 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు. ఆస్పత్రుల్లోని ద్రవవ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల్సి ఉందని, లేనట్లయితే పరిసరాలు, సమీప నీటివనరులు కాలుష్యం బారిన పడే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, సిద్దిపేట మెడికల్ కాలేజీ, ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వాస్పత్రుల్లో కూడా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రూ.52.59 కోట్లను ప్లాంట్ల ఏర్పాటుకు, మరో రూ.15.72 కోట్లు మూడేళ్లపాటు ఈ ప్లాంట్ల నిర్వహణకు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీల నుంచి వెలువడే వ్యర్థాలతోపాటు పేషెంట్ల బెడ్లను, బెడ్ షీట్లను, వార్డులను శుభ్రం చేసే సమయంలో వెలువడే వ్యర్థాల్లోని వైరస్లు పలు ఇన్ఫెక్షన్లు, కాలుష్యానికి కారకమవుతాయని హరీశ్ చెప్పారు. -
అవయవ మార్పిడికి నజరానా
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్స చేస్తే.. సదరు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు అందజేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలు చేయడంపై వైద్యులు దృష్టి సారించాలని.. వైద్య పరికరాలు, మందులు ఇతర అవసరాలను సమకూర్చుకునేందుకు నిధులు ఇస్తామని తెలిపారు. సదరు డాక్టర్లకు, పనిచేసే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. పేదలకు వైద్యం అందించడంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని.. నంబర్ వన్‌గా నిలిపేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం రాత్రి బాసరలో బసచేశారు. గురువారం ఉదయమే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తర్వాత ముధోల్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి, నిర్మల్‌లో నిర్మించనున్న 250 పడకల జిల్లా ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. సాయంత్రం ఆదిలాబాద్‌లో రూ.150 కోట్లతో నిర్మించిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. ఏడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు: దేశంలో పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మనదేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరవై ఏళ్లపాటు కొనసాగిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మూడే మెడికల్ కాలేజీలు వచ్చాయని.. ఏడేళ్ల స్వరాష్ట్ర పాలనలో ఏకంగా 17 ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అప్పట్లో వరంగల్‌లో రైతులు బస్తాకు రూపాయి చొప్పున జమ చేసుకుని ఆస్పత్రి కట్టుకుంటే.. తర్వాత సమైక్య పాలకులు దానిని మెడికల్ కాలేజీగా మార్చారన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల పనితీరుపై నెలనెలా సమీక్షిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. ఇక సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఈ నెల 5న హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్‌కార్డు అందిస్తామన్నారు. దేశం మెచ్చుకుంటుంటే.. ఇక్కడ విమర్శలు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు దారుణమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో తెలంగాణ ఇంటింటి సర్వే చేసి ఉత్తమ ఫలితాలు సాధించిన తీరును నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో బస్తీ దవాఖానాల ఏర్పాటును 15వ ఆర్థిక సంఘం మె చ్చుకుందని తెలిపారు. ఈ రెండింటినీ మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్న సూచనలు చేశాయని వివరించారు. సొంత జాగా ఉంటే ఇల్లు సొంత జాగా ఉన్న పేదలు ఇల్లు కట్టుకునేందుకు వీలుకల్పించే కార్యక్రమంపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నా రని హరీశ్‌రావు తెలిపారు. 57 ఏళ్లు దాటినవారికి పింఛన్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, రేఖా శ్యాంనాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ చదువు డీలా!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఇందులో భాగంగా వైద్య కళాశాలలకు సైతం వాటిల్లోని ప్రమాణాలు, కొన సాగుతున్న పరిశోధనలు, అందుతున్న సేవలు, పడకల సామర్థ్యం.. ఆక్యుపెన్సీ, అవుట్ పేషెంట్లు, బోధన సిబ్బంది, ఆర్థిక వనరులు, ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు, దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటిస్తుంది. ఇదే క్రమంలో 2021 సంవత్సరానికి కూడా ప్రకటించింది. అయితే రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి కూడా దేశంలోని టాప్ 50 వైద్య కళాశాలల్లో చోటు దక్కలేదు. ఈ సంవత్సరమే కాదు..గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో వైద్య విద్య దుస్థితికి ఇదే నిదర్శనమని వైద్య నిపుణులు అంటున్నారు. సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: ప్రజల ప్రాణాలు కాపాడేలా చదువు నేర్పే వైద్య కళాశాలలు రాష్ట్రంలో తూతూమంత్రంగా నడుస్తున్నాయి. బోధన సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాల కొరత వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభా వం చూపిస్తోంది. ప్రధానంగా అధ్యాపకులు లేకపోవ డంతో వైద్య విద్యలో నాణ్యత నాసిరకంగా మారుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలనూ ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల కొరత వేధిస్తోంది. ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రైవేటు కళాశాలలు కూడా సరిపడా బోధన సిబ్బందిని నియమించుకోవడం లేదు. ఫీజుల వసూళ్లపై చూపెడు తున్న శ్రద్ధ విద్యా ప్రమాణాలు, సదుపాయాల కల్పన, పరిశోధనలపై పెట్టడం లేదనే విమర్శలున్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) తనిఖీలకు వచ్చే సమయంలో మాత్రం ఒక మెడికల్ కాలేజీకి చెందిన వారిని మరో మెడికల్ కాలేజీకి పంపించి తగిన సంఖ్య చూపించి కాలేజీని రెన్యువల్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీలే ఖాళీలు..! రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలా బాద్ (రిమ్స్), వరంగల్ (కాకతీయ), మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసి యేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు కలిపి 2,866 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ దాదాపు 655 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంటోం ది. కానీ నిజానికి ఈ సంఖ్య వెయ్యి వరకు ఉంటుందని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వైద్య ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ)’ను ఏర్పాటు చేసింది. ఖాళీ అయిన వెంటనే వేగంగా పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశారు. వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి బోర్డు చైర్మన్‌గా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సభ్య కార్యదర్శిగా, జాయింట్ డైరెక్టర్ హోదా ఉన్న అధికారి సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ పోస్టుల భర్తీపై శ్రద్ధ చూపించడం లేదనే విమర్శలున్నాయి. పలు సర్కారీ కళాశాలల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. నిజామాబాద్ మెడికల్ కాలేజీ... నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పెద్దసంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2013లో నెలకొల్పిన ఈ కాలేజీలో అన్ని రకాలైన 750 పోస్టులు భర్తీ చేయాల్సి ఉం డగా ఇప్పటివరకు పూర్తికాలేదు. ప్రధానంగా ప్రొఫెసర్ పోస్టులు 35 మంజూరు చేయగా, రెగ్యులర్ 21 మంది, కాంట్రాక్ట్ పద్ధతిన ఇద్దరు ఉన్నారు. 12 ఖాళీగా ఉన్నాయి. 57 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను 17 మంది రెగ్యులర్, ముగ్గురు కాంట్రాక్ట్ పద్ధతిన ఉన్నారు. ఏకంగా 37 ఖాళీలున్నాయి. 109 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 52 మంది రెగ్యులర్, 32 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నా రు. 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 23 మంజూరు కాగా, రెగ్యులర్ 9 మంది, కాంట్రాక్ట్‌లో 12 మంది ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 69 మంజూరు కాగా, 48 మంది కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తుండటం గమనార్హం కాగా.. 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్లగొండ మెడికల్ కాలేజీ... నల్లగొండ మెడికల్ కాలేజీలో ట్యూటర్లు 31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 115, అసోసియేట్ ప్రొఫెసర్లు 48, ప్రొఫెసర్లు 25 మంది ఉండాలి. అయితే ప్రొఫెసర్లు 9, అసోసియేట్ ప్రొఫెసర్లు 32, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 42, ట్యూటర్లు 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలేజీకి సొంత భవనం కూడా లేదు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోగల పాత భవనంలో దీనిని నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదులకు తోడు క్యాంటీన్, డైనింగ్ హాల్, తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట మెడికల్ కాలేజీ.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడేళ్ల క్రితం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆధునీకరించి అందులో మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నారు. కళాశాలలో మొదటి సంవత్సరం 150 మంది, ద్వితీయ సంవత్సరం 150 మంది చదువుకుంటున్నారు. ట్యూటర్లు 15, ప్రొఫెసర్లు 24, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 115, అసోసియేట్ ప్రొఫెసర్లు 48 మంది ఇలా మొత్తం 202 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం ట్యూటర్లు 13, ప్రొఫెసర్లు 20, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 80, అసోసియేట్ ప్రొఫెసర్లు 30 మంది కలిపి మొత్తం 143 మందే పనిచేస్తున్నారు. 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పడిపోతున్న వైద్య విద్య నాణ్యత రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారైంది. ముఖ్యంగా అన్ని రకాల ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులకు చదువు చెప్పే నాథుడే లేడు. ఉన్నవారే క్లాసులు తీసుకోవడం, పేషెంట్లను చూడడం, పేపర్లు దిద్దాల్సి ఉండటంతో ఒత్తిడి పెరిగిపోతుంది. ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చేప్పుడు ఒక కాలేజీ ఫ్యాకల్టీని మరో కాలేజీకి పంపిస్తున్నారు. దీంతో ఎంబీబీఎస్‌లో విద్యార్థులు సరిగా నేర్చుకోలేకపోతున్నారు. నాసిరకమైన వైద్య విద్య వల్ల పీజీ సీట్లు పొందలేకపోతున్నారు. – విజయేందర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు, జూడా మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల 150 సీట్లతో మొదలైంది. ఇటీవల ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 25 సీట్లు పెరిగాయి. కళాశాలకు మొత్తం 981 పోస్టులు మంజూరు చేయగా ఇందులో బోధన సిబ్బంది పోస్టులు 242 ఉన్నాయి. ఇందులో రెగ్యులర్, కాంట్రాక్టు కలిపి 121 బోధన సిబ్బంది ఉండగా మరో 121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్... ఆదిలాబాద్ రిమ్స్ 120 ఎంబీబీఎస్ సీట్లతో కొనసాగుతోంది. అయితే అనేక ఖాళీల కారణంగా వైద్య కళాశాలలో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. మరోపక్క ఖాళీ పోస్టుల కారణంగా ఈ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఇలావుండగా రిమ్స్ ఆస్పత్రికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అన్ని హంగులతో నిర్మించారు కానీ, ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. కాకతీయ మెడికల్ కాలేజీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కాకతీయ మెడికల్ కాలేజీ 250 సీట్లతో కొనసాగుతోంది. కళాశాలలోని 26 విభాగాల్లో 250 అధ్యాపక పోస్టులు ఉన్నాయి. ఇందులో 34 మంది ప్రొఫెసర్లకు గాను 27 మంది ఉన్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 71మంది అసోçసియేట్ ప్రొఫెసర్లకు 43 మంది ఉన్నారు. 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 145 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 100 మంది ఉండగా 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలేజీలో ఏడేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన అకడమిక్ భవనం పూర్తయితే విద్యార్థులకు డిజిటల్ తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. 250 మంది విద్యార్థులు ఒకే తరగతి గదిలో సౌకర్యంగా కూర్చునే అవకాశం కూడా ఉంటుంది. -
టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: టెలీ మెడిసిన్ సేవల్లో మన రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలు ఏపీకి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీ మెడిసిన్ సేవలను 2019 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో 13 హబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి రాష్ట్రంలోని 1,145 పీహెచ్‌సీలతో పాటు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రజలు ఇంటినుంచే టెలీ మెడిసిన్ సేవలు పొందేలా ఈ–సంజీవని (ఓపీడీ) సేవలు గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రోజువారీగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి టెలీ మెడిసిన్‌కు వస్తున్న కన్సల్టేషన్లలో అత్యధిక శాతం ఏపీవే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం టెలీ మెడిసిన్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచినట్టు ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. 42 శాతం ఏపీ నుంచే.. టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభమైన నాటినుంచి నేటివరకు దేశ వ్యాప్తంగా 2,43,00,635 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 42 శాతం అంటే 1,02,03,821 ఏపీ నుంచి నమోదై రికార్డు సృష్టించాయి. 37,70,241 కన్సల్టేషన్లతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం రోజుకు 75 వేల వరకూ కన్సల్టేషన్లు ఉంటున్నాయి. ఈ–సంజీవని ఓపీడీ యాప్‌ను రాష్ట్రంలో ఇప్పటికే 85,351 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ సంజీవని సేవలపై స్మార్ట్ ఫోన్లు వినియోగించడం తెలియని, స్మార్ట్ ఫోన్లు లేనివారిలో అవగాహన పెంచడం కోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది. వీటిని హబ్‌లకు అనుసంధానించింది. త్వరలో ఆశా వర్కర్ల ద్వారా ప్రజలకు టెలీ మెడిసిన్ సేవలను మరింత చేరువ చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్తగా మరో 14 చోట్ల.. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 13 టెలీ మెడిసిన్ హబ్స్‌తో ప్రభుత్వం సేవలు అందిస్తోంది. వీటిని మరింత విస్తృతం చేయడంలో భాగంగా రూ.5 కోట్లకు పైగా నిధులతో కొత్తగా మరో 14 చోట్ల హబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఇప్పటికే 7 హబ్స్ ప్రారంభమయ్యాయి. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు ఉంటారు. రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లు లక్ష్యంగా.. టెలీ మెడిసిన్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి రోజుకు 2 లక్షల కన్సల్టేషన్లకు చేరుకుంటాం. ఈ ఏడాది చివరి నాటికి రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో సగటున మూడుసార్లు టెలీ మెడిసిన్ సేవలు పొందుతారు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ -
పీహెచ్‌సీలపై పీజీల మోజు
►ఆయన పేరు డాక్టర్ రంగారావు (పేరు మార్చాం). రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్. ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఆయన ఈ పోస్టులో చేరారు. ఆ తర్వాత ఎండీ ఫల్మనరీ పూర్తిచేశారు. పీహెచ్‌సీకి రెగ్యులర్‌గా వెళ్లకుండా మేనేజ్ చేసుకుంటూ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ►ఆమె పేరు డాక్టర్ ప్రభావతి(పేరు మార్చాం). ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఓ పీహెచ్సీలో పనిచేస్తున్నారు. తర్వాత ఎండీ గైనిక్ చదివారు. వారానికి ఒకట్రెండు రోజులు పీహెచ్‌సీకి వెళ్లి వస్తూ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ దాదాపు రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదివాక పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్‌గా చేరినవారు, ఆ తర్వాత పీజీ పూర్తయ్యాక కూడా అక్కడే తిష్ట వేస్తున్నారు. మెడికల్ పీజీలో కార్డియాలజీ, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, రేడియాలజీ, అనస్థీషియా ఇలా స్పెషలైజేషన్ పీజీ పూర్తయిన తర్వాత పీహెచ్‌సీల నుంచి పెద్దాసుపత్రులకు మారాలి. ప్రస్తుతం 290 మంది ఇలా పీహెచ్‌సీల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్పెషలిస్టు వైద్యులను పని ఉన్నచోటుకు మార్చాలని, ఈ నెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. వారు కౌన్సెలింగ్‌కు రాకున్నా, విధుల్లో చేరడానికి అయిష్టత చూపినా, షోకాజ్ నోటీసులిచ్చి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. పెద్దాసుపత్రులకు మారితే ప్రైవేట్ వైద్యానికి కష్టం పెద్దాసుపత్రులకు మారితే ఆయా స్పెషలిస్ట్ వైద్యుల రోజువారీ సమయమంతా అక్కడే సరిపోతుంది. ఉన్నతాధికారుల నిఘా కూడా బాగానే ఉంటుంది. దీంతో ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్‌గా వైద్యసేవలు అందించడంకానీ కుదరదు. పీహెచ్‌సీల్లో అయితే వారానికి ఒకసారి అలా సరదాగా వెళ్లొచ్చినా అడిగే నాథుడు ఉండడు. స్పెషలిస్ట్ వైద్యులుగా పెద్దాసుపత్రులకు వచ్చినా అందే జీతం ప్రైవేట్ ప్రాక్టీస్ ముందు దిగదుడుపే. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగం వదులుకోవడానికైనా కొందరు స్పెషలిస్ట్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిందే.. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న పీజీ స్పెషలిస్ట్ వైద్యులు పెద్దాసుపత్రుల్లో సేవలు అందించాలి. ఎంతమంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో జాబితా తయారు చేశాం. వారిని సామాజిక, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రులకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ, చాలామంది పీహెచ్‌సీలను వదలడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని మా దృష్టికి వచ్చింది. దానికి అనుగుణంగా చర్యలు చేపడతాం. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
అత్యవసర పరిస్థితుల్లోనే అబార్షన్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇక నుంచి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అబార్షన్లకు అనుమతి ఉంటుంది. విచ్చలవిడి అబార్షన్ల (ఎంటీపీ–మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ)కు దేశవ్యాప్తంగా చెక్ పడనుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, న్యాయ శాఖలు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదో పెద్ద వ్యాపారంగా మారిన నేపథ్యంలో 1971లో చేసిన చట్టానికి 2021లో సవరణ చేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. కొత్త సవరణ చట్టం అమలుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కసరత్తు మొదలుపెట్టింది. ఏటా రాష్ట్రంలో 7.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 50 వేలకు పైగా అబార్షన్లు ఉంటున్నట్లు వైద్యుల అంచనా. ఇక ప్రతి అబార్షన్ రికార్డుల్లోకి.. ఇకపై అబార్షన్ చట్ట నిబంధనలకు లోబడి చేయాల్సి ఉంటుంది. పైగా ప్రతి అబార్షన్ వివరాలను రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. కడుపులోని బిడ్డకు 20 వారాలకు మించి వయసుంటే అబార్షన్ చేయకూడదని గత చట్టంలో పేర్కొన్నారు. తాజా చట్టం ప్రకారం 24 వారాల వరకు పొడిగించారు. తల్లికి తీవ్ర మానసిక రుగ్మతలున్నా, అత్యాచారానికి గురైనా, కడుపులో అసాధారణ పరిస్థితుల్లో బిడ్డ ఉన్నా, కడుపులో బిడ్డ పెరగడం వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్నా.. ఇలాంటి కేసుల్లో మాత్రమే 24 వారాల వరకు ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయొచ్చు. మిగిలిన పరిస్థితుల్లో అబార్షన్ చేసినట్లు ఫిర్యాదులొస్తే సంబంధిత డాక్టరుపై కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే డాక్టరు పట్టాను రద్దు చేయొచ్చు. ప్రతి జిల్లాకో మెడికల్ బోర్డు విచ్చలవిడి అబార్షన్లను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ముగ్గురు వైద్యులతో ఓ మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో గైనకాలజిస్ట్, పీడియాట్రిక్ వైద్యులు, రేడియాలజిస్ట్ లేదా సోనాలజిస్ట్ ఉంటారు. అబార్షన్ చేసే వైద్యులు రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి. ఎవరికైతే అబార్షన్ చేయాలో వారి వివరాలు, దానికి గల కారణాలు విధిగా పేర్కొని, బోర్డుకు నివేదిక ఇవ్వాలి. బాధితురాలి వయసు, ఆరోగ్య పరిస్థితులు, కడుపులో బిడ్డ వయసు విధిగా పేర్కొనాలి. కొత్త చట్టాన్ని త్వరలోనే అమలు చేయనున్నామని, దీనికి సంబంధించిన మెడికల్ బోర్డులు జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తున్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి తెలిపారు. -
లక్ష్యాన్ని మించి టీనేజర్లకు టీకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న టీనేజీ పిల్లలకు టీకా పంపిణీలోనూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 24.41 లక్షల మంది పిల్లలకు టీకా పంపిణీ చేయాలన్న కేంద్రం లక్ష్యాన్ని అనతి కాలంలోనే అధిగమించింది. అదనపు టీకాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేస్తోంది. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 24,91,079 మంది పిల్లలకు తొలి డోసు టీకా వేశారు. వీరిలో 36.53 శాతం మందికి అంటే 9,10,042 మందికి రెండో డోసు టీకా కూడా వేశారు. 76.86 శాతం మందికి ప్రికాషన్ డోసు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గత నెలలో 60 ఏళ్లు పైబడిన వారికి, ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు ప్రికాషన్ డోసు టీకా వేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో కోమార్బిడిటీస్ (బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, ఇతర జబ్బులు)తో బాధపడే వారికి ఈ డోసు వేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రంలో మాత్రం కోమార్బిడిటీస్‌తో పాటు 60 ఏళ్లు పైబడి, రెండు డోసులు వేసుకుని 39 వారాలు దాటిన వారందరికీ ప్రభుత్వం ప్రికాషన్ డోసు వేస్తోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ప్రికాషన్ డోసుకు 14,52,854 మంది అర్హులు కాగా వీరిలో 76.86 శాతం మందికి అంటే 11,16,669 మందికి ఈ డోసు వేశారు. వీరిలో 5,47,403 మంది 60 ఏళ్లు పైబడిన వారు, 3,14,374 మంది ఫ్రంట్‌లైన్, 2,54,892 మంది హెల్త్‌కేర్ వర్కర్లు ఉన్నారు. కొనసాగుతున్న 38వ విడత ఫీవర్ సర్వే కరోనా నియంత్రణలో ఫీవర్ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటివరకు 37 విడతలు ఫీవర్ సర్వే చేపట్టింది. 38వ విడత సర్వే కొనసాగుతోంది. కరోనా అనుమానిత లక్షణాలను గుర్తించి, వారి ద్వారా ఎక్కువ మందికి వైరస్ వ్యాపించకుండా నియంత్రించడం, అనుమానిత లక్షణాలతో ఉన్న వారికి చికిత్స అందించడం సర్వే ముఖ్య ఉద్ధేశం. 38వ విడతలో 1.26కోట్ల గృహాలకు గాను ఇప్పటికి 64.62 శాతం అంటే 1.05 కోట్ల గృహాల్లో సర్వే చేశారు. 1,480 మంది అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి వీరిలో 1,073 మందికి పరీక్షలు నిర్వహించారు. 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. -
మరో 2098 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 2,098 మంది కోవిడ్–19 బారిన పడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,76,313 మందికి కరోనా వైరస్ సోకగా, వారిలో 7,42,988 మంది కోలుకున్నారు. మరో 29,226 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా ప్రభా వంతో శనివారం ఇద్దరు మరణించగా.. ఇప్పటి వరకు 4,099 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 74,803 నిర్ధారణ పరీ క్షలు చేశారు. వీటిలో మరో 2,131 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కోవిడ్–19 వ్యాక్సినేషన్లో భాగంగా శనివారం 1,71,014 డోసులు పంపిణీ చేశారు. ఇందులో 29,318 మొదటి డోసు, 1,33,008 రెండో డోసు, 8,688 బూస్టర్ డోసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 5,51,65,713 డోసులు పంపిణీ చేసినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. -
11 జిల్లాల్లో రెండోవిడత జ్వర సర్వే షురూ
సాక్షి, హైదరాబాద్: రెండోవిడత ఇంటింటి జ్వర సర్వే 11 జిల్లాల్లో ఆదివారం ప్రారంభమైంది. జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మొదటి విడత సర్వే పూర్తికాగానే మొదలుపెడతారని పేర్కొంది. సర్వేలో భాగంగా కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి కిట్లు అందజేస్తుండటంతో ఎక్కడికక్కడే వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నారు. రోగుల పరిస్థితి తీవ్రం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సెకండ్ వేవ్‌లో మూడు, నాలుగుసార్లు కూడా జ్వర సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏకంగా 8 లక్షల మందికి మెడికల్ కిట్లు అందజేశారు. ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి పలు విడతలుగా జ్వర సర్వే చేపడతామని అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 29 వరకూ జరిగిన మొదటి విడత సర్వేలో రాష్ట్రంలో కేవలం 9 రోజుల వ్యవధిలోనే 4,00,283 మందిలో కరోనా లక్షణాలున్నట్లుగా గుర్తించారు. వీరిలో అందరికీ కరోనా అని నిర్ధారణ కాకపోయినా, 3,97,898 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. -
జ్వర సర్వేపై కేంద్రం ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రంలో ప్రారంభించిన జ్వర సర్వేను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు. తెలంగాణ అనుసరిస్తున్న పద్ధతిని మంచి వ్యూహంగా అభినందించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్ష ద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఖమ్మం కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వ సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలను హరీశ్‌రావు కేంద్ర మంత్రికి వివరించారు. రెండో వేవ్ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు మరోసారి జ్వర సర్వే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మొత్తం 21,150 బృందాలు జ్వర సర్వేలో పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. వైద్య, ఆరోగ్య, పంచాయతీ లేదా మున్సిపల్ విభాగాల నుంచి ఒక్కో బృందంలో ముగ్గురు ఉంటారని, వీరంతా ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి అక్కడే హోంఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నామని, తదుపరి వారంపాటు వారి ఆరోగ్య పరిస్థితిని సిబ్బంది పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 77,33,427 ఇళ్లలో జ్వర సర్వే చేశామన్నారు. సర్వేతో ప్రభుత్వం వైద్యాన్ని ఇంటి వద్దకే చేర్చిందనీ, దీని వల్ల పాజిటివిటీ రేటు తగ్గి, ఆస్పత్రుల్లో చేరికలు తగ్గాయన్నారు. 60 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలి.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు 60 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గడువును తగ్గించాలని, అలాగే 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బూస్టర్ ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. -
తొలి క్యాథ్‌ల్యాబ్ ఖమ్మంలో..
సాక్షి, హైదరాబాద్: గుండె జబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం మొదటిసారిగా జిల్లాల్లో ఏర్పాటు కానుంది. శుక్రవారం ఖమ్మంలో క్యాథ్‌ల్యాబ్‌ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో నెలకొల్పనున్న తొలి క్యాథ్‌ల్యాబ్ ఇదే. త్వరలో సిద్దిపేట, మహబూబ్‌నగర్ బోధనాసుపత్రులకు రానుంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్, గాంధీల్లోనే ఈ సేవలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది సిద్దిపేటలో, 2024లో మహబూబ్‌నగర్ బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.7 కోట్లు ఖర్చు కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. క్యాథ్‌ల్యాబ్‌ల్లో గుండె జబ్బుల పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలుంటాయి. -
ఆంక్షల నడుమ మేడారం జాతర? మొదటివారంలో కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. కోటికిపైగా భక్తులు హాజరుకానున్న ఈ జాతర వచ్చేనెల 16వ తేదీ నుంచి 19వ తేదీవరకు నాలుగు రోజులపాటు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా సాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతున్న పరిస్థితుల్లో మేడారం జాతర వైరస్ వ్యాప్తికి కారణం కాకూడదని గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయపడుతోంది.ఇందులో భాగంగా వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మొదటివారంలో ప్రత్యేక సమావేశం... వచ్చేనెలలో కోవిడ్ వ్యాప్తి తారాస్థాయికి చేరుతుందని వైద్య,ఆరోగ్య శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి మాసమంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల మొదటివారంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్చువల్ పద్ధతిలో సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఉండేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ సమీక్ష కీలకం కానుంది. జాతరకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలా.. భౌతిక దూరాన్ని పాటిస్తూ అనుమతి ఇస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.. శానిటైజేషన్ ఏర్పాట్లు, మాస్కుల నిర్వహణ, తక్ష ణ వైద్య సేవల కల్పన తదితర అంశాలపై లోతు గా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వడివడిగా నిర్మాణ పనులు ప్రస్తుతం జాతర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 21 ప్రభుత్వ విభాగాలకు రూ.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం వివిధ పనులు నిర్దేశించింది. కోటికి పైగా భక్తులు/పర్యాటకులు హాజరు కానుండటంతో ప్రభుత్వం అక్కడ రవాణా, వసతికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. దీంతోపాటు తాగునీటి సరఫరా, భద్రత చర్యలు కీలకం కానున్నాయి. జాతరకు మంజూరు చేసిన మొత్తంలో దాదాపు 50శాతం నిధులు ఈ మూడు శాఖలకే ఖర్చు చేయనుంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. -
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ తీవ్రజబ్బుకు లోనై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు అందుబాటులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,774 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో కేవలం 9.04 శాతం అంటే 434 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. 1.75 శాతం మంది అంటే 84 మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. మిగిలిన 89.14 శాతం అంటే 4,256 మంది వైద్యసిబ్బంది పర్యవేక్షణలో హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో సుమారు 40 మంది మాత్రమే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వీరు వయసు పైబడి, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు కావడం గమనార్హం. సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలే ఎక్కువమందిలో ఉంటున్నాయి. రెండోదశలో మాదిరిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడం వంటి సమస్యలు తక్కువమందిలో కనిపిస్తున్నాయి. దేశంలో 20వ స్థానంలో.. యాక్టివ్ కేసుల పరంగా పరిశీలిస్తే మన రాష్ట్రం.. దేశంలో 20వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనే యాక్టివ్ కేసులు ఎక్కువ ఉన్నాయి. మరణాల రేటులో మన రాష్ట్రం.. దేశంలో 31వ స్థానంలో రాష్ట్రం ఉంది. నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.70 శాతం మంది మాత్రమే రాష్ట్రంలో మృత్యువాతపడ్డారు. పంజాబ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. -
ఏపీలో నైట్ కర్ఫ్యూ
-
కేసుల పెరుగుదలతో.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ అమలుచేయాలని సోమవారం ఆదేశాలు జారీచేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయాలన్నారు. థియేటర్లలో సీటు మార్చి సీటు విధానాన్ని ప్రవేశపెట్టాలని.. ప్రేక్షకులకు మాస్క్ తప్పనిసరి చేయాలని ఆయన స్పష్టంచేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో అందరూ భౌతిక దూరం పాటించేలా.. మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న విషయాన్ని, కోవిడ్ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పలు ఆదేశాలు జారీచేశారు. అవి.. సమర్థవంతంగా కరోనా నివారణ ► అధికార యంత్రాంగం కోవిడ్ నివారణ చర్యలను సమర్థవంతంగా అమలుచేయాలి. ► భౌతిక దూరం పాటించని.. మాస్క్‌లు ధరించని పక్షంలో కచి్చతంగా జరిమానాలు కొనసాగించాలి. ► దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలి. ► బస్సు ప్రయాణికులు కూడా విధిగా మాస్క్ ధరించేలా చూడాలి. ► బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకూడదు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీచేయనుంది. నియోజవర్గానికి ఓ కోవిడ్ కేర్ సెంటర్ ఇక 104 కాల్ సెంటర్‌ను బలంగా ఉంచాలని కూడా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఎవరు కాల్ చేసినా వెంటనే స్పందించేలా ఉండాలని.. అలాగే, కోవిడ్ కేర్ సెంటర్లను కూడా సిద్ధంచేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలని ముఖ్యమం‘త్రి సూచించారు. హోం కిట్‌లో మార్పులు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో హోం కిట్‌లో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య నిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేయాలన్నారు. అంతేకాక.. చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపైనా సమీక్షించారు. అవసరమైన మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. -
సరోగసి తల్లికీ మాతృత్వపు సెలవు
సాక్షి, అమరావతి/కాకినాడ: సరోగసి(అద్దె గర్భం) ద్వారా తల్లి అయిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మాతృత్వపు సెలవు మంజూరు చేయని పలువురు అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఆమెకు కూడా మాతృత్వపు సెలవు మంజూరు చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ మాతృత్వపు సెలవు ఇదే వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్, రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కాకినాడకు చెందిన ఉండమట్ల మురళీకృష్ణ ఆడిటర్‌గా పని చేస్తుండగా, ఆమె భార్య డాక్టర్ కిరణ్మయి రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కిరణ్మయి గత నెలలో సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యారు. మాతృత్వపు సెలవు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు తిరస్కరించారు. దీంతో కిరణ్మయి గత నెల 24న హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జయసూర్య అధికారుల తీరును ఆక్షేపించారు. విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు. -
పెనుమూరులో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
పెనుమూరు/కార్వేటినగరం (చిత్తూరు): ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. ఆయన శనివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగరరెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాని మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా స్థానిక పీహెచ్సీ ఆవరణలో రూ.13.5 కోట్లతో నూతనంగా ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ పాల్గొన్నారు. -
తెలంగాణలో భారీగా కోవిడ్ కేసులు.. ఒక్క హైదరాబాద్‌లోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 73,156 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: Sankranti: ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త.. ఈ విషయం మరిచారో అంతే..! గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందగా, దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,041కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1583 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 292, రంగారెడ్డి జిల్లాల్లో 214 కేసులు నమోదయ్యాయి. -
త్వరలో జ్వర సర్వేలు
సాక్షి, హైదరాబాద్: ఫస్ట్, సెకండ్ వేవ్‌ల సందర్భంగా ప్రభుత్వం గ్రామాలు, బస్తీల్లో జ్వర సర్వేలు చేపట్టింది. జ్వరం వచ్చిన వారందరికీ హోం ఐసోలేషన్ కిట్లను అందజేసింది. దాదాపు 8 లక్షల మంది జ్వర పీడితులకు కిట్లు ఇచ్చి వైరస్ కట్టడికి కట్టుదిట్ట చర్యలు తీసుకున్నారు. ఇది వినూత్న కార్యక్రమం కావడంతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దీంతో ఈసారి కూడా జ్వర సర్వేలు చేపట్టాలని నిర్ణయించినట్లు వైద్య వర్గాలు చెప్పాయి. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి జ్వర పీడితులను గుర్తించి అక్కడికక్కడే కిట్లను ఇస్తారు. అవసరమైన వారికి కరోనా పరీక్షలు చేయిస్తారు. జ్వరం సర్వేల సమయంలో కోటి హోం ఐసోలేషన్ కిట్లను అందజేయాలని నిర్ణయించారు. సెకండ్ వేవ్‌లో పారాసిట్మాల్, అజిత్రోమైసిన్, లివోసిట్రజిన్, విటమిన్ మాత్రలు, స్టెరాయిడ్స్లతో కూడిన హోంఐసోలేషన్ కిట్లు అందించారు. ఈసారి కిట్లలో స్టెరాయిడ్స్ ఉంచడం లేదని వైద్య వర్గాలు చెప్పాయి. స్టెరాయిడ్స్ అందరికీ అవసరం లేదని, దీనివల్ల గతంలో అనేక మందికి అనారోగ్య సమస్యలు వచ్చాయన్నాయి. కిట్లను త్వరితంగా సిద్ధం చేసేందుకు ఆగమేఘాల మీద ఆర్డర్లు పెట్టారు. మందులను కోట్లలో సేకరించి, వాటిని కిట్లలో ఉంచేందుకు వివిధ కంపెనీలకు బాధ్యత అప్పగించారు. థియేటర్ల సంగతేంటి? కేసులు పెరుగుతుండటం, సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో వివిధ అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ సమాలోచనలు చేస్తోంది. పండుగ సందర్భంగా బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతరత్రా వాహనాల్లో ప్రజల రద్దీ ఉంటుంది. మరోవైపు సినిమా హాళ్లు కూడా నిండుతాయి. ఈ నేపథ్యంలో సమగ్రమైన కరోనా జాగ్రత్తలను పాటించాలని, ఆ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని యోచిస్తున్నారు. ఇక సినిమా హాళ్లలో పక్కపక్కన కూర్చోవడం, గాలి, వెలుతురు పెద్దగా ఉండని స్థితిలో వందల మంది ఉండటంవల్ల వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లలో సగం ఆక్యుపెన్సీకి అవకాశమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య వర్గాలు చర్చిస్తున్నాయి. -
కోవిడ్ టెస్ట్ ఇంట్లోనే
సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రులకు వెళ్లి క్యూలైన్లో నిల్చొవాల్సిన పనిలేదు.. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. లక్షణాలుంటే కుటుంబ సభ్యులు ఎవరికివారు ఇంట్లోనే పరీక్ష చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ఇంట్లోనే ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు అనుమతించింది. టెస్ట్ కిట్లను మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు కూడా అనుమతిస్తారు. పరీక్ష చేసుకునే విధానం కిట్ లో ఉంటుందని వైద్య, ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి. కిట్ ధరను మాత్రం త్వరలో వెల్లడించ నున్నాయి. ఇప్పటికే అమెరికా, యూకే వంటి అనేక దేశాల్లో ఇంట్లోనే పరీక్షలు చేసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్ ఆసుపత్రుల్లోనే.. ఇప్పటివరకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు తదితర చోట్లకు వెళ్లాల్సి వచ్చేది. దాదాపు 1,100 కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేసేవారు. ప్రైవేట్‌లో ఈ టెస్టులు అందుబాటులో లేవు. పది నిమిషాల్లో ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో 90 శాతం పరీక్షలు ర్యాపిడ్ యాంటిజెన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. రోజుకు వేలల్లో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రులకు వస్తుంటారు. దీనికోసం లైన్లలో నిలబడటం ప్రయాసగా మారింది. పైగా కరోనా ఉన్నవారు ఇతరులకు అంటించే కేంద్రాలుగా కూడా ఆసుపత్రుల వద్ద పరిస్థితి తయారైంది. తాజా నిర్ణయంతో ఈ ఇబ్బందులన్నీ తగ్గనున్నాయి. కొన్నిచోట్ల అనధికారికంగా కొన్ని లేబొరేటరీల్లో నిర్వాహకులు ఇంటికొచ్చి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. కాగా, ర్యాపిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, లేబొరేటరీల్లోనే చేస్తారు. ఇంటి వద్దకే మందులు.. ఇంట్లో కరోనా పరీక్ష చేసుకున్నవారికి పాజిటివ్ నిర్ధారణ అయితే ఆ విషయాన్ని సంబంధిత ఆసుపత్రికి తెలియజేస్తే, హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తారు. ఈ మేరకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ఎవరికివారు సొంతంగా పరీక్షలు చేయించుకుంటే ఆ వివరాలు ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఎంతమందికి కరోనా సోకిందో పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉండదన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగే స్వాబ్‌ను సరిగా తీయకుంటే సరైన ఫలితాలు వచ్చే అవకాశం తక్కువని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ వద్ద 25 లక్షల మేరకు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని రెండు కోట్ల వరకు కొనుగోలు చేస్తారు. -
Ragging in Suryapet: ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
సాక్షి, నల్గొండ: సూర్యాపేట మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటన నిజమేనని తేలింది. ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ హాస్టల్లో ర్యాగింగ్ జరిగినట్లు నివేదికలో తేల్చింది. ఏడాదిపాటు ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు డీఎంఈ తెలిపారు. విద్యార్థులు తక్షణం హాస్టల్ ఖాళీ చేయాలంటూ డీఎంఈ ఆదేశించారు. కాగా, ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కాగా, సూర్యాపేట మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఓ జూనియర్ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: (కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం) -
Suryapet: ర్యాగింగ్ ఘటనపై విచారణ
సూర్యాపేట క్రైం: సూర్యాపేట మెడికల్ కళాశాల బాలుర హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ శారద, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాబురావుతో పాటు పలువురు అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ, విద్యార్థుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సేకరించింది. అనంతరం ఈ కమిటీ విచారణ నివేదికను సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డికి సమర్పించింది. (చదవండి: కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం) బాధ్యులందరిపై కేసు నమోదు చేస్తాం.. బాధిత విద్యార్థి సాయికుమార్ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కూడా విచారణ జరిపారు. హాస్టల్‌ను సందర్శించి పలువురు మెడికోలను విచారించారు. కాగా, ర్యాగింగ్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని, ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. ఇంకా మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నామని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. గతంలో కూడా కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ జరిగినట్లు తెలిసిందని, విద్యా సంస్థలు, వసతిగృహాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, త్వరలో మెడికల్ కళాశాల వసతి గృహాల్లో కూడా ర్యాగింగ్‌ను నిరోధించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ మోహన్‌కుమార్, సీఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాల హాస్టల్లో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు మెడికల్ కళాశాల ఎదుట ధర్నా చేశారు. ర్యాగింగ్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. -
Andhra Pradesh: కొనసాగుతున్న టీనేజ్ టీకా డ్రైవ్
► ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకా కార్యక్రమం 7 కోట్ల మార్క్‌ను దాటింది. టీనేజర్లకు మొదటి రోజు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జోరుగా సాగింది. ఈ నెల 7 వరకూ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 6,454 కేంద్రాలలో టీకా కార్యక్రమం జరుగుతోంది. మొదటి రోజు డ్రైవ్‌లో ఇప్పటి వరకు 6 లక్షల మంది టీనేజర్లు సింగిల్ డోసు వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇంకా కార్యక్రమం కొనసాగుతోంది. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఈ నెల 7వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగనుంది. ► ఏపీలో 25 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ అందించనున్నారు. వ్యాక్సినేషన్ కోసం 40 లక్షల డోసులు సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ► మిగిలిన వారికి వారివారి ఇళ్ల వద్దే వ్యాక్సినేషన్ అందించనున్నారు.19 వేల వైద్య బృందాలు కోవిడ్ వ్యాక్సినేషన్లో పాల్గొన్నాయి. విజయవాడ పడమట వార్డు సచివాలయంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను హెల్త్ డైరెక్టర్ హైమావతి పశీలించారు. సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి నేటి నుంచి మరో కీలక ఘట్టం ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ కోవాగ్జిన్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ/వార్డు సచివాలయాలలో ఉదయం నుంచి టీకాల పంపిణీ చేపట్టనున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు ఇళ్లకు తిరిగి వచ్చిన అనంతరం టీకాలు పొందేందుకు వీలుగా మధ్యాహ్నం 3 గంటల తరువాత కూడా టీకా పంపిణీ కొనసాగించనున్నారు. తొలి మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ అనంతరం స్థానిక పరిస్థితుల ఆధారంగా విద్యా సంస్థల వద్ద టీకా పంపిణీపై అధికారులు చర్యలు తీసుకుంటారు. అదే దూకుడుతో.. గత ఏడాది జనవరిలో టీకాల పంపిణీ పెద్ద ఎత్తున ప్రారంభమైన విషయం తెలిసిందే. 18 ఏళ్లు పైబడిన 3.95 కోట్ల మందికి టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించి మహమ్మారి కట్టడికి దూకుడుగా ముందుకు వెళుతోంది. పెద్దల తరహాలోనే పిల్లలకూ శరవేగంగా టీకాలను ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. 28 రోజులకు రెండో డోసు తొలి డోసు టీకా తీసుకున్న 28 రోజుల అనంతరం పిల్లలకు రెండో డోసు ఇస్తారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు కోవిడ్ టీకాల ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అపోహలొద్దు.. పిల్లలకు ఇప్పిద్దాం అర్హులైన పిల్లలకు ఉచితంగా టీకాలు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు టీకా పంపిణీ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారు. అపోహలు వీడి టీకాలు తీసుకోవాలి. పిల్లలు టీకాలు పొందేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. 15–18 ఏళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలి. – కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం సచివాలయాలవారీగా పిల్లల వివరాలను ఇప్పటికే ఆరోగ్య శాఖ సిబ్బందికి అందించాం. వారంతా ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆశ వర్కర్లు నేటి నుంచి మరోసారి ఇళ్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. టీకా తీసుకున్న తరువాత ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే చికిత్స అందించేందుకు వీలుగా కేంద్రాలకు కిట్లు పంపిణీ చేశాం. అందుబాటులో అంబులెన్స్‌లు కూడా ఉంటాయి. – డాక్టర్ హైమవతి, ప్రజారోగ్య సంచాలకులు రోగ నిరోధకత పెరుగుతుంది పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే 15–18 ఏళ్ల వయసు పిల్లలు తరగతి గదుల్లో కూర్చోవడంతోపాటు నిత్యం వివిధ వర్గాలతో కలసి ప్రయాణం చేస్తుంటారు. వీరిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదు కానీ రోజూ ఎంతో మందిని కలుస్తున్నందున టీకా రక్షణ అవసరం. టీకా తీసుకోవడం ద్వారా రోగనిరోధకత బలపడుతుంది. వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుంది. – డాక్టర్ రాఘవేంద్రరావు, వైద్య విద్య సంచాలకులు 6.35 లక్షల మంది రిజిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల వయసు వారిలో ఆదివారం రాత్రి 7.50 గంటల వరకు 6.35 లక్షల మందికిపైగా కోవిడ్ వ్యాక్సినేషన్‌కు పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు, బృందాలను సిద్ధం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్య శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య సంసిద్ధత, వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించారు. ఈసీఆర్పీ–2 కింద ఆమోదించిన నిధులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరారు. మార్గదర్శకాల ప్రకారం పిల్లలకు టీకాల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. దేశంలో 15–18 ఏళ్ల వయసున్న పిల్లల సంఖ్య దాదాపు 10 కోట్లు ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేసింది. పిల్లల్లో అత్యవసర వినియోగం కోసం కోవ్యాగ్జిన్ టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనుమతించిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో.. రాష్ట్రంలో 15–18 ఏళ్ల లోపు పిల్లలు 24.41 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరందరికి వారం రోజుల్లో టీకాల పంపిణీ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కోవిన్ యాప్, పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు నేరుగా టీకా పంపిణీ కేంద్రాల్లోనూ పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందవచ్చు. ఆధార్ లేదా 10వ తరగతి గుర్తింపు కార్డు, ఇతర గుర్తింపు కార్డుల ద్వారా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
ఆర్సీటీ యూనిట్‌గా గాంధీ మెడికల్ కాలేజీ
గాంధీఆస్పత్రి: రీజనల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్ (ఆర్‌సీటీయు)గా గాంధీ మెడికల్ కాలేజీని ఎంపిక చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్(ఇంటెంట్)లో భాగంగా అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్(ఏసీసీటీ), రీజనల్ క్లినికల్ ట్రయల్ యూనిట్(ఆర్‌సీటీయు), ఐసీఎంఆర్ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్(ఐసీసీటీ), స్పెషాలిటీ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్ (ఎస్సీసీటీ), నాలెడ్జ్ పార్ట్నర్ ఫర్ క్లినికల్ ట్రయల్(కేపీసీటీ) వంటి ఐదు విభాగాల్లో దేశవ్యాప్తంగా పలు క్లినికల్ సెంటర్లను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలో ఆర్‌సీటీయు విభాగంలో గాంధీ మెడికల్ కాలేజీని ఎంపిక చేస్తు ఆదేశాలు జారీ చేసింది. రీజనల్ క్లినికల్ ట్రయల్ యూనిట్‌గా ఐసీఎంఆర్ గుర్తించడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రులను అభివృద్ధి చేసినందువల్లే ఇది సాధ్యమైందన్నారు. దీనివల్ల తెలంగాణ వైద్యులు, వైద్యవిద్యార్థులకు సైంటిఫిక్ స్టడీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలు పెరుగుతాయని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాంధీ మెడికల్ కాలేజీ మైక్రోబయోలజీ విభాగంలో ఇటీవల వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో మరిన్ని పరిశోధనలకు వెసులుబాటు కలుగుతుందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమేష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
మళ్లీ మొదలైంది.. మరో 235 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే భారీ తేడా కనిపిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారమే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలో 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం ఏకంగా 235కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అందులో జీహెచ్ఎంసీలో 23వ తేదీన 93 కేసులు నమోదైతే, 28వ తేదీన 110 కేసులు, తాజాగా 121 కేసులు రికార్డు అయ్యాయి. ఇలా వారం రోజుల్లో 11 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కాగా తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6.81 లక్షలకు చేరుకున్నాయి. ఒక రోజులో 204 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 6.73 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 4,024 మంది చనిపోయారు. ఇదిలావుండగా ముప్పున్న దేశాల నుంచి బుధవారం 346 మంది ప్రయాణికులు రాగా, అందులో 10 మందికి సాధారణ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. తాజా శాంపిళ్లతో కలుపుకొని ఫలితాలు రావాల్సినవి 23 కేసులున్నాయి. ఇప్పటివరకు 62 మందికి ఒమిక్రాన్ వ్యాపించిన విషయం తెలిసిందే. వారిలో తాజాగా ఐదుగురు కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 18కి చేరిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఇప్పటివరకు ముప్పున్న దేశాల నుంచి 12,267 మంది ప్రయాణీకులు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. -
కరోనా కల్లోలం
జన జీవితాల్లో కరోనా పెద్ద కల్లోలమే రేపింది. లక్షలాది కుటుంబాలను ఛిద్రం చేసింది. వేలాది కుటుంబాల్లో విషాదం నింపింది. 2020 మార్చిలో మొదలైన మహమ్మారి వైరస్ విజృంభణ... ఈ ఏడాది మరింత విజృంభించింది. రెండోవేవ్‌లో కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.80 లక్షల మంది కరోనా బారినపడ్డారు. అందులో 6.72 లక్షల మంది కోలుకున్నారు. 3,600 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో లేదా ఇళ్లల్లో చికిత్స పొందుతున్నారు. 4,018 మంది కరోనాతో చనిపోయారు. అనేకమంది ఇప్పటికీ పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 54,245 పడకలు ఉండగా, అవసరాన్ని బట్టి వాటిని కరోనా కేసులకు వాడుతున్నారు. కరోనా వైరస్ విజృంభణ సమయంలో వీటన్నింటినీ సంసిద్ధంగా ఉంచారు. మూడోవేవ్‌కు ముందస్తు ఏర్పాట్లు కరోనా మూడోవేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ఏర్పాట్లు చేశాయి. కరోనా నిర్ధారణ పరీక్షల దగ్గరి నుంచి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల వరకు అన్ని ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వం అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ ఫేజ్–2 కింద రాష్ట్రానికి రూ.456 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఏయే పనులకు నిధులు అవసరమన్న దానిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని, అందులో 20 పీడియాట్రిక్ బెడ్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 27.04 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను సిద్ధంగా ఉంచారు. 2.91 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచారు. 5.74 కోట్ల పారసిటమాల్ మాత్రలను, 2.44 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను నిల్వ ఉంచారు. 41.11 లక్షల ఎన్–95 మాస్క్‌లు సిద్ధంగా ఉంచారు. రోజుకు 80వేలకుపైగా పరీక్షలు కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను రోజుకు 80 వేలకుపైగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మేరకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను లక్షల సంఖ్యలో ముందస్తుగా అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా కొరత లేకుండా ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందులను కొనుగోలు చేసింది. ప్రధానంగా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అవసరమైన మేర కొనుగోలు చేసింది. అయితే కేంద్రం నుంచి ఇవి పూర్తిస్థాయిలో రాకపోవడంతో రోగుల బంధువులు అక్కడక్కడా బ్లాక్మార్కెట్లో కొనుగోలు చేశారు. కొన్ని సందర్భాల్లో రెండు మూడింతలు పెట్టి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన మందుల విషయంలో ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక ఆక్సిజన్ విషయంలో మాత్రం ఎక్కడా కొరత లేకుండా చూశారు. అయితే, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను చేసిన దోపిడీని అరికట్టడంలో కొంతమేర వైఫల్యం కనిపించింది. దాదాపు 200 ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. కొత్త ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను ప్రభుత్వం ఏప్రిల్‌లో బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ తీవ్రత ఉన్న సమయంలో ఈ మార్పు జరగడంతో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా కొన్ని నెలలపాటు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. దీంతో ఇబ్బందులు రాకుండా రెండో దశను ఎదుర్కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. -
ప్రజా వైద్యానికి.. రూ.10,000 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నడూలేని విధంగా 2021 సంవత్సరంలో అత్యంత విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఒకేసారి ప్రభుత్వ రంగంలో 8 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో రానున్న 2022–23 సంవత్సరంలో వైద్య కళాశాలలు ప్రారంభం అవుతాయి. ప్రతీ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 1,200 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 మెడికల్ కాలేజీలుంటే, అంతేమొత్తంలో కొత్త కాలేజీలు రావడం విప్లవాత్మక నిర్ణయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,840 అవుతుంది. కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్ ఎయిమ్స్ తరహాలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో వీటి సేవలు ఉండాలన్నది సర్కారు సంకల్పం. అలాగే వరంగల్లోనూ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కూడా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికి మెడికల్ హబ్‌గా మారుతుందని అంటున్నారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మానవవనరులను సమకూర్చి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నిధులను సాధారణ బడ్జెట్‌తో సంబంధం లేకుండా వచ్చే రెండేళ్లలో అదనంగా కేటాయించనుంది. ‘రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకూడదు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం’ అని సర్కారు చెప్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ. 6,295 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌ను సాధారణ అవసరాలకు, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. -
ఫస్ట్ డోసులో మనమే ఫస్ట్: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: మొదటి కరోనా డోసును వంద శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇప్పటివరకు అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లక్ష ద్వీప్, సిక్కిం వంటి 8 చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఈ ఘనత సాధించాయన్నారు. ఈ లక్ష్యం చేరడంలో వైద్యారోగ్య శాఖ కృషి ఎంతో ఉందన్నారు. మొదటి డోసు వంద శాతం పూర్తి అయిన సందర్భంగా ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో మంగళవారం ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... మున్సిపల్, పంచాయతీ, ఇతర శాఖల సమన్వయంతో వైద్య ఆరోగ్యశాఖ ఈ మైలు రాయిని చేరుకుందన్నారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి టీకాలు వే స్తున్న ఏఎన్ఎం, ఆశా వర్క ర్లు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనవరి 3 నుండి 15–18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ముందుగా హైదరాబాద్‌తోపాటు మున్సిపాలిటీల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని, ఆ తర్వాత గ్రామ స్థాయిలో ఇస్తామని చెప్పారు. -
ఒమిక్రాన్‌ను పట్టేందుకు..
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ‘చాపకింద నీరులా’ఒమిక్రాన్ విస్తరిస్తోందన్న అనుమానాల నేపథ్యంలో అప్రమత్తమైంది. మొదటి, రెండో కాంటాక్టులకూ వ్యాప్తి చెందుతుండటంతో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు విరివిగా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చినవారికి సాధారణ కరోనా సోకితే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షకు పంపిస్తున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ నమోదైన కేసుల్లో తీవ్రత ఉన్న వాటన్నింటినీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత అధికారులతోపాటు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకూ ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. ముప్పున్న దేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు విదేశాల నుంచి ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 1.25 లక్షలమంది వచ్చారు. వారిలో ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి దాదాపు 12 వేలమంది రాగా, మిగిలిన వారంతా ముప్పులేని దేశాల నుంచి వచ్చినవారే. ముప్పున్న దేశాల నుంచి వచ్చినవారిలో కేవలం నలుగురికి మాత్రమే ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. ముప్పున్న దేశాల నుంచి వచ్చేవారందరికీ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తుండగా, ముప్పులేని దేశాల నుంచి వచ్చినవారిలో కేవలం రెండు శాతమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. వారిలో ఎంతమందికి ఒమిక్రాన్ ఉందో ఎవరికీ తెలియదు. సీటీ వ్యాల్యూ 25 లేదా అంతకన్నా తక్కువుంటే... రాష్ట్రంలో నమోదయ్యే కరోనా పాజిటివ్ వ్య క్తుల్లో సీటీ వ్యాల్యూ 25 లేదా అంతకన్నా తక్కువ ఉన్నవారికి తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తద్వారా ఒమి క్రాన్ తీవ్రతను గుర్తించాలని భావిస్తున్నారు. సీటీ వ్యాల్యూ 25 లేదా అంతకన్నా తక్కువ ఉండటం అంటే తీవ్రత ఎక్కువ ఉన్నట్లు లెక్క. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు 150 నుంచి 190 మధ్య నమోదవుతున్నాయి. వీటిల్లో తీవ్రత ఉండేవి దాదాపు 70 శాతం వరకు ఉంటాయని అంచనా. అంటే, రోజుకు వంద వరకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాల్సి ఉంటుందని భావిస్తున్నారు. సీసీఎంబీ, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబోరేటరీలుసహా గాంధీ ఆసుపత్రిలోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
నియంత్రణలోనే ఉన్నా నిర్లక్ష్యమొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, అలా అని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ తదితర అం శాలపై సోమవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మొదటిడోసు లక్ష్యం వంద శాతానికి చేరువైందని, ఇదే స్ఫూర్తితో రెండోడోసును వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. 15– 18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్, 60 ఏళ్లు పైబడిన వారికి మూడో డోసు (బూస్టర్ డోస్) విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. 15–18 ఏళ్ల వయస్సువారు 22.78 లక్షలు, 60 ఏళ్ల పైబడిన వారు 41.60 లక్షలు, హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వారియర్లు 6.34 లక్షలున్నారని, వీరందరికీ దాదాపు 70 లక్షల వ్యాక్సిన్ అవసరం ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఏర్పాట్లను విభాగాలవారీగా సమీక్షించుకోవాలన్నారు. ఒమిక్రాన్ సోకి టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు కోలుకుంటున్నారని అధికారులు వివరించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్‌రావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
టీనేజర్ల టీకాకు ఢోకా లేదు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఈ వయసు టీనేజర్ల సంఖ్య 22.78 లక్షలుగా ఉందని లెక్కించింది. టీకాకు అర్హుల్లో ఎక్కువ శాతం మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులే ఉంటారని భావిస్తోంది. మరోవైపు పిల్లలకు టీకా ఇచ్చే విషయంలో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని చాలా మంది కంగారుపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోగా అక్కడక్కడా విద్యార్థులు కరోనా బారినపడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు. అలాగే జనవరి రెండో వారం నుంచి కరోనా తీవ్రత పెరుగుతుందని, ఫిబ్రవరి నాటికి తారస్థాయికి చేరుతుందని ప్రభుత్వం హెచ్చరించిందని... ఈ నేపథ్యంలో టీనేజర్లకు టీకా ఇవ్వడం అత్యంత కీలకమైనదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పరిధిలో ఉచితమే... టీనేజర్లకు ఇవ్వాల్సిన కరోనా టీకాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ ఉచితంగానే టీకా ఇస్తారు. అయితే ప్రైవేటులో ఇచ్చే టీకాను ప్రస్తుత ధరకే ఇస్తారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. పిల్లలకు టీకా ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మొదటి వారం రోజులపాటు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, తర్వాత అనుభవాలను బట్టి తదుపరి చర్యలుంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు 60 ఏళ్లు పైబడిన అనారోగ్య సమస్యలు ఉన్న వారితోపాటు వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రివెంటబుల్ డోస్ (బూస్టర్ డోసు) టీకా ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించడంతో ఆయా లబ్ధిదారుల సంఖ్య, వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు 41.60 లక్షల మంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 6.34 లక్షల మంది ఉంటారని, వారిలో రెండో డోస్ పూర్తయిన వారికి జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ ఇస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు నూటికి నూరు శాతం మంది మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోస్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. మార్గదర్శకాలపై స్పష్టత రావాలి... పిల్లలకు కరోనా టీకాతోపాటు పెద్దలకు ప్రివెంటబుల్ డోస్ (బూస్టర్)పై కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాం. ఇప్పటికైతే ప్రధాని విధాన నిర్ణయాన్నే ప్రకటించారు. దానికి సంబంధించి పూర్తి వివరాలతో మార్గదర్శకాలు రావాల్సి ఉంది. పిల్లలకు ఏ కంపెనీ టీకాలు వేస్తారు? ఎలా వేస్తారు? తదితర అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. – డాక్టర్ రమేశ్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు 15–18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా వేయాలని కేంద్రం నిర్ణయించడం సబబే. చిన్న వయసులో పిల్లలకు ఇచ్చే ఇతర టీకాలు ఎంత సురక్షితమో కరోనా వ్యాక్సిన్ కూడా అంతే సురక్షితం. ప్రస్తుతం ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీ పిల్లలకు వ్యాక్సిన్ వేయించడానికి తల్లిదండ్రులు వెనుకాడవద్దు. – డాక్టర్ ఎస్.కవిత, పీడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్, నిలోఫర్ -
10 మంది ఒమిక్రాన్ బాధితులకు నెగెటివ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 10 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 38 మంది ఒమిక్రాన్ బాధితులున్న సంగతి తెలిసిందే. వారిలో పది మంది కోలుకోవడంతో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. వారికి సాధారణ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. కోలుకున్నవారు పోను ప్రస్తుతం 28 మంది ఒమిక్రాన్‌తో బాధపడుతున్నారు. కాగా, శుక్రవారం రిస్క్ దేశాల నుంచి 883 మంది వచ్చారు. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. మొత్తం 15 మంది సీక్వెన్సింగ్ ఫలితాలు రావాల్సి ఉందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే అధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం రాష్ట్రంలో 35,037 కరోనా పరీక్షలు చేయగా, అందులో 162 మందికి పాజిటివ్ వచ్చింది. ఒకరోజులోఒకరు కరోనాతో మృతిచెందగా, ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,019కు చేరుకుంది. -
ఒక్క అడుగే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఒమిక్రాన్ దడ.. ముంగిట్లో థర్డ్‌వేవ్ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం జనం పరుగులు తీస్తున్నారు. ‘ఏం పర్వాలేదు’అని ఇప్పటివరకు అనాసక్తి చూపిన వాళ్లూ టీకా వేయించుకుంటున్నారు. రాష్ట్రంలో అర్హత గల వ్యక్తుల్లో 100 శాతం (99 శాతం) చేరువలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రెండో డోస్ వేయించుకున్నవారు కూడా 63 శాతానికి చేరుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వచ్చే నెల మొదటి వారం వరకు రెండో డోస్ అర్హత కలిగిన వ్యక్తులందరికీ కూడా 100 శాతం అందించేలా ప్రత్యేక ప్రణాళిక వేసినట్టు అధికారులు తెలిపారు. టార్గెట్ 2.7 కోట్లు మంది కరోనా వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడినవారికి వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం 18 ఏళ్లు నిండి వ్యాక్సిన్‌కు అర్హులైన వారు రాష్ట్రంలో 2,77,67,000 మంది ఉన్నారు. వీరందరికీ రెండు డోస్‌లు వ్యాక్సిన్ పూర్తి చేసే దిశగా సర్కారు ప్రణాళిక వేసింది. అర్హత గల వ్యక్తుల్లో ఇప్పటివరకు 2,75,88,003 మందికి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అనేక మంది వలస కూలీలు, కార్మికులు, ఇతర ఉద్యోగులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. హైదరాబాద్, మెదక్, ఇతర కొన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో 113 శాతం, హైదరాబాద్‌లో 110 శాతం, మెదక్‌లో 104 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ జరిగిందని అధికారులు తెలిపారు. ఇక రెండో డోస్ 1.76 కోట్ల మందికి (63 శాతం) వేశారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 86 శాతం, హైదరాబాద్‌లో 80 శాతం, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో 78 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం రెండో డోస్ వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యంత తక్కువగా కొమురం భీం జిల్లాలో 33 శాతం, వికారాబాద్ జిల్లాలో 36 శాతం, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 43 శాతం చొప్పున రెండో డోస్ వేశారు. వ్యాక్సినేషన్లో ముఖ్యాంశాలు ♦మొదటి, రెండో డోస్‌లు కలిపి 4.51 కోట్లు వేశారు. ప్రభుత్వ కేంద్రాల్లోనే ఎక్కువగా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ♦రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీకా డోస్‌లు – 33.98 లక్షలు. ఇందులో కోవిషీల్డ్ 19.17 లక్షలు, కోవాగ్జిన్ 14.81 లక్షల డోస్‌లు. ♦ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసేలా మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు. ♦కొన్నిచోట్ల కరోనా టీకాలు వేసుకోకపోతే జీతాలు ఇవ్వొద్దని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ♦పొలాలు, గడ్డివాముల మీదికి కూడా ఎక్కి వైద్య సిబ్బంది టీకాలేస్తున్నారు. పనిచేసే చోట కూడా వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ♦18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. -
చెత్త.. వేస్ట్ కాదు వనరు!
సాక్షి, సిద్దిపేట: ప్రజల భాగస్వామ్యం, పారిశుధ్య కార్మికుల పనితనంతో స్వచ్ఛతలో సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన బయో–సీఎన్జీ ప్లాంట్‌ను సోమవారం ఆయన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలసి ప్రారంభించారు. తడి చెత్తతో ఈ ప్లాంట్‌లో బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. రాష్ట్రంలో ఈ తరహా ప్లాంట్ ఇదే మొదటిది కావడం గమనార్హం. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బయో–సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటుకు బలం, బలగం సిద్దిపేట పుర ప్రజలేనని పేర్కొన్నారు. భారీగా పోగవుతున్న చెత్త కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోందని, భూమి, నీరు కలుషితం అవుతున్నాయని అన్నారు. సిద్దిపేట పట్టణంలో రోజుకు 55 వేల కిలోల చెత్త పోగవుతోందని, అయితే సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా ప్రజల భాగస్వామ్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల కృషితో సిద్దిపేట స్వచ్ఛ పట్టణంగా రూపుదిద్దుకుందని వివరించారు. తాము చెత్తను ఆదాయ వనరుగా మార్చామన్నారు. బయో –సీఎన్జీ ప్లాంట్‌లో త యారయ్యే గ్యాస్‌ను పట్టణంలో హోటళ్లకు సరఫరా చేస్తామ ని చెప్పారు. అలాగే మున్సిపల్ వాహనాలకు ఇంధనంగా ఈ సీఎన్జీ గ్యాస్‌ను ఉపయోగిస్తామని మంత్రి వెల్లడించారు. స్వచ్ఛతలో రాష్ట్రానికి ఆదర్శం సిద్దిపేట.. స్వచ్ఛత విషయంలో సిద్దిపేట జిల్లా తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు.« నాయకుల ధృడ సంకల్పం, దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం గొప్ప విషయం అన్నారు. ప్రసంగం ప్రారం భంలో ఆయన సభకు నమస్కారం.. అని తెలుగులో మాట్లా డి సభికులను ఆకట్టుకున్నారు. అనంతరం ప్లాంట్‌లో తిరు గుతూ ఫొటోలు తీసుకున్నారు. చెత్త రహిత వార్డుకు తులం బంగారం సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణంలో చెత్త రహిత వార్డు.. ఘనత సాధించే కౌన్సిలర్‌కు తులం బంగారం, వార్డు రిసో ర్స్ పర్సన్‌కు ఒక పట్టుచీరను బహుమతిగా ఇస్తా మని మం త్రి హరీశ్‌రావు ప్రకటించారు. సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తో ఆయన సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి పూట కొందరు రోడ్లపై చెత్త వేయడం వల్ల రోడ్లు అపరిశుభ్రంగా మారుతున్నాయని, అలాంటి ఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలని హరీశ్‌రావు అధికారులకు సూచించారు. బయో సీఎన్జీ తయారీ ఇలా.. ఇంటింటా సేకరించిన తడిచెత్తను తొలుత క్రషింగ్ చేస్తారు. అనంతరం పైప్ ద్వారా ప్రి–డిజాస్టర్ ట్యాంక్‌లోకి పంపిస్తారు. దాన్ని మూడ్రోజులు నిల్వ ఉంచు తారు. అది ద్రావణంగా మారాక మరో ట్యాంక్‌లోకి పం పిస్తారు. అనంతరం అందులో మైక్రో ఆర్గాన్లు కలుపుతారు. ఆ సమయంలో విడుదలయ్యే మీథేన్ గ్యాస్ నుంచి సీఎన్జీని వేరుచేసి సిలిండర్లలో నింపుతారు. -
త్వరలో అందుబాటులోకి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ వచ్చే వారంలో రాష్ట్రంలోనే అందుబాటులోకి రానుంది. దీని ఏర్పాటు కోసం సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 15% నమూనాలను వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించేందుకు హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా నిర్ధారణయితే.. వారి నమూనాలను కూడా హైదరాబాద్‌కే పంపాల్సి వస్తోంది. దీని వల్ల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విజయవాడలో ల్యాబ్ అందుబాటులోకి వస్తే ఫలితాలు త్వరగా వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. వచ్చే వారంలో ల్యాబ్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. ల్యాబ్‌లో పనిచేయనున్న వైద్యులు, సిబ్బందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించినట్టు చెప్పారు. -
15లోగా 100% మొదటి డోసు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ డిసెంబరు 15వ తేదీ లోపు మొదటి డోసు టీకా వేయడం 100 శాతం పూర్తి చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనీల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు.. టీకా బృందాలు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి ప్రతి ఇంటికీ వెళ్లి టీకా వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలి. జిల్లా కలెక్టర్లు కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ప్రజలంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలి. ఎవరైనా మాస్క్ ధరించకపోయినా, వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు కరోనా నిబంధనలు పాటించకపోయినా జరిమానా విధించాలి. కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో వ్యక్తులతోనే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం దృష్టి సారించాలి. ► ఒమిక్రాన్ కేసులు నమోదైన యూకే, యూరప్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయేల్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు, వీరి సన్నిహితులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ► చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. -
ఒమిక్రాన్‌ను ఓడిద్దాం
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిపై ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దేశంలో ఒమిక్రాన్ కేసు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కానప్పటికీ అధికారులు ముందు జాగ్రత్తగా అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అత్యవసర మందులు, సర్జికల్ పరికరాలు తదితరాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) అధికారులు ఆగమేఘాల మీద 2.5 లక్షలకు పైగా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, వేల సంఖ్యలో ఫావిపిరావిర్ మాత్రలు, యాంపోటెరిసిన్ ఇంజెక్షన్లు, పొసాకొనాజోల్ గ్యాస్ట్రో రెసిస్టెంట్ మాత్రలను సిద్ధం చేశారు. లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లతో పాటు పల్స్ ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, ఎన్–95, సర్జికల్ మాస్క్‌లను సిద్ధం చేశారు. కరోనా టెస్ట్‌లు చేసేందుకు 32 లక్షలకు పైగా ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాటిని మరింత పెంచాలని తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో ఆ కిట్లను భారీగా కొనుగోలు చేయాలని యోచిస్తున్నారు. మోనోక్లోనాల్ కొనుగోలుపై దృష్టి కరోనాబారిన పడినవారు త్వరగా కోలుకోవాలంటే అందుకు మోనోక్లోనాల్ యాంటీబాడీస్ ఔషధాన్ని ఇప్పుడు అనేక ప్రైవేట్, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇస్తున్నారు. దాని ధర మార్కెట్లో రూ. 60 వేల వరకు ఉంటుంది. కరోనా సోకిన వారికి నిర్ణీత డోస్‌లు ఇస్తే, వేగంగా కోలుకుంటున్నట్లు ఇటీవల పలు పరిశోధనలు వెల్లడించాయి. అయితే ఈ మందు ప్రైవేట్‌లోనే ఎక్కువగా లభ్యం అవుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వద్ద పెద్దగా అందుబాటులో లేదు. హైదరాబాద్ గాంధీ, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఇది లభిస్తోంది. వాటిని కేవలం వీఐపీల కోసమే వాడుతుండగా, ప్రస్తుతం ముఖ్యమైన ఈ మందు కొనుగోలుపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. అత్యవసరంగా టెండర్లు వేసి తెప్పించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
వేవ్ వచ్చినా.. వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం
గుంటూరు మెడికల్: మన రాష్ట్రానికి ఏ వేవ్ వచ్చినా, ఎలాంటి వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. వైద్య కళాశాల ప్రారంభమై 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా త్వరలో జరగనున్న ప్లాటినం జూబ్లీ వేడుకలకు గుర్తుగా కళాశాలలో సోమవారం పైలాన్‌కు శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ పైలాన్‌కు శంకుస్థాపన చేయడం వైద్య, ఆరోగ్యశాఖలో చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ పైలాన్‌ను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు చొరవతో గుంటూరు వైద్య కళాశాల ఏర్పడిందని, ఇక్కడ వైద్య విద్యను అభ్యసించిన ఎంతో మంది దేశ, విదేశాల్లో ప్రముఖ వైద్యులుగా స్థిరపడిపోయి దేశానికి మంచి పేరు తెస్తున్నట్టు తెలిపారు. వైద్య కళాశాల, జీజీహెచ్‌పై సీఎం ప్రత్యేక దృష్టి గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమంలో కళాశాల, ఆస్పత్రిలో పలు వార్డుల ఆధునికీకరణ, నూతన వైద్య విభాగాల నిర్మాణం కోసం సీఎం రూ.500 కోట్లు కేటాయించి.. నిర్మాణాలు చేయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ రూ.1,600 కోట్లతో అభివృద్ధి చేసేందుకు సీఎం శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కేఎస్ లక్ష్మణరావు, మేయర్ మనోహర్‌నాయుడు, డెప్యూటీ మేయర్ షేక్ సజీలా, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా తదితరులు పాల్గొన్నారు. -
మరింత ఉధృతంగా వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. టార్గెట్ నిర్దేశించుకుని మరీ వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్దేశించారు. వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతామన్నదే మన ముందున్న లక్ష్యమని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నెలాఖరుకల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ (ఇంకా మొదటి డోసు కూడా తీసుకోని వారు, రెండో డోసు తీసుకోవాల్సిన వారితో కలిపి) పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, కేంద్రం నుంచి వస్తున్న టీకాలను వీలైనంత త్వరగా వినియోగించాలని పేర్కొన్నారు. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్... హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్ మెడికల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయాలి. ర్యాపిడ్ టెస్టులు కాకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు మాత్రమే నిర్వహించాలి. మాస్క్‌లపై మళ్లీ డ్రైవ్.. అందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టి మళ్లీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ప్రజలు గుమిగూడకుండా చూడాలి. గతంలో ఉన్న నిబంధనలు అమలు చేయాలి. అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యం. మాస్క్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ వెంటనే పాటించాలి. ఆక్సిజన్ పైప్ లైన్లు పరీక్షించాలి.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పైప్లైన్లు సరిగ్గా ఉన్నాయా? డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా? గతంలో కోవిడ్ చికిత్స కోసం వినియోగించిన అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా? ఇవన్నీ సరి చూసుకోవాలి. ఎంప్యానల్ ఆసుపత్రులలో వసతులను కూడా పరిశీలించాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్‌పై మాక్ డ్రిల్ నిర్వహించాలి. క్షుణ్నంగా అన్నీ తనిఖీ చేయాలి. టెండర్లు పూర్తయిన మెడికల్ కాలేజీలకు వెంటనే అగ్రిమెంట్లు పూర్తి చేయాలి. అనారోగ్య సమస్యలపై కాల్ 104 ప్రజలకు ఏ అనారోగ్య సమస్య తలెత్తినా 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలి. క్వారంటైన్ సెంటర్స్, కోవిడ్ కేర్ సెంటర్స్, కోవిడ్ కాల్ సెంటర్లను పరిశీలించండి. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రికవరీ రేట్ 99.20 శాతం ► ఏపీలో రికవరీ రేట్ 99.20 శాతం కాగా పాజిటివిటీ రేట్ 0.64 శాతం ► నిత్యం సగటున 197 కేసులు నమోదు, యాక్టివ్ కేసులు 2,140 ► 104కి కాల్స్ తగ్గుదల ► థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధం ► అందుబాటులో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డీటైప్ సిలెండర్లు ► 100 బెడ్స్‌కి పైగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు 82 ► వ్యాక్సినేషన్ ఒక డోస్ పొందిన వారు 87.43 శాతం ► రెండు డోస్‌లు పొందిన వారు 62.19 శాతం ► డిసెంబర్, జనవరి కల్లా రాష్ట్రంలో అందరికీ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ త్వరలో విజయవాడలోనే జీనోమ్ ల్యాబ్ కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత మ్యుటేషన్లు జరుగుతున్నందువల్ల చాలా వేగంగా విస్తరిస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై వివిధ దేశాల్లో అధ్యయనం జరుగుతోందని, ఈ వేరియంట్‌ను గుర్తించేందుకు జీనోమిక్ సీక్వెన్స్ కోసం రోజూ 15 శాతం శాంపిళ్లను సీసీఎంబీకి పంపుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంగ్‌కాంగ్ నుంచి వస్తున్న వారిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్రం సూచించినట్లు వివరించారు. త్వరలోనే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి.కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జి ఏ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి జీఎస్.నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సత్తుపల్లిలో 250 పడకల ఆస్పత్రి
పంజగుట్ట: దేశంలో అన్నింటికన్నా వైద్యం ఎంతో ఖరీదుగా మారిందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో శ్రీ షిరిడీసాయి జన మంగళం ట్రస్ట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన ఆసుపత్రి లోగో, నమూనా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని, గతంలో 5 మెడికల్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం మరో 12 పెంచి మొత్తం 17 మెడికల్ కాలేజీలు, ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్యం అందించాలని 700 పీసీహెచ్ సెంటర్లకు అదనంగా గ్రామాల్లో 4 వేల పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ్డట్రస్ట్ ఆస్పత్రికి ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. గొప్ప కార్యక్రమం: టీటీడీ చైర్మన్ అందరూ ఆస్పత్రిని పెద్ద నగరంలో కడితే బాగుంటుందని అనుకుంటారని, కానీ సాయి ట్రస్ట్ మాత్రం సత్తుపల్లిలోని మారుమూల గిరిజన గ్రామాన్ని ఎంచుకుందని, ఇది గొప్ప కార్యక్రమమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఏపీ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలోనే ఆస్పత్రి రానుండటం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారికీ ఉపయోగంగా ఉంటుందన్నారు. టీటీడీ తరఫున తామూ కొన్ని ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందిస్తున్నామని, ఇటీవల పీడియాట్రిక్ ఆస్పత్రి పారంభించామని చెప్పారు. అభినందనీయం: నటుడు మోహన్‌బాబు ఎదుటివారి కష్టాలు తెలుసుకొని తీర్చేందుకు మారుమూల ప్రాంతంలో ఆస్పత్రి నిర్మిస్తున్న సాయి ట్రస్ట్ ప్రతినిధులు అభినందనీయులని ప్రముఖ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్‌బాబు అన్నారు. రెండేళ్లుగా ప్రజలు కొత్తకొత్త వ్యాధులతో సతమతమౌతున్నారని వారి ఇబ్బందులు చూసి మారుమూల ప్రాంతంలోని ప్రజలకు వైద్యం అందించేందుకు ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఐపీఎస్ చంద్రభాను సత్పతి, ట్రస్ట్ ప్రతినిధి రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆరోగ్యంలో అందరికంటే ముందుందాం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య సూచీల్లో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కృషి చేయాలని మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య సూచీల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాల పురోగతిపై సమీక్షించి లక్ష్యాలను సాధించాలని, ఆ దిశగా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇకపై పనితీరులో నెలవారీ వృద్ధి కనిపించాలని, అధికారుల పదోన్నతులు, ప్రోత్సాహకాలకు ఈ గణాంకాలే ప్రామాణికమన్నారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయో హరీశ్‌రావు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. క్యాథ్ ల్యాబ్స్ సిద్ధం చేయాలి... రెండు వారాల్లోగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో క్యాథ్ లాబ్స్ సిద్ధం చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. అలాగే వచ్చే నెల రెండో వారంలోగా ఖమ్మంలోని క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ఆన్లైన్ (హెచ్ఐఎంఎస్)లో నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లోనే 100% ప్రసవాలు జరగాలి ప్రసూతి మరణాలు తగ్గించడంలో దేశంలో మనం నాలుగో స్థానంలో ఉన్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి స్థానంలోకి తెలంగాణ వచ్చేలా కృషి చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రస్తుతమున్న 97 శాతం నుంచి 100 శాతానికి పెంచాలన్నారు. టీ–డయాగ్నొస్టిక్స్ దేశానికే ఆదర్శం... పేద రోగులకు ఉచితంగా నాణ్యమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ–డయాగ్నొస్టిక్స్ సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. టీ–డయాగ్నొస్టిక్స్ సేవలు ప్రజలకు అందుతున్న తీరును పరీశిలించేందుకు గత నెలలో బిహార్ ప్రభుత్వ అధికారులు రాష్ట్రాన్ని సందర్శించారన్నారు. వచ్చే వారం యూపీ, ఆ తర్వాత కేరళ, తమిళనాడు సైతం తమ బృందాలను రాష్ట్రానికి పంపుతున్నాయన్నారు. -
వచ్చే నెల తొలి వారంలో ‘హెల్త్ ప్రొఫైల్’
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల మొదటివారంలో ముందుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఊరూరా ఇల్లిల్లూ తిరిగి ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం సేకరించి హెల్త్ ప్రొఫైల్‌ను పక్కాగా రూపొందించాలని సూచించారు. సోమవారం ఇక్కడ జరిగిన వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ఈ పరీక్షలు పూర్తయినవారి ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజ్ చేస్తారని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా ఆసుపత్రికి వెళ్లినా, యాక్సిడెంట్‌కు గురైనా అతడి ఆరోగ్య సమాచారమంతా క్లౌడ్ స్టోరేజ్ నుంచి తెప్పించుకుని వైద్యసేవలు అందిస్తారని అన్నారు. హెల్త్ ప్రొఫైల్ సమాచారం పకడ్బందీగా ఉంటే, ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలవుతుందన్నారు. అదేవిధంగా, రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి... ఆ ప్రాంతంలో ఎలాంటి వైద్యసేవలు, మందులు అవసరం... ఎలాంటి వైద్య నిపుణులు, వైద్య పరికరాలు అవసరం... అనేవి తెలుస్తాయని వివరించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌లో ప్రస్తుతం 8 పరీక్షలు చేస్తుండగా, తెలంగాణ డయాగ్నసిస్ ద్వారా 57 టెస్టులు చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇందులో వాడే పరికరాల ద్వారా ఫలితాలు కచ్చితంగా ఉంటాయని, రోజుకు పదివేల పరీక్షలు చేయొచ్చని పేర్కొన్నారు. నోడల్ ఆఫీసర్ల ద్వారా వేగంగా.. ప్రతి ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్య సమాచారం తీసుకోవాలని, నోడల్ ఆఫీసర్లను నియమించి ఈ ప్రక్రియ వేగంగా సాగేలా చూడాలని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్‌ను ఎలా తయారు చేయనున్నారనే వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, షుగర్, బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సమాచారం ద్వారా వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ అంచనా వేసి, హైరిస్క్ వాళ్లకు అవసరమైవ వైద్యసేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్‌రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్‌లతో కూడిన కమిటీ ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : సీఎస్ సమీర్‌శర్మ
సాక్షి, అమరావతి: కోవిడ్ థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్‌శర్మ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన గురువారం సచివాలయంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కమిషనర్ కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ థర్డ్‌వేవ్‌ను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. థర్డ్‌వేవ్ కోవిడ్‌ను గుర్తించి, అందుకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్సు ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ హెల్త్ సమాచార ప్లాట్‌ఫామ్, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరు గురించి ఆరా తీశారు. సకాలంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. -
వైద్య ఆరోగ్యశాఖలో 10,865 పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు పెద్ద ఎత్తున కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 10,865 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 7,390, కొత్తగా సృష్టించినవి 3,475 ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డీఎంఈ పరిధిలోని 15 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న 35 ఆస్పత్రుల్లో 1,952 పోస్టులు ఖాళీగా ఉండగా 2,190 పోస్టులను సృష్టించారు. ఏపీవీవీపీ పరిధిలో 2,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 2,918 పోస్టులు ఖాళీగా ఉండగా 1,285 పోస్టులను సృష్టించారు. బోధనాస్పత్రుల్లోని చాలా విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలు అమలు చేయడం ఇబ్బందిగా ఉంటోంది. బోధనాస్పత్రుల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ విభాగాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సృష్టించిన పోస్టులను కూడా ఒకేసారి భర్తీ చేయనున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో భాగంగా 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్.. ఇలా మొత్తం 12 మంది ఉండాలని నిర్ణయించింది. అదేవిధంగా 560 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఒక్కో ఫార్మసిస్ట్‌లు ఉండేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి ఆయా విభాగాలు, జిల్లా ఎంపిక కమిటీలు నోటిఫికేషన్లు ఇవ్వనున్నాయి. -
హెల్త్ ప్రొఫైల్‌కు సాఫ్ట్వేర్ రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లా ల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ తయా రీకి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆయా వ్యక్తులను హెల్త్ చెకప్ చేసి ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు హైదరాబాద్ ఐఐటీ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ పనితీరుపై సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ అధికారు లతో చర్చించారు. హెల్త్ ప్రొఫైల్‌పై సమగ్ర కార్యాచరణను రూపొందించడానికి త్వరలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహి స్తారు. కాగా, గ్రామాలు, పట్టణాల్లోని ఇంటిం టికీ వెళ్లి కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు, బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. ఈసీజీ సహా కొన్ని రక్త, మూత్ర పరీక్షలను మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. బ్లడ్ గ్రూప్, రక్తంలో ఆక్సిజన్ శాతం, గుండె కొట్టుకునే తీరు తదితర పరీక్షలు చేస్తారు. వీటితోపాటు ఇంకా ఏమైనా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనేదానిపై కూడా పరీక్ష చేసి వివరాలు నమోదు చేస్తారు. ఈ సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్ కేటాయిస్తారు. ఈ రెండు జిల్లాల తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ నిర్వహి స్తామని అధికారులు వెల్లడించారు. -
కరోనా వ్యాక్సిన్‌కు స్పందన కరువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. టీకా డోసులు అందుబాటులో ఉన్నా, అర్హులైన లబ్ధిదారులు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడంలేదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం పెద్దగా లేదన్న భావనతోనే చాలామంది టీకాలు తీసుకోవడానికి ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా కరోనా టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, రోజుకు 5 లక్షల వరకు డోసులు వేయాలని భావించారు. అవసరమైతే ఏడెనిమిది లక్షలు కూడా వేసేందుకు సన్నాహాలు చేశారు. అందుకోసం ప్రత్యేక డ్రైవ్ కూడా పెట్టారు. కానీ, ప్రస్తుతం రోజుకు అటుఇటుగా రెండుమూడు లక్షలకు మించి టీకాలు నమోదు కావడంలేదని అధికారులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా కేసులు దాదాపు 200 లోపు నమోదవుతున్నాయి. కరోనాతో ఒక్కోరోజు ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు. కరోనా పూర్తిగా తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. పూర్తిగా తగ్గే అవకాశాలు కూడా లేవంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని స్కూళ్లల్లో కేసులు వెలుగుచూస్తున్నాయి. కాబట్టి ఏమరుపాటు తగదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొంటున్నారు. 20 రోజుల్లో 52.76 లక్షల డోస్‌లు వచ్చే అవకాశం... ఈ నెలలో ఇప్పటివరకు 20.77 లక్షల కరోనా టీకాలు రాగా, నెలాఖరు వరకు మరో 52.76 లక్షల టీకాలు వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ అ ంచనా వేసింది. టీకాలు అందుబాటులో ఉ న్నా తీసుకునేవారు ముందుకురాకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ►ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా డోసులు తీసుకున్నవారిలో ఎక్కువగా ప్రభుత్వం నుంచి ఉచితంగా తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. 3.01 కోట్ల మంది ప్రభుత్వం నుంచి కరోనా వ్యాక్సిన్లు పొందగా, 38.77 లక్షల మంది ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా పొందారు. ►దేశంలో అర్హులైనవారిలో మొదటి డోస్ తీసుకున్నవారు 79% ఉండ గా, తెలంగాణలో 84.3 % ఉన్నారు. ►రెండో డోస్ తీసుకున్నవారు దేశవ్యాప్తంగా 37.5 శాతం ఉండగా, తెలంగాణలో 38.5 శాతం ఉన్నారు. ►ప్రధానమైన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 8వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 3.40 కోట్ల డోస్‌లు అందజేత... రాష్ట్రంలో ఇప్పటివరకు 3.40 కోట్ల డోసుల టీకాలు వేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో మొదటి డోసు వేసుకొని రెండో డోసు తీసుకోనివారు చాలామంది ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా మొదటి డోసు టీకా తీసుకున్నవారు నూటికి నూరు శాతం ఉన్నారు. అత్యంత తక్కువగా వికారాబాద్ జిల్లాలో 66 శాతమే ఉన్నారు. రాష్ట్రంలో టీకాకు అర్హుల సంఖ్య: 2.77 కోట్లు ఇందులో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య: 2.33 కోట్లు రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య: 1.06 కోట్లు -
ప్రభుత్వ వైద్యులు.. భేష్
కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యులకు మరోమారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నుంచి ప్రశంసలు దక్కాయి. గత నెల 26న అడవి దున్న దాడిలో పాల్వంచ మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన సమ్మయ్య ముఖం ఛిద్రం కావడంతోపాటు ఎడమ కన్ను దెబ్బతినగా, డవడ ఎముక, కుడి పక్క ఆరు పక్కటెముకలు విరిగాయి. దీంతో ఆయనను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ముక్కంటేశ్వరావు, ఆర్ఎంఓ డాక్టర్ రవిబాబు నేతృత్వంలో జనరల్ సర్జన్ డాక్టర్ విజయ్‌కుమార్, ఎండీ ఫిజీషియన్ డాక్టర్ వెంకన్న, డాక్టర్ నవీన్‌లు ఫేషియల్ రీ కన్‌స్ట్రక్టన్ సర్జరీ చేశారు. ఈ సర్జరీకి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనైతే రూ.10 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. సర్జరీ ద్వారా వెంకన్న ముఖం పూర్వ స్థితికి చేరుకోవడంతో శనివారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ ట్విట్టర్ వేదికగా డాక్టర్లను అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నామనడానికి సమ్మయ్య ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. -
జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకాల కార్యక్రమం జాతీయ సగటును మించి పూర్తయిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ వేశారని చెప్పారు. జాతీయ స్థాయిలో మొదటి డోస్ 79 శాతం, రెండో డోస్ 37.5 శాతం నమోదైందని వివరించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌పై రేపు వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త వైద్య కళాశాలలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై హరీశ్‌రావు చర్చించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ వేగం పెంచడంలో భాగంగా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్ కోఠి జిల్లా దవాఖానాలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరించాలని, టిమ్స్ ఆస్పత్రిలో 200 పడకలు (ఇవి కోవిడ్ చికిత్స కోసం) మినహా సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని, టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు, ఆసుపత్రి బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ పరిస్థితిని వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
కరోనా మరణాల నిర్ధారణకు త్రిసభ్య కమిటీ
సాక్షి, హైదరాబాద్: కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. కరోనాతో మరణించినట్లుగా అధికారికంగా ధ్రువపత్రాన్ని జారీ చేసేందుకు కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీని నియమిస్తూ సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో), జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్లను సభ్యులుగా నియమించింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నష్టపరిహారాన్ని కోరుతూ మీ సేవా కేంద్రం ద్వారా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ నష్టపరిహారం చెల్లిస్తుంది. అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా వారి బ్యాంకు ఖాతాలోనే నేరుగా నష్టపరిహారాన్ని జమ చేస్తారు. ఇవీ మార్గదర్శకాలు... కరోనా మరణ ధ్రువపత్రం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. విషం తాగడం, హత్య, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాలు తదితర కారణాలతో మరణించినవారికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా బయటపడితే, ఆ మరణాన్ని కరోనా మృతిగా పరిగణించబోమని స్పష్టం చేసింది. 80 శాతం కరోనా మరణాలు వ్యాధి బారినపడిన 13 రోజుల్లోనే సంభవించగా, 90 శాతం మరణాలు 18 రోజుల్లోపు, 95 శాతం మరణాలు 25 రోజుల్లోగా జరిగాయి. ఈ నేపథ్యంలో కరోనా బారినపడిన 30 రోజుల్లోగా బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందితే, దాన్ని కరోనా మరణంగానే పరిగణనలోకి తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా నిర్ధారణ అయిన తర్వాత కొందరు ఇంటి వద్దే చికిత్స పొందుతూ మరణిస్తే, దానిని కూడా కోవిడ్ మృతిగానే పరిగణించాలని పేర్కొంది. వీరేకాకుండా తమ బంధువుల మరణాలు కరోనా కారణంగానే జరిగాయని భావించేవారు త్రిసభ్య కమిటీకి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత జిల్లాస్థాయి కమిటీ ధ్రువపత్రాన్ని జారీచేస్తుందని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో సోమవారం నాటికి 3,967 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆయా కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే, నష్టపరిహారం సొమ్ము అందుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రభుత్వం దృష్టికి రాని మరణాలు కూడా ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. అలాంటి మరణాలకు సంబంధించి కూడా మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే వాటిని కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. -
సీపీసీహెచ్ లేకున్నా.. దరఖాస్తు చేసుకోవచ్చు
సాక్షి, అమరావతి: మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టులకు బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సర్టిఫికెట్ ప్రోగ్రాం ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) పూర్తి చేయని వారిని సైతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. దరఖాస్తుల సమర్పణకు శనివారం (6వ తేదీ) చివరి రోజు అయిన నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సీపీసీహెచ్ లేని వారికి సంబంధించిన మెరిట్ జాబితాను మాత్రం తమ ఆదేశాల తరువాతే ప్రకటించాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సర్టిఫికెట్ ప్రోగ్రాం ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) పూర్తి చేసిన వారు మాత్రమే మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటనను సవాలు చేస్తూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ అసనుద్దీన్ ధర్మాసనం విచారణ జరిపింది. బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సీపీసీహెచ్‌ను 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారని పిటిషనర్ సంఘం తరఫు న్యాయవాది తెలిపారు. 2019కి ముందు ఈ ప్రోగ్రాం లేదని, ప్రోగ్రాం తీసుకొచ్చిన తరువాత జరుగుతున్న మొదటి రిక్రూట్మెంట్ ఇదేనని వివరించారు. 2019కి ముందు బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారు మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టుల భర్తీకి అనర్హులవుతారని, ఇది ఏకపక్ష నిర్ణయమని, అందువల్ల ఇందులో జోక్యం చేసుకుని, సీపీసీహెచ్ లేని వారు సైతం దరఖాస్తు చేసుకునే అనుమతినివ్వాలని కోరారు. ఈ నెల 6వ తేదీనే దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అని, ఇప్పుడు దరఖాస్తుల సమర్పణకు అనుమతివ్వకపోతే తమ ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని చెప్పారు. పూర్తి వివరాల సమర్పణకు గడువు కావాలని సహాయ ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి సీపీసీహెచ్ లేని వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినివ్వాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. -
తెలంగాణలో పురోగతి.. ప్రతి వెయ్యికి 23 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల కారణంగానే ఈ పురోగతి కనిపిస్తోందని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 2019లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) సర్వే నిర్వహించి తాజాగా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 30 మంది మరణిస్తుండగా, తెలంగాణలో 23 మంది శిశువులు మరణిస్తున్నారు. 2014లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి శిశు జననాల్లో 35 మంది చనిపోయేవారని ఎస్ఆర్ఎస్ వెల్లడించింది. 1971లో దేశంలో శిశు మరణాల రేటు 129 ఉండేది. 21 పెద్ద రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల రేటు అత్యంత తక్కువగా కేరళలో ప్రతి వెయ్యికి ఆరుగురు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 46 మంది మరణిస్తున్నారు. 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాం, నాగాలాండ్‌లో ప్రతి మందికి ముగ్గురు చొప్పున శిశువులు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మేఘాలయలో 33 మంది మరణిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యంత తక్కువగా అండమాన్ అండ్ నికోబార్‌లో ఏడుగురు మరణిస్తుండగా, అత్యంత ఎక్కువగా డామన్, డయ్యూలో 17 మంది శిశువులు మరణిస్తున్నారు. పల్లెల్లో అధికంగా శిశు మరణాల రేటు.. రాష్ట్రంలో మగ శిశు మరణాల రేటు 24, ఆడ శిశువుల మరణాల రేటు 22గా ఉంది. పట్టణాల్లో శిశు మరణాల రేటు 18 ఉండగా, పల్లెల్లో 26 మంది మరణిస్తున్నారు. పల్లెల్లో మరణించే శిశువుల్లో 27 మంది మగ శిశువులు, 25 మంది ఆడ శిశువులు ఉన్నారు. పట్టణాల్లో మరణించే శిశువుల్లో 18 మంది మగ, 19 మంది ఆడ శిశువులు ఉన్నారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటులో గ్రామాలకు, పట్టణాలకు మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఈ తేడాకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడమేనని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదో అర్ధ రాత్రి గర్భిణీకి పురిటి నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లే దిక్కుండదు. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే సరికి శిశు మరణాలు సంభవిస్తున్నాయన్న భావన నెలకొని ఉంది. సమీప పట్టణాలకు తీసుకెళ్లాలంటే ఎంతో సమయం తీసుకుంటుంది. ఇక గిరిజన ప్రాంతాల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉంది. పట్టణాలు, నగరాల్లోనైతే వైద్య వసతి అధికంగా ఉండటం వల్ల ఇక్కడ శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ప్రసవ సమయంలో తక్షణమే స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లే వెసులుబాటు ఉంటేనే శిశు మరణాల రేటు తక్కువగా నమోదు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. తగ్గుదలకు కారణాలివే.. తెలంగాణలో శిశు మరణాలు గతం కంటే తగ్గడానికి ప్రధాన కారణం ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగడమేనని చెబుతున్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం, ఆసుపత్రుల్లో శిశు మరణాలు పెరగకుండా ప్రత్యేకమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడమేనని పేర్కొంటున్నారు. కేసీఆర్ కిట్‌ను ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు ప్రోత్సాహకం ఇస్తుండటం కూడా శిశు మరణాల రేటు తగ్గుతోందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
కరోనా పూర్తిస్థాయిలో తగ్గలే.. ముప్పు పొంచి ఉంది.. వైద్య నిపుణుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కరోనా పూర్తిస్థాయిలో తగ్గిపోలేదని ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా తగ్గిపోయిందిలే అన్న ధోరణి చాలా మందిలో పెరిగిపోయిందని, కానీ రష్యా, యూకేల్లో కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటంతో థర్డ్‌వేవ్ పొంచి ఉందనే విషయాన్ని గమనంలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. సెకండ్ వేవ్‌లో ఇన్ఫెక్షన్ బారినపడి కోలుకోవడం, వ్యాక్సినేషన్ జరగడంతో చాలామందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందాయి కానీ, అవి ఎన్నోరోజులు ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఆరు నెలల వరకే కరోనా నుంచి రక్షణ ఏర్పడుతుందని, ఆ తర్వాత మళ్లీ వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌ల్లో ఇన్ఫెక్షన్కు గురికానివారు, వ్యాక్సిన్ వేసుకోనివారిలో కొందరికి థర్డ్‌వేవ్‌లో ప్రమాదం పొంచి ఉండొచ్చని చెబుతున్నారు. తెలంగాణలో స్థిరంగా కేసుల నమోదు... రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతూనే ఉన్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి నుంచి బయటపడిన తర్వాత గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. నిర్ధారణ పరీక్షలను బట్టి చూస్తే రోజుకు సగటున 200 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ గాంధీ వంటి ఆసుపత్రుల్లో కొందరు చికిత్స పొందుతూనే ఉన్నారు. అలాగే సగటున రోజుకు ఒకరు మరణిస్తున్నారు. అంటే కరోనా నియంత్రణలోనే ఉన్నా ప్రమాదం మాత్రం తొలగిపోలేదని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. కేంద్రం సన్నాహాలు.. రాష్ట్రాలకు నిధులు థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో సన్నాహాలు మొదలుపెట్టింది. అందుకోసం అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ–ఫేజ్–2 కింద తెలంగాణకు ఇటీవల రూ.456 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఈ నిధులను ఏయే రంగాల్లో ఖర్చు చేయాలన్న దానిపై స్పష్టత కూడా ఇచ్చింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని ఎదుర్కోవడంపై దృష్టి సారించాలని సూచించింది. థర్డ్‌వేవ్ రాకముందే ముందుచూపుతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే రంగాలపై నిధులు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను సిద్ధం చేయడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వివిధ కార్యక్రమాలను అమలు చేయాలని సూచించింది. పీడియాట్రిక్ కేర్‌కు పెద్దపీట ఇప్పటివరకు 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా వేయనందున వారిపై కరోనా పంజా విసిరే ప్రమాదముంది. అందుకే వైద్య ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలకు, అందులో ప్రధానంగా పీడియాట్రిక్ కేర్ యూనిట్లకు వైద్య ఆరోగ్య శాఖ పెద్దపీట వేసింది. ఈ రంగాలకు ఉమ్మడిగా రూ.270 కోట్లు కేటాయించారు. అలాగే ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని, అందులో 20 పీడియాట్రిక్ ఐసీయూ పడకలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ‘థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని పీజీ మెడికల్ రెసిడెంట్లను కోవిడ్ మేనేజ్మెంట్ విధుల కోసం తాత్కాలిక పద్ధతిన నియమించుకోవాలి. కొందరు ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులను కోవిడ్ కోసం వచ్చే ఏడాది మార్చి వరకు తాత్కాలిక పద్ధతిన తీసుకోవాలి. అలాగే జీఎన్ఎం నర్సింగ్ ఫైనలియర్ విద్యార్థులను తాత్కాలిక పద్ధతిన తీసుకోవాలి. వచ్చే ఏడాది మార్చి నాటికి మెడికల్ కాలేజీల్లో 825 ఐసీయూ పడకలు, జిల్లా ఆసుపత్రుల్లో 90 ఐసీయూ పడకలను చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించాలి. రిఫరల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి..’అని కేంద్రం సూచించింది. -
గ్రామ సచివాలయాలే.. ఇక కోవిడ్ చికిత్స కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్లో కీలక పాత్ర పోషించిన గ్రామ సచివాలయాలు ఇప్పుడు మరో చరిత్ర సృష్టించనున్నాయి. వికేంద్రీకరణలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ కేర్ సెంటర్లను గ్రామ సచివాలయాల పరిధిలోనే ఏర్పాటు చేయబోతున్నారు. కోవిడ్ తీవ్రత తక్కువగా ఉండి, సాధారణ మందులతోనే నయమయ్యే పరిస్థితులున్నప్పుడు.. వారికి గ్రామ సచివాలయాల కోవిడ్ కేర్ సెంటర్లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కోవిడ్ సోకితే చిన్న చిన్న కుటుంబాలు, చిన్న ఇళ్లలో ఐసొలేషన్‌లో ఉండటం సాధ్యం కాదు. అందుకే గ్రామ సచివాలయాల్లోనే 5 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, మూడో వేవ్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆరోగ్య పరిరక్షణ ఏఎన్ఎంలకు.. గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసే పడకల్లో చేరే కోవిడ్ బాధితుల ఆరోగ్య పర్యవేక్షణ ఏఎన్ఎంలకు అప్పగిస్తారు. నిర్వహణ బాధ్యతలు మాత్రం వార్డు సెక్రటరీ చూసుకుంటారు. భోజనం, మందులు సచివాలయ సిబ్బందే అందజేస్తారు. ఒకవేళ ఎవరికైనా కోవిడ్ తీవ్రత ఎక్కువైతే పంచాయతీ సెక్రటరీ లేదా తహసీల్దార్‌కు సమాచారం ఇస్తే.. అధికారులే దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసే కోవిడ్ కేర్ సెంటర్‌కు అవసరమైన వైద్య ఉపకరణాలను కుటుంబ సంక్షేమశాఖ అందజేస్తుంది. 11,789 గ్రామ సచివాలయాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 11,789 గ్రామ సచివాలయాల్లో పడకలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కో కోవిడ్ కేంద్రంలో 4 నుంచి 5 పడకలు ఏర్పాటు చేస్తారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,186 మైనర్ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ మూడో వేవ్ వస్తే ముందస్తు అంచనాలను బట్టి ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. -
8 కోట్ల జ్వరం బిళ్లలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఆర్నెల్లుగా జ్వరానికి వాడే పారాసెటిమాల్ అత్యధికంగా వినియోగించినట్లు వైద్య ఆరోగ్యశాఖ, ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) పరిశీలనలో వెల్లడైంది. కోవిడ్ నేపథ్యంలో చిన్నపాటి జ్వరం సూచనలు ఉన్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పారాసెటిమాల్ తీసుకుంటున్నారు. గత ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ రాష్ట్రంలో 8,13,44,410 మాత్రలను వినియోగించారు. రోజుకు సగటున 4.51 లక్షల మాత్రలకు పైగా వినియోగం నమోదైంది. కోవిడ్‌కు ముందు అంటే 2020 కంటే ముందు పోలిస్తే ఈ వినియోగం చాలా ఎక్కువగా ఉన్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. భారీగా నొప్పి నివారణ మందులు.. చాలామంది తాత్కాలిక ఉపశమనం కోసం నొప్పి నివారణ మందులకు అలవాటు పడినట్టు గుర్తించారు. ఆరు నెలల్లో 6.63 కోట్ల డైక్లోఫినాక్ మాత్రలు వాడారంటే పెయిన్‌కిల్లర్స్ వినియోగం ఎలా ఉందో అంచనా వేయచ్చు. ఏదైనా గాయాలైనప్పుడు, ఆపరేషన్లు, విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు తాత్కాలికంగా వాడి గాయాల తీవ్రత తగ్గగానే ఆపాలి. కానీ చాలామంది చిన్న తలనొప్పి, ఒళ్లు నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడ్డారు. ఇవి ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మధుమేహంతో జాగ్రత్త ఒక్కసారి మధుమేహం వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. కొత్తగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత 180 రోజుల్లో 6.44 కోట్ల మెట్ఫార్మిన్ మాత్రలు వినియోగమయ్యాయి. రక్తపోటు (బీపీ) బాధితులకు ఇచ్చే అటెన్‌లాల్ మాత్రలు 3.76 కోట్లు వినియోగమయ్యాయి. బీపీ, షుగర్ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని, వ్యాయామం, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమయానికి తినకపోవడం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లాంటి కారణాలతో గ్యాస్ సమస్యలు తలెత్తి 3.24 కోట్ల ర్యాంటిడిన్ మాత్రలు వినియోగించారు. గత ఆర్నెల్లలో రకరకాల మాత్రలకు రూ.73 కోట్లు వెచ్చించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక డబ్లూహెచ్‌వో/జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ స్టాండర్డ్స్) ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 510 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో 481 రకాల మందులు ఏదో ఒక సందర్భంలో వినియోగించినట్టు తేలింది. కోవిడ్ సమయంలో ఎక్కడా మందుల కొరత లేకుండా సర్కారు పటిష్ట చర్యలు చేపట్టగలిగిందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. -
3,393 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ రిక్రూట్మెంట్కు ప్రభుత్వం తెరలేపింది. వైఎస్సార్ విలేజ్, వార్డు క్లినిక్స్‌లో వైద్య సేవలు అందించడానికి 3,393 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా వైద్య చికిత్సలు, పరీక్షలను ప్రజల చెంతకే తీసుకువెళ్లనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వైద్య ఆరోగ్య శాఖ తొలి దశలో 3,393 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి శనివారం నుంచే దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 6ను చివరి తేదీగా పేర్కొంది. అర్హులు వీరే.. ► ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన వారు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్లలోపు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ 40 ఏళ్లలోపు) వయసు కలిగి ఉండాలి. ► కాంట్రాక్టు విధానంలో నియామకాలు ఉంటాయి. తొలుత ఏడాది పాటు కాంట్రాక్టు విధానంలో నియమిస్తారు. పనితీరు ఆధారంగా సర్వీసు కొనసాగిస్తారు. ► బీఎస్సీ నర్సింగ్ మార్కులు ఆధారంగా ఎంపిక ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు. -
Andhra Pradesh: భారీ రిక్రూట్మెంట్.. కొలువుల జాతర
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామ స్థాయిలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నుంచి మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా, ఏరియా, బోధనాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ రిక్రూట్మెంట్కు ఆమోదం తెలిపారు. ఒకేసారి ఏకంగా 11,775 వైద్య పోస్టుల భర్తీకి సీఎం అంగీకారం తెలిపారు. పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుందని, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. మరోవైపు వీటికి అదనంగా కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కొనసాగుతున్నందున మరో 3,176 పోస్టులను కూడా తరువాత భర్తీ చేయనున్నట్లు వివరించారు. గత సర్కారు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోగా రద్దు చేసి ఔట్‌సోర్సింగ్‌కు అవకాశం కల్పించింది. ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించేందుకు డాక్టర్లతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా ఇతర ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏటా వేతనాలకు అదనంగా రూ.726.34 కోట్లు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఏటా వేతనాల రూపంలో రూ.2,753.79 కోట్లు చెల్లిస్తుండగా కొత్తగా భర్తీ చేసే పోస్టులకు ఏటా అదనంగా రూ.726.34 కోట్ల వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు. వైద్య శాఖలో అతి పెద్ద భర్తీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ఇది అతి పెద్ద ప్రక్రియ కావడం విశేషం. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కోవిడ్ సమయంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు గతంలోనే 9,700 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు అంతకు మించి పోస్టుల భర్తీ చేపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరు చొప్పున దాదాపు 15,000 మంది ఏఎన్ఎంలు, 7 వేల మందికిపైగా మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం గతంలోనే చర్యలు చేపట్టింది. గతంలో మండల స్థాయిలో పీహెచ్‌సీల్లో ఏఎన్ఎంలు సేవలు అందిస్తుండగా వాటిని గ్రామాలకు విస్తరించారు. సచివాలయాల వ్యవస్థ ప్రవేశపెట్టిన తరువాత గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరు చొప్పున ఏఎన్ఎంల సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లోనూ బీఎస్సీ నర్సింగ్ అర్హతతో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌ను ప్రభుత్వం నియమిస్తోంది. హెల్త్ అసిస్టెంట్‌తో పాటు ఆశా వర్కర్లు కూడా క్లినిక్‌లో సేవలందిస్తారు. క్లినిక్‌లో నిరంతరం ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటూ 12 రకాల వైద్య సేవలు అందిస్తారు. 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 65 రకాల మందులను సమకూర్చడంతోపాటు 57 రకాల బేసిక్ మెడికిల్ ఎక్విప్మెంట్లను అందుబాటులో ఉంచుతారు. విలేజ్ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలు, ల్యాబ్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించడంతోపాటు టెలిమెడిసిన్ సదుపాయాలను కల్పించారు. మండలానికి రెండు పీహెచ్‌లను అందుబాటులోకి తేవడమే కాకుండా ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు చొప్పున డాక్టర్లు సేవలందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
కోవిడ్ జరిమానాలు కట్టిన వారు 40.33 లక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానా కట్టిన వారు 2021 అక్టోబర్ 15 నాటికి 40,33,798 మంది.. వారు కట్టిన జరిమానా మొత్తం రూ.31,87,79,933గా తేలింది. మాస్క్ లేకుండా బయటకు వెళ్లడం, గుంపులు గుంపులుగా ఉండటం, వ్యాపార సముదాయాల్లోకి మాస్క్ లేకున్నా అనుమతించడం.. తదితర నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీగానే జరిమానాలు కట్టారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలో 11.41 లక్షల మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాల్లో వెల్లడైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారు విశాఖపట్నంలో ఎక్కువగా ఉండగా, జరిమానా వసూళ్లలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కనీవినీ ఎరుగని రీతిలో చిత్తూరు జిల్లా నుంచి రూ.6.01 కోట్లు వసూలయ్యాయి. అనంతపురం జిల్లాలో సైతం 4.88 లక్షల మంది నిబంధనలు ఉల్లంఘించగా.. రూ.4.98 కోట్లకు పైగా వసూలైంది. గుంటూరు, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లోనూ జరిమానాలు రూ.కోటి దాటాయి. -
రాష్ట్రంలో జ్వరపీడితులు 13 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఊరూ, వాడా అనే తేడా లేకుం డా జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ ఇంట చూసినా ఒక్కరన్నా ఏదోరకమైన జ్వరంతో మంచంపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జ్వర లక్షణాలున్నవారు లక్షల్లో ఉన్నారు. రోజురోజుకూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాలపై వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న సర్వేలో అనేక కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో గతనెల నుంచి ఇప్పటివరకు అంటే ఆరువారాల్లో 1.62 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు సర్వేలో నిర్ధారణ అయింది. ఇవిగాక జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు వచ్చేవారిని కలుపుకుంటే 2 లక్షల జ్వరం కేసులు ఉండొచ్చని అంచనా. అత్యధి కంగా హైదరాబాద్‌లో 42 వేలు, రంగారెడ్డి జిల్లాలో 24 వేల మంది జ్వరాల బారినపడినట్లు అంచనా. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏకంగా 13 లక్షల మంది జ్వరం బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కరోనాతో జ్వరాలు నమోదు కాగా, జూలై నుంచి అటు కరోనా, ఇటు వైరల్ జ్వరాలు నమోదవుతున్నాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనా, డెంగీ, చికున్‌గున్యా, టైఫాయిడ్, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఐదు వేల డెంగీ కేసులు...? రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నా యి. ఈ ఏడాది నమోదైన డెంగీ కేసుల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ల్లోనే అత్యధికం. 2020లో 2,173 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 8నాటికి 4,714 కేసులు న్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ తర్వాత నమోదైన వాటిని కలుపుకుంటే దాదాపు ఐదువేల డెంగీ కేసులు ఉంటాయని అంచనా. అత్యధికంగా హైదరాబాద్‌లో 1,188 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 8 వరకు 632 మలే రియా కేసులు నమోదయ్యాయి. 2019లో 1,168... 2020లో 664 నమోదయ్యాయి. బయటకు రానివి ఇంతకుమించి ఉంటాయని వైద్యనిపుణులు అంటు న్నారు. మరోవైపు పలు ఆసుపత్రులు డెంగీ బాధి తులను ఫీజుల రూపేణా పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఇవీ కారణాలు... రాష్ట్రంలో పలు చోట్ల పారిశుధ్య నిర్వహణ సరిగా లేక దోమలు విజృంభిస్తున్నాయి. పగటిపూట కుట్టే దోమలతో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. మలే రియా కేసులూ వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ దోమలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. డెంగీ, మలేరియా కేసులు మరింతగా నమోదయ్యే అవకాశాలున్నాయి. నిర్లక్ష్యం తగదు.. ప్రస్తుతం గొంతునొప్పి, జ్వరంతో అనేకమంది ఆసుపత్రులకు వస్తున్నారు. గతంలో డెంగీ, కరోనా కేసులు అధికంగా రాగా, ఇప్పుడు డెంగీ కేసులే ఎక్కువ ఉంటున్నాయి. డెంగీకి, కరోనా లక్షణాలకు మధ్య తేడాను గుర్తించవచ్చు. డెంగీలో 102–103 జ్వరం కూడా ఉంటుంది. పారాసిటమాల్ మాత్ర వేసినా అది తగ్గదు. కరోనాలో మాత్ర వేశాక తగ్గుముఖం పడుతుంది. 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినప్పుడు మాత్రం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. అప్పుడు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. -
భేతాళపాడుకు వైద్యాధికారులు
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామపంచాయతీ పరిధిలో కిడ్నీ వ్యాధి బాధితులు, అనుమానితుల నుంచి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సోమవారం రక్త నమూనాలు సేకరించారు. ‘సాక్షి’దినపత్రిక ప్రధాన సంచికలో ఆదివారం ‘ఆ ఊరికి ఏమైంది..?’శీర్షికతో కిడ్నీ వ్యాధి పీడితులపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష ఆదేశాల మేరకు జూలూరుపాడు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ భూక్యా వీరబాబు భేతాళపాడు పంచాయతీ పరిధిలోని పంతులుతండాలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధి బాధితులు, అనుమానితుల ఇళ్లకు వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పోటు వినోద్ వైద్యశిబిరాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం టీ హబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు దీనితో తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి శాంపిళ్లు సేకరించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. -
రోగుల ఇంటికే ఆక్సిజన్
సాక్షి, హైదరాబాద్: అత్యవసర రోగుల ఇళ్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4,500 కాన్సన్ట్రేటర్లను అన్ని రకాల ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో ప్రాథమిక ఆసుపత్రిలో సరాసరి రెండు మూడు చొప్పున సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఏరియా, సామాజిక, జిల్లా, బోధన ఆసుపత్రుల్లోనూ చాలాచోట్ల సిద్ధంగా ఉంచారు. కొన్ని పెద్దస్థాయి ఆసుపత్రుల్లో పది వరకు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచారు. త్వరలో మరికొన్నింటిని కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు. కరోనా కాలంలో డిమాండ్ కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. దేశంలో సెకండ్‌వేవ్ సమయంలో చాలామంది రోగులు ఆక్సిజన్ అందక చనిపోయిన పరిస్థితులను కూడా చూశాం. పరిస్థితి విషమంగా ఉన్న అనేకమంది రోగులకు ఆక్సిజన్ ఎక్కించడం పరిపాటి. ఐసీయూ, వెంటిలేటర్లపై ఉండే రోగులకు కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. అయితే కొందరు రోగులు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్నాళ్లపాటు ఇళ్లల్లోనూ ఆక్సిజన్‌పై ఉండాల్సి వస్తుంది. అటువంటి వారు ఇళ్లల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వాడుతున్నారు. కొందరు కొనుగోలు చేసుకోవడం, మరికొందరు అద్దెకు తెచ్చుకొని వాడేవారు. దీంతో అనేకమంది దాతలు ముందుకురావడం, ప్రభుత్వం కూడా కొన్నింటిని కొనుగోలు చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆస్పత్రుల్లో ఉంచుతోంది. వీటిని ఆస్పత్రుల్లో ఉంచడమే కాకుండా గ్రా>మాల్లో అత్యవసరమైన రోగులకు ఇళ్లకు కూడా ఇస్తున్నారు. కొన్నిచోట్ల కొద్దిపాటి అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎక్కడా ఆక్సిజన్‌కు కొరత లేకుండా చేయాలన్నది ఉద్దేశం. ఒకవేళ థర్డ్‌వేవ్ వచ్చినా కొరత లేకుండా అన్ని రకాలుగా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
సీసీఎంబీ స్థాయిలో ల్యాబొరేటరీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటివరకూ క్లిష్టమైన నమూనాలను పూణె వైరాలజీ ల్యాబొరేటరీ లేదా సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ–హైదరాబాద్)కు పంపించేవారు. ఇకపై ఈ స్థాయి ల్యాబొరేటరీని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అధికారులు స్థల సేకరణకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి గన్నవరం విమానాశ్రయం వద్ద 3 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఈ ల్యాబొరేటరీ నిర్మాణానికి రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ అవుతుందని అంచనా. దీన్ని రెండేళ్లలో అందుబాటులోకి తెస్తారు. పూర్తిస్థాయి నిర్మాణం తర్వాత ఇందులో 300 మందికి పైగా సిబ్బంది పనిచేయనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు అతి తక్కువ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉపయోగాలివే.. ► ఈ ల్యాబొరేటరీలో అన్ని రకాల వైరస్‌లే కాదు, బ్యాక్టీరియా నమూనాలు, కీటకాలు, ఎల్లో ఫీవర్.. తదితర ఎలాంటి నమూనాలనైనా పరిశీలించవచ్చు. ► ప్రస్తుతం మన వద్ద మన రాష్ట్రంలో జినోమిక్ సీక్వెన్సీ ల్యాబ్ (వైరస్ ఉనికిని కనుక్కునే ల్యాబ్) లేదు. ఇకపై ఇలాంటి టెస్టులు ఇక్కడే చేసుకోవచ్చు. ► గతంలో ఏలూరు పట్టణంలో వింత వ్యాధితో బాధితులు ఆస్పత్రికి వచ్చినప్పుడు నమూనాలు వివిధ రాష్ట్రాలకు పంపించాల్సి వచ్చింది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎలాంటి టెస్టులైనా ఇక్కడే చేసుకోవచ్చు. ► దీనికి సంబంధించిన నిర్మాణ వ్యయం, మానవ వనరులు కేంద్రం చూసుకుంటుంది. స్థలం మాత్రం ఏపీ సర్కారు ఇస్తుంది. త్వరలోనే అవగాహన ఒప్పందం అతిపెద్ద ల్యాబొరేటరీ నిర్మాణానికి గన్నవరంలో 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం చూపించింది. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే అవగాహన ఒప్పందం చేసుకుంటాం. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపించే పరిస్థితి ఉండదు. రకరకాల జబ్బుల ఉనికిని వీలైనంత త్వరగా తెలుసుకునే వీలుంటుంది. – డా.ఎం.అనురాధ, సీనియర్ రీజనల్ డైరెక్టర్, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ -
ఇంట్లో మృతిచెందినా పరిహారం
సాక్షి, హైదరాబాద్: కరోనాతో ఇంట్లో చనిపోయినా పరిహారం దక్కుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు రూ. 50 వేలు పరిహారంగా ఇవ్వాలని కేంద్రం ప్రకటించిన సంగతి విదితమే. ఈ మేరకు ప్రాథమిక మార్గదర్శకాలు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందాయి. కొందరు కోవిడ్‌తో ఆసుపత్రుల్లో కాకుండా ఇంట్లో చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తే, బాధిత కుటుంబసభ్యులకు పరిహారం అందుతుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కరోనా మృతుల కుటుంబసభ్యులు అధికారిక డాక్యుమెంట్ కోసం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ లేదా యాంటిజెన్ టెస్టులు, ఆసుపత్రుల్లో కోవిడ్‌తో చనిపోయినట్లు ధ్రువీకరణ ఉంటే ఆయా కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వొచ్చని పొందుపరిచారు. విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలను కోవిడ్ మరణాలుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. 95 శాతం మరణాలు 25 రోజుల్లోనే... కోవిడ్‌తో మరణించిన కుటుంబాలకు కేంద్ర విపత్తు నిర్వహణశాఖ ఆధ్వర్యంలో పరిహారమిచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం కరోనాతో ఇప్పటివరకు 3,911 మంది మృతి చెందారు. అయితే ప్రభుత్వం దృష్టికి రాని కరోనా మరణాలు కూడా ఉండొచ్చని అంటున్నారు. ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి, ఈ లెక్కల ప్రకారమే కాకుండా బాధిత కుటుంబ సభ్యులందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. అందువల్ల మరిన్ని దరఖాస్తులు కూడా వచ్చే అవకాశముందని అంటున్నారు. సాధారణంగా కోవిడ్ మరణాల్లో 95 శాతం 25 రోజుల్లోనే సంభవిస్తాయి. దాన్ని మరింత విస్తృతపరిచి వైరస్ నిర్ధారణ అయిన తేదీ నుంచి 30 రోజుల్లోపు మరణాలు సంభవించినా వాటిని కూడా కరోనా మరణాలుగా పరిగణించాలని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉన్నప్పుడు, అది కూడా 30 రోజుల తర్వాత మరణం సంభవించినా దాన్ని కూడా కరోనా మరణంగా పరిగణిస్తారు. ఆయా మరణాలను ధ్రువీకరించేందుకు జిల్లాస్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తారు. అడిషనల్ కలెక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఒక వైద్య నిపుణుడు కరోనా మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అయితే ఎప్పటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారన్న విషయంపై వైద్య శాఖ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. త్వరలో అన్ని అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని చెప్పాయి. -
ఒక్కరోజులో 1.75 లక్షల టీకాలే
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకాల పంపిణీ ప్రత్యేక కార్యక్రమానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నెలాఖరునాటికి కోటి టీకాలు వేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వ్యాక్సిన్ల కొరత కారణంగా వైద్య ఆరోగ్య శాఖ చేరుకునేలా కనిపించడంలేదు. రోజుకు ఆరు నుంచి ఏడు లక్షల టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వైద్య ఆరోగ్య శాఖ బుధవారం 1,75,864 టీకాలు మాత్రమే వేయగలిగింది. అందులో మొదటి డోస్ 1,37,656 కాగా, రెండో డోస్ టీకాలు 38,208 ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2.31 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇక రాష్ట్రంలో గురువారం నిర్వహించిన 51,521 కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 247 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,411కి చేరుకుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. కరోనాతో ఒక్క రోజులో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,909కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,877 యాక్టివ్ కేసులున్నాయి. -
కోర్టులు ఆదేశిస్తేనే స్పందిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘న్యాయస్థానాలు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వం స్పందించదా? పరిస్థితులకు అనుగుణంగా అధికార యంత్రాంగం ముందు చూపుతో వ్యవహరించదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏటా ఆదేశాలిస్తే తప్ప తగిన చర్యలు తీసుకోరా? అని నిలదీసింది. రాష్ట్రవ్యాప్తంగా దోమల నివారణకు తీసుకున్న చర్యలతోపాటు డెంగీ సహా ఇతర జ్వరాల కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కౌటూరి పవన్‌కుమార్, కోర్టు సహాయకారి (అమికస్‌క్యూరే), సీనియర్ న్యాయ వాది ఎస్.నిరంజన్‌రెడ్డిని ఆదేశించింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా జ్వరాల బారినపడే ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ నేత రాసిన లేఖను 2019లో హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యం(పిల్)గా విచారణకు స్వీకరించింది. ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచందర్‌రావు, జస్టిస్ టి. వినోద్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం మళ్లీ విచారించింది. రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, నెలలో 2,500 మంది డెంగీబారిన పడ్డారని న్యాయవాది పవన్‌కుమార్ నివేదించారు. కమిటీ సూచనలేంటి? ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఇతర ప్రభుత్వ విభాగాలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని 2019లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీని ఏర్పా టు చేశారా? ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు సమావేశమైంది? ఏమైనా సిఫార్సులు చేసిందా? ఈ సిఫార్సుల అమలు పురోగతి ఏమైనా ఉందా?’అని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. జ్వరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సీఎస్ నేతృత్వంలోని కమిటీ సమావేశాల సమాచారం సమర్పించేందుకు కొంత గడువు ఇవ్వాలని ఏజీ అభ్యర్థించారు. గత నెలలో సీఎం కేసీఆర్ ఈ అంశంపై అన్ని ప్రభుత్వ విభాగాలతో సమీక్షించారని నివేదించారు. వాదనల అనంతరం పూర్తి వివరాలను ఈనెల 29లోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
రెండేళ్లలో కొత్తగా 2,400 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యపై దృష్టి సారించింది. వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తుండటంతో కొత్త వైద్య కళాశాల విషయంలో ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల స్థాపించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎక్కువమంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు అవకాశం దక్కనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ కళాశాలలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్ల గొండ, సూర్యాపేటల్లో కొత్త కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో కలిపి ప్రస్తుతం 9 ప్రభుత్వ వైద్య కళాశాల లున్నాయి. వాటిల్లో 1,640 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో..మొదటి ఏడాది 1,200, రెండో ఏడాది 1,200 సీట్ల చొప్పున మొత్తం 2,400 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఒక్కో కాలేజీలో 150 సీట్లు 2022–23లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్ కర్నూల్, రామగుండంలో కాలేజీలు ఏర్పాటు చేస్తారు. 2023–24లో వికారాబాద్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాలతో పాటు మరో 4 జిల్లాల్లోనూ కొత్తగా వైద్య కళాశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఒక్కో మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 28వ తేదీన ముందుగా 8 మెడికల్ కాలేజీలకు అనుమతులు కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మిగిలిన 8 కళాశాలలకు వచ్చే సంవత్సరం దరఖాస్తు చేస్తారు. -
గణేష్ ఉత్సవాల్లో చిందేసిన శ్రీనివాసరావు
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): గణేష్ ఉత్సవాల్లో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కాసేపు సరదాగా చిందులు వేసి ఆ శాఖ ఉద్యోగుల్లో జోష్ నింపారు. టీఎన్జీవోస్ డీఎంహెచ్ఎస్ విభాగం అధ్యక్షుడు మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలకు మంగళవారం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆడిపాడారు. అయితే కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని ప్రజలకు జాగ్రత్తలు చెబుతోన్న ఆయనే మాస్కు లేకుండా డ్యాన్సులు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలంగాణలో మంగళవారం నిర్వహించిన 76,481 కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,202కి చేరింది. ఒకరోజులో కరోనాతో ఒకరు మృతిచెందారు. -
రెండ్రోజుల్లో 516 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 516 మందికి కోవిడ్–19 నిర్ధారణైంది. శుక్రవారం 220 మందికి, శనివారం మరో 296 మందికి వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,61,302 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 6,52,085 మంది కోలుకున్నారు. శనివారం ఒకరు మరణించారు. -
కఠిన ఆంక్షలు అమలు చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అవసరమైతే కఠిన ఆంక్షలను అమలు చేయాలంది. ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ మెమో దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కోవిడ్ విషయంలో పలు అభ్యర్థనలతో దాఖలైన వ్యాజ్యాలపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది వై.వి.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఉపాధ్యాయుల్లో 50 శాతం మందికే వ్యాక్సినేషన్ జరిగిందని, అయినా ప్రభుత్వం పాఠశాలలు తెరిచిందని చెప్పారు. మాస్క్‌లు వేసుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, వారికి ప్రభుత్వం జరిమానా విధించకపోతుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ ఈ వాదనలను తిప్పికొట్టారు. ఎంతమందికి జరిమానా విధించి ఎంత మొత్తం వసూలు చేసిందీ గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ధర్మాసనం ప్రస్తావించగా.. పత్రికలు ఏమైనా రాస్తాయంటూ ఇటీవల రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటునకు ఎలాంటి అనుమతినివ్వలేదని తెలిపారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాదుల్లో ఒకరైన అశోక్‌రామ్ జోక్యం చేసుకుంటూ.. ఓనం సందర్భంగా వేడుకల నిర్వహణకు కేరళ ప్రభుత్వం అక్కడి ప్రజలకు అనుమతి ఇచ్చిందని, దీంతో దేశంలోనే ఇప్పుడు అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ నిలిచిందని చెప్పారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వినాయక ఉత్సవాలకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. -
మీ ప్లాన్ కోసం కరోనా వేచి ఉండదు
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ ప్రభావం దేశంలో అక్కడక్కడా కనిపిస్తున్నా.. కరోనా కట్టడికి ఇంకా ప్రణాళికలు రూపొందిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన వైద్యం అందకపోయినా, జాప్యం జరిగినా రెప్పపాటు కాలంలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. మొదటి, రెండో దశలో ఎన్నో ప్రాణాలు పోయాయని, ఆక్సిజన్ అందక మృతి చెందినవారూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రణాళికలు రూపొందించి తగిన చర్యలు చేపట్టే వరకూ కరోనా వైరస్ ఆగదనే విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది. మూడో దశ ముప్పు ముంచుకొస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. నిపుణుల సమావేశం ఎందుకు నిర్వహించలేదు? ‘తాజా సెరో సర్వైలెన్స్ నివేదిక, విపత్తు నిర్వహణ చట్టం నిర్దేశించిన మేరకు నిపుణులతో కూడిన కమిటీ సమావేశాలకు సంబంధించిన మినిట్స్ సమర్పించాలని గత నెల 11న ఆదేశించాం. అలాగే మూడో దశ కట్టడికి తీసుకుంటున్న చర్యలను సవివరంగా పేర్కొనాలని చెప్పాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో అవేవీ లేవు’అని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసలు నిపుణులతో కూడిన కమిటీ సమావేశం నిర్వహించారా? అని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. సమావేశం జరిగినట్లు లేదని, రెండు వారాల సమయం ఇస్తే పూర్తి వివరాలు సమర్పిస్తామని ఆయన చెప్పారు. దీంతో తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మూడో దశ కట్టడికి తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినా ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీసింది. ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం తగదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలివీ.. ►వారం రోజుల్లో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించి కరోనా కట్టడికి తగిన ప్రణాళికలు రూపొందించాలి. ►రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తేలిన కేసుల సంఖ్య ఆధారంగా పాజిటివిటీ రేట్ ఎంత ఉందో జిల్లాల వారీగా నివేదిక ఇవ్వాలి. ►మూడో దశ కట్టడికి తీసుకున్న చర్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సమగ్ర నివేదిక సమర్పించాలి. ఈ నెల 22 విచారణకు రాష్ట్ర ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాలి. ►కరోనా చికిత్సలో భాగంగా వినియోగించే ఔషధాలను అత్యవసర మందుల జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందో కేంద్ర వైద్య ఆరోగ్య విభాగం కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై వివరణ ఇవ్వాలి. ►రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమంది చిన్న పిల్లల వైద్యులు విధులు నిర్వహిస్తున్నారో తెలియజేయండి. ►చిన్నారుల చికిత్సకు నీలోఫర్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ పడకలు, ఇతర సౌకర్యాలపై జిల్లాల వారీగా వివరాలు సమర్పించండి. ►ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకానికి తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలి. -
వ్యాక్సినేషన్లో 44 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తొలి ప్రాధాన్యతగా వీరికి మొదటి డోసు, రెండో డోసు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల మధ్య వయస్కులు 1.93 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో సెప్టెంబర్ 7 వరకు 77,04,990 మందికి మొదటి డోసు వేశారు. మరో 8,94,624 మందికి రెండో డోసు కూడా పూర్తయింది. ఇంకా తొలి డోసు వేసుకోని వారిపై దృష్టి సారించి.. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు రెండో డోసు కోసం ఏ వయసు వారు వచ్చినా విధిగా వారికి కూడా వేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లోని కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లలో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. రద్దీ లేకుండా, జనం గుంపులు గుంపులుగా చేరకుండా క్రమపద్ధతిలో వ్యాక్సిన్ వేయాలని తెలిపింది. ఇప్పటివరకు హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్లు దాటినవారు, టీచర్లు వంటి వాళ్లందరికీ దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తయింది. దీంతో 18 ఏళ్ల పైన.. 44 ఏళ్లలోపు వారికి కూడా వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు మొదటి డోసు వేసుకోని 18 ఏళ్లు దాటినవారు గ్రామ/వార్డు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. -
విషజ్వరాలూ ఆరోగ్యశ్రీలోకి..
సాక్షి, విశాఖపట్నం: సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతో పాటు విషజ్వర పీడితులకు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, వైద్యులతో మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. (చదవండి: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి) రాష్ట్రవ్యాప్తంగా విశాఖ జిల్లాలోనే అత్యధిక మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 462 డెంగీ, 708 మలేరియా, 24 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లోతట్టు, నీటి నిల్వలున్న ప్రాంతాలు, దోమల లార్వా నిల్వ ప్రాంతాల్లో ప్రతిరోజూ శానిటైజేషన్ చేయడమే కాకుండా వైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశామని మంత్రి నాని చెప్పారు. అలాగే, ఐటీడీఏ పరిధిలోని పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాలు, పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాల గుర్తింపు విషజ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాలను ‘హాట్ స్పాట్’ ప్రాంతాలుగా గుర్తించి.. అక్కడే వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్ల నాని వెల్లడించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రే చేయిస్తున్నామని, ఏజెన్సీలో దోమ తెరలు పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Bigg Boss 5 Telugu: జనాలను పిచ్చోళ్లను చేసిన లోబో, సిరి) -
ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా డిప్యుటేషన్లపై లెక్కలు తీసింది. ఆరువేల మందికిపైగా డిప్యుటేషన్ల మీద ఉన్నట్లు తేలింది. 54 మంది వైద్యులైతే ఏళ్ల తరబడి విధులకే హాజరు కావటంలేదని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి.. అవసరం మేరకు ప్రభుత్వం డాక్టర్‌ను నియమిస్తుంది. కానీ.. కారణాలేమైనా ఆ డాక్టర్ మరోచోట విధులు నిర్వర్తిస్తుంటారు. డిప్యుటేషన్‌పై ఏళ్ల తరబడి అక్కడే కొనసాగుతుంటారు. అవసరమైన చోట పోస్టు భర్తీలోనే ఉంటుంది కానీ ప్రజలకు వైద్యసేవలు అందవు. పనిచేస్తున్నది ఒక చోట, వేతనం మరోచోట ఇదీ తంతు. కొంతమంది డాక్టర్లయితే అవసరం లేకపోయినా సొంత ఊళ్లో ప్రాక్టీస్ కోసమని డిప్యుటేషన్ తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు కడపలో ఉద్యోగంలో ఉన్న ఒక పీడియాట్రిక్ వైద్యుడు.. డిప్యుటేషన్ మీద విశాఖపట్నంలో కొనసాగుతుంటారు. ఇలాంటివి కొన్నయితే.. జూనియర్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు వేలల్లో ఉన్నారు. డీఎంహెచ్‌వోలే డిప్యుటేషన్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు తేలింది. ఏళ్ల తరబడి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న డిప్యుటేషన్ల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అవకతవకలపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. దీంతోపాటు ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా డిప్యుటేషన్లు రద్దుచేయాలని చెప్పినట్టు సమాచారం. దీంతో.. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ కాలం పూర్తయినా కొనసాగుతున్న వారి డిప్యుటేషన్‌ను తక్షణమే రద్దు చేయనున్నారు. రెండు వారాల్లోగా తమ ఒరిజినల్ పోస్టింగ్‌లో చేరాలని ఆదేశించనున్నారు. డిప్యుటేషన్ల పేరుతో కొందరు యూనియన్ నాయకులు ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరం మేరకు సడలింపు రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సడలింపు ఇవ్వనున్నారు. కొత్తగా ఏర్పాటైన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు పోస్టులు మంజూరుకాని చోట డిప్యుటేషన్లు కొనసాగిస్తారు. వైద్యసేవలకు, అత్యవసర సేవలకు విఘాతం కలుగుతుందన్న పరిస్థితుల్లోను మినహాయింపు ఇవ్వనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవన్నీ రద్దు చాలామంది ఏళ్ల తరబడి డిప్యుటేషన్‌పై ఉన్నారు. వాస్తవానికి అక్కడ వారిసేవలు నామమాత్రం. అలాంటి వారి డిప్యుటేషన్లు రద్దుచేస్తాం. వీటిమీద పూర్తిగా సమీక్షిస్తున్నాం. ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ తెచ్చుకున్న వారు కాకుండా, విభాగాధిపతులే (హెచ్వోడీలు) డిప్యుటేషన్లు ఇచ్చారు. ఇది కరెక్టు కాదు. వ్యవస్థలకు ఇబ్బంది కలుగుతుందంటేనే కొనసాగిస్తాం. లేదంటే డిప్యుటేషన్లన్నీ రద్దుచేస్తాం. – ముద్దాడ రవిచంద్ర, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ -
ప్రత్యక్ష బోధనపై ఆచితూచి అడుగులు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష విద్యాబోధనపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. తాజా పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) మరోసారి నివేదిక కోరినట్టు తెలిసింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని గతంలో వైద్యశాఖ సానుకూల నివేదిక ఇచ్చింది. విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచీ ప్రత్యక్ష తరగతులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి దశలావారీగా విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలనూ విద్యాశాఖ రూపొందించింది. అయితే బెంగళూరులో పిల్లలకు కరోనా సోకడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఇప్పటికే విద్యాసంస్థలు తెరిచిన ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు ఏపీలో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రత్యక్ష బోధనతో ఎదురయ్యే సమస్యలను గమనించాకే నిర్ణయం తీసుకునే వీలుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో సెప్టెంబర్ 1 నుంచి 9–12 తరగతులు 50 శాతం విద్యార్థులతో ప్రత్యక్ష బోధన చేపట్టాలని భావిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 9–12 తరగతులను రెండు బ్యాచ్‌లుగా విభజించి, రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిం చాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం సామర్థ్యంతో ప్రత్యక్ష బోధనకు ఉపక్రమించింది. ఒడిశా జూలై 26 నుంచే 10, 12 తరగతులు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేపట్టింది. మహా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మంగళ వారం నుంచి ప్రత్యక్ష తరగతులకు ఉపక్రమిం చింది. ఢిల్లీ మాత్రం వాస్తవ పరిస్థితిపై నిపుణులతో కమిటీ వేసింది. వీటిని పరిశీలించి రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో సీఎం నిర్ణయం కొంత ఆలస్యమయ్యేలా ఉంది. -
ఆ 3 ముఖ్యం.. 27 రోజులు ప్రచారం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు చేస్తోంది. వ్యాధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. తప్పనిసరిగా మాస్క్ ధరించడం (నో మాస్క్.. నో ఎంట్రీ), భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం.. ఈ మూడు కరోనా వైరస్ నియంత్రణకు కీలకమని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 27 రోజులపాటు నిర్వహించనున్న ఈ ప్రచార కార్యక్రమాలు గురువారం (ఈనెల 5న) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, షార్ట్ ఫిల్మ్‌లతో చేపట్టిన ఈ ప్రచారంలో ఏరోజు ఎక్కడ ఏకార్యక్రమాలు నిర్వహించాలన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణ కోవిడ్‌ను నియంత్రించేందుకు నిఘా, పరీక్షలను బలోపేతం చేసిన ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, కోవిడ్ టీకా కార్యక్రమాలను విస్తృతం చేసింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్–19 నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఈ ప్రచారం చేపట్టింది. ఈనెల 31న ముగిసే ఈ ప్రచార కార్యక్రమాలను కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కేంద్రస్థాయిలో టీచింగ్ ఆస్పత్రుల వారు, జిల్లా ఆస్పత్రుల స్థాయిలో జిల్లా వైద్యాధికారులు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల స్థాయిలో మునిసిపల్ కమిషనర్లు, సంబంధిత పోలీసు, వైద్య అధికారులు, డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఎస్పీలు, మండల స్థాయిలో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, పీహెచ్సీ వైద్యులు ఈ అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించింది. ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాలపై కలెక్టర్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఈ ప్రచార కార్యక్రమాలను కచ్చితంగా నిర్వహించేలాగ అన్ని శాఖల ప్రత్యేక సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారంటే.. గ్రామస్థాయి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని రకాల విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు, రవాణా వాహనాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, సినిమాహాళ్లు, క్రీడాసముదాయాలు, విహారస్థలాలు, వివాహాలు వంటి కార్యక్రమాల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తారు. అందరూ మాస్క్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా, తరచూ చేతులు కడుక్కునేలా అవగాహన కల్పిస్తారు. 21 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిలో ఈ నెల 21వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలలో తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అనంతరం నిత్య అలంకరణ, పవిత్రమాలధారణ జరుగుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 9 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మండపారాధన, అగ్నిప్రతిష్టాపన జరుగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనం, వేద పారాయణ, హారతి, మంత్ర పుష్పం జరుగుతాయి. 23న ఉదయం 8 గంటల నుంచి మూలమంత్ర హవనం, శాంతి పౌష్టిక హోమాలు, కూష్మాండబలి అనంతరం మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అన్ని ఆర్జిత సేవలు రద్దు: మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాల నేపథ్యంలో అలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను దేవస్థాన అధికారులు రద్దు చేశారు. ప్రత్యక్ష పూజలతో పాటు పరోక్ష పూజలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం 20న దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
పల్లెకు ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలని, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీహెచ్‌సీలతో కూడా అనుసంధానం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒక మంచి ఉద్దేశంతో కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని, కార్పొరేట్ తరహా వాతావరణం అక్కడ కనిపించాలని సూచించారు. బెడ్ షీట్స్ దగ్గర నుంచి సేవల వరకు అన్ని విషయాల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా నిర్వహణ ఉండాలన్నారు. ఈ తరాలకే కాదు.. భవిష్యత్తు తరాలవారికి కూడా అత్యుత్తమ వైద్యం అందాలన్నదే తన కల అని సీఎం పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’ కార్యక్రమాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు డిసెంబర్‌కి అన్నీ పూర్తి.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించాలి. ల్యాబ్స్తోనూ అనుసంధానం చేయడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది. గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలి. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ విలేజ్ క్లినిక్స్‌కు అందుబాటులో ఉండాలి. ఇదివరకే సేకరించిన డేటా వివరాలను ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానించాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా వైద్యుడు ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు చికిత్సకు ఈ వివరాలెంతో సహాయపడతాయి. సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యమందించేందుకు దోహదపడుతుంది. డిసెంబర్ నాటికి విలేజ్ క్లినిక్స్ అన్నింటినీ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులే మదిలో మెదలాలి.. ఒక మంచి ఉద్దేశంతో 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టాం. అక్కడ కార్పొరేట్ తరహా వాతావరణం కనిపించాలి. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే అక్కడ అందే సదుపాయాలతో ఎలాంటి భావన కలుగుతుందో ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ప్రజలకు అదే రకమైన భావన కలగాలి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యం సరిగా లేకపోతే చికిత్స పొందేందుకు వాళ్ల ఆప్షన్ మనం కడుతున్న ప్రభుత్వాస్పత్రులే కావాలి. ఆ తరహాలో నాణ్యతతో కూడిన నిర్వహణ ఉండాలి. మెడికల్ కాలేజీల్లో సరైన యాజమాన్య విధానాలపై నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక(ఎస్వోపీ)లు రూపొందించాలి. మెడికల్ కాలేజీల ఆస్పత్రుల్లో వాతావరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, కొత్తగా కనిపించాలి. అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన సేవలు అందాలి. నిర్వహణపరంగా ఎలా ఉండాలి? నిర్మాణం పూర్తైన తర్వాత ఎలా ఉండాలి? అనే వాటిపై నిర్దిష్ట విధానాలతో నివేదిక రూపొందించాలి. మండలానికి రెండు పీహెచ్‌సీలు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ప్రజలకు సేవలందిస్తుండగా కొత్తగా మరో 176 ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్సీలుంటాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు చొప్పున విధులు నిర్వహిస్తారు. ఇలా ఒక్కో మండలంలో నలుగురు డాక్టర్ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రకారం ప్రతి వైద్యుడు మండలంలోని 7 నుంచి 8 గ్రామాలను ఓన్ చేసుకుని వారానికి ఒకసారి ఏదైనా ఊరికి వెళ్లి వారికి అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారు. పురోగతిలో కాలేజీల పనులు రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల పనుల పురోగతిని సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. పాడేరు, విజయనగరం, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనకాపల్లి, నంద్యాలలో మెడికల్ కాలేజీల స్థలాలపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలైనట్లు పేర్కొనటంతో వెంటనే పరిష్కారం దిశగా ప్రయత్నించాలని సీఎం సూచించారు. అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండల్లో వైద్య కళాశాలల పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా కాంట్రాక్ట్ సంస్థకు పనులు అవార్డ్ చేశామని, వెంటనే మొదలవుతాయని చెప్పారు. ప్రస్తుతం సేవలందిస్తున్న 11 బోధనాస్పత్రుల్లో కూడా ‘నాడు – నేడు’ ద్వారా అప్‌గ్రెడేషన్, సదుపాయాలను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో నాడు– నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గడువులోగా పనులు పూర్తయ్యేలా అన్ని వివరాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. విలేజ్ క్లినిక్స్‌లో సదుపాయాలు ఇలా ► విలేజ్ క్లినిక్స్‌లో ప్రజలకు అందుబాటులో 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు ► 14 రకాల టెస్టులు ► 65 రకాల ఔషధాలు ► 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్ ► టెలీమెడిసిన్ సేవలు ► బీఎస్సీ నర్సింగ్, సీపీసీహెచ్ కోర్సు చేసిన ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్) సేవలు లభ్యం ► ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సేవలు ► ఔట్ పేషెంట్ పరీక్షల గది, ల్యాబ్, ఫార్మసీ, వెయిటింగ్ హాల్‌తోపాటు క్వార్టర్స్ ఏర్పాటు వల్ల 24 గంటలు ఏఎన్ఎం సేవలు అందుబాటులో -
ఏపీ: మాస్క్ లేకుంటే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనల్ని మరింత కఠినం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్‌లు లేని వారిని అనుమతిస్తే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జరిమానా మొత్తాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తామని, అదే విధంగా 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేకంగా 8010968295 వాట్సప్ నెంబర్‌ను కేటాయించామని ఆయన వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేళ కర్ఫ్యూను పొడిగించినట్లు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. అందరూ కోవిడ్ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కమిషనర్ హెచ్చరించారు. మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్ఐ ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పటి వరకూ ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. -
థర్డ్‌వేవ్‌కు ఇలా సిద్ధం కండి!
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తున్న తరుణంలో.. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలకు మరోసారి సూచనలిచ్చింది. రాష్ట్రాల్లో జిల్లా స్థాయి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకూ అవసరమయ్యే మౌలిక వసతులను, వాటికయ్యే వ్యయం వంటి వాటిని సూచించింది. మొత్తంగా రూ. 8,261.45 కోట్లను కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ కింద విడుదల చేస్తున్నట్టు చెప్పింది. రాష్ట్రాలు తమ వాటాగా 40 శాతం, కేంద్రం 60 శాతం వ్యయం భరిస్తుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా టెలీ కన్సల్టెన్సీ సేవలను భారీగా పెంచాలని, రోజుకు 5 లక్షల మందికి సేవలను అందించాలని సూచించింది. ఏర్పాట్లపై కేంద్రం ఏం చెప్పిందంటే..? ► దేశవ్యాప్తంగా 8,800 ఏఎల్ఎస్ (అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్) అంబులెన్సులు ఏర్పాటు చేసుకోవాలి. వీటికి నెలకు రూ.2 లక్షల వరకూ చెల్లించాలి. 9 నెలల వరకు ఈ వాహనాలకు అయ్యే వ్యయం కేంద్రం చెల్లిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాలు చెల్లించాలి. కోవిడ్ పేషెంట్లకే ఈ వాహనాలు ఉపయోగించాలి. ► అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,050 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్‌లకు అనుమతి ఇచ్చాం. ఒక్కో యూనిట్ వ్యయం రూ. 20 లక్షలు అవుతుంది. దీంతో పాటు ఎంజీపీఎస్ (మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టం) కూడా రూ.60 లక్షల వ్యయంతో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ► రోజుకు దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి ఇ–సంజీవని కింద ఔట్‌పేషెంటు సేవలు అందించాలి. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే చికిత్సకు వసతులు లేవో వారికి ఈ సేవలు అందించాలి. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో ఇ–సంజీవని సేవలు జరుగుతున్నాయి. ► 540 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఒక్కో యూనిట్లో 42 పడకలు ఉంటాయి. ఇందులో 12 పడకల ఐసీయూ యూనిట్ కూడా ఉంటుంది. మరో 196 జిల్లాల్లో 32 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఉంటాయి. ఇక్కడ 8 పడకల ఐసీయూ వార్డు ఉంటుంది. ► దేశవ్యాప్తంగా 10 లక్షల కోవిడ్ ఐసొలేషన్ పడకలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 20 % కేవలం పీడియాట్రిక్ పడకలే ఉండాలి. ► ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకలు, సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో 20 పడకలు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలి. ఈ కేంద్రాల్లో టెలీ కన్సల్టేషన్ సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. సన్నద్ధతలో ఏపీ ముందంజ.. కోవిడ్ థర్డ్ వేవ్ వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లనూ చేసుకోవడం మొదలుపెట్టింది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. థర్డ్ వేవ్ కోసం కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్‌లో భాగంగా ఏపీకి రూ. 696 కోట్ల మేర కేంద్రం అంచనా వేసింది. అందులో 60 శాతం కేంద్రం, 40 % రాష్ట్రం భరించనున్నాయి. రూ. 101.14 కోట్ల వ్యయంతో 14 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాస్పత్రుల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్లను ప్రారంభించనున్నారు. అలాగే రూ. 188.72 కోట్ల వ్యయంతో మరో 28 ఏరియా ఆస్పత్రుల్లో 40 లెక్కన 1,120 ఐసీయూ పడకలు శరవేగంగా ఏర్పాటవుతున్నాయి. రూ. 5 కోట్లతో గుంటూరు లేదా విజయవాడలో చిన్నపిల్లలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభిస్తారు. రూ. 185 కోట్ల ఖర్చుతో 1,145 పీహెచ్‌సీల్లో, 208 సీహెచ్‌సీల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ మేనేజ్మెంట్ నిర్వహణలో భాగంగా 14 చోట్ల 50 పడకలు లేదా 100 పడకల ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు. 100 పడకల ఆస్పత్రికి రూ. 7.5 కోట్లు, 50 పడకల ఆస్పత్రికి రూ. 3.5 కోట్లు ఖర్చవుతుంది. రూ. 8.38 కోట్ల వ్యయంతో టెలీమెడిసిన్‌ను బలోపేతం చేస్తారు. ప్రతి ఆస్పత్రిలో అత్యవసర మందుల బఫర్ స్టాకు కోసం జిల్లాకు రూ.కోటి ఖర్చు చేయనుంది. కోటి ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తారు. కోవిడ్ సేవలకు గానూ 2,089 మంది పీజీ వైద్య విద్యార్థులు, 2,890 మంది ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు, 1,750 మంది ఎంబీబీఎస్ చదువుతున్న వారు, 2వేల మంది నర్సింగ్ విద్యార్థులను 4 నెలల ప్రతిపాదికన నియమిస్తారు. వీరికి వేతనాల కింద రూ.80.12 కోట్లు ఖర్చవుతుందని అంచనా. -
భూ బదలాయింపుపై యథాతథస్థితి
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఆర్‌ఏఆర్‌సీ) భూమిని ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణం కోసం బదలాయించే విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్, పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ తదితరులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
కొత్తగా 8 డీఎన్బీ కోర్సులు
సాక్షి, అమరావతి: జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా డిప్ల్లమా కోర్సులు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) పీజీ వైద్య సీట్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్రం కొత్తగా డిప్ల్లమా కోర్సులకు అవకాశమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఎన్బీఈఎంఎస్ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్)కు లేఖ రాసింది. అందులో కొత్తగా ఆఫర్ చేసే కోర్సులకు దరఖాస్తులు పంపిస్తామని, తమ లేఖను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై సానుకూల నిర్ణయం వస్తే భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 4,500 వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో 940 మాత్రమే పీజీ సీట్లు ఉన్నాయి. చాలామందికి పీజీ సీటు రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎన్బీ సీట్లు పెరిగితే వైద్య విద్యార్థులకు మేలు జరుగుతుంది. 8 కొత్త కోర్సులు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) 8 కొత్త కోర్సులను నిర్వహిస్తోంది. ఎంబీబీఎస్ పాసైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు ఆగస్ట్ 31వ తేదీ వరకు ఉంది. కొత్త కోర్సుల్లో అనస్థీషియా, ఫ్యామిలీ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, ఆబ్‌స్ట్రెటిక్స్ అండ్ గైనకాలజీ, ఆఫ్తాల్మాలజీ, ట్యూబర్క్లోసిస్ అండ్ చెస్ట్ డిసీజస్ (టీబీ), పీడియాట్రిక్స్, ఈఎన్టీ ఉన్నాయి. ఈ కోర్సుల వల్ల పీజీ సీట్లు రాని ఎంతో మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుంది. 14 జిల్లా ఆస్పత్రుల్లో... చిత్తూరు, మదనపల్లె, టెక్కలి, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, మార్కాపురం, ప్రొద్దుటూరు, ఆత్మకూరు, నంద్యాల, హిందూపురంలలో జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. వీటన్నిటిలో ఈ కొత్త కోర్సులకు దరఖాస్తు చేయనున్నారు. కోర్సుల నిర్వహణకు ఈ ఆస్పత్రుల్లో అన్ని రకాలుగా మౌలిక వసతులు ఉన్నాయి. కొత్త కోర్సులు వస్తే ఆస్పత్రుల్లో స్పెషాలిటీ సేవలు ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఏరియా ఆస్పత్రుల్లో కూడా డీఎన్బీ సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రుల్లో నిర్వహిస్తోన్న డీఎన్బీ వైద్య కోర్సులు ఇవే.... విజయనగరం జిల్లా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్స్– 2, పీడియాట్రిక్స్–6, గైనకాలజీ–2, అనస్థీషియా– 2 ఉన్నాయి అనకాపల్లి ఆస్పత్రిలో గైనకాలజీ–2 కోర్సులు నిర్వహిస్తున్నారు రాజమహేంద్రవరంలో గైనకాలజీ–2, ఎమర్జెన్సీ మెడిసిన్–2, అనస్థీషియా–2, జనరల్ సర్జరీ–1 ఉన్నాయి ఏలూరులో ఆర్థోపెడిక్స్–4, జనరల్ మెడిసిన్–1, గైనకాలజీ–4, అనస్థీషియా–2, ఎమర్జెన్సీ మెడిసిన్–1 ఉన్నాయి నంద్యాల ఆస్పత్రిలో ఫ్యామిలీ మెడిసిన్–2, అనస్థీషియా–2, గైనకాలజీ–2, ఎమర్జెన్సీ మెడిసిన్–1 ఉన్నాయి మచిలీపట్నంలో ఆర్థోపెడిక్స్–1 సీటు, తెనాలి జిల్లా ఆస్పత్రిలో గైనకాలజీ–2 సీట్లు ఉన్నాయి. -
కరోనా మరణాల కట్టడిలో భేష్
సాక్షి, అమరావతి: కరోనా మరణాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో కొనసాగుతోంది. దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్.. మరణాల నియంత్రణపై ప్రత్యేక వ్యూహంతో పట్టు సాధించింది. క్రిటికల్ కేర్ నిర్వహణ, సకాలంలో బాధితులకు వైద్యమందించడం, ఆక్సిజన్, ఐసీయూ పడకల నిర్వహణ తదితర కారణాల వల్ల బాధితులు కరోనా నుంచి బయటపడుతున్నట్టు తేలింది. మృతిచెందుతున్న వారిలో చాలామంది కోమార్బిడిటీ (జీవనశైలి/ఇతర జబ్బులు) కారణాల వల్ల మరణిస్తున్నారని, కరోనా సోకిన తర్వాత ఆస్పత్రికి రావడంలో జాప్యం కూడా దీనికి కారణమని విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రికి చెందిన ఓ డాక్టరు అభిప్రాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రంలో కరోనా బాధితులు 2.69 శాతం మంది మరణిస్తున్నారు. దేశంలో ఇదే అత్యధికం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనా మరణాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఒకదశలో 2 లక్షలకు పైగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య జూలై 6వ తేదీ నాటికి 33,230కి తగ్గింది. దేశంలో అత్యధికంగా యాక్టివ్ కేసులు మహరాష్ట్రలో 1.21 లక్షలు ఉన్నాయి. 1.03 లక్షల యాక్టివ్ కేసులతో కేరళ రెండోస్థానంలో ఉంది. కేసులు తగ్గుతున్నాయని జనం గుంపులుగా వెళ్లకూడదని, బయటకు వెళ్లేటప్పుడు విధిగా మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ వివిధ మాధ్యమాల ద్వారా పల్లెలు, పట్టణాల్లో ప్రచారం నిర్వహిస్తోంది. -
రాష్ట్రానికి మరిన్ని టీకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరిన్ని టీకాలు వచ్చే అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇందుకు మార్గంసుగమం చేసింది. రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసే కరోనా టీకాల్లో 75 శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, 25 శాతం ప్రైవేట్ ఆసుపత్రులకు అందజేస్తుంది. అయితే ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు చాలా తక్కువగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల నిమిత్తం కేటాయించిన టీకా డోసులు మిగిలిపోతున్నాయి. ఈ విధంగా మిగిలిన టీకాలను, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొనుక్కోవచ్చని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఆయా రాష్ట్రాల్లో మిగిలిపోతున్న ప్రైవేట్ టీకా డోసులు కొనుగోలు చేసే ఆలోచనలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉంది. టీకాల కోసం ఎదురుచూపులు తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 1.20 కోట్లకు పైగా టీకాలను సరఫరా చేసింది. జూలై నెలకు మరో 28 లక్షలు కేటాయించింది. అయితే కరోనా నేపథ్యంలో చాలామంది అర్హు లు ఇంకా టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు దాదాపు రెండు లక్షల డోసులు వేస్తున్నా కొరత వేధిస్తూనే ఉంది. కొన్ని టీకా కేంద్రాల్లో డోసులు అసలే దొరకడం లేదు. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేం ద్రం.. జనాభా, కరోనా కేసుల ప్రాతిపదికన ఇస్తుండటంతో డిమాండ్ మేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఉపకరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నా రు. ఇతర రాష్ట్రాల నుంచి టీకాలు కొనడం వల్ల తక్కువ కాలంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయడానికి వీలుపడుతుందని చెబుతున్నారు. నెలకు అదనంగా మరో ఐదారు లక్షల టీకాలకు వీలు పడుతుందని పేర్కొంటున్నారు. టీకాల షెడ్యూల్‌కు కసరత్తు రాష్ట్రంలో ప్రస్తుతం వెయ్యికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. అయితే ఒక్కోరోజు కొన్ని కేంద్రాల్లో టీకాల కార్యక్రమా న్ని అకస్మికంగా నిలిపివేస్తున్నారు. టీకాల కొరత, కొన్నిసార్లు ఇతర కేంద్రాలకు ఎక్కువగా పంపడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇలాం టి పరిస్థితిని నివారించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఏ నెలలో ఎన్ని టీకాలు రాష్ట్రాలకు పంపాలో ఇప్పటికే నిర్ణయించి షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ ప్రకారమే రాష్ట్రాలు కూడా ప్రణాళిక రచించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. జిల్లాలు మొదలు టీకా కేంద్రాల వారీగా షెడ్యూల్ ఖరారు చేసి సరఫరా చేయాలని ఆదేశించింది. ఇలా చేయడం వల్ల ఏ టీకా కేంద్రానికి, ఏ రోజు, ఎన్ని డోసులు సరఫరా అవుతాయో స్పష్టత ఉంటుంది. దీనివల్ల లబ్ధిదారులకు కూడా ఎలాంటి ఇబ్బందీ కలగదు. కేంద్రం ఆదేశాల మేరకు షెడ్యూల్ ఖరారుకు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 15 నుంచి దేశంలో మోడెర్నా టీకా ప్రపంచంలో పేరుపొందిన టీకాల్లో ఒకటైన మోడెర్నా ఈ నెల 15వ తేదీ నుంచి దేశంలో అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రంలో ఈ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. మోడెర్నా టీకాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోనూ అందుబాటులోకి తెస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తామని అధికారులు చెబుతున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 7 వరకు కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో జూలై 7వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మిగతా 9 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈమేరకు కలెక్టర్లు, పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కోవిడ్ పాజిటివీటీ రేటు 5 శాతం ఉన్న జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ రోజుకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పాజిటివిటీ 5 శాతానికిపైగా ఉంది. దీంతో ఈ 5 జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఆ జిల్లాలో కూడా సడలింపు సమయాన్ని పెంచారు. దీంతో మిగిలిన 4 జిల్లాల్లో మాత్రమే కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిమితం చేశారు. -
సీహెచ్సీల్లోనూ కోవిడ్ చికిత్స!
సాక్షి, అమరావతి: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి ఆస్పత్రులకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులకే కోవిడ్ చికిత్సలు పరిమితమయ్యాయి. మూడో వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇకపై సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కోవిడ్ చికిత్సలు అందించేలా వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 30 నుంచి 50 పడకల వరకూ ఉంటాయి. వీటిల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉంటుంది. 18ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్ సోకినా ఇబ్బందులు తలెత్తకుండా సీహెచ్సీల్లోనూ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల బాధితులకు సత్వరమే సమీపంలోనే సేవలు అందనున్నాయి. 24 గంటలూ కరెంటు ఉండేలా చర్యలు చేపట్టారు. వెంటనే ఆస్పత్రికి చేరుకునేలా.. సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు కలిపి 50కిపైగా ఆస్పత్రులను కోవిడ్ చికిత్సకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇవికాకుండా 10 ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇంతకుముందు వీటిల్లో కోవిడ్ సేవలు అందించలేదు. కొత్తగా కోవిడ్ చికిత్స కోసం వీటిని సిద్ధం చేస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు సాధారణంగా నియోజకవర్గ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా తక్షణమే ఆస్పత్రికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆస్పత్రుల్లో కొత్తగా ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, వార్డుల పునరుద్ధరణ చేపట్టారు. కోవిడ్‌కు అవసరమైన మౌలిక వసతులను అన్నిటినీ ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థంగా చికిత్స అందించేలా వసతులు కల్పిస్తున్నారు. పీడియాట్రిక్ వైద్యులు లేని చోట్ల తక్షణమే నాన్‌కోవిడ్ ఆస్పత్రులకు చెందిన పిల్లల వైద్యులను నియమిస్తారు. ఏ జిల్లాలో ఎక్కడ..? ► అనంతపురం: అనంతపురం సీడీహెచ్, గుత్తి, కల్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ,ఉరవకొండ సీహెచ్‌సీలు ► తూర్పు గోదావరి: రంపచోడవరం, తుని (ఏరియా ఆస్పత్రి), అడ్డతీగల, చింతూరు, గోకవరం, పి.గన్నవరం, పెద్దాపురం, పత్తిపాడు, రాజోలు, ఏలేశ్వరం సీహెచ్‌సీలు ► గుంటూరు: చిలకలూరిపేట, సత్తెనపల్లి (ఏరియా ఆస్పత్రులు), ఫీవర్ ఆస్పత్రి ► ప్రకాశం: గిద్దలూరు,యర్రగొండపాలెం (ఏరియా ఆస్పత్రులు), డోర్నాల, కంభం సీహెచ్‌సీలు, ఎంసీహెచ్ ఒంగోలు ► చిత్తూరు: మహల్, పుత్తూరు, సత్యవేడు, వాయల్పాడు సీహెచ్‌సీలతో పాటు తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి ► పశ్చిమ గోదావరి: భీమవరం,చింతలపూడి, నరసాపురం,పాలకొల్లు (ఏరియా ఆస్పత్రులు), కొవ్వూరు, నిడదవోలు సీహెచ్‌సీలు ► కృష్ణా: జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ (విజయవాడ), సీహెచ్‌సీ మైలవరం ► శ్రీకాకుళం: నరసన్నపేట, సీతంపేట ఏరియా ఆస్పత్రులు ► కడప: జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి (ఏరియా ఆస్పత్రులు), బద్వేల్, పోరుమామిళ్ల, వేంపల్లి, మైలవరం సీహెచ్‌సీలు ► కర్నూలు: బనగానపల్లి, ఆదోని, ఎమ్మిగనూరు సీహెచ్‌సీలు ► విశాఖపట్నం: అగనంపూడి (ఏరియా ఆస్పత్రి),చింతపల్లి, కోటపాడు, నక్కపల్లి, యలమంచిలి సీహెచ్‌సీలు -
స్కూళ్ల సమీపంలోని సిగరెట్, పాన్ షాపులు క్లోజ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్కూల్‌కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఇకపై ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు. ఒక్కో ఏఎన్ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఏఎన్ఎం వెళ్లి స్కూలు సమీపంలోని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. దీనికోసం ఒక ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్ ద్వారా అక్కడి ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఎవరైనా సిగరెట్, గుట్కా వంటి షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే స్కూల్ సమీపంలో ఎవరైనా స్మోకింగ్ చేసినా కూడా చర్యలుంటాయి. మద్యం షాపులైతే ఆ పరిసరాల్లో అసలే కనిపించకూడదు. ప్రతి స్కూల్‌నూ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అనంతరం వీటిని ఆన్లైన్ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదని ఈ చర్యలు చేపట్టారు. అలాగే స్కూల్ ఆవరణలో స్మోకింగ్ వల్ల వచ్చే అనర్థాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేస్తారు. టీచర్లు ఎవరైనా స్కూల్ ఆవరణలో స్మోకింగ్ చేస్తే.. వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు. త్వరలో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. -
ఆక్సిజన్‌కు కొరత లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో అవసరమైనంత ఆక్సిజన్ అందుబాటులోనే ఉందని, కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఆక్సిజన్ అందక పేషెంట్లు మృతి చెందారంటూ.. తప్పుడు వార్తలతో అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. సోమవారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం తగ్గిందని చెప్పారు. ఈ నెల 24న 196 మెట్రిక్ టన్నులు, 25న 169 టన్నులు, 27న 170 టన్నుల ఆక్సిజన్ తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉందని వివరించారు. కానీ ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేషెంట్లు మృతి చెందారంటూ వార్తలు వచ్చాయన్నారు. తప్పుడు వార్తలు రాసే వారిపై చట్టపరంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించే సమీక్షా సమావేశాలపై కూడా అవాస్తవాలు ప్రచురించడం తగదని అనిల్ సింఘాల్ సూచించారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,16,90,837 మందికి టీకాలు వేశామని సింఘాల్ చెప్పారు. ఐదేళ్లలోపు పిల్లలు కలిగిన 45 ఏళ్ల లోపు వయసు తల్లులు 18,75,866 మంది ఉండగా.. 12,99,500 మందికి టీకా మొదటి డోసు పూర్తయ్యిందని తెలిపారు. జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి 53,14,740 డోసులు అందజేయనున్నట్లు కేంద్రం సమాచారమిచ్చిందని చెప్పారు. -
చిత్తూరు జిల్లాలో ‘డెల్టా ప్లస్’ కేసులు లేవు
తిరుపతి, అన్నమయ్య సర్కిల్: కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యు.శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం ఎటువంటి డెల్టా ప్లస్ కేసులు లేవన్నారు. తిరుపతిలో డెల్టా ప్లస్ ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతి మంగళం పీహెచ్సీ పరిధిలో ఓ వ్యక్తికి ఏప్రిల్ 4న పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 5న స్విమ్స్ కోవిడ్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నారు. బాధితుడు కరోనాకు చికిత్స తీసుకొని ఏప్రిల్ 13న డిశ్చార్జ్ అయ్యాడని, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. చికిత్స తీసుకున్న సమయంలో అతని నుంచి శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పరీక్ష నిమిత్తం పంపించారన్నారు. జూన్ 23వ తేదీన వచ్చిన రిజల్ట్‌లో డెల్టా ప్లస్‌గా నిర్ధారణ అయిందన్నారు. సమాచారం అందిన వెంటనే ఆ వ్యక్తిని, అతని కుటుంబసభ్యులను పరామర్శించి, ఆరా తీయగా అందరూ ఆరోగ్యంగా వున్నారని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని గుర్తించామన్నారు. అతను నివసించే ప్రాంతంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించగా అక్కడి వారంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో డెల్టా వేరియంట్ ప్రభావం ఏమాత్రం లేదన్న విషయాన్ని గుర్తించి ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. -
మన సత్తా చాటారు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సినేషన్లో గత రికార్డును అధిగమిస్తూ రాష్ట్రంలో ఒకేరోజు పెద్ద ఎత్తున టీకాలు ఇచ్చిన అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే అంతేస్థాయిలో టీకాలు ఇవ్వగలిగే సామర్థ్యం మనకు ఉందని, ఇంతకంటే మెరుగ్గా చేయగలమని స్పష్టం చేశారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయాల సిబ్బంది, మండలానికి రెండు పీహెచ్‌సీలు, డాక్టర్లు.. ఇలా గట్టి యంత్రాంగం మనకు ఉందన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే మరోసారి మెగా డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడుపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒక్కరోజులో 20 – 25 లక్షల మందికి వాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, యంత్రాంగం మనకు ఉందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. సమర్థంగా ఎమర్జెన్సీ ప్లాన్స్.. ఆస్పత్రుల్లో అనుకోని ప్రమాదాలు సంభవించిన సమయాల్లో రోగులను సురక్షితంగా తరలించేందుకు ఎమర్జెన్సీ ప్లాన్స్ సమర్థంగా ఉండాలని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరించే ప్రోటోకాల్స్‌పై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధ్యయనం చేసిన అధికారులు దీనికి సంబంధించిన వివరాలను సమర్పించారు. బిల్డింగ్, సర్వీసులు, నాన్ బిల్డింగ్ సర్వీసులపై అధ్యయనం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఏ.బాబు, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు తదితరులు హాజరయ్యారు. సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఇలా... – ఏపీలో ఇప్పటిదాకా 1,37,42,417 డోసుల వ్యాక్సినేషన్ పూర్తి – 82,77,225 మందికి మొదటి డోసు, 27,32,596 మందికి రెండు డోసుల టీకాలు. మొత్తంగా వ్యాక్సిన్లు ఇచ్చిన వారి సంఖ్య 1,10,09,821 – ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లుల్లో 10,29,266 మందికి వ్యాక్సినేషన్ – విదేశాలకు వెళ్లనున్న 11,158 మందికి మొదటి డోసు – జూన్ 20న నిర్వహించిన మెగా డ్రైవ్‌లో మొత్తం 13,72,481 మందికి టీకాలు. రికవరీ రేటు 95.93 % – తూర్పు గోదావరి మినహా అన్ని జిల్లాల్లో తగ్గిన పాజిటివిటీ రేటు. పాజిటివిటీ రేటు 5.65 శాతం – 63,068కు తగ్గిన యాక్టివ్ కేసులు – 95.93 శాతానికి చేరిన రికవరీ రేటు – తాజాగా అందుబాటులో 2,655 ఐసీయూ బెడ్లు, 13,824 ఆక్సిజన్ పడకలు. – మే 17న అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్లు కేవలం 433. – 91.48 శాతం పడకల్లో ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స – 104 కాల్ సెంటర్‌కు కోవిడ్ ఉధృతి సమయంలో గరిష్టంగా వచ్చిన కాల్స్ 19,715 కాగా ప్రస్తుతం వచ్చిన కాల్స్ 1,506 – కోవిడ్ కేర్ సెంటర్లలో భర్తీ అయిన బెడ్లు 7,056 బ్లాక్ ఫంగస్ బాధితుల్లో 1,232 మంది డిశ్చార్జి – బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు 2,772 – 922 మందికి సర్జరీలు, 1,232 మంది డిశ్చార్జి – 212 మంది మృతి – మిగిలిన వారికి ఆస్పత్రిలో చికిత్స మరోసారి నిరూపించాం.. ‘‘మన దగ్గర పటిష్ట యంత్రాంగం ఉన్నందువల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ సాధ్యమైంది. టీకాలు అందుబాటులో ఉంటే శరవేగంగా ఇచ్చే సమర్ధత ఉందని అధికార యంత్రాంగం మరోసారి నిరూపించింది’’ – ముఖ్యమంత్రి జగన్ ఆస్పత్రుల నిర్వహణపై ఎస్‌వోపీలు ఆస్పత్రుల ఆవరణలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి పటిష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనం పోటీపడుతున్నది ప్రభుత్వ ఆస్పత్రులతో కాదని, కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదన్నారు. ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి.. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలను సడలిస్తుండటం, రాకపోకలు పెరుగుతున్న సమయంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. శరవేగంగా కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం ఆదేశించారు. పనుల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. -
యాంటీబయోటిక్స్‌కు చికిత్స
సాక్షి, అమరావతి: ప్రాణాధార మందులు (యాంటీబయోటిక్స్) కొనుగోళ్లలో భారీ దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీంతో గత పదేళ్లుగా సీపీఎస్‌యూ (సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్)ల పేరుతో అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్న దుస్థితి నుంచి రాష్ట్రానికి విముక్తి లభించింది. రాష్ట్రానికి వచ్చే చాలా రకాల యాంటీబయోటిక్స్.. సీపీఎస్‌యూలు మాత్రమే సరఫరా చేసేలా రిజర్వుడు ఐటెమ్స్‌గా ఉండేవి. సీపీఎస్‌యూలు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే కొనాల్సి వచ్చేది. ఎలాంటి టెండరూ ఉండేది కాదు. ఈ విధానానికి ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం చెక్ పెట్టింది. రిజర్వుడు కేటగిరీలో ఉన్న యాంటీబయోటిక్స్ మందులను డీరిజర్వు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు యాంటీబయోటిక్స్ రేట్లు 50 శాతానికి పైగానే తగ్గాయి. పదేళ్లలో రూ.200 కోట్లు నష్టం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల విలువ చేసే యాంటీబయోటిక్స్ మందులను సీపీఎస్‌యూల నుంచి కొనుగోలు చేస్తోంది. అధిక ధరల కారణంగా ఏటా రూ.20 కోట్ల వరకు రాష్ట్రానికి అదనపు భారం పడేది. ఇలా గత పదేళ్లలో ఒక్క యాంటీబయోటిక్స్ మందుల కారణంగానే రూ.200 కోట్ల వరకు ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చింది. వీటిని డీరిజర్వు చేయడం ద్వారా ఇప్పుడు ఏటా రూ.20 కోట్లు ఆదా అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రాణాధార మందులను డీరిజర్వు చేయకుండా గత ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టర్లు భారీ లబ్ధి పొందారు. వీళ్లకు కొంతమంది నేతలు అండగా ఉండటంతో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఇప్పుడు కూడా అదే రీతిలో యత్నించిన కాంట్రాక్టర్ల పాచికలు పారలేదు. ఇక ఎవరైనా టెండర్లలో పాల్గొనే అవకాశం.. యాంటీబయోటిక్స్ డీరిజర్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం టెండర్లకు వెళ్లింది. ఈ టెండరు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. గతంలో కొనుగోలు చేసిన వాటికంటే కొన్ని మందులు వంద శాతం తక్కువ ధరకు లభించాయి. కొన్నిటిని 50 శాతం, మరికొన్నింటిని 40 శాతం తక్కువ ధరకే సరఫరా చేయడానికి ముందుకొచ్చారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో తెలుస్తోంది. మన రాష్ట్రంలో లేని సీపీఎస్‌యూల కోసం ఎంత అదనంగా చెల్లింపులు చేశారో అర్థమవుతోంది. కరోనా కారణంగా కొన్ని కంపెనీలు టెండరుకు రాలేకపోయాయని, భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. ఓపెన్ మార్కెట్‌కు వెళ్లినందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)/గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) గుర్తింపు ఉన్న ఎవరైనా ఇకపై టెండర్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అజిత్రోమైసిన్ కొనుగోళ్లలోనే రూ.1.28 కోట్లు మిగులు కరోనా సమయంలో ఏపీలో 40 లక్షల అజిత్రోమైసిన్ మాత్రలు కొన్నారు. ఒక్కో మాత్ర విలువ రూ.9.20. అదే మాత్ర ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం.. రూ.6కు దిగివచ్చింది. ఇంతకుముందు ఒక్కో మాత్రపైన రూ.3.20పైనే చెల్లించాల్సి వచ్చింది. అంటే.. రూ.1.28 కోట్లు అదనంగా చెల్లించారు. ఇప్పుడు ఇదంతా మిగిలినట్టే. భారీగా రేట్లు తగ్గాయి.. గతంలో సీపీఎస్‌యూల దగ్గర కొనుగోళ్ల వల్ల ఎక్కువ ధరలు చెల్లించాల్సి వచ్చేది. అందుకే ఆ విధానానికి స్వస్తి పలికాం. కొత్త విధానం ప్రకారం.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏ కంపెనీ అయినా టెండర్లలో పాల్గొనవచ్చు. తాజాగా టెండర్లకు వెళితే భారీగా రేట్లు తగ్గాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరింత చౌకగా యాంటీబయోటిక్స్ లభిస్తున్నాయి. – అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ -
ఇ–సంజీవనిలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇ–సంజీవని కార్యక్రమం వరంలా ఉపయోగపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి తెస్తూ ఇ–సంజీవని ద్వారా ప్రయోజనం చేకూర్చడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో వుంది. దేశంలో జూన్ 7వ తేదీ నాటికి 59.28 లక్షల మందికిపైగా ఇ–సంజీవని ద్వారా సేవలు పొందగా అందులో 11.84 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. ఇ–సంజీవని ఇలా రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో 13 టెలీమెడిసిన్ హబ్స్ ఏర్పాటు కాగా ప్రతి హబ్‌లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్‌తో పాటు ఇద్దరు ఎంబీబీఎస్ అర్హత ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. హబ్‌ను పీహెచ్సీలో మానిటర్‌కు అనుసంధానిస్తారు. దీంతో రోగిని నేరుగా హబ్‌నుంచి చూసే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులను మెడికల్ ఆఫీసర్లు పరీక్షించి వారి పరిధిలో లేనివి, అంతుచిక్కని జబ్బుల బాధితులను అక్కడ నుంచే టెలీహబ్‌కు కనెక్ట్ చేస్తారు. ఇ–సంజీవని హబ్‌లో స్పెషలిస్టు డాక్టర్లు పేషెంటును పరిశీలించి మందులు సూచించడం లేదా పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తారు. మొత్తం 13 హబ్‌లలో 39 మంది స్పెషలిస్టు వైద్యులు, 26మంది మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. గ్రామీణులకు మెరుగైన సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్పెషలిస్ట్ సేవలతో మేలు జరుగుతోంది. గ్రామాల్లో వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్‌లో ఉన్న మిడ్‌లెవెల్ హెల్త్‌ప్రొవైడర్లు ప్రత్యేక యాప్‌ద్వారా పీహెచ్‌సీకి కనెక్ట్ చేస్తారు. ఎంబీబీఎస్ డాక్టరు పరీక్షించిన అనంతరం తన పరిధిలో లేని జబ్బుల బాధితులను బోధనాసుపత్రిలోని టెలీహబ్‌కు కనెక్ట్ చేసి చూపిస్తారు. దీనివల్ల పేదలు పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండానే స్పెషలిస్టు సేవలు పొందగలుగుతున్నారు. సగటున రోజుకు రాష్ట్రంలో ఇలా 15 వేల మందికిపైగా సేవలు పొందుతున్నట్టు అంచనా. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో ఇ–సంజీవని మెరుగ్గా అమలు జరుగుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా లబ్ధిదారుల్లో 19.71 శాతం మంది ఏపీలోనే ఉండటం గమనార్హం. స్పెషలిస్టు సేవలు గ్రామాల్లోకే గతంలో స్పెషలిస్టు డాక్టరు సేవలు పొందాలంటే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు టెలీహబ్ ద్వారా ఆ భారం తప్పింది. దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దితే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. –అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి -
వైద్య ఆరోగ్య సిబ్బందికి కొండంత భరోసా
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్, బ్లాక్‌ఫంగస్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్సలు అందిస్తోంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానంతో కరోనాను కట్టడి చేస్తోంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి తోడుగా వేలాది మంది వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. వారి కుటుంబాలకు భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న శాశ్వత (రెగ్యులర్) ఉద్యోగులెవరైనా కోవిడ్‌తో మృతి చెందితే వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పరిహారం.. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ లేదా ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేదానికి అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటగిరీల వారీగా పరిహారం ► కోవిడ్‌తో డాక్టరు మృతి చెందితే రూ. 25 లక్షలు, స్టాఫ్ నర్సులకు రూ. 20 లక్షలు, ఎంఎన్‌వో/ఎఫ్ఎన్వో (మేల్ నర్సింగ్ ఆర్డర్లీ/ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ)కు రూ.15 లక్షలు, ఇతర సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. ► ఈ సొమ్మును మృతి చెందిన బాధితుడి కుటుంబ సభ్యులకు అందిస్తారు. ► కోవిడ్ నియంత్రణలో భాగంగా కోవిడ్ హాస్పిటల్, కోవిడ్ కేర్ సెంటర్, లేదా హౌస్ విజిట్స్‌కు వెళ్లినప్పుడు పాజిటివ్‌గా నిర్ధారణ అయి ప్రాణాలు కోల్పోతే ఈ పరిహారం చెల్లిస్తారు. ► ఉద్యోగికి సంబంధించిన గుర్తింపు కార్డును సంబంధిత అధికారి జారీ చేసి ఉండాలి. ► కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ విధిగా చూపించాలి. అలాగే ఆధార్ కార్డు, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి. ఉద్యోగులకు భద్రత ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత భరోసా ఇచ్చారు. నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందంతో ఉన్నారు. – డాక్టర్ జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం -
చిన్నారులకు అత్యుత్తమ వైద్యం
ఆరోగ్యశ్రీ దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా నిలవాలి. ఆరోగ్యశ్రీ చికిత్సల కింద ప్రభుత్వం నిర్ధారిస్తున్న రేట్లు ఇబ్బందులకు గురిచేసేలా కాకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఫిక్స్ చేయాలి. ఇవాళ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వారాల లోపే బిల్లులు చెల్లిస్తున్నాం. పథకం అమలులో బాధ్యత, విశ్వసనీయత చాలా ముఖ్యం. సకాలంలో బిల్లుల చెల్లింపు ఆరోగ్యశ్రీ విశ్వసనీయతను పెంచుతుంది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఆరోగ్య ఆసరా కూడా ఒక విప్లవాత్మక చర్య. ప్రతి రోజూ ఆరోగ్యశ్రీ పథకంపై దృష్టి పెట్టాలి. అప్పుడే పేదల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్ తగ్గిన తరువాత ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యల బారిన పడుతున్న చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా హెల్త్ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, రెండు వారాల్లోగా హెల్త్ హబ్‌లపై విధివిధానాలను ఖరారు చేయాలని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కోవిడ్ కారణంగా మరణించిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కుటుంబాలకు త్వరగా ఆర్థిక సాయం అందించాలని సూచించారు. కోవిడ్ రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బందికి కూడా ఆర్ధిక సహాయం అందించడంపై పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్... కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్ సంబంధిత అంశాల్లో నర్సులు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయాల గురించి అధికారులు వివరించారు. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తం 1,600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అదనంగా చిన్న పిల్లల వైద్యులు, స్టాఫ్ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. టైర్–1 నగరాల తరహాలో అత్యుత్తమ వైద్యం హెల్త్ హబ్‌లపై సమీక్ష సందర్భంగా జిల్లా కేంద్రాల్లో వీటి ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు ఏర్పాటు కావాలని సీఎం సూచించారు. దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్స విధానాలు, టెక్నాలజీ, అత్యుత్తమ సదుపాయాలను ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకు రావాలన్నదే హెల్త్ హబ్‌ల వెనుక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకూ అందుబాటులోకి రావాలన్నారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), కోవిడ్ అండ్ కమాండ్ కంట్రోల్ చైర్పర్సన్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ.కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వారంలో గణనీయంగా తగ్గిన కోవిడ్ కేసులు (జూన్ 6–12 వరకు) ► జూన్ 12న 6.58 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు. మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం 8 అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 17.5% లోపే. ► 7 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 0–9% లోపే. ► చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో 10–19 శాతం మధ్య పాజిటివిటీ రేటు ► 85,637కి తగ్గిన యాక్టివ్ కేసులు. 94.61 శాతానికి పెరిగిన రికవరీ రేటు. ► 104 కాల్ సెంటర్‌కు ఏప్రిల్ 15 నుంచి 5 లక్షలకుపైగా కాల్స్ అందగా ఔట్ గోయింగ్ కాల్స్ సంఖ్య 6,41,093. ప్రస్తుతం రోజు వారీ కాల్స్ సుమారు 2,700. ► జూన్ 12 వరకూ 2,303 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు, 157 మంది మృతి. -
రాష్ట్రంలో చురుగ్గా వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 45 ఏళ్లు పైబడినవారిలో ఇప్పటికే 53.7 శాతం మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయసుతో నిమిత్తం లేకుండా 1,28,824 మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,13,76,000 డోసులు పంపిణీ చేశామని చెప్పారు. 26,04,000 మందికి రెండు డోసులు, 61,67,700 మందికి మొదటి డోసు వేశామని వివరించారు. 45 ఏళ్లు పైబడినవారిలో 52,52,000 మందికి ఒక డోసు, 18,94,000 మందికి రెండు డోసులు వేశామన్నారు. జూన్ నెలాఖరుకు 47,50,000 డోసులు అందుబాటులో ఉంటాయన్నారు. సింఘాల్ ఇంకా ఏం చెప్పారంటే.. పాజిటివిటీ రేటు తగ్గుతోంది రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు జూన్ 10న 8. 29, జూన్ 11న 8.09గా నమోదైంది. రికవరీ రేటు 94 శాతంగా ఉంది. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. జూన్ 10న 67 మంది, 11న 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆస్పత్రుల్లో 15,951 మంది, కోవిడ్ కేర్ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్‌లో 71,186 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఆక్సిజన్ వినియోగం తగ్గింది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో 625 ఆస్పత్రుల్లో దానికి చికిత్స అందజేశాం. ప్రస్తుతం తీవ్రత తగ్గడంతో 454 ఆస్పత్రులు కరోనాకు చికిత్స అందిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రస్తుతం 2,231 ఐసీయూ బెడ్లు, 11,290 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో కేంద్రం నుంచి 423 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే తీసుకున్నాం. బ్లాక్ ఫంగస్ కేసులను దాచిపెట్టడం లేదు రాష్ట్రంలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీనితో 138 మంది మృతి చెందారు. ఈ కేసులను దాచిపెడుతున్నామనే ఆరోపణలు సరికాదు. కేసులు దాచిపెట్టడం వల్ల కేంద్రం నుంచి బ్లాక్ ఫంగస్ నివారణకు రావాల్సిన ఆంపోటెరిసిన్–బి ఇంజక్షన్లు రాకుండా పోతాయి. -
సంప్రదాయ మందుగా వాడవచ్చు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందును సంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు.మందు వాడకం వల్ల లాభం గురించి కాకుండా, ఎలాంటి నష్టాలు జరగలేదని భావించి ఆమోదం ఇచ్చామన్నారు. సోమవారం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములుతో కలిసి మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. మందులో వాడుతున్న పదార్థాల్లో హానికారకాలు లేవని తేలిందని చెప్పారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు పనిచేస్తుందన్న ఆధారాలు కూడా ఏమీ లేవని, ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వాడుకోవచ్చని పేర్కొన్నా రు. ఇతర మందులు వాడుతున్న వారు వాటిని వాడుతూనే ఈ మందును కేవలం సప్లిమెంట్‌గా వాడాలని సూచించారు. పాజిటివ్ పేషెంట్లెవరూ క్యూలలో లేకుండా వారి సహాయకులు వచ్చి మందు తీసుకెళ్లడం మంచి దని,కంట్లో వేసే మందుకు అనుమతి లేదన్నారు. కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం కర్ఫ్యూ కారణంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గతంలో కొన్ని పత్రికలు 144 సెక్షన్ అమలు, కర్ఫ్యూపై మీడియాలో విమర్శలు చేశాయని, కానీ ఇప్పుడు ఈ విధానమే మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు. అందుకే జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగించామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ఇదే మొదటిసారి అని తెలిపారు. రూ.7,880 కోట్లతో నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో 14 కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేశారని, రెండు కాలేజీలకు ఇంతకుముందే శంకుస్థాపన చేశారని చెప్పారు. రాష్ట్రంలో 1,179 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులున్నారని, వీరిలో 97 మంది పూర్తిగా కోలుకోగా, 14 మంది మృతిచెందారని తెలిపారు. 1,179 మందిలో 40 మంది మినహా మిగతావారు కరోనా సోకినవారేనని చెప్పారు. బ్లాక్‌ఫంగస్ కేసుల్లో 370 మంది ఆక్సిజన్ సపోర్టు తీసుకున్న వారు, 687 మంది స్టెరాయిడ్స్ వాడిన వారు ఉన్నారని తెలిపారు. మధుమేహ బాధితులు 743 మంది ఉన్నారన్నారు. కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు బాగా డిమాండు తగ్గిందన్నారు. ఆక్సిజన్ స్టోరేజీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు 590 మెట్రిక్ టన్నులు మాత్రమే తెస్తున్నామని, ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గిందని తెలిపారు. 10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేశాం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ కృష్ణపట్నం మందుపై తమశాఖ ఈనెల 21, 22 తేదీల్లో పరిశీలన మొదలుపెట్టిందని చెప్పారు. చెప్పినట్లుగానే అన్ని పరిశీలనలు పూర్తిచేసి 10 రోజుల్లో ఫలితాలు ఇచ్చామన్నారు. దీన్నిబట్టి ఈ మందుపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చట్టం, శాస్త్రం ప్రకారం దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేదని, స్థానిక, సంప్రదాయ మందుగానే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ మందును పంపిణీ చేయాలన్నారు. ఆనందయ్యతో మాట్లాడిన తరువాత మందు పంపిణీపై తేదీలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే 57 ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తుందని, భవిష్యత్‌లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 16 చోట్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి భూమిలో రాయితీ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. దీనికోసం భూములు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో 808 బ్లాక్‌ఫంగస్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 808 బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్‌ఫంగస్ చికిత్సకు సంబంధించిన యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు కేంద్రం ఇస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, దీనికి మరో మార్గం లేదన్నారు. ఇంజక్షన్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం 7,726 ఇంజక్షన్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,475 యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు జిల్లాలకు పంపించామని, పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రోజువారీ ఆక్సిజన్ వినియోగం తగ్గిందని, ఒక దశలో 620 టన్నుల వినియోగం జరిగిందని, ఇప్పుడు 510 టన్నులు వినియోగం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 66 విజిలెన్స్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 43 ఆస్పత్రులపై పెనాల్టీలు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ వంటి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అన్ని జిల్లాలో తగ్గిన ప్రభావం కనిపిస్తోందన్నారు. రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ ‘రాష్ట్రంలో గతంలో ఒకేరోజు 6.28 లక్షల మందికి టీకా వేశాం. ఇప్పుడు రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాం. రాష్ట్రానికి టీకా వేసే సామర్థ్యం ఎక్కువగా ఉంది కాబట్టి కేటాయింపులు కూడా ఎక్కువగా చేయాలని కేంద్రాన్ని కోరాం’ అని సింఘాల్ తెలిపారు. నేటితో అంటే మే 30వ తేదీతో ఉన్న స్టాకు అయిపోతుందన్నారు. ఆ తర్వాత కేంద్రం వ్యాక్సిన్ పంపించే వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయడానికి లేదని, ఈ నేపథ్యంలో కాస్త కేటాయింపులు పెంచి త్వరగా వ్యాక్సిన్ పూర్తయ్యేలా చేయాలని లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 94,74,745 డోసుల టీకాలు పంపిణీ చేశామని, వీరిలో రెండు డోసులు తీసుకున్న వారు 24.12 లక్షల మంది ఉండగా, మొదటి డోసు తీసుకున్న వారు 46.48 లక్షల మంది ఉన్నారన్నారు. వ్యాక్సిన్లు ఎక్కడైనా దుర్వినియోగం జరిగాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చిన్న పిల్లల్లో కోవిడ్ చికిత్స విధానానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 ఏళ్లలోపు చిన్న పిల్లలకు కోవిడ్–19 సోకితే అనుసరించాల్సిన చికిత్సా విధానం, నియంత్రించడం కోసం ఒక స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌గా ఏపీఎండీసీ చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి వ్యవహరించనుండగా, సభ్య కన్వీనర్‌గా ఏపీహెచ్ఎస్ఎస్పీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఐఏఎస్ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా డాక్టర్లు ఎం.రాఘవేంద్రరావు, సాయిలక్ష్మి, అరుణ్‌బాబు, సర్దారా సుల్తానా, చంద్రశేఖర్‌రె డ్డి, రఘువంశి చిత్ర ఉన్నారు. చిన్న పిల్లల్లో కోవిడ్ లక్షణాలున్నప్పుడు వైద్య విధానాలు, ఇందుకు వైద్య సిబ్బంది, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ వంటి ప్రోటోకాల్స్‌ను టాస్క్ ఫోర్స్ రూపొందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల గుర్తింపునకు కమిటీ ప్రైవేటు ఆస్పత్రుల గుర్తింపు, నిబంధనల పర్యవేక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి ఎక్స్అఫిషియో చైర్మ న్గా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ప్రత్యేక ప్రధానకార్యదర్శి/ ముఖ్యకార్యదర్శి/ కార్యదర్శి ఉంటారు. ఆరోగ్య శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉండే ఈ కమిటిలో న్యాయ, స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన డిప్యూటీ కార్యదర్శులతో పాటు వివిధ వైద్య సంఘాలు, సంక్షేమ సంఘాలకు చెందిన 10 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు. -
జిల్లాలకు 3 వేల బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇప్పటి వరకు బ్లాక్‌ఫంగస్ నియంత్రణకు వాడే యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు 3 వేలు పంపిణీ చేశామని, ఎప్పటికప్పుడు కేసుల పరిశీలన చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఇంజక్షన్ల లభ్యతను బట్టి రాష్ట్రానికి తెప్పిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై నాలుగు రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. ఇప్పటికే ఈ మందు నమూనాలు హైదరాబాద్ ల్యాబొరేటరీతో పాటు సెంట్రల్ ఆయుర్వేదిక్ ల్యాబొరేటరీకి వెళ్లాయని, ఫలితాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయని, వచ్చిన వెంటనే నిర్ణయం వెలువరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల డిమాండ్ బాగా తగ్గిందని, గడిచిన 24 గంటల్లో 5,640 ఇంజక్షన్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 22 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 41 వేలకు పైగా ఉన్నాయన్నారు. బుధవారం నాటికి ప్రభుత్వాస్పత్రుల్లో 75 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయన్నారు. గత 24 గంటల్లో 767 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి తీసుకొచ్చామని, 650 మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతోందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆక్సిజన్ నిల్వ చేస్తున్నామన్నారు. బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందినట్టు తమకు సమాచారం లేదన్నారు. నేడు, రేపు కోవాగ్జిన్ సెకండ్ డోసు పంపిణీ చేస్తున్నామన్నారు. 78 వేల కోవాగ్జిన్ డోసులు రావాల్సి ఉందన్నారు. 45 ఏళ్లు దాటి, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగులకు కోవిషీల్డ్ మొదటి డోస్ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్టాకును జూన్ 15 వరకు మొదటి డోసుగా వేస్తామని, తర్వాత కేంద్రం నుంచి వచ్చే స్టాకును బట్టి రెండో డోస్ వేస్తామన్నారు. -
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షల మంది గర్భిణులు ప్రసవాల నిమిత్తం ఆస్పత్రులకు వెళ్తుండగా.. వీరిలో 3 లక్షల మందికి పైగా ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకుంటున్న వారే. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు కోవిడ్ బారినపడే అవకాశం ఉండటంతో ప్రసవాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కోవిడ్ బాధితుల కోసం తీసుకునే చర్యల కంటే గర్భిణులకు మరింత జాగ్రత్తగా ఐసొలేషన్ వార్డులు, గదులు, ప్రత్యేక ప్రసవ గదులు, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు వెళ్లాయి. కరోనా పాజిటివ్ బారిన పడిన గర్భిణులకు ప్రత్యేక వైద్యం అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక చర్యలు ఇలా ► కోవిడ్ పాజిటివ్ బారిన పడిన గర్భిణులకు యాంటీనటల్ చెకప్స్ (గర్భిణుల వైద్య పరీక్షలు), పోస్ట్నటల్ చెకప్స్ (ప్రసవం తర్వాత పరీక్షలు) విధిగా చేయాలి. డెలివరీకి 15 రోజుల ముందు ప్రతి గర్భిణికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయాలి ► ప్రసవానికి ప్రత్యేక గది, ఆపరేషన్ థియేటర్ ఉండాలి. ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రి అయి ఉండాలి. ► ప్రసవానికి మెటర్నిటీ ఆస్పత్రిలో 50, బోధనాస్పత్రిలో 30, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రిలో 20 చొప్పున, సీహెచ్‌సీలో 10, పీహెచ్సీలో 2 చొప్పున పడకలు కేటాయించాలి. ► 104 కాల్ సెంటర్ ద్వారా టెలీ కన్సల్టెన్సీ సేవలు, 108 ద్వారా రవాణా సేవలు నిత్యం అందుబాటులో ఉండాలి. ► కరోనా సోకిన గర్భిణులను కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించే విధంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలి. ► గిరిజన ప్రాంతాల్లో అత్యవసర సేవల్లో భాగంగా ఫీడర్ అంబులెన్సులు అందుబాటులో ఉంచాలి. ► ప్రసవానికి 15 రోజుల ముందే బర్త్ వెయిటింగ్ హోమ్స్‌ను రెడీ చేసి ఉంచాలి. ► అన్ని జిల్లాల్లో వైద్యాధికారులు, జిల్లా ఆరోగ్య సమన్వయకర్తలు (డీసీహెచ్ఎస్), బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ► రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో గర్భిణుల కోసం 575 పడకలు కేటాయించాలి. -
45 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పారు. నేటి నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 3 రోజుల పాటు వేయనున్నామన్నారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పరిధిలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఉంటే ఇష్టారాజ్యంగా ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీఎం కేంద్రానికి లేఖ రాశారన్నారు. కొన్ని గ్రూపులు అంటే రైల్వే, ఆర్టీసీ, పోర్ట్‌లు, బ్యాంకులు, సివిల్ సప్లై, పాత్రికేయులు వంటి విభాగాల్లో ఉన్న వారికి వ్యాక్సిన్ వేయాలని చెప్పామన్నారు. సింఘాల్ ఇంకా ఏమన్నారంటే.. ► తుపాన్ ప్రభావం కారణంగా ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది ఎదురవ్వకుండా అప్రమత్తంగా ఉన్నాం. రూర్కెలా, జామ్‌నగర్ వంటి చోట్ల నుంచి 70 మెట్రిక్ టన్నుల చొప్పున సేకరించాం. ► మూడు రోజులుగా టెస్టులు తగ్గించకున్నా కేసులు రోజుకు వెయ్యి లెక్కన తగ్గుతూ వస్తున్నాయి. పడకల లభ్యత పెరిగింది. 104కు వచ్చే కాల్స్ తగ్గాయి. ఇవన్నీ చూస్తే కరోనా కాస్త నెమ్మదిస్తున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ ఫంగస్ కేసుల కోసం వెయ్యి ఇంజక్షన్లు వచ్చాయి. మరిన్ని వస్తున్నాయి. ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ► కృష్ణపట్నం మందుపై ఆయుష్ విభాగం నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ మందులో హానికారక దినుసులేవీ లేవని చెప్పారు. ప్రతి ఊళ్లో సంప్రదాయ మందులు వాడుతుంటారు. వాటికి అనుమతులు అవసరం లేదు. అయితే ఈ మందును ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే పరిశీలించాల్సి ఉంటుంది. ► రాష్ట్రంలో ఇప్పటి వరకు 78,78,604 మందికి వ్యాక్సిన్ వేశాం. 1.55 లక్షల డోసులు కోవాగ్జిన్, 11.58 లక్షల డోసులు కోవిషీల్డ్‌ను జిల్లాలకు పంపించాం. 23.38 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. జూన్ 15 వరకు మన దగ్గర ఉన్నది, కేంద్రం ఇచ్చేది అంతా కలిపితే 28.56 లక్షల డోసులు అవుతుంది. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.50 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కొనుగోలుకు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు రూ.50 కోట్లకుపైగా చెల్లించాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ)ను ఆదేశించినట్లు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ కోవిïÙల్డ్ ఒక డోస్ రూ.300, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.315, కోవాగ్జిన్ ఒక డోస్ రూ.400, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.415 వంతున చెల్లించనున్నట్లు వివరించారు. -
రాష్ట్రానికి చేరుకున్న వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు
విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో రోగుల అవసరాల నిమిత్తం 70 వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు బుధవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్ 32 కార్గో విమానంలో ఇక్కడికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లారీలో విజయవాడకు తరలించారు. కాగా, ఆక్సిజన్ దిగుమతి కోసం బుధవారం మరో రెండు ఖాళీ ట్యాంకర్లను ఐఏఎఫ్ సీ–17 కార్గో విమానంలో భువనేశ్వర్ విమానాశ్రయానికి అధికారులు తరలించారు. -
ఆరోగ్యశ్రీలోకి 'బ్లాక్ ఫంగస్'
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) వ్యాధికి గురవుతున్న వారి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, అందుకయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. దీనికోసం అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోనూ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోనూ వైద్యం చేసే విధంగా ఆదేశించామని తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదైనా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. దీనికి సంబంధించిన ఇంజక్షన్లు కొన్నింటిని కేంద్రం కేటాయించిందని, మిగతా వాటిని రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ టెండర్స్ నిర్వహించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. కోవిడ్‌తో అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం రూ. 10 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కర్ఫ్యూ తర్వాత రెండు జిల్లాల్లో కేసులు తగ్గాయని, మరికొన్ని జిల్లాల్లో నిలకడగా ఉన్నాయని, అందుకే ఈ నెల 31 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని సీఎం నిర్ణయించారని వివరించారు. ఫీవర్ సర్వే ద్వారా ఇప్పటివరకూ 91 వేల మందికి జ్వర లక్షణాలున్నట్టు గుర్తించామని, వీరి ఆరోగ్యంపై రోజువారి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 67 శాతం మంది బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. కోవిడ్ విధుల్లోకి 17,901 మంది సిబ్బందిని తీసుకున్నామని, అవసరమైతే మరింత మందిని నియమిస్తామని సింఘాల్ వెల్లడించారు. ఆక్సిజన్ వృథా కాకుండా నేవీ బృందాలు చేస్తున్న సాయం అభినందనీయమన్నారు. సీమ జిల్లాల్లో 7 కేసులు రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిపైనా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఈ పరిశీలన జరుగుతోంది. కేసులకు సంబంధించి ఇప్పటికే నిపుణుల అభిప్రాయాలతో చికిత్సలు చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. మ్యుకర్ మైకోసిస్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయినా సరే దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. -
బ్లాక్‌ఫంగస్ కేసులపై పరిశీలన
సాక్షి, అమరావతి: కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్‌ఫంగస్‌పై పూర్తిస్థాయిలో సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో కొంతమందిలో భయాందోళనలు ఉన్నాయన్నారు. ఇలాంటి కేసులపై పరిశీలన చేయాలని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించామని, దీనిపై నేటి సాయంత్రానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఆయన ఆదివారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధిపై ఖచ్చితమైన వివరాలతో మాట్లాడాలన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి కేంద్రమే దానికి సంబంధించిన మందులు కేటాయించిందని, మన రాష్ట్రానికి 1,600 వయల్స్ కేటాయించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తగినంత స్టాకు ఉన్నాయని, గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 18 వేలకుపైగా ఇంజక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే జామ్‌నగర్, దుర్గాపూర్, జంషెడ్పూర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ చేరిందన్నారు. త్వరలోనే స్టోరేజీ కెపాసిటీకి చేరతామని చెప్పారు. 104 కాల్‌సెంటర్ ద్వారా వైద్యులు సుమారు 15 వేలమందికిపైగా హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులకు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకుని, వైద్యసాయం చేశారని తెలిపారు. -
బురద చల్లడం చంద్రబాబుకు అలవాటే
సాక్షి, విశాఖపట్నం: కరోనా విపత్కర సమయంలో కూడా చంద్రబాబు ప్రజల కోసం ఆలోచన చేయకుండా.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా బురద చల్లడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. శనివారం విశాఖలోని విమ్స్‌లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ గొలగాని వెంకట హరికుమారితో కలిసి వైద్యాధికారులతో సమీçక్ష నిర్వహించారు. అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నా కూడా.. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేసే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు.. కోవిడ్ రోగులకు సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. చేతనైతే కరోనా బాధితులకు సహాయం చేయాలని.. లేదంటే హైదరాబాద్‌లోని అద్దాల మేడల్లో తలుపులేసుకుని ఉండాలని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు మంత్రి ఆళ్ల నాని చురకలంటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తుంటే.. దానిని కూడా అవహేళన చేస్తూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం వారి వివేకానికే వదిలేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్ పేషెంట్లకే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్ రోగుల వైద్యానికి కేటాయించడం తప్పనిసరి అని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో అమ్మేవారిపై.. రోగుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విశాఖలో కరోనా నియంత్రణకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారన్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారని చెప్పారు. -
రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వం రోజు వారీ కేటాయిస్తున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌కు అదనమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయాలను అన్వేషించి ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి 2 ట్యాంకుల్లో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి కృష్ణపట్నం పోర్టులకు ఆ ట్యాంకర్లు చేరుకోనున్నాయన్నారు. జామ్ నగర్ నుంచి మరో 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రైలు మార్గంలో ఆదివారం నాటికి గుంటూరుకు రానుందని తెలిపారు. జమ్షెడ్పూర్ నుంచి మరో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. రెండు రోజుల్లో మొత్తం 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందని ఆయన తెలిపారు. కేంద్రం ఇచ్చే ఆక్సిజన్‌తో పాటు అదనంగా రానున్న ఆక్సిజన్‌ను రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో నిల్వ చేయడం ద్వారా అత్యవసర సేవలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఇవే కాకుండా మరో రెండు మూడు ట్యాంకర్లు దుర్గాపూర్ నుంచి రానున్నాయన్నారు. దీనివల్ల రాయలసీమ జిల్లాలకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. అదనపు ఆక్సిజన్‌ను ప్రతి జిల్లాలో 10 నుంచి 20 టన్నుల వరకు నిల్వ చేస్తామని, రోజు వారీ వచ్చే ఆక్సిజన్‌లో ఎక్కడైనా జాప్యం జరిగితే ఈ నిల్వలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. 24 గంటల్లో 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ► గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందింది. చెన్నై ప్లాంట్‌లో ఇబ్బందులు రావడంతో ఐదారు రోజుల పాటు ఏపీకి రావాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోనుందని నిన్న (గురువారం) అర్ధరాత్రి సమాచారమిచ్చారు. ► వెంటనే అధికారులు కేంద్రంతో మాట్లాడారు. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సమస్యను పరిష్కరించారు. పెరుగుతున్న డిశ్చార్జిలు ► రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జిల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామం. దేశ వ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలో మరణాల శాతం తక్కువగా ఉంది. ► రాష్ట్రంలో 6,453 ఐసీయూ బెడ్లలో 6,006 మంది రోగులు ఉన్నారు. 447 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23,204 ఆక్సిజన్ బెడ్లలో 22,029 మంది బాధితులు ఉన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మంది చికిత్స పొందుతున్నారు. ► గడిచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రైవేట్ ఆస్పత్రులకు పెద్ద మొత్తంలో 18,410 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేశాం. ప్రభుత్వాసుపత్రుల్లో 19,349 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. గత 24 గంటల్లో 104 కాల్ సెంటర్‌కు 13,868 ఫోన్లు వచ్చాయి. ఇందులో వివిధ సమాచారాల నిమిత్తం 5,444, అడ్మిషన్లకు 3,018, కరోనా టెస్టులకు 2,914, టెస్ట్ రిజల్ట్ కోసం 1,886 ఫోన్ కాల్స్ వచ్చాయి. ► రాష్ట్రంలో వ్యాక్సిన్ సెకండ్ డోస్‌ల పంపిణీ ఎలాంటి రద్దీ లేకుండా సాఫీగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొవాగి్జన్ వ్యాక్సిన్ల గురించి ఎదురు చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను సెకండ్ డోస్ గడువు ముగియక ముందే వేస్తున్నామన్నారు. నేటి నుంచి జ్వరాలపై ఇంటింటి సర్వే ► కరోనాను కట్టడి చేయడంలో భాగంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంటింటికీ వెళ్లి జ్వర పీడితులను గుర్తించే సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర అధికారులు, జిల్లా వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటింటి సర్వేపై దిశా నిర్ధేశం చేశారు. ► జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేయనున్నారు. దీనివల్ల కరోనాను కట్టడి చేయడమే కాక, ఆస్పత్రులపై ఒత్తడి కూడా తగ్గనుంది. -
ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. నెల క్రితం రోజుకు 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉండగా ఇప్పుడు 590 మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలిపారు. గతంలో 54 ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్‌ను ఇప్పుడు 78కి పెంచగలిగామన్నారు. ఆక్సిజన్ సామర్థ్యం పెంచుకునేందుకు ఇంకా ఎలాంటి వనరులున్నా వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. అవసరం మేరకు వినియోగిద్దాం.. తాజాగా కేంద్రం 3 ఆక్సిజన్ ట్యాంకర్లు ఇచ్చిందని, ఒకటి ఇప్పటికే రాష్ట్రానికి చేరుకోగా మరో రెండు కోల్‌కతా నుంచి వస్తున్నాయని సింఘాల్ తెలిపారు. అక్కడి నుంచే ఒక్కో ట్యాంకర్లో 20 టన్నుల చొప్పున 40 టన్నుల ఆక్సిజన్‌తో రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెలాఖరుకు 25 కొత్త ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయని, సరఫరాలో జాప్యం కాకుండా ప్లాంట్ల నుంచి నేరుగా ఆస్పత్రులకు కాకుండా ఒక సెంటర్లో ఆక్సిజన్ నింపి అక్కడ నుంచి చిన్న వాహనాల ద్వారా ఆస్పత్రులకు చేరవేస్తామన్నారు. ‘రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్లు 17 వేలు ఉన్నట్లు గుర్తించాం. వీటిలో 14,338 సిలిండర్లను మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లుగా మార్చాలని నిర్ణయించాం, ఇప్పటికే 6,917 సిలిండర్లను మార్చాం. మిగిలినవి కూడా త్వరగా పూర్తయితే ఆక్సిజన్ కొరత ఉండదు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారులు ఒక్క రోజులో 30 శాతం ఆక్సిజన్ పొదుపు చేయగలిగారు. అవసరం మేరకు వినియోగిస్తే అన్ని ఆస్పత్రుల్లో ఎక్కువ మందికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలను కూడా తెరిచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటాం’ అని సింఘాల్ తెలిపారు. 104కి ఒకే రోజు 17 వేల కాల్స్.. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంటు అక్టోబర్‌లో అందుబాటులోకి రానుందని సింఘాల్ చెప్పారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, కిట్లు, ఇతరత్రా విరాళాలు అందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక విభాగానికి అర్జా శ్రీకాంత్ నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఇప్పటికే ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన కాన్సన్ట్రేటర్లు 8 వేలు, పది లీటర్ల కెపాసిటీ కలిగిన 10 వేల కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. 104 కాల్‌సెంటర్‌కు బుధవారం ఒక్కరోజే 17 వేల కాల్స్ వచ్చాయని, హోం ఐసోలేషన్‌లో ఉన్న 9 వేల మందికి పైగా బాధితులను వైద్యులు ఫోన్లో పరామర్శించి తగిన సూచనలు అందించినట్లు వివరించారు. -
ఆక్సిజన్ సరఫరాపై నిత్యం పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తీసుకురావడం, దాన్ని ఆస్పత్రులకు సరఫరా చేయడంపై ప్రతిక్షణం పర్యవేక్షణ చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో ఉన్న ప్లాంట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ నిర్వహణకు సీనియర్ ఐఏఎస్ అధికారులు కలికాల వలవన్, అనంతరాములు, ఏకే పరిడాను నియమించామని తెలిపారు. నేటి నుంచి రెండు వారాల పాటు ఈ అధికారులు ఆయా ప్లాంట్లలోనే ఉండి పర్యవేక్షిస్తారన్నారు. మంగళవారం ఆయన ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తే మొత్తం కేటాయింపులను రాష్ట్రానికి తెచ్చామన్నారు. ట్యాంకర్ జాప్యం కారణంగా తిరుపతిలో ఘటన జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. మృతి చెందిన వారికి సీఎం జగన్ రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారన్నారు. ప్రతిరోజూ ఆక్సిజన్ వినియోగం పెరుగుతోందని, దీనికి తగ్గట్టు కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నామని, సీఎం కూడా ప్రధానికి లేఖ రాశారని వివరించారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రస్తుతం మైలాన్ కంపెనీ నుంచి కొంటున్నామని, అవి కాకుండా మరో 50 వేల ఇంజక్షన్లు వేరే కంపెనీ నుంచి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22,395 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్‌కు ఒక్కరోజులో 16వేలకు పైగా కాల్స్ వచ్చాయని చెప్పారు. హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న 9,796 మందికి ఫోన్ చేసి డాక్టర్లు సలహాలు ఇచ్చారని తెలిపారు. ఈ సంఖ్యను రోజుకు 15 వేలకు పెంచాలనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ సెంటర్లకు 100 చొప్పున స్లిప్పులు ఇస్తున్నామని, దీనిపై కలెక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. -
కోవిడ్ చికిత్సకు ఆరోగ్యశ్రీ రేట్లు పెంపు
సాక్షి, అమరావతి: కోవిడ్ చికిత్సలకు చెల్లించే ఆరోగ్యశ్రీ రేట్లను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సీటీ స్కాన్‌లో కొరాడ్స్–4, సీటీ సివియారిటీ స్కోర్ 25 ఉండి, ఆర్టీపీసీఆర్ టెస్టు లేకపోయినా పేషెంట్లను అనుమతించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్ సాయంతో ఉన్న రోగులకు రోజుకు రూ. 2,500 చెల్లిస్తామన్నారు. గతంలో నాన్‌క్రిటికల్ ట్రీట్మెంట్కు రూ. 3,250, వెంటిలేటర్ లేని ఐసీయూకు రూ.5,480, ఐసీయూతో వెంటిలేటర్‌కు రూ.9,580, క్రిటికల్ పేషంట్లకు వెంటిలేటర్‌తో చికిత్సకు రూ. 10,380 ఇచ్చేవారు. -
విదేశీ వ్యాక్సిన్ల కొనుగోలుకైనా సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలను కోవిడ్ నుంచి విముక్తి కల్పించేందుకు విదేశాల్లో ఎక్కడైనా వ్యాక్సిన్ లభిస్తే కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వ్యాక్సిన్ లభ్యత ఉంటే ఇప్పటికిప్పుడు రూ. 1,600 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధంగా ఉందన్నారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్ లభ్యత మొత్తం కేంద్రం చేతుల్లోనే ఉందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని తెలిపారు. అందుకే కేంద్రం నుంచి అనుమతులన్నీ తీసుకుని బయట దేశాల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని కూడా చూస్తున్నామన్నారు. వ్యాక్సిన్ దొరికితే నెలలోగా అందరికీ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో పాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఇంకోచోట ఎక్కడైనా వేరే యూనిట్లలో ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉన్న వ్యాక్సిన్‌ను ముందుగా రెండో డోసు వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు దాటిన వారికి మొదటి డోసు వేసేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వ్యాక్సిన్‌పై ఉన్న వాస్తవాలను వివరిస్తూ తాము చేస్తున్న విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. నేటి నుంచి కోవిడ్ సేవల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు రాష్ట్రంలో సోమవారం నాటికి 648 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలు అందిస్తున్నామని సింఘాల్ తెలిపారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 47,444 పడకలు అందుబాటులో ఉంటే అందులో ప్రస్తుతం 24,645 పడకల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందుతున్నారన్నారు. దీనిపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లకు సూచించామని చెప్పారు. కోవిడ్‌కు ఇంత భారీ స్థాయిలో ఉచితంగా చికిత్స చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, పీజీ, బీఎస్సీ నర్సింగ్, హౌస్ సర్జన్స్, ఎంఎస్సీ నర్సింగ్ విద్యారి్థనులను కోవిడ్ సేవలకు వినియోగించుకోవాలని నిర్ణయించామని, మంగళవారం నుంచి ఈ ప్రక్రియ అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని, సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24,273 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న 6,508 మందికి సలహాలు గడిచిన 24 గంటల్లో 104 కాల్‌సెంటర్‌కు 16,663 కాల్స్ వచ్చాయని సింఘాల్ తెలిపారు. ఈ కాల్సెంటర్లో టెలీకన్సల్టెన్సీ సేవలు అందించడానికి 3,496 మంది వైద్యులు రిజిస్టర్ చేసుకున్నారని, ఇందులో 600 మంది స్పెషలిస్టులూ ఉన్నారని పేర్కొన్నారు. వీరు సోమవారం హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న 6,508 మందితో మాట్లాడి వైద్యపరమైన సూచనలు ఇచ్చారన్నారు. కోవిడ్ కోసం ఇప్పటికే 17వేల మందిని పైగా నియమించామని, మరింత మంది నియామకం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్దాస్పత్రుల దగ్గరలో ప్రైవేటు భవనాలు, లేదా జర్మన్ హ్యాంగర్స్ టెక్నాలజీతో కూడిన ఏర్పాట్లు చేసి తక్షణమే కనీసం 50 బెడ్లైనా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వైద్యం కోసం ఆస్పత్రి ఆవరణంలో ఎవరూ కనిపించకూడదని కలెక్టర్లకు సూచించామని తెలిపారు. మంగళవారం జరిగే స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కలెక్టర్లతో కోవిడ్‌పై వివరాలు తెలుసుకుంటారని, బుధవారం కోవిడ్ నియంత్రణకు నియమించిన మంత్రుల కమిటీ సమావేశం జరుగుతుందని సింఘాల్ చెప్పారు. -
సరఫరా పెరిగితే 18 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అనుకున్న రీతిలో ఉత్పత్తి లేనందున జాప్యం జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. కేంద్రం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించిందన్నారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్యశ్రీ పడకలపై కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. సోమవారం సాయంత్రానికి ఎన్ని పడకలు వస్తాయి.. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం ఎంత మందికి చేయొచ్చు అన్నది తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా గణనీయంగా పెంచామని తెలిపారు. 330 మెట్రిక్ టన్నుల నుంచి 561 టన్నుల వరకు పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించిందన్నారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఎక్కడా కొరత లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24,861 ఇంజక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకూ 104 కాల్ సెంటర్‌కు 2 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ కేవలం రెండో డోసు వారికి మాత్రమే వేయాలని కలెక్టర్లను ఆదేశించామని, ఆ తర్వాత డోసుల రాకను బట్టి అందరికీ వేస్తామన్నారు. మనకు రానున్న డోసులను 45 ఏళ్లు పైబడిన వారికి ఇస్తామని, రెండ్రోజుల్లో కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి అందిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కోవిడ్ డ్యూటీ చేసిన వారికి వెయిటేజీ రాష్ట్రంలో కోవిడ్ డ్యూటీలు చేసిన వారికి శాశ్వత నియామకాల్లో వెయిటేజీ ఇచ్చినట్టు తెలిపారు. 6 మాసాలు డ్యూటీ చేసిన వారికి 5 మార్కులు, ఏడాది చేస్తే 10 మార్కులు, ఏడాదిన్నర చేస్తే 15 మార్కులు ఇచ్చామన్నారు. కష్టకాలంలో పని చేసిన వీళ్లందరికీ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.