'చిక్కు ప్రశ్నలకు కేంద్రమే జవాబు చెప్పాలి' | Centre must address issues before bifurcation: YS vijayamma | Sakshi
Sakshi News home page

'చిక్కు ప్రశ్నలకు కేంద్రమే జవాబు చెప్పాలి'

Published Wed, Aug 21 2013 10:32 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

'చిక్కు ప్రశ్నలకు కేంద్రమే జవాబు చెప్పాలి' - Sakshi

'చిక్కు ప్రశ్నలకు కేంద్రమే జవాబు చెప్పాలి'

గుంటూరు : రాష్ట్ర విభజనపై చిక్కు ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. సమన్యాయం చేయాలంటూ గుంటూరులో విజయమ్మ చేపట్టిన సమర దీక్ష నేటికి మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ సర్పంచ్లకు చెక్ పవర్ను నియంత్రిస్తే గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

సీమాంధ్రలో ప్రజాగ్రహం ఈ స్థాయిలో ఉందని ఏ పార్టీ ఊహించలేదని విజయమ్మ అన్నారు. రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చిదంబరం, చంద్రబాబు మధ్య ఉన్న సంబంధాన్ని ఆయనే ఒప్పుకున్నారని విజయమ్మ అన్నారు. 

తమకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు హాట్లైన్ లింకే ఉంటే తమ కుటుంబం ఎందుకింత బాధపడేదని విజయమ్మ అన్నారు. జగన్ జైల్లో ఎందుకు ఉండేవారని ప్రశ్నించారు. ఎవరివి వీధి నాటకాలో ప్రజలే గమనిస్తున్నారని ఆమె అన్నారు. భావోద్వేగాలకు లోనై ఏ ఒక్కరూ ఆత్మార్పణ చేసుకోవద్దని ఈ సందర్భంగా విజయమ్మ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా పోరాడి డిమాండ్లను నెరవేర్చుకుందామని విజయమ్మ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement