
కొత్త ఐడియాతో...
శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, శివారెడ్డి, రాకేశ్ ముఖ్య తారలుగా శ్రీధర్‌రెడ్డి యార్వ దర్శకత్వంలో సోహం రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటైర్‌టైన్‌మెంట్ స్టూడియో బ్యానర్లపై నిర్మాతలు దీపక్ ముకుత్, పాషా నిర్మిస్తున్న చిత్రం ‘సచ్చింది రా గొర్రె’. ‘‘కొత్త కంటెంట్‌ని, ఐడియాస్‌ని ప్రోత్సహించే సోహం రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలసి వినోదాత్మకంగా సాగే సినిమాలను నిర్మించాలనుకుంటున్నాం.
మంచి కథలను, టాలెంట్‌ని ప్రొత్సహిస్తూ క్వాలిటీ సినిమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత పాషా. ‘‘దక్షిణాది సినిమాల్లో వినూత్నమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త టాలెంట్‌ని వెతికి పట్టుకుని ప్రొత్సహిస్తూ నిర్మాణం చేపట్టడమే మా లక్ష్యం’’ అన్నారు నిర్మాత దీపక్ ముకుత్. ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: అపర్ణా కిటే, సంగీతం: సంతోష్‌కుమార్.