Penumuru
-
పెనుమూరులో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
కార్వేటినగరం: చిత్తూరు జిల్లా పెనుమూరు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కామసాని విజయకుమార్‌రెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఇంటి ఆవరణలోని రెండు కార్లను ధ్వంసం చేశారు. విజయకుమార్‌రెడ్డిని చంపుతామని బెదిరించారు. విజయకుమార్‌రెడ్డి పెనుమూరు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రపోతుండగా పెనుమూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పి.సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు పి.అనంత్‌రెడ్డి, పి.హేమాద్రినాయుడు కుమారుడు పి.ప్రదీప్, కె.బాబు కుమారుడు కె.రాజేష్ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు.వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలున్న కారు నంబరు ప్లేట్లను పెరికి ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న పెనుమూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి కమలాకరరెడ్డి కారు నంబర్ ప్లేటు తీసి పగులగొట్టారు. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న విజయకుమార్‌రెడ్డికి ఫోన్‌చేసి బయటకు రమ్మని పిలిచారు. నిద్రలో ఉన్న విజయకుమార్‌రెడ్డి భార్యాపిల్లలతో బయటకు రాగా చంపుతామంటూ బెదిరించారు. భయంతో విజయకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వీరి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన సోమవారం ఉదయం పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుమూరు ఎస్ఐ లోకేష్ సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు.నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి అర్ధరాత్రి ఇంటి పైకి వచ్చి కార్లు ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారు సోమవారం విజయకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన నారాయణస్వామి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
శాంతి వద్దు రక్త పాతమే ముద్దు అంటున్న టీడీపీ నేతలు చంపుతాం అంటూ బెదిరింపులు
-
పెనుమూరులో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
పెనుమూరు/కార్వేటినగరం (చిత్తూరు): ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. ఆయన శనివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగరరెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాని మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా స్థానిక పీహెచ్సీ ఆవరణలో రూ.13.5 కోట్లతో నూతనంగా ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ పాల్గొన్నారు. -
భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య
తనను ప్రేమించిన వ్యక్తి అపురూపంగా చూసుకుంటాడని ఆ యువతి భావించింది. తల్లిదండ్రులు లేరన్న లోటు తీరుస్తాడని నమ్మింది. ప్రేమికుడితో కలిసి ఏడడుగులు నడిచింది. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేకపోయింది. ఇద్దరు బిడ్డలతో సహా తనువు చాలించింది. ఈ ఘటన పెనుమూరు మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సాక్షి, చిత్తూరు: మండలంలోని గుడ్యాణంపల్లెకు చెందిన బి.సుబ్రమణ్యం పెద్ద కుమారుడు కిశోర్ తిరుపతి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగి. స్విమ్స్‌లో నర్స్‌గా పనిచేస్తున్న నీరజ (32)తో పరిచయం ఏర్పడింది. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తిరుపతిలో నివాసముంటున్న మేనమామ అనిల్ చేరదీసి, ఇంటర్ వరకు చదివించాడు. నర్స్ ట్రైనింగ్ పూర్తిచేయించి, స్విమ్స్‌లో చేర్పించాడు. ఈ క్రమంలో కిశోర్‌తో నీరజకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుపతిలో కాపురం పెట్టారు. వీరికి చందు(8), చైత్ర (2) పిల్లలున్నారు. కరోనా కారణంగా గత ఏడాది గుడ్యాణంపల్లెకు వచ్చారు. అప్పటి నుంచి తల్లిదండ్రులతో ఉంటున్నారు. కిశోర్ కాంట్రాక్ట్ ఉద్యోగం వదిలేసి పెనుమూరు మండలంలో కోళ్ల ఫారాలు లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తున్నాడు. నీరజ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో డ్యూటీకి వెళ్లి వచ్చేది. కిశోర్ భార్యకు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో అనుమానం పెంచుకున్నాడు. గత ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేయించాడు. నీరజ ఇంట్లో ఒంటరిగా ఉండలేక పోయింది. తిరుపతికి వెళ్లి కాపురం పెడదామని భర్తను పదేపదే కోరింది. దీనికి భర్తతో పాటు అత్తమామలు వ్యతిరేకించారు. ఈ విషయం గొడవకు దారితీసింది. గత శనివారం రాత్రి నీరజ భర్త, అత్త మామలతో గొడవ పడింది. నీరజపై వారు చేయి చేసుకున్నారు. మనస్తాపం చెందిన ఆమె ఆదివారం తెల్లవారు జామున తన ఇద్దరు బిడ్డలను తీసుకొని స్కూటీలో అత్తింటి నుంచి వెళ్లిపోయింది. భార్య, బిడ్డలు కనిపించడం లేదని భర్త ఆదివారం పెనుమూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం రామచంద్రాపురం మండలానికి చెందిన ఓ క్వారీ గుంతలో నీరజతో పాటు ఇద్దరు బిడ్డల మృత దేహాలు తేలాయి. రామాపురం చెత్త సేకరణ కేంద్రం వద్ద స్కూటీని పార్కింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉపాధి కూలీలు అటువైపు వెళ్లగా మృతదేహాలు కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారమే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. రామచంద్రాపురం ఎస్ఐ జయ స్వాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రూ.కోటి ఎగ్గొట్టి.. బిచ్చగాడిగా మారి! -
నిన్న కూతురు, ఇవాళ తండ్రి మృతదేహం లభ్యం
సాక్షి, చిత్తూరు : బిడ్డల బాగోగుల కోసం ఊరు వదిలి వెళ్లాడు. తనకు తెలిసిన వృత్తినే జీవనాధారంగా ఎంచుకున్నాడు. కడుపున పుట్టిన వారికి ఏ లోటూ రానివ్వకుండా చూసుకున్నాడు. చదువులో రాణిస్తున్న కుమార్తెను చూసి మురిసిపోయాడు. కుటుంబంతో కలిసి పెనుమూరు మండలం కలిగిరి కొండపై జరిగిన బంధువుల వివాహానికి వెళ్లాడు. అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించాడు. చినుకులు పడుతున్నా లెక్కచేయకుండా ఓ కారులో ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో కొండయ్యగారిపల్లె వాగు మృత్యువు రూపంలో అడ్డుపడింది. తండ్రీకుమార్తెను ముంచేసింది. వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కుటుంబంలో కన్నీటి వరదని మిగిల్చింది. కుమార్తె మృతదేహం నిన్న లభ్యం కాగా, ఇవాళ తండ్రి మృతదేహం లభ్యమైంది. (వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు) పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పూతలపుట్టు మండలం వడ్డార్లపల్లెకు చెందిన జి.ప్రతాప్ (45) కుటుంబం ప్రస్తుతం చిత్తూరులో నివాసముంటోంది. గురువారం రాత్రి భార్య శ్యామల, కుమార్తె సాయి వినీత (15)తో కలిసి పెనుమూరు మండలం కలిగిరికొండపై జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి ఎక్కువ మంది రావడంతో భోజనం అయిపోయింది. మద్యం సేవించి వచ్చిన ప్రతాప్ పెళ్లిలో బంధువులతో గొడవ పడ్డాడు. అనంతరం భార్య, కుమార్తెతో పాటు గ్రామానికి చెందిన చిన్నబ్బ అలియాస్ సుధాకర్, చిత్తూరు టౌన్ కాజూరుకు చెందిన డ్రైవర్ కిరణ్‌కుమార్ ఏపీ 03 బీఏ 4404 నంబరు కారులో చిత్తూరుకు బయలుదేరారు. గురువారం సాయంత్రం పెనుమూరు మండలంలో భారీ వర్షం కురిసింది. కొండయ్యగారివూరు వద్ద రోడ్డుపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో వాగు దాటుతుండగా కారు కొట్టుకుపోయింది. వాగులో కారు సుమారు కిలో మీటర్ దూరం వరకు వెళ్లి నిలిచింది. డ్రైవర్ కిరణ్‌కుమార్ కారు ముందు అద్దాలు పగులగొట్టి శ్యామల, చిన్నబ్బ, ప్రతాప్‌ను సురక్షితంగా వాగు నుంచి ఒడ్డుకు చేర్చాడు. సాయి వినీతను కాపాడుతున్న క్రమంలో ఆమె వాగులో కొట్టుకుపోయింది. (కోడలి ఆత్మహత్యతో మామ బలవన్మరణం) కుమార్తెను రక్షించేందుకు ప్రతాప్ వాగులో దిగాడు. తండ్రి, కూతురు వాగులో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కొండయ్యగారివూరు గ్రామస్తులు డయిల్ 100కు సమాచారం ఇచ్చారు. పాకాల సీఐ ఆశీర్వాదం, ఎస్ఐ ప్రవీన్‌కుమార్ తమ సిబ్బందితో గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆచూకీ లభించక పోవడంతో శుక్రవారం ఉదయం చిత్తూరు డీఎస్పీ ఈశ్వరరెడ్డి, ఆర్డీఓ రేణుక, తహాసీల్దారు చంద్రశేఖర్ డ్రోన్ కెమెరాతో వాగుతో పాటు కలికిరి పెద్ద చెరువులో గాలించారు. అలాగే తెప్ప, బోటు సాయంతో చెరువులో గాలించారు. శుక్రవారం మధ్యాహ్నం సాయి వినీత మృతదేహం చెరువులో లభ్యమైంది. ప్రతాప్ మృతదేహం కోసం శుక్రవారం నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలిసులతో కలిసి బోటులో ఎక్కి గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రతాప్ మృతదేహం దొరకడంతో స్థానికంగా విషాదం నెలకొంది. (అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.. చివరకు!) -
కొండయ్యవాగులో మరో మృతదేహం లభ్యం
-
అనితా రాణి నుంచి సమాధానం లేదు..
-
అనితా రాణి తలుపులు తీయడం లేదు..
సాక్షి, చిత్తూరు: పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు అనితా రాణి విచారణకు సహకరించడం లేదని సీఐడీ ఎస్పీ రత్నకుమారి తెలిపారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అనితా రాణిని విచారణ చేసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోందని రత్నకుమారి తెలిపారు. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం) ‘నిన్న చిత్తూరుకు చేరుకున్నాం. సీఆర్పీ 160 సెక్షన్ కింద నోటీసులు పంపాం. విచారణ నిమిత్తం చిత్తూరులోని ఆమె ఇంటికి వెళితే తలుపులు తెరవలేదు. ఫోను ద్వారా సంప్రదించాం. తనకు రాష్ట్ర పోలీసులు, సీఐడీ మీద నమ్మకం లేదని చెబుతున్నారు. ఇవాళ ఉదయం 5.30 గంటలకు అనితా రాణి ఇంటికి వెళ్లాం. కాలింగ్ బెల్ నొక్కినా ఆమె నుంచి సమాధానం రాలేదు. మరోసారి ఫోన్ చేశాం. తనకు సీఐడీ మీద నమ్మకం లేదని చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని బర్తరఫ్ చేసిన తర్వాత విచారణకు రావాలని చెబుతున్నారు. (విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి) తనకు కాలు విరిగిందని చెప్పారు. అనితా రాణి నివాసం ఉంటున్న సమీపంలోని చుట్టుపక్కల ఇళ్లవారిని విచారించి వివరాలు నమోదు చేసాం. అనిత రాణి ఇంటికి రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు వస్తున్నారని చెప్పారు. దీంతో ఇవాళ పెనుమురు వచ్చి ఆసుపత్రితో పాటు పోలీస్ స్టేషన్లోనూ విచారణ చేశాం. ఒక వైద్యురాలిగా ఉంటూ సీఐడీ మీద నమ్మకం లేదని చెప్పడం భావ్యం కాదు. అన్ని కోణాల్లో మా విచారణ కొనసాగుతుంది’ అని ఎస్పీ రత్నకుమారి స్పష్టం చేశారు. -
విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి
-
విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు అనితా రాణి సీఐడీ విచారణకు సహకరించడం లేదు. అధికారులు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో వారే..స్వయంగా అనితా రాణి నివాసానికి వెళ్లారు. సీఐడీ అధికారులను చూడగానే అనితా రాణి ఇంటి తలుపులు వేసుకున్నారు. ‘నాకు సీఐడీ పోలీసులపై నమ్మకంలేదు. నన్ను విచారించడానికి మీరు ఎవరూ కూడా నా ఇంటి వద్దకు రాకండి. మీరు పిలిచినా నేను రాను. నా కేసు సీబీఐతో విచారించాల్సిందే..’ అంటూ ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి పేర్కొన్నారు. ఆమెను విచారించడానికి చిత్తూరుకు చేరుకున్న సీఐడీ పోలీసులు నిన్న (మంగళవారం) అనితారాణికి ఫోన్‌చేయగా.. ఆమెనుంచి ఇలాంటి సమాధానం వచ్చింది. దాంతో సీఐడీ అధికారులు బుధవారం ఆమె నివాసానికి వెళ్లగా...అధికారులను చూడగానే తన నివాసంలో తలుపులు మూసివేశారు. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం) కాగా ఈ ఏడాది మార్చి 22వ తేదీ పెనుమూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి భరత్ అనే వ్యక్తి వైద్యం కోసం రాగా వైద్యం చేయకుండా అనితారాణి తలుపులు వేసుకున్నారు. ఇదేమిటని గ్రామస్తులు నిలదీయడంతో తనను కులం పేరిట ధూషించారని, బాత్రూమ్లో ఉంటే ఫొటోలు తీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైద్యురాలిగా ఉంటూ వైద్యసేవలు అందివ్వలేదంటూ భరత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంతలో తనకు న్యాయం జరగలేద ని అనితారాణి మీడియాకు ఎక్కారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చడానికి కేసును సీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. విచారించడానికి చిత్తూరుకు వచ్చిన సీఐడీ పోలీసులు అనితారాణిని ఫోన్లో సంప్రదించగా ఆమె నిరాకరించారు. అయితే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర టీడీపీ నాయకులు దగ్గరుండీ మరీ వివాదంగా మారుస్తున్నారని పెనుమూరు వాసులు అంటున్నారు. -
బాబు సీఎం కుర్చీపై ఆశలు వదులుకో..
సాక్షి, పెనుమూరు: చంద్రబాబు సీఎం కుర్చీపై పెట్టుకున్న ఆశలు వదులుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారాయణస్వామి సూచించారు. శుక్రవారం ఆయన పెనుమూరు మండలం చిప్పారపల్లెలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జూన్ 8 వరకు తానే సీఎం అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి కాదని ఆయనే ఒప్పుకున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెనుమూరు మండలంలో టీడీపీ నేతల భూ ఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామన్నారు. ఎన్నికల రోజు పెనుమూరులో వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడి చేసిన పోలీసులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. పోలీసులు తీరుకు వ్యతిరేకంగా పెనుమూరులో త్వరలో ధర్నా చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 35 వేలు నుంచి 40 వేల మెజార్టీతో నారాయణస్వామి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని చెప్పారు. బాధితులకు పరామర్శ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతల దాడిలో గాయపడిన కారేటి సురేష్, కంచర్ల చక్రవర్తినాయుడిని శుక్రవారం చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డితో కలిసి ఎమ్మెల్యే నారాయణస్వామి పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. -
చంటిబిడ్డ తల్లి ముసుగులో ఎర్రచందనం రవాణా
ఐదుగురు దొంగల అరెస్టు 8 ఎర్రచందనం దుంగల స్వాధీనం పెనుమూరు(చిత్తూరు జిల్లా): ఎర్రచందనం స్లగ్లర్లు రూటు మార్చారు. ఫ్యామిలీ టూరు, చంటిబిడ్డ తల్లితో ప్రయాణం సాగిస్తున్నట్టు చూపుతూ ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పెనుమూరులో గురువారం తెల్లవారుజామున చంటిబిడ్డ తల్లి ముసుగులో తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసరావు కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కంబతూకి గ్రామానికి చెందిన రామస్వామి కుమారులు ఆర్.అన్నామలై(40), ఆర్.గణేష్(30), కుంభపాడికి చెందిన వి.సుబ్రమణ్యం(29), ధర్మపురి జిల్లా ముత్తువాలూరుకు చెందిన ఆర్.గోపాలస్వామి(26), అతని భార్య జి.మంగమ్మ (23), కుమార్తె సగి(2) కలిసి ఎనిమిది ఎర్రచందనం దుంగలను తీసుకుని ఇండికారులో గురువారం తెల్లవారుజామున శేషాచల అడవుల నుంచి తమిళనాడుకు బయలు దేరారు. పెనుమూరు చెక్‌పోస్టు వద్ద ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో అతివేగంగా వస్తున్న ఇండికా కారును ఆపారు. డ్రైవర్ పక్క సీటులో చిన్నబిడ్డను పెట్టుకొని మహిళ కూర్చొని ఉండడంతో పోలీసు సిబ్బంది కారును పంపే ప్రయత్నం చేశారు. ఎస్ఐ శ్రీనివాసరావుకు అనుమానం రావడంతో కారును ఆపి తనిఖీ చేయడంతో ఎర్రచందనం దుంగలు బయట పడ్డాయి. కారుతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆర్.అన్నామలై, ఆర్.గణేష్, వి.సుబ్రమణ్యం,ఆర్.గోపాలస్వామి, అతని భార్య జి.మంగమ్మను అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.