గర్భధారణ సమయంలో కొందరు మహిళలు బరువు పెరగడం మామూలే. అది పరిమితంగానే ఉంటే పర్లేదు. కానీ మరీ ఎక్కువగా బరువు పెరిగితే కొన్ని అనర్థాలు రావచ్చు. అవి తల్లికీ, బిడ్డకూ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.
గర్భవతుల్లో స్థూలకాయం అంటే...
గర్భవతులు కొంత బరువు పెరగడం సాధారణమే అయినప్పటికీ... బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం... ఆ మహిళ ఎత్తుకు తగినట్లుగా ఉండాల్సిన బరువు కంటే (బీఎమ్‌ఐ 30 కంటే) ఎక్కువ ఉంటే దాన్ని ఒబేసిటీగా పరిగణించవచ్చు.
గర్భిణుల్లో దుష్ప్రభావాలు...
సాధారణ సమస్యలు: ఇతర మహిళలతో పోలిస్తే బరువు పెరుగుతున్న గర్భిణుల్లో సాధారణ ఆరోగ్య సమస్యలైన గుండెమంట, ఛాతీలో మంట, కొన్ని మామూలు ఇన్ఫెక్షన్ల వంటివి వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ.
జస్టేషనల్ డయాబెటిస్: గర్భవతిగా ఉన్న టైమ్‌లో ఒంట్లో చక్కెర మోతాదులు పెరగడం వల్ల వచ్చే డయాబెటిస్‌ను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు కడుపులోని బిడ్డ బరువు పెరగడంతో తల్లికి ప్రసవం కష్టం కావడం.
ప్రీ–ఎక్లాంప్సియా: గర్భంతో ఉన్నప్పుడు వచ్చే అధిక రక్త΄ోటు (హైబీపీ / హైపర్‌టెన్షన్)ను ‘ప్రీ–ఎక్లాంప్సియా’ అంటారు. ఒంట్లోకి చేరిన ద్రవాలు అదే స్థాయుల్లో బయటకు వెళ్లక΄ోవడం వల్ల ఒంట్లో వాపు వచ్చి ‘ప్రీ–ఎక్లాంప్సియా’తో కొన్నిసార్లు కడుపులోని చిన్నారికి రక్తప్రసరణ తగ్గడం.
నొప్పులు చాలాసేపు రావడం: బరువు పెరిగిన మహిళల్లో ప్రసవం నొప్పులు చాలాసేపు వస్తూనే ఉండటం.
సిజేరియన్‌కు అవకాశాలు పెరగడం: మామూలు ప్రసవానికి అవకాశాలు తగ్గడంతో కొన్నిసార్లు సిజేరియన్ తప్పక΄ోవడం.
బిడ్డలకు కలిగే అనర్థాలు
మ్యాక్రోసోమియా: కడుపులో బిడ్డ అనూహ్యంగా బరువు పెరగడంతో ప్రసవ మార్గం (బర్త్ కెనాల్) నుంచి తేలిగ్గా ప్రసవం కాకపోవడంతోపాటు... బర్త్‌కెనాల్ నుంచి బిడ్డ భుజాలు రావడం కష్టం. ఇలాంటి సందర్భాల్లో బిడ్డకు గాయాలయ్యే (షోల్డర్ డిస్టోసియా) ప్రమాదం ఎక్కువ.
బిడ్డలో ఎదుగుదల / వికాసం లోపించడం: ప్రసవం తేలిగ్గా జరగకపోవడంతో ఫోర్‌సెప్స్ డెలివరీ వంటివి జరిగినా లేదా ప్రసవం వెంటనే జరగక బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో బిడ్డ ఎదుగుదల / మెదడు వికాసంలో లోపోలు.
న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్: బిడ్డ వెన్నుపాము ఎదుగుదల సాధారణ స్థాయిలో జరగకపోవడం వల్ల కలిగే సమస్యను ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్’ అంటారు. బిడ్డ పుట్టుకకు ముందుగా మహిళలు తగినంత ఫోలిక్ యాసిడ్ తీసుకోని సందర్భాల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరుగుతున్న మహిళల్లోనూ ఈ ప్రమాదం ఏర్పడే అవకాశం.
పిల్లల్లో స్థూలకాయం : తల్లికి స్థూలకాయం ఉంటే పిల్లల్లోనూ ఊబకాయం వచ్చి,
పెద్దయ్యాక కూడా అది కొనసాగే అవకాశమెక్కువ. భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే అవకాశాలూ ఎక్కువే.
వైద్య పరీక్షలు...
గర్భిణులు రొటీన్‌గా చేయించే పరీక్షలపాటు బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తెలుసుకునేందుకు గర్భధారణ తర్వాత మూడోనెలలో అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. (స్థూలకాయం ఉన్నవారిలో... వారి కడుపులోని కొవ్వు పోరల కారణంగా... కొన్ని సమస్యలు స్పష్టంగా తెలియకపోవచ్చు. ఈ రకంగా చూసినా గర్భిణుల్లో బరువు పెరగడం, లావెక్కడం ప్రమాద
సూచికలే.)
నివారణ / మేనేజ్‌మెంట్...
👉గర్భవతిగా ఉన్నవారు మరీ ఎక్కువ బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవడం.
👉ఆ టైమ్‌లో తీసుకోవాల్సిన మంచి సమతులాహారం, చేయాల్సిన వ్యాయామాలపై అవగాహన కలిగి ఉండటం.
👉ముందునుంచే ఎక్కువ బరువు ఉండేవారు గర్భధారణ తర్వాత అకస్మాత్తుగా బరువు తగ్గకూడదు. అలా తగ్గితే బిడ్డకు అందాల్సిన క్యాలరీలుపోషకాలు అందకపోవచ్చు.
అందుకే ఆ సమయంలో పిండం ఎదుగుదలకు కావాల్సినంత ఆహారం తీసుకుంటూ ఉండాలి. బిడ్డలో తెలివితేటలు, వికాసానికి అడ్డుపడే న్యూరల్ ట్యూబ్ సమస్యల నివారణకు ప్రెగ్నెన్సీ ΄్లాన్ చేసుకున్నప్పటి నుంచే ‘ఫోలిక్ యాసిడ్’ టాబ్లెట్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండటం.
Comments
Please login to add a commentAdd a comment