సాక్షి, హైదరాబాద్: మొదటి కరోనా డోసును వంద శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇప్పటివరకు అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లక్ష ద్వీప్, సిక్కిం వంటి 8 చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఈ ఘనత సాధించాయన్నారు. ఈ లక్ష్యం చేరడంలో వైద్యారోగ్య శాఖ కృషి ఎంతో ఉందన్నారు.
మొదటి డోసు వంద శాతం పూర్తి అయిన సందర్భంగా ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో మంగళవారం ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... మున్సిపల్, పంచాయతీ, ఇతర శాఖల సమన్వయంతో వైద్య ఆరోగ్యశాఖ ఈ మైలు రాయిని చేరుకుందన్నారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి టీకాలు వే స్తున్న ఏఎన్‌ఎం, ఆశా వర్క ర్లు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయానికి సహకరించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనవరి 3 నుండి 15–18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ముందుగా హైదరాబాద్‌తోపాటు మున్సిపాలిటీల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని, ఆ తర్వాత గ్రామ స్థాయిలో ఇస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment