
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 43 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు 7,93,133 మందికి కరోనా వ్యాప్తి చెందగా, వీరిలో 7,88,599 మంది కోలుకున్నారు. మరో 423 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 11,984 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 306 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment