50 పడకల ఆస్పత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రులు నాని, నారాయణస్వామి
పెనుమూరు/కార్వేటినగరం (చిత్తూరు): ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. ఆయన శనివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగరరెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నాని మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా స్థానిక పీహెచ్‌సీ ఆవరణలో రూ.13.5 కోట్లతో నూతనంగా ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment