ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికపై చర్చ | Sivarama krishnan committee meets Chandrababu naidu over new capital | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికపై చర్చ

Published Sat, Jun 14 2014 1:52 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Sivarama krishnan committee meets Chandrababu naidu over new capital

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపిక కోసం సూచనలు చేయడానికి ఏర్పాటు చేసిన  శివరామ కృష్ణన్ కమిటీ శనివారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికపై చర్చ జరిగింది.

గతంలో కమిటీ పర్యటన వివరాలను కమిటీ సభ్యులు .... చంద్రబాబుకు తెలియచేశారు. కాగా గుంటూరు, విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను బాబు అడిగి తెలుసుకుంటున్నారు. కమిటీ సభ్యులు ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలను సందర్శించి వివిధ రంగాల నిపుణులతో సంప్రదింపులు జరిపారు.

 మరోవైపు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఒకవేళ ఈ రెండు నగరాల మధ్య అవకాశం లేనిపక్షంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసే విషయమై గురువారం విశాఖపట్నంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement