![Department Of Medical And Health Arranged Health Profile Program At Sircilla - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/16/CATS-1628.jpg.webp?itok=OiZtgeq8)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లా ల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ తయా రీకి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆయా వ్యక్తులను హెల్త్ చెకప్ చేసి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు హైదరాబాద్ ఐఐటీ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ పనితీరుపై సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ అధికారు లతో చర్చించారు. హెల్త్ ప్రొఫైల్‌పై సమగ్ర కార్యాచరణను రూపొందించడానికి త్వరలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహి స్తారు.
కాగా, గ్రామాలు, పట్టణాల్లోని ఇంటిం టికీ వెళ్లి కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు, బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. ఈసీజీ సహా కొన్ని రక్త, మూత్ర పరీక్షలను మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. బ్లడ్ గ్రూప్, రక్తంలో ఆక్సిజన్ శాతం, గుండె కొట్టుకునే తీరు తదితర పరీక్షలు చేస్తారు. వీటితోపాటు ఇంకా ఏమైనా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనేదానిపై కూడా పరీక్ష చేసి వివరాలు నమోదు చేస్తారు. ఈ సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్ కేటాయిస్తారు. ఈ రెండు జిల్లాల తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ నిర్వహి స్తామని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment