
సమర దీక్షలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'సమర దీక్ష' ప్రారంభానికి ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. నటుడు శివారెడ్డి తన మిమిక్రీతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మాజీ సీఎం కె.రోశయ్య, కొండవలస, పోసాని కృష్ణమురళి, తదితరుల గొంతుతో శివారెడ్డి అందరినీ అలరిస్తున్నారు. మంగళగిరి వై జంక్షన్ సమీపంలో వైఎస్ జగన్ సమర దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే.