సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఆర్‌ఏఆర్‌సీ) భూమిని ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణం కోసం బదలాయించే విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్, పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ తదితరులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
భూ బదలాయింపుపై యథాతథస్థితి
Published Fri, Jul 9 2021 4:56 AM | Last Updated on Fri, Jul 9 2021 4:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment