గుంటూరు కేంద్రంగా వైఎస్ విజయమ్మ దీక్ష.. చంద్రబాబు యాత్ర
Published Mon, Sep 9 2013 3:43 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, గుంటూరు : తెలుగు ప్రజల ప్రయోజనాల్ని కాపాడే నేతలెవరు... విభజనతో ఎదురయ్యే సమస్యలపై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించిందెవరు... ప్రాణం కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆమరణ దీక్షలు చేసిందెవరు.. ఁసమైక్య శంఖారావంరూ. పూరించిందెవరు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర పరిస్థితేంటనే ప్రస్తావన లేకుండా విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి.. తానేదో గొప్ప పని చేసినట్లు చెప్పుకుంటుందెవరు..? ఈ ప్రశ్నలు ప్రస్తుతం సమైక్యవాదుల్లో చర్చనీయాంశమయ్యాయి.
రాష్ర్ట విభజనపై కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిరసనగా కోట్లాది ప్రజల గుండె చప్పుడుగా గుంటూరులో ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర పేరిట గుంటూరు నుంచే బస్సు యాత్ర ప్రారంభించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల చిత్తశుద్ధిని జిల్లా వాసులు బేరీజు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుల డ్రామాలనూ ఏవగించుకుంటున్నారు. కేవలం అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం తంటాలు పడుతూ, సమైక్యవాదుల నుంచి ఎదురవుతున్న నిరసనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు తన పర్యటన సాగిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తలెత్తే నీటి వివాదాలు, ఉద్యోగాలు, రాజధాని వంటి సమస్యలేవీ ప్రస్తావించకుండా సోత్కర్షతో సరిపుచ్చుతున్నారు.
మొన్నటికి మొన్న పాదయాత్రలో కార్యకర్తలంతా ఆస్తులమ్మి తనకు అధికారం కట్టబెట్టాలని నినాదం ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు తనకుఅధికారం ఇస్తే సమస్యల్ని పరిష్కరిస్తా అంటూ అధికారమే పరమావధిగా చేస్తున్న గుంటూరు పర్యటనపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలుచేజారకుండా జాగ్రత్త పడేందుకే ఆత్మగౌరవ యాత్ర అనిసమైక్యవాదులు వ్యాఖ్యానించడం గమనార్హం. కేంద్రంతెలంగాణ, సీమాంధ్రులకు సమన్యాయం చేయలేదని తేలిపోవడంతో వైఎస్ విజయమ్మ సమైక్య విధానంపై బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో గుంటూరులో చంద్రబాబుమొదటి రోజు యాత్ర కొనసాగింపుపై మల్లగుల్లాలు పడ్డారు. దీనిపై పొందుగల అతిథిగృహంలో సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ నాయకులతో మంతనాలు సాగించారు.
విజయమ్మ దీక్ష చరిత్రాత్మకం...
గుంటూరు వేదికగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేసిన సమర దీక్ష చరిత్రాత్మకంగా నిలిచింది. విభజనతో ఎదురయ్యే సమస్యలపై ఆమె కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. తెలుగు జాతి ప్రయోజనాలపై గొంతెత్తి నినదించారు. హైదరాబాదు, ఉద్యోగ సమస్యలపై కేంద్రానికి తన గళం వినిపించారు. కృష్ణా డెల్టా ఎడారిగా మారుతుందని విజయమ్మ దీక్ష వేదికపై నుంచి వినిపించడం రైతుల్నీ ఆలోచింపజేసింది. వెనువెంటనే జైలు గోడల మధ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షకు దిగడం, ఆ తర్వాత ఆయన సోదరి, మహానేత వైఎస్సార్ తనయ షర్మిల ‘సమైక్య శంఖారావం’ పూరించడం గమనిస్తూనే ఉన్న ప్రజలు తెలుగు ప్రజల ప్రయోజనాలపై పోరాటం చేస్తోంది వైఎస్సార్ సీపీ ఒక్కటేనని ముక్త కంఠంతో చెబుతున్నారు.
సమైక్యరాష్ట్రాన్ని కొనసాగించాలని విజయమ్మ కేంద్ర హోం మంత్రి షిండేకు లేఖ రాయడంతో సమైక్యవాదుల ఉత్సాహం ద్విగుణీకృతమైంది. ఈనెల 11న జిల్లాలో ప్రారంభం కానున్న షర్మిల యాత్ర తమలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపుతుందని సమైక్యవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. షర్మిల యాత్రకు తామం తా మద్దతు తెలుపుతామని సమైక్య వాణిని బలంగా వినిపిస్తున్న ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఏ విధానం లేకుండా సాగుతున్న చంద్రబాబు యాత్రను ప్రజలు తప్పు పడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన తన స్థాయి మరిచి వ్యక్తిగత దూషణలకు పాల్పడటంపై టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement