సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో ఆదిమానవులు గీసిన చిత్రాల తావు వెలుగు చూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ బుర్కగుట్ట మీద ఈ చిత్రాలున్నాయి. ఇవి పెద్ద రాతియుగానికి చెందినవిగా భావిస్తున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు అల్లె రమేశ్ ఈ చిత్రాలను గుర్తించినట్లు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు.
చదరంలో తేలు, వృత్తాకారాలు, త్రిభుజాకార గీతలు, ఆరు వేళ్లున్నట్లుగా ఉన్న పాదాలు, చేతులు పైకెత్తిన మనిషి రూపాన్ని పోలిన చిత్రాలతో పాటు అంతుచిక్కని మరెన్నో చిత్రాలున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా ఒంటిగుండుపై కనిపించిన చిత్రాల తరహాలో ఇవి ఉన్నాయని, నరసింహస్వామి క్షేత్రం పక్కనే ఉండటంతో మొత్తం సున్నాలు కొట్టించటంతో చాలా చిత్రాలు అంతర్ధానమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment