sivareddy
-
టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం కందుకూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యకు గురికావడమే అందుకు నిదర్శనమన్నారు. మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేసినా మంత్రి సునీత, ఆమె కుటుంబీకులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని, ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందంటూ ఆయన మండిపడ్డారు. సునీతపై కుటుంబీకులపై కేసు నమోదు చేయలేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యపై ఆయన కుటుంబీకులు ఫిర్యాదు చేయగా ప్రధాన నిందితుడు, టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, వారి సమీప బంధువులు మురళీ, మహేంద్ర అండతోనే హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నా.. వీరిపై మాత్రం కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. కాగా, ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని శుక్రవారం టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప నేతలు, కార్యకర్తల హత్యలకు పాల్పడటం దారుణమని తోపుదుర్తి పేర్కొన్నారు. -
కందుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
-
వైఎస్సార్ సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త శివారెడ్డిని దారుణంగా చంపారు. ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికిచంపారు. పీర్ల పండగ సందర్భంగా కందుకూరులో ఇటీవల ఓ గొడవ జరిగింది. ఆ ఘటనను ఆసరాగా చేసుకొని టీడీపీ కార్యకర్తలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. కాగా మంత్రి పరిటాల సునీత ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శివారెడ్డి హత్య వెనుక పోలీసుల వైఫల్యం ఉందని అన్నారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సీఐ రాజేంద్రనాథ్ పట్టించుకోలేదని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
కొత్త ఐడియాతో...
శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, శివారెడ్డి, రాకేశ్ ముఖ్య తారలుగా శ్రీధర్‌రెడ్డి యార్వ దర్శకత్వంలో సోహం రాక్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, ఎంటైర్టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై నిర్మాతలు దీపక్ ముకుత్, పాషా నిర్మిస్తున్న చిత్రం ‘సచ్చింది రా గొర్రె’. ‘‘కొత్త కంటెంట్‌ని, ఐడియాస్ని ప్రోత్సహించే సోహం రాక్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలసి వినోదాత్మకంగా సాగే సినిమాలను నిర్మించాలనుకుంటున్నాం. మంచి కథలను, టాలెంట్‌ని ప్రొత్సహిస్తూ క్వాలిటీ సినిమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత పాషా. ‘‘దక్షిణాది సినిమాల్లో వినూత్నమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త టాలెంట్‌ని వెతికి పట్టుకుని ప్రొత్సహిస్తూ నిర్మాణం చేపట్టడమే మా లక్ష్యం’’ అన్నారు నిర్మాత దీపక్ ముకుత్. ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: అపర్ణా కిటే, సంగీతం: సంతోష్‌కుమార్. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
విడపనకల్లు (ఉరవకొండ) : విడపనకల్లు మండల పరిధిలోని వేల్పమడుగు గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి కుమారుడు శివారెడ్డి (25) శనివారం రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు శివారెడ్డి పొలంలో నీళ్లు కట్టేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. బోరు ఆన్ చేయడానికి ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ గురై తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనున్న పొలంలో రైతులు గుర్తించి శివారెడ్డిని బళ్లారి ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మార్గంమధ్యలో మృతి చెందాడు. -
విదేశాలకు బైవోల్టిన్ ఎగుమతి
–కేంద్రపట్టుశాఖ జాయింట్ డైరెక్టర్ చేలూరి శివారెడ్డి బి.కొత్తకోట: ఒకప్పుడు రైతులు బైవోల్టిన్ సాగుచేసేందుకు ముందుకురాని పరిస్థితుల నుంచి విదేశాలకు బైవోల్టిన్ హైబ్రిడ్‌ను ఎగుతుమలు చేసే స్థాయికి దేశం ఎదిగిందని కేంద్రపట్టు పరిశ్రమశాఖ ప్రధానకేంద్రం బెంగళూరు జాయింట్ డైరెక్టర్ చేలూరి శివారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం మొగసాలమర్రి సమీపంలోని కేంద్ర పట్టుశాఖకు చెందిన ప్రాథమిక బీజ క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో 21 పట్టుగ్రుడ్ల ఉత్పత్తి కేంద్రాలు, మరో 21 మూల బీజక్షేత్ర కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు. ఉత్పత్తి కేంద్రాల ద్వారా గత ఆర్థిక సంవత్సరం 375 లక్షల వాణిజ్య పట్టుగ్రుడ్ల ఉత్పత్తి లక్ష్యంకాగా 410 లక్షల గ్రుడ్లను ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 410లక్షల గ్రుడ్లను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యమన్నారు. ఇందులో 350లక్షల బైవోల్టిన్ హైబ్రీడ్ గ్రుడ్లను ఉత్పత్తి చేయాల్సివుందన్నారు. కాగా ప్రస్తుతం బైవోల్టిన్ హైబ్రిడ్ గ్రుడ్లు నేపాల్, ఇథియోపియా, కెన్యా, రువాండా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా తయారవుతున్న గ్రుడ్లు రోగరహితమైనవి కావడంతో వీటి ఫలితాలు అధికంగా వస్తున్నాయని చెప్పారు. వీ1 మల్బరీ స్థానంలో కొత్తగా జీ2, జీ4 వంగడాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీనిద్వారా ఏడాదికి ఆరుపంటలు తీయవచ్చని, తద్వారా సగటున రూ.3లక్షల ఆదాయం దక్కుతుందన్నారు. కాగా క్లస్టర్ ప్రమోషన్ ప్రోగ్రాం పేరుతో దేశంలో 172 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్లస్టర్లద్వారా బైవోల్టిన్ హైబ్రీడ్ సాగు విస్తరణ పెరిగేలా చూడటమే లక్ష్యమన్నారు. ఏపీలో రాష్ట్రప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు. దీనికోసం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సంకరజాతీ గ్రుడ్ల ఉత్పత్తి భారీగా పడిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రైతులు అధిక లాభాలు పొందేందుకు బైవోల్టిన్ హైబ్రిడ్‌సాగుపై దష్టి పెట్టాలన్నారు. దీనికోసం రైతులకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోందని చెప్పారు. కేంద్రప్రభుత్వం దీనిపై ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు. 2016–17లో 33వేల టన్నుల పట్టును ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా కేంద్రం నిర్ణయించగా 2023నాటీకి 41,800 టన్నుల పట్టును ఉత్పత్తి లక్ష్యమన్నారు. తద్వారా చైనాపై ఆధారపడటం పూర్తిగా తగ్గిపోతుందని, ఒకదశలో 5వేల టన్నులు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామని చెప్పారు. -
ఖమ్మం జిల్లాలో భారీ చోరీ
ఎర్రుపాలెం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడులో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వేమిరెడ్డి పెద్ద శివారెడ్డి ఇంట్లో 13 కాసుల బంగారం చోరీకి గురైంది. శివారెడ్డి తన కుటుంబంతో కలసి ఈ నెల 4న తిరుపతి వెళ్లారు. బుధవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న బీరువాని పరిశీలించి చూడగా 13 కాసుల బంగారం మాయమైంది. దీనిపై శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివారెడ్డి కుటుంబసభ్యులు తిరుపతి కి వెళ్లినపుడు ఇంట్లో ఆయన అత్త ఒక్కరే ఉన్నారు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. తనకు ఏమి తెలియదని, తాను బయటికి వెళ్లినపుడు చోరీ జరిగి ఉండవచ్చునేమోనని అనుమానం వ్యక్తం చేసింది. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ రాంరెడ్డి, మధిర సీఐ వెంకటేశ్వరరావు పరిశీలించారు. డాగ్స్వాడ్ తో వివరాలు సేకరిస్తున్నారు. -
పొలానికి వెళ్లి..నిర్జీవమయ్యాడు!
కురిచేడు : పొలంలో కట్టెలు కొట్టేందుకు సహచరులతో కలిసి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎన్ఎస్పీ అగ్రహారం రోడ్డులోని మల్లాయపాలెం పంట పొలాల్లో శుక్రవారం వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని ఎన్ఎస్పీ అగ్రహారం గ్రామానికి చెందిన తాటి చెంచయ్య(52) మరో ఏడుగురితో కలిసి కట్టెలు కొట్టేందుకు పొలం వెళ్లాడు. మధ్యాహ్నం తర్వాత వారు రెండు జట్లుగా విడిపోయి కట్టెలు కొడుతున్నారు. ఓ చెట్టు కొట్టడం పూర్తయిన తర్వాత మలవిసర్జనకు వెళ్లి వస్తానని తోటి వారితో చెప్పి చెంచయ్య అటుగా వెళ్లాడు. మిగిలిన ముగ్గురూ మరో జట్టుకు చెందిన నలుగురు కూలీల వద్దకు వెళ్లారు. మేస్త్రి వచ్చి చెంచయ్య గురించి వాకబు చేశాడు. మల విసర్జనకు వెళ్లాడని మిగిలిన వారు చెప్పారు. పొలం కాపలాదారుడు శివారెడ్డి కూడా కూలీల వద్దే ఉన్నాడు. అంతలో శివారెడ్డి భార్య కేకలు వేస్తూ చెంచయ్య పడిపోయాడని చెప్పింది. మిగిలిన కూలీలు వచ్చి కిందపడి ఉన్న చెంచయ్యను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నారు. మృతునికి భార్య,నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వెళ్లారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చెంచయ్య విద్యుదాఘాతంతో చనిపోయాడా? ఏదైనా విషసర్పం కాటుకు బలయ్యాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
బాకీదారుడి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం
బద్వేలు అర్బన్ : అప్పు చెల్లించలేదని బాధిత కుటుంబ సభ్యురాలు బాకీదారుడి ఇంటి ముందు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కడప రిమ్స్‌కు తరలించారు. అంతకుముందు ఆమె తన కుటుంబంతో కలిసి స్థానిక ఆంజనేయనగర్‌లోని బాకీ దారుడి ఇంటిముందు బైఠాయించి ఆందోళన నిర్వహించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని బోయనపల్లె గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామసుబ్బారెడ్డి అనే రైతు పట్టణంలో నివసిస్తున్న శివారెడ్డి(రామసుబ్బారెడ్డి సమీప బంధువు) అనే చీటీల వ్యాపారికి సుమారు రూ.12 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఎంత తిరిగినా ఆయన చెల్లించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గతేడాది జనవరి 23న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అప్పట్లో మృతదేహంతో రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అనంతరం బాకీదారుడి ఇంటి ముందు శవ జాగారం చేశారు. పోలీసులు, పెద్ద మనుషులు పంచాయితీ చేసి ఆరు నెలల్లో డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేశారు. ఇందుకు నమ్మకంగా శివారెడ్డికి చెందిన ఇంటిని మృతుడి భార్య పేరు మీద అగ్రిమెంట్ చేశారు. అయితే 18 నెలలు గడిచినా ఒక్క రూపాయి చెల్లించకుండా తమకు అగ్రిమెంట్ చేసిన ఇంటిని ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని మృతుడి భార్య రామసుబ్బమ్మ, కుమారుడు రామక్రిష్ణారెడ్డి, కుమార్తె శ్రావణి బంధువులతో కలిసి శివారెడ్డి ఇంటిముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్ఐ నాగమురళి, రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని శివారెడ్డిని, అతని కుమారుడిని స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారం మైదుకూరు డీఎస్పీ వద్ద ఉందని అదుపులోకి తీసుకున్న వారిని డీఎస్పీ వద్దకు పంపుతామని.. మీరు కూడా అక్కడకు వెళ్లి మాట్లాడండి అని బాధితులకు తెలిపారు. అయితే వారు అక్కడి నుంచి కదలలేదు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటామని బాకీదారుడి ఇంటిముందే బైఠాయించారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో మృతుడి కుమార్తె శ్రావణి బాకీదారుడి ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బంధువులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ‘18 నెలలుగా తండ్రిని పోగొట్టుకుని రావలసిన బాకీ డబ్బుకోసం పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదు. జిల్లా ఎస్పీ , డీఎస్పీ వద్దకు వెళ్లి సమస్యను చెప్పినా పరిష్కరించలేకపోయారు. చివరకు పోలీసులు, పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీలో శివారెడ్డి(బాకీదారుడు) మాకు రాయించిన ఇంటిని కూడా వేరేవారికి రిజిస్టర్ చేయించారు. మా కుటుంబాన్ని వీధి పాలు చేశారు. ఇక న్యాయం జరగదని నా తండ్రిలాగే నేను చనిపోదామని ఆత్మహత్య చేసుకున్నాన’ని తెలిపింది. -
అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
-
సమర దీక్షలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'సమర దీక్ష' ప్రారంభానికి ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. నటుడు శివారెడ్డి తన మిమిక్రీతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మాజీ సీఎం కె.రోశయ్య, కొండవలస, పోసాని కృష్ణమురళి, తదితరుల గొంతుతో శివారెడ్డి అందరినీ అలరిస్తున్నారు. మంగళగిరి వై జంక్షన్ సమీపంలో వైఎస్ జగన్ సమర దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. -
పల్లెగూటికి పండగొచ్చింది
రైతు కష్టం ఫలించింది. పంటలు ఇంటికి చేరుతున్నాయి. అందరి మొహాల్లో ఆనందం. ఇంట సంక్రాంతి సంబరాలు. పండిన ధాన్యాన్ని అవసరానికి దాచుకోగా మిగిలినది అమ్మేస్తున్నాడు. ఆ డబ్బుతో పిల్లలకు కొత్త బట్టలు కొనుగోలు చేశాడు. పండగ పూట పిండి వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు సిద్ధమయ్యాడు. ఆనంద లోగిళ్లు.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొల్లపర గ్రామం నుంచి వచ్చిన కుటుంబ రెడ్డి, కాంతమ్మ దంపతులు నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు శివారెడ్డి, కోడులు సీతామహాలక్ష్మి వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. కుటుంబీకుల మధ్య సంక్రాంతిని జరుపుకునేందుకు ఆయన కుమారుడు బసవ పున్నారెడ్డి, కోడలు దుర్గాలక్ష్మి, మనుమళ్లతో భువనేశ్వర్ రెడ్డి, సాయి రుత్విక్ రెడ్డితో కలసి ఇక్కడికి చేరుకున్నాడు. ప్రతి ఏటా జరుపుకునే పండుగ విశేషాలను ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు. ‘ పండుగ గ్రామానికి వచ్చినప్పుడల్లా చిన్నానాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తోటి మిత్రులతో కలసి ఇంటిలోని పాత వస్తువులను బోగిరోజు కాల్చడం, కాల్వలో ఈత కొట్టడం, పసందైన పిండి వంటలు తినడం ఎంతో ఇష్టం. మా అక్క రాములమ్మ చేసే పిండి వంటలు చాలా బాగుంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరం హాయిగా గడుపుతాం’. అన్నారు. అనంతరం అందరూ గ్రామంలో దేవాలయానికి ట్రాక్టర్లతో బయలుదేరారు. సంబరాల సంక్రాంతి ఈ ఏడాది పత్తి పంట బాగా పండటంతో ఆదోని ప్రాంత వాసులు సంక్రాంతిని రెట్టింపు ఉత్సాహంతో చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆడబిడ్డలను, బంధువులను పండుగకు ఆహ్వానించారు. ఉద్యోగ రీత్యా ఆదోనిలో నివాసముంటున్న చంద్రశేఖర్ ఇద్దరు కుమార్తెలు. పండుగకు వారిద్దరూ భర్తలు, పిల్లలతో పండగకు వచ్చేశారు. ఇళ్లంతా సందడి సందడిగా ఉంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ‘శూన్య మాసం కావడంతో కొత్త బట్టలు పెట్టం. అయితే మూడు రోజుల పాటు పండుగకు ప్రత్యేక వంటకాలు తయారు చేస్తాం. ముఖ్యంగా నువ్వులు అద్దిన సద్ద రొట్టెలు, గుమ్మడికాయ, ఇతర కాయగూరలతో చేసిన తీపి పచ్చడి, గుగ్గిళ్లు, పిండి వంటలు, మరుసటి రోజు భక్ష్యాలు వండుతాం. అందరం కలిపి కబుర్లు చెపుతూ రుచికరమైన వంటకాలు ఆరగిస్తాం. ఉద్యోగం రిత్యా మేము పట్టణంలో నివాసం ఉంటున్నప్పటికీ కుటుంబానిది పల్లె నేపథ్యమే’. అని చెప్పారు.