వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలను తీసుకొచ్చిన విమానం
విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో రోగుల అవసరాల నిమిత్తం 70 వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు బుధవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్ 32 కార్గో విమానంలో ఇక్కడికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లారీలో విజయవాడకు తరలించారు. కాగా, ఆక్సిజన్ దిగుమతి కోసం బుధవారం మరో రెండు ఖాళీ ట్యాంకర్లను ఐఏఎఫ్ సీ–17 కార్గో విమానంలో భువనేశ్వర్ విమానాశ్రయానికి అధికారులు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment