
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 10 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 38 మంది ఒమిక్రాన్ బాధితులున్న సంగతి తెలిసిందే. వారిలో పది మంది కోలుకోవడంతో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. వారికి సాధారణ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. కోలుకున్నవారు పోను ప్రస్తుతం 28 మంది ఒమిక్రాన్‌తో బాధపడుతున్నారు. కాగా, శుక్రవారం రిస్క్ దేశాల నుంచి 883 మంది వచ్చారు.
వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. మొత్తం 15 మంది సీక్వెన్సింగ్ ఫలితాలు రావాల్సి ఉందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే అధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం రాష్ట్రంలో 35,037 కరోనా పరీక్షలు చేయగా, అందులో 162 మందికి పాజిటివ్ వచ్చింది. ఒకరోజులోఒకరు కరోనాతో మృతిచెందగా, ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,019కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment