గుంటూరు: ప్రత్యేక హోదా ఉద్యమం కీలక మలుపు తిరుగుతుందని, మహోద్యమంగా మారేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష పునాది కానుందని పార్టీ నేత అంబటి రాంబాబు చెప్పారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ఆంధప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా మాట తప్పిందని అన్నారు. ప్రత్యేక రాదు అంటూ చెప్పకనే చెప్తోందని.. ఈ నేపథ్యంలో కీలక మలుపు తిప్పేందుకే తాము ఈనిర్ణయం తీసుకున్నామని, తమ అధినేత నిరవధిక నిరాహార దీక్షకు దిగారని చెప్పారు. గతంలో ఎన్నో ఉద్యమాలు చేశారని, కేంద్రానికి తమ డిమాండ్ తెలియజేశారని గుర్తు చేశారు. తక్షణమే కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఇది మహోద్యమంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
'దీక్ష మహోద్యమంగా మారడం ఖాయం'
Published Thu, Oct 8 2015 10:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement