సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 73,156 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
చదవండి: Sankranti: ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త.. ఈ విషయం మరిచారో అంతే..!
గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందగా, దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,041కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1583 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 292, రంగారెడ్డి జిల్లాల్లో 214 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment