సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వివిధ వర్గాలకు అందజేసే భోజన చార్జీలను పెంచుతూ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత చెల్లింపులను రెట్టింపు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఆదేశా లిచ్చారు.
రోగులందరికీ, అలాగే గిరిజన రోగుల సహాయకులకు ప్రస్తుతం రూ.40 ఉండగా, దాన్ని రూ.80కి పెంచారు. టీబీ, మానసిక రోగులు, థెరపాటిక్ రోగులకు ప్రస్తుతం రూ.56 ఇస్తుండగా, దాన్ని రూ.112కి పెంచారు. ఇక డ్యూటీ డాక్టర్లకు రూ.80 నుంచి రూ.160కి పెంచారు. నాణ్యమైన భోజనాన్ని అందజేయాలన్న ఉద్దేశంతోనే ఈ మేరకు పెంచినట్లు రిజ్వీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment